Srikaram Subhakaram 17th Nov 2013

0

రాశి ఫలాలు Nov 17th – Nov 23rd

మేషం
ఉత్సాహవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల అనురాగం, ఆదరణ చూరగొంటారు. ప్రముఖ వ్యక్తులను కలుసుకుని సహాయం ఆర్థిస్తారు. శుత్రువులు సైతం మిత్రులుగా మారతారు. కొన్ని క్లిష్టసమ స్యలు తీరతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారాలు అభివృద్ధిపథంలో కొనసాగుతాయి.  షేర్ల విక్రయాలు లాభిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబకలహాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం
సాహిత్య, పరిశోధనాంశాలపై దృష్టి సారిస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. మీ యుక్తితో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదాలు నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూలం. షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

మిథునం
ఇతరులు సైతం మీపట్ల ప్రేమ చూపుతారు. గతంలో నిలిచిన పనులు కొన్ని ఈవారం పూర్తి కాగలవు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. పర్యటనలు విజయవంతం కాగలవు. చిరకాల కోరిక నెరవేరు తుంది. ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. షేర్ల విక్రయాలలో లాభాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నందీశ్వరుని వద్ద ఆవునేతి దీపం వెలిగించండి.

కర్కాటకం
కార్యజయం. శుభకార్యాలకు డబ్బు అధికంగా ఖర్చు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన పిలుపు సంతోషం కలిగిస్తుంది. వాహనా లు, స్థలాలు సమకూర్చుకుంటారు. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందు తారు. చాకచక్యంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ముందంజ వేస్తా రు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. షేర్ల విక్రయాలు అనుకున్న విధంగా సాగు తాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని పనులు కుటుంసభ్యుల చేయూతతో పూర్తి చేస్తారు. అందరిలోనూ మీ ఆధిప త్యాన్ని నిలుపుకుంటారు. పరువు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహన సౌ ఖ్యం. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు.సోదరుల నుంచి ఒత్తిడులు. షేర్ల విక్ర యాలు లాభిస్తాయి.దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

కన్య
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. బాధ్యతలు సమర్థ వంతంగా నిర్వహిస్తారు. మీపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుని అందరికీ ఇష్టులు కాగలరు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. వారం చివరిలో వ్యవహారాలలో ఆటంకాలు. ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం. అంగారకస్తోత్రం పఠించండి.

తుల
ఆర్థిక విషయాలు కొంత మందగించినా అవసరాలు తీరతాయి. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉన్నా సోదరులు మీకు చేదోడుగా నిలుస్తారు. పలుకుబడి కలిగిన వారిని కలుసుకుంటారు. వాహనాల విషయంలో కొంత అప్రమత్తత పాటించా లి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. షేర్ల విక్రయాలలో లాభాలు స్వల్పంగా అందుతాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చికం
శుభవార్తలు సంతోషం కలిగిస్తాయి. భూములు, వాహనాలు కొను గోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థు లు మిత్రులుగా మారతారు. భవిష్యత్‌పై కొత్త ఆశలు చిగురిస్తాయి.    జీవితాశయ సాధనలో ముందడుగు వేస్తారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. 

ధనుస్సు
పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీ అభివృద్ధిలో కుటు ంబ సభ్యుల చేయూత అందుతుంది. ఆస్తుల వివాదాల నుంచి బయ టపడతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. సంతాన విషయాలలో          కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సాహిత్య, సినీ ప్రముఖులతో పరిచయాలు. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. షేర్ల విక్రయా లలో లాభాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణా స్తోత్రాం పఠించండి.

మకరం
కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. మీ అంచనాలు నిజమవుతాయి. భవిష్యత్ అంచనాలు రూపొందిస్తారు. ఇతరులకు సైతం సహాయపడి దయార్ద్ర హృదయులుగా గుర్తింపు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో గందరగో ళం తొలగుతుంది. లాభాలు అందుతాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. కళాకారుల కు అనుకోని సన్మానాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.గణేశాష్టకం పఠించండి.

కుంభం
అనుకోని విధంగా రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. అనుకున్నది సాధించేందుకు మరింత కష్టపడతారు. కళాకారులకు ఒక ఆహ్వానం ఉత్సా హాన్నిస్తుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. వారం ప్రారంభంలో ధననష్టం. కుటుం సభ్యులతో తగాదాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రం పఠించండి.

మీనం
ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. అనుకోని ఖర్చులు మీదపడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. తద్వారా ఔషధసేవనం. నిర్ణయాలలో అవరోధాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. ప్రత్యర్థుల చర్యలను గమనించి ముందుకు సాగండి. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులు కొంత ఓపిక వహించాలి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.