Srikaram Subhakaram 20th April 2014

0

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Srikaram Subhakaram, 20th April 2014 Episode

Weekly Horoscope (2014-04-20  –  2014-04-26)

మేషం…
—-
చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి.
ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు.
చిరకాల ప్రత్యర్థులు సైతం మీకు అనుకూలురుగా మారతారు.
అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు.
ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.
భవనాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
పరపతి పెరుగుతుంది.
వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి.
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
పారిశ్రామిక, వైద్యరంగాల వారు నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు.
కళాకారులకు ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు.
మహిళలకు శుభవార్తలు అందుతాయి.
ఆది, సోమవారాలలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. భార్యాభర్తల మధ్య వివాదాలు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం…
—–
మొదట్లో పనులు నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి.
ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు.
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.
ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది.
నూతనోత్సాహంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు తొలగుతాయి.
ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు.
పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.
మహిళలకు కుటుంబంలో గౌరవం మరింతగా పెరుగుతుంది.
సోమ, మంగళవారాలలో ఆస్తి వివాదాలు. ఖర్చులు . అనారోగ్యం.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
గణపతిని ఆరాధించండి.

మిథునం…
——
ఈవారం మిశ్రమంగా ఫలాలు ఉంటాయి.
రావలసిన సొమ్ము కొంత ఆలస్యంగా అందుతుంది.
వివాదాలకు కాస్తదూరంగా ఉండడమే మంచిది.
ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు.
బంధువులు, మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.
ప్రముఖ వ్యక్తులతో ఉత్తరప్రత్యుత్తరాలు.
జీవిత భాగస్వామి ద్వారా కొంత ధనలాభం ఉంటుంది.
ముఖ్యనిర్ణయాలలో తొందరపాటు వద్దు.
వ్యాపారాలలో స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవలసిన పరిస్థితి.
ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరుత్సాహం .
కళాకారులకు ఒడిదుడుకులు.
మహిళలకు నిరాశాజనకంగా ఉన్నా గౌరవానికి లోటు ఉండదు.
ఆది, సోమవారాలలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గాదేవిని పూజించండి.

కర్కాటకం…
——-
కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.
ఆస్తి వ్యవహారాలలో వివాదాల నుంచి బయటపడతారు.
ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.
ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.
మీ అంచనాలు నిజమవుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.
పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి.
మహిళలకు కుటుంబంలో చిక్కులు తొలగుతాయి.
గురు, శుక్రవారాలలో ధననష్టం. కుటుంబసమస్యలు, అనారోగ్యం.
దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

సింహం…
——
పనులు చకచకా సాగుతాయి.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.
కాంట్రాక్టులు పొందుతారు.
భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
అనుకున్న విజయాలు సాధిస్తారు.
విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.
విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారాలలో పెట్టుబడులు అంది ముందుకు సాగుతారు.
ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి.
పారిశ్రామికవర్గాలకు విదేశీ యానం.
కళాకారులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు.
మహిళలకు సోదరులు, సోదరీల నుంచి సహాయం.
ఆది, సోమవారాలలో వ్యయప్రయాసలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. మానసిక ఆందోళన.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ఆంజనే య దండకం పఠించండి.

కన్య…
—–
కొత్త అంచనాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.
సంఘంలో ఆదరణ పొందుతారు.
జీవితాశయం నెరవేరుతుంది.
నేర్పుగా కొన్నిసమస్యలు పరిష్కరించుకుంటారు.
ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు.
ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
పరపతి పెరుగుతుంది.
కొత్త కాంట్రాక్టులు పొందుతారు.
ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు.
వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. లాభాలు తథ్యం.
ఉద్యోగులకు విధుల్లో ఒడిదుడుకులు తొలగుతాయి.
పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు అనుకోని విదేశీ యానం.
కళాకారులకు పురస్కారాలు. సన్మానాలు.
మహిళలు కుటుంబంలో ప్రత్యేకతను చాటుకుంటారు.
శ నివారం ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

తుల…
——
పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు.
ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా ఏదోవిధంగా అవసరాలకు డబ్బు సమకూరుతుంది.
సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
ఆలోచనలు అమలులో కొంత జాప్యం.
నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తొందరపాటు వద్దు.
ఆరోగ్యం కొంత మందగిస్తుంది.
సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు.
భూములు, వాహనాల కొనుగోలు యత్నాలలో స్వల్ప ఆటంకాలు.
వ్యాపారులకు స్వల్ప లాభాలు మాత్రమే దక్కుతాయి.
ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.
కళాకారులు అవకాశాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలి.
మహిళలకు మానసిక అశాంతి.
మంగళ, బుధవారాలలో వ్యయప్రయాసలు. ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
గణేశ్ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం…
——
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడులు.
బంధువులు, మిత్రులతో అకారణంగా విరోధాలు.
కష్టపడ్డా ఫలితం అంతగా ఉండదు.
విలువైన డాక్యుమెంట్లు భద్రంగా చూసుకోండి. చేజారే అవకాశం.
పనులు మందకొడిగా సాగుతాయి.
ఆలోచనలు నిలకడగా ఉండవు.
ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయి.
నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కుటుంబబాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఆలయాలు సందర్శిస్తారు.
వ్యాపారాలలో ఆటుపోట్లు, లాభాలు కష్టమే.
ఉద్యోగవర్గాలకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.
రాజకీయవర్గాలకు ప్రజాదరణ తగ్గి నిరాశచెందుతారు.
కళాకారులు అవకాశాల ఎంపికలో తొందరపడరాదు.
మహిళలకు కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి.
మంగళ, బుధవారాలలో శుభవార్తలు. ధన,వస్తులాభాలు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు..
——
ఈవారం అనుకున్న కార్యాలు సమయానికి పూర్తి చేస్తారు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది.
ఇతరులను సైతం ఆకట్టుకుంటారు.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు.
మీ ఆశయాల సాధనలో మిత్రులు చేదోడుగా నిలుస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు.
కళాకారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.
మహిళలకు ఆస్తి లాభ సూచనలు.
శనివారం ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది.

మకరం….
——
ఆదాయం సమృద్ధిగా ఉంటుంది.
సన్నిహితుల నుంచి శుభవార్తలు.
ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు .
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
జీవిత భాగస్వామి సలహాలు పొందుతారు.
శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు.
కాంట్రాక్టర్లకు అనుకూల కాలం.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
సోదరులతో వివాదాలు తీరతాయి.
వ్యాపారాలు లాభసాటిగాఉంటాయి.
ఉద్యోగులకు కొత్త విధులు దక్కుతాయి.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి సన్మానాలు.
కళాకారులకు ఊహించని అవకాశాలు.
మహిళలకు కుటుంబంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది.
ఆది, సోమవారాలలో ధననష్టం. కుటుంబంలో చికాకులు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
శ్రీరామరక్షా స్తోత్రం పఠించండి.

కుంభం…
——-
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి, రుణాలు తీరుస్తారు.
బంధువులతో సత్సంబంధాలు.
ఒక సమస్య నుంచి బయటపడతారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
విలువైన వస్తువులు కొంటారు.
కోర్టు కేసుల నుంచి విముక్తి.
చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు.
నిరుద్యోగులకు శుభవార్తలు.
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగులకు ఉన్నతమైన హోదాలు దగ్గరకు వ స్తాయి.
పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళాకారులకు సన్మానాలు, సత్కారాలు.
మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి.
మంగళ,బుధవారాలలో ధననష్టం. కుటుంబంలో చికాకులు.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణచేయండి.

మీనం….
——
ఈవారం పట్టింది బంగారమే అన్నట్లుంటుంది.
సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది.
వివాదాలు తీరి ఊరట చెందుతారు.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
మీ ఆశయాలు నెరవేరతాయి.
వాహనాలు, స్థలాలు కొంటారు.
శత్రువులను సైతం ఆకట్టుకుంటారు.
మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది.
ఆలయాలు సందర్శిస్తారు.
వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ ఆహ్వానాలు.
కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.
మహిళలకు ప్రశంసలు అందుతాయి.
గురు, శుక్రవారాలలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

Tags : Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 20th April 2014,