Srikaram Subhakaram 22nd Dec 2013

0

Srikaram Subhakaram 22nd Dec 2013-

రాశి ఫలాలు

Dec 22nd  to  28th Dec– by Vakkantam Chandra Mouli, janmakundali.com

మేషం
ఆర్ధికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది
ఆశ్చర్యకరమైన రీతిలో పనులు పూర్తి చేస్తారు
ఆత్మీయుల ఆదరణ చూరగొంటారు
ప్రతిభను చాటుకొని ముందుకు దూసుకు పోతారు
ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి
మీ ఆశయాలు నెరవేరుతాయి
గతం లో చేజారిన వస్తువులు తిరిగి దక్కించుకొంటారు
సప్తమం లో చంద్రునితో రాహువు కలయిక వల్ల భార్యాభర్తల మధ్య విబేధాలు నెలకొనవచ్చు
భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహం గా సాగుతాయి
ఉద్యోగులు కోరుకున్న పదోన్నతులు దక్కించుకొంటారు
పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతం గా ఉంటుంది
సినీకళాకారులు చక్కటి అవకాశాలు పొందుతారు
మహిళలకు నూతనోత్సాహం
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం
రావి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి

వృషభం
పనులు విజయవంతం గా పూర్తి చేస్తారు
కాంట్రాక్టుల్లో పోటీ ఉన్న ఎట్టకేలకు దక్కించుకొంటారు
పరిచయాలు పెరుగుతాయి
వివాదాలు నుంచి బయటపడతారు
ప్రత్యర్దుల వ్యూహాలు పసిగట్టి కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు
ఆధ్యాత్మిక కార్యక్రమాల లో పాల్గొంటారు
ఒక ముఖ్య విషయం తెలుసుకొంటారు
వ్యాపారులకు పెట్టుబడులు సమకూరుతాయి
రోగ స్థానం లో చంద్ర, శని రాహువుల కలయిక వల్ల చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి
ఉద్యోగులు విధుల్లో పురోగతి సాదిస్తారు
కళాకారులు, విద్యార్దులకు శుభవార్తలు
మహిళలకు కుటుంబం లో విశేష గౌరవం దక్కుతుంది
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం
ఆదిత్య హృదయం చదవడం మంచిది

మిథునం
ఆర్ధిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి
ఇంటాబయటా బాధ్యతలు మరింతగా పెరుగుతాయి
కుటుంబ సభ్యులతో అకారణం గా తగాదాలు
వ్యాపారాలలో మందగమనం
ఉద్యోగులకు స్థానచలన సూచనలు
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు
మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది
పంచమం లో చంద్ర, శని రాహువుల కలయిక వల్ల మానసిక అశాంతి, సంతాన రీత్యా చికాకులు
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది

కర్కాటకం
ఈ వారం అన్ని విషయాలలోనూ పురోగతి కనిపిస్తుంది
మీ సచ్చీలత, సమర్ధత చాటుకొంటారు
బంధువులతో తగాదాలు పరిష్కారమవుతాయి
ఆత్మీయులు నుంచి ఆహ్వానాలు అందుతాయి
కార్యక్రమాలు సజావుగాసాగుతాయి
పాతబాకీలు కొన్ని వసూలవుతాయి
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది
భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకొంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి
ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం
పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం
కళాకారులకు సన్మానాలు
మహిళలకు సంతోషకరమైన వార్తలు వింటారు
చతుర్దం లో చంద్రుడు శని, రాహువులతో కలయిక వల్ల వాహనాల విషయం లో మెలుకువ పాటించడం మంచిది
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం
హనుమాన్ చాలీసా చదవడం మంచిది

సింహం
ఈ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు
ఆత్మీయుల ఆదరణ పొందుతారు
చాకచక్యం గా కొన్ని సమస్యలు పరిష్కరించుకొంటారు
ప్రతిభకు తగిన గుర్తింపు రాగలదు
ఆస్తి ఒప్పందాలు చేసుకొంటారు
దూరమైనా ఆప్తులు తిరిగి దగ్గరవుతారు
ఆలయాలు సందర్శిస్తారు
వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి
ఉద్యోగులు కొత్త ఉత్సాహం తో ముందుకు సాగుతారు
పారిశ్రామిక, విద్యారంగాల వారు అరుదైన సన్మానాలు అందుకొంటారు
సినీకళాకారులు అవకాశాలు అప్రయత్నం గా పొందుతారు
మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి
సప్తమ స్థానాన్ని గురువు వీక్షించడం భార్యాభర్తల మధ్య మరింత అనురాగం ఏర్పడుతుంది
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం
శివాలయంలో అభిషేకం చేయించుకొంటె మంచి ఫలితం ఉంటుంది

కన్య
ఈ వారం ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు
ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు
అందరిలోనూ గౌరవం పొందుతారు
వివాదాలకు దూరం గా ఉండండి
జీవిత భాగస్వామి సలహాల మేరకు నిర్ణయాలు తీసుకొంటారు
ఆప్తుల నుంచి సహాయం అందుతుంది
ఇళ్ళు వాహనాలు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు
వ్యాపారాలు అనుకోని హోదాలు దక్కుతాయి
పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం
కళాకారులకు పురస్కారాలు అందుతాయి
మహిళలు ఊహించని ఆహ్వానాలు అందుకొంటారు
ద్వీతీయం లో చంద్ర, శని, రాహువుల కలయిక ఉన్నా, గురుద్రుష్టి వల్ల ఆర్ధిక ఇబ్బందులు నుంచి బయటపడతారు
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం
శివాలయం లో ఆవునేతి దీపం వెలిగించడం మంచిది

తుల
రావలసిన సొమ్ము అందుతుంది
సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు
మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు
ఇంటి నిర్మాణయత్నాలు కలసి వస్తాయి
సంఘం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి
బంధువులు మీ నిర్ణయాలలో పాలు పంచుకొంటారు
పోటీపరీక్షల్లో విజయం సాదిస్తారు
వ్యాపారాలు ఉత్సాహం గా సాగుతాయి. బ్యాంకు రుణాలు, పెట్టుబడులు అందుతాయి
ఉద్యోగులు పదోన్నతులు దక్కుతాయి
పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు
సినీ కళాకారులకు సన్మాన యోగం
మహిళలకు తండ్రి తరపు నుంచి సొమ్ము అందుతుంది
లాభాస్థితిలో చందుని వల్ల తల్లి తరపు వారి నుంచి ధన లాభం
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం
ఆదిత్య హృదయం చదవడం మంచిది

వృశ్చికం
ఆదాయం సంతృప్తినిస్తుంది
కొత్త ఆశలు చిగురిస్తాయి
కష్టానికి ఫలితం కనిపిస్తుంది
వ్యవహారాలు ఆశాజనకం గా ఉంటాయి
పప్రత్యర్దులు మిత్రులుగా మారతారు
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది
కాంట్రాక్టులు దక్కించుకొంటారు
విద్యార్దులు అనుకూలఫలితాలు సాదిస్తారు
వ్యాపారాలలో ఆశించిన లాభాలు తధ్యం
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు
రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి
కళాకారులకు పురస్కారాలు
మహిళకు కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కరించుకొంటారు
దశమంలో చంద్రుని కారణం గా ఆశించిన లభించే అవకాశం
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం
అంగారక స్తోత్రం చదవడం మంచిది

ధనుస్సు
కష్టసుఖాలు సమాన స్థాయి లో ఉంటాయి
ఆదాయం పెరిగినా తద్వారా ఖర్చులు కూడా పెరుగుతాయి
బాధ్యతలు సమర్దవంతం గా నిర్వహిస్తారు
అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి
ఆరోగ్యపరం గా కొద్దిపాటి చికాకులు తప్పవు
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు
భాగాస్వామ్య వ్యాపారాలు సామాన్యస్థాయి లో ఉంటాయి
ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉండవచ్చు
పారిశ్రామిక, వైద్య రంగాల వారికి అంచనాలలో పొరపాట్లు
మహిళలకు కుటుంబం లో కొద్దిపాటి చికాకులు ఉంటాయి
అష్టమస్థానాన్ని శని వీక్షించడం వల్ల మనోవేదన, కలతలు ఉంటాయి
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
హనుమాన్ చాలీసా చదవడం మంచిది

మకరం
ఆర్ధిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది
వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి
ఆసక్తికరమైన సమాచారం అందుతుంది
కాంట్రాక్టర్లకు అనుకూలం గా ఉంటుంది
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు
విచిత్రమైన సంఘటనలు ఎదురువుతాయి
ఆరోగ్యభంగం, ఔషదసేవనం తప్పదు
విలువైన వస్తువులు జాగ్రత్త గా చూసుకోవడం మంచిది
వ్యాపారాలు మందగిస్తాయి
ఉద్యోగులు విధుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి
కళాకారులకు అంచనాలు తప్పి నిరాశ మిగులుతుంది
మహిళలకు ఆస్తి వివాదాలు తప్పవు
జన్మ రాశిలో శుక్రుని వల్ల జీవిత భాగస్వామి తో వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది

కుంభం
కొత్త పనులు ప్రారంభిస్తారు
చిరకాల మిత్రులను కలసుకొని ముఖ్య విషయాలు తెలుసుకొంటారు
పరిస్థితులు అనుకూలం గా మారుతాయి
చిరకాల ప్రత్యర్ధులు అనుకూలం గా మారుతారు
సేవా కార్యక్రమాల లో పాల్గొంటారు
ఆలయాలు సందర్శిస్తారు
బంధువులతో సఖ్యత నెలకొంటుంది
గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి
లాభం లో రవి బుధుల వల్ల వ్యాపార లావాదేవీలు సాగుతాయి
ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కుతాయి
రాజకీయవర్గాలకు సన్మానాలు
కళాకారులకు అవార్డులు తథ్యం
మహిళలకు ఆరోగ్య సమస్యలు తీరుతాయి
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
శివారాధన చేయడం మంచిది

మీనం
ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి
బాధ్యతలు సమర్దవంతం గా నిర్వహిస్తారు
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
పరపతి పెరుగుతుంది
చిరకాల మిత్రులను కలసుకొని ఉల్లాసంగా గడుపుతారు
ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది
కొత్త కాంట్రాక్ట్లు పొందుతారు
పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు
వాహన సౌఖ్యం లభిస్తుంది
వ్యాపారులకు అధిక లాభాలు
ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి
పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం
మహిళలకు శుభకార్యాలలో పాల్గొంటారు
అష్టమం లో శని, రాహువులతో చంద్రుని కలయిక వల్ల వారం చివరి లో మనోవేదన, చర్మ ఉదర సంబంధిత రుగ్మతులు తలెత్తుతాయి
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం
హానుమాన్ చాలీసా చదవడం మంచి ఫలితాన్నిస్తుంది

Tags : Srikaram Subhakaram 22nd Dec 2013, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com