Srikaram Subhakaram 13th April 2014

0

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Srikaram Subhakaram, 13th April 2014 Episode

Weekly Horoscope (2014-04-13  –  2014-04-19)

మేషం..
——
కొత్తకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
కార్యోన్ముఖులై ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.
ఎంతటి వారినైనా మాటల ద్వారా ఆకట్టుకుంటారు.
ప్రత్యర్తులు అనుకూలురుగా మారి చేయూతనందిస్తారు.
పరపతి పెరుగుతుంది.
వాహనాలు, ఆభరణాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.
ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి.
వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలం.
ఉద్యోగులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.
రాజకీయవర్గాలకు పదవీయోగాలు.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
కళాకారులకు నూతనోత్సాహం.
మహిళలు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.
శుక్ర, శనివారాలలో ధనవ్యయం. కుటుంబసమస్యలు.భార్యాభర్తల మధ్య వివాదాలు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృషభం…
——-
కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి.
బంధువులతో విభేదాలు పరిష్కారం.
కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు.
మీ అంచనాలు ఫలించే సమయం.
వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది.
నిరుద్యోగులయత్నాలు సానుకూలం.
విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.
వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.
కళాకారులు అందిన అవకాశాలపై సంతృప్తి చెందుతారు.
మహిళలు కొంత ప్రశాంతత పొందుతారు.
ఆది, సోమవారాలు వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం…
——-
ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. రుణభారాలు పెరుగుతాయి.
దూరప్రయాణాలు ఉంటాయి.
సన్నిహితుల నుంచి ఒత్తిడులు, విమర్శలు ఎదుర్కొంటారు.
ఏ పని చేపట్టినా ముందుకు సాగడం కష్టమే.
తీసుకునే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి.
ఒక ప్రకటన నిరుద్యోగులకు కొంత నిరాశ కలిగించవచ్చు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మనస్సుకు నచ్చిన విధంగా చేస్తారు, ఇతరులను అంతగా పట్టించుకోరు, తద్వారా కొన్ని సమస్యలు.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కొంత చికాకులు తప్పకపోవచ్చు.
వ్యాపారాలు సాదాసీదాగానే సాగుతాయి. లాభాలు అంతగా కనిపించవు.
ఉద్యోగవర్గాలకు అంచనాలు తప్పుతాయి.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి గందరగోళ పరిస్థితులు.
కళాకారులకు నిరుత్సాహం.
శుక్ర, శనివారాలలో దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. సోదరులతో సఖ్యత.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం…
——-
ఈవారం పనుల్లో జాప్యం.
పట్టుదల ఉన్నా అనుకున్నదిసాధించడంలో కొంత వెనుకబడతారు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.
తీర్థయాత్రలు చేస్తారు.
అనుకోని ప్రయాణాలు ఉంటాయి.
ఆరోగ్య, కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి.
పరపతి పెంచుకునేందుకు యత్నిస్తారు.
జీవిత భాగస్వామితో మాటపట్టింపులు.
వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.
ఉద్యోగులకు స్థానచలనం.
రాజకీయ, వైద్యరంగాల వారికి ఒడిదుడుకులు.
కళాకారుల ఆశలు అంతగా ఫలించవు.
మహిళలకు మానసిక అశాంతి.
ఆది,సోమవారాలలో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తిలాభం.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గాస్తోత్రాలు పఠించండి.

సింహం…
——-
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.
వివాదాలకు దూరంగా ఉండండి.
ఆస్తివిషయంలో అగ్రిమెంట్లు వాయిదావేసుకుంటారు.
అనుకోని ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగల అవకాశాలు.
సోదరులతో అకారణంగా తగాదాలు.
వాహనాలు విషయంలో అప్రమత్తత పాటించండి.
నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.
వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగస్తులు విధుల్లో మరింత మెలకువ పాటించాలి.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నిరుత్సాహం.
కళాకారులు అంచనాలు తప్పి అసంతృప్తికి లోనవుతారు.
మహిళలకు మానసికఆందోళన .
బుధ, గురువారాలలో విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య…
—–
కొత్త ఆశలు చిగురిస్తాయి.
పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి.
ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.
ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది.
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.
రావలసిన బాకీలు అందుతాయి.
వస్తు, వాహనలాభాలు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగులకు హోదాలు పెరుగతాయి.
పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు నూతనోత్సాహం.
కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
మహిళలకు కుటుంబసభ్యుల సహకారం అందుతుంది.
బుధ, గురువారాలలో ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్య సమస్యలు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

తుల…
—–
వ్యయప్రయాసలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి కాగలవు.
ఆదాయం అంతగా కనిపించక, రుణాలు సైతం చేస్తారు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఇంటాబయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
తీర్థయాత్రలు చేస్తారు.
ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు తప్పకపోవచ్చు.
బంధువులు, మిత్రులు మీపై విమర్శలు కురిపిస్తారు.
ఆత్మవిశ్వాసం, మౌనంతో ముందుకు సాగడం మంచిది.
వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి, ఆశించిన లాభాలు కష్టమే.
ఉద్యోగులకు అనుకోని మార్పులు ఆశ్చర్యం కలిగించవచ్చు.
రాజకీయ, పారిశ్రామికవర్గాలకు కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది.
కళాకారులు ఆచితూచి ముందుకు సాగడం మంచిది.
మహిళలకు కుటుంబసమస్యలు కొంత వేధిస్తాయి.
బుధ, గురువారాలలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. సోదరులతో విభేదాలు తొలగుతాయి.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గాస్తోత్రాల పఠనం మంచిది.

వృశ్చికం…
——
ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి.
ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు.
ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది.
ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు.
ఇంతకాలం పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది.
ప్రత్యర్థులను సైతం కంగుతినిపించే నిర్ణయాలు తీసుకుంటారు.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
గృహ నిర్మాణాలకు సంబంధించి ఆటంకాలు తొలగుతాయి.
జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు.
వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులకు తగిన సమయం.
ఉద్యోగులు విధుల్లో అవ రోధాలు అధిగమిస్తారు.
రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అనుకోని విదేశీ యానం.
కళాకారులకు ఒత్తిడుల నుంచి విముక్తి. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.
మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.
బుధ, గురువారాలలో అనుకోని ఖర్చులు. అదనపు ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్‌కు ఆకుపూజ చేయించుకుంటే మంచిది.

ధనుస్సు..
——
ఈవారం ఏ పనిచేపట్టినా విజయమే.
ఆప్తులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు.
మీ అంచనాలు నిజం చేసుకుంటారు.
పలుకుబడి పెరుగుతుంది.
ఆశ్చర్యరమైన విషయాలు తెలుసుకుంటారు.
భూములు, వాహనాలు సమకూరతాయి.
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.
ఉద్యోగయత్నాలలో పురోగతి కనిపిస్తుంది.
వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి.
ఉద్యోగులకు ఉన్నత స్థాయి అధికారుల నుంచి ప్రశంసలు. ప్రమోషన్లు.
పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.
కళాకారులకు అవార్డులు లభిస్తాయి.
మహిళలకు గౌరవపురస్కారాలు.
శుక్ర, శనివారాలలో ధనవ్యయం. మానసిక ఆందోళన. కుటుంబంలో చికాకులు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆంజనేయ దండకం పఠించండి.

మకరం…
——
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
కొత్త మిత్రులు పరిచయమవుతారు.
ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.
ఆలోచనలు అమలు చేస్తారు.
ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు.
దేవాలయాలు సందర్శిస్తారు.
నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.
ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి.
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పదోన్నతులు దక్కే అవకాశం.
రాజకీయ,సాంకేతిక వర్గాలకు అవకాశాలు అనూహ్యంగా దక్కుతాయి.
కళాకారులకు ఆశలు నెరవేరే సమయం.
మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి.
ఆది, సోమవారాలలో వ్యయప్రయాసలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు.
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణచేయండి.

కుంభం…
—–
ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి.
బంధువులతో అకారణంగా తగాదాలు.
సహాయంపొందిన వారే మీపై విమర్శలు కురిపిస్తారు.
విలువైన పత్రాలు జాగ్రత్తగా చూసుకోండి.
వివాదాలకు దూరంగా ఉండండి.
ఆరోగ్యం, వాహనాలు విషయంలో నిర్లక్ష్యం వద్దు.
భాగస్వామ్య వ్యాపారాలు సాగించే వారు కొంత అప్రమత్తత పాటించాలి.
ఉద్యోగులు అనుకోని మార్పులు చూస్తారు. పనిభారం పెరుగుతుంది.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరుత్సాహం.
కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి.
విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు.
మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. సమస్యలు పెరుగుతాయి.
శుక్ర,శనివారాలలో ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. గృహయోగాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
గణపతిని పూజించండి.

మీనం..
——
ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.
అనుకోని ప్రయాణాలు.
బంధువులు, మిత్రులతో విభేదాలు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
చర్మ, గొంతు సంబంధిత రుగ్మతలు.
దూర ప్రాంతాల నుంచి కీలకసమాచారం.
ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.
విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలలో ఒడిదుడుకులు.
ఉద్యోగులకు స్థానమార్పులు. విధుల్లో ఆటంకాలు.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరుత్సాహమే.
కళాకారులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
మహిళలకు మానసిక ఆందోళన.
ఆది, సోమవారాలలో శుభవర్తమానాలు. అదనపు రాబడి. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
శివస్తోత్రాలు పఠించండి.

Tags;Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 13th April 2014,