Srikaram Subhakaram 23rd Feb 2014

0

Srikaram Subhakaram 16th Feb 2014

రాశి ఫలాలు

26th Jan 201–1st Feb 2014 by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (2014-02-23  –  2014-03-01)

 

మేషం :
రావాల్సిన సొమ్ము సకాలం లో చేతికందుతుంది. ముక్యమైన వ్యవహారాలూ విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నలుగురిలో మీ పలుకుబడి పెరుగుతుంది.బందువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. దైవదర్శనాలు చేసుకొంటారు. ప్రత్యర్థులు సైతం మీకు మిత్రులుగా మారే అవకాశం కలదు.ఆరోగ్యపరమైన చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకి మంచి గుర్తింపుతో పాటు ప్రసంసలు అందుకొంటారు.వ్యాపార విస్తరణ కొరకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.పారిశ్రామిక వర్గాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది,అదే ఉత్సాహం తో ముందుకు సాగుతారు. ఐటి రంగం లో వారు విజయవంతంగా పనులు నిర్వర్తిస్తారు.విద్యార్దులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది.మహిళలు ఇంటా బయటా వారి సామర్ధ్యాని నిరుపించుకొంటారు.షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు వస్తాయి.సుబ్రమణ్యస్వామి ని ఆరాదించడం మంచిది.

 

వృషభం:

అప్రయత్నం గానే పనులు పూర్తి చేస్తారు.శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.రావాల్సిన డబ్బులు సకాలం లో చేతికందుతాయి.దూర ప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుకొంటారు.ఆస్తి పాస్తులకు సంబందించిన చికాకులు తగ్గుతాయి.కోర్టు వ్యవహారాలు పరిష్కార దశకు వస్తాయి.సంగీత సాహ్యిత్యాల పై ఆసక్తి చూపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఊహించిన దానికన్నా అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి.పారిశ్రామిక వర్గాల వారికి విదేశి పర్యటనలు కలిసివస్తాయి.కళాకారులకు అవకాశాలు దగ్గరకు వచినట్టే వచ్చి చేయిజారిపోతాయి.నూతన విద్యావకాశాల కోసం ప్రయత్నించేవారికి మంచి అవకాశాలు వస్తాయి.సాఫ్టవేర్ రంగం లోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.మహిళలకు శుభవార్తలు అందుతాయి.షేర్ల క్రయ విక్రయాలు సాధారణం గా సాగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

 

మిథునం:

అదనపు ఆదాయం సమకూరుతుంది.బంధువుల రాకపోకలు ఎక్కువవుతాయి.ఎంతో కాలం గా ఉన్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది.మీ ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.కాంట్రాక్టర్లు ఎంత పోటి ఉన్నప్పటికీ తట్టుకొని నిలబడి కాంట్రాక్ట్లు చేజిక్కిన్చుకొంటారు. ఆలయాలు సందర్శిస్తారు.నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకొంటుంది.వ్యాపారస్తులకి పెట్టుబడులు లభిస్తాయి.ఉద్యోగస్తులకు ప్రొమొషన్లు లభిస్తాయి.కళాకారులకు అవార్డులు లభిస్తాయి. సాంకేతిక విద్యనభ్యసించే వారికి మంచి అవకాశాలు వస్తాయి.షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఐటి రంగం లో నూతన అవకాశాల కొరకు ప్రయత్నించే వారికి అనుకూల సమయం.మహిళలకు కుటుంబ చికాకులు తొలగి కొంత ఊరట చెందుతారు.గణపతి ని ఆరాధించడం మంచిది.

 

కర్కాటకం:

చేపట్టిన కార్యాలు సకాలం లో పూర్తికావు,కొంత జాప్యం జరిగే అవకాశం కలదు.ఆర్థిక పరిస్తితి అనుకూలం గా ఉండదు.ముక్యమైన నిర్ణయాలు తీసుకోవడం లో తొందరపడడం మంచిది కాదు.ఆలోచలు అధికమవుతాయి.నరాలకి సంబందించిన సమస్యలు తలెత్తుతాయి.తల్లి తరపు వారితో అనవసరమైన విభేదాలు తలెత్తే అవకాశాలు కలవు. వ్యాపారస్తులకి నిరాశ తప్పదు.దూరప్రయాణాలు ఉంటాయి.ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు జరుగుతాయి.మహిళలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.నూతన కోర్సులు చేయాలనుకొనే విద్యార్డులకి మంచి అవకాశాలు లభిస్తాయి.షేర్ల క్రయవిక్రయాలు లభాసాటిగా సాగవు.సాఫ్టవేర్ రంగం వారికి తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.

 

సింహం :

పట్టిందల్లా బంగారమవుతుంది.మీకు ఇష్టమైన వ్యక్తులను కలుసుకొంటారు.భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు.మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి.చిరకాల మిత్రులని కలుసుకొని ఆనందం గా గడుపుతారు.ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. ఆగిపోయిన ఇంటినిర్మాణాలు మళ్ళి మొదలవుతాయి.ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని అదిగమిస్తారు.వ్యాపార పురోగతి ఉంటుంది.కొత్తగా ఉద్యోగం లో చేరిన వారు, కొత్త వాతావరణానికి చక్కగా అలవాటు పడతారు.సాఫ్టవేర్ రంగం లోని వారికి విదేశీ ప్రయాణాలు ఉంటాయి.విద్యార్దుల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబానికి సంబంధించి తీసుకొనే నిర్ణయాలు మంచి ఫలితాన్నిస్తాయి.షేర్ల క్రయ విక్రయాలు లభిస్తాయి.లక్ష్మి దేవి ని ఆరాధించడం మంచిది.

 

కన్య :

ఆర్దిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు.సన్నిహితుల నుండి అందిన వార్త ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.సంఘం లో మీ గౌరవమర్యాదలు పెరుగుతాయి.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురుకోవలసి వస్తుంది.ఉద్యోగస్తులకు ముఖ్యమైన భాద్యతలు అప్పగిస్తారు, వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు .కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.రుణాల కొరకు ప్రయత్నించేవారికి రుణాలు లభిస్తాయి.మహిళలకు ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది.ఐటి రంగం లోని వారు ప్రశంసా పత్రాలు అందుకొంటారు.షేర్ల క్రయ విక్రయాలు సాధారణం గా ఉంటాయి.శివారాధన చేయడం మంచిది

 

తుల :

నూతన పరిచయాలు ఆనందాన్నిస్తాయి.సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు.ఎప్పటి నుండో రావాల్సిన బాకీలు వసూలయ్యే అవకాశం కలదు.పెండింగ్ లో ఉన్న పనుల మీద దృష్టి సారిస్తారు.బంధుమిత్రులతో కలిసి కొంత సంతోష సమయం గడుపుతారు. కొన్ని ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పవు. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన సంస్థలు స్తాపించాలనుకోనేవారికి అనుకూల సమయం.ఇంటర్వ్యూ లకు హాజరయ్యే వారికి విజయావకాశాలు అధికంగా ఉన్నాయి.మహిళలకు శుభ వర్తమానాలు అందుతాయి.స్పెక్యులేషన్లు లాభిస్తాయి.ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.సాంకేతిక నిపుణులకు అవార్డులు లభిస్తాయి. సినీ సాహిత్య రంగంలోని వారికి మంచి ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.

 

వృశ్చికం:

ఆర్దిక వ్యవహారాలూ సంతృప్తికరంగా ఉంటాయి.ఊహించని మార్పులు సంతోషాన్నిస్తాయి.మీ సేవలను అందరు గుర్తిస్తారు. సంఘసేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.ఇంతకాలం పడిన శ్రమకి మంచి గుర్తింపు లభిస్తుంది.ఎప్పటినుండొ మీ మనసులో ఉన్న ఆలోచనలకి కార్యరూపం దాలుస్తారు.ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అనుకూల సమయం.వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ సంబందమైన పనులు పూర్తవుతాయి.తరచూ ఉద్యోగ మార్పు చేసేవారికి ఒక స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది, అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవడం మంచిది.కళాకారులకు మంచి ప్రోత్సాహకరమైన సమయం.దుర్గాదేవిని ఆరాదించడం మంచిది.

 

ధనుస్సు :

ఆర్దికవ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది.అనుకొన్న పనులు సజావుగా పూర్తీ కాగలవు.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు చేసుకొంటారు.అనుకోనిరీతిలో కొన్ని సమస్యల నుండి బయటపడతారు.భార్య భర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది.పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి.సేవా కార్యక్రమాల లో పాల్గొంటారు.మీ ప్రతిభకి మంచి గుర్తింపు లభిస్తుంది.దూర ప్రయాణాలు ఆనందదాయకం గా ఉంటాయి.ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి.ఐటి రంగం వారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కళాకారులు విశేష ప్రజాదరణ పొందుతారు.విద్యార్దులు మంచి ఫలితాలని సాధిస్తారు.మహిళలకు కుటుంబం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.స్పెకులేషన్లు లాభసాటి గా ఉంటాయి. శివారాధన చేయడం మంచిది.

 

మకరం:

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు.పెండింగ్ లో ఉన్న పనులు చకచకా పూర్తీ కాగలవు.ఇంటాబయటా మీ మాటే నెగ్గిన్చుకొంటారు.సన్నిహితులతో, స్నేహితులతో ఏర్పడిన అపార్ధాలు తొలగుతాయి.భార్యాభర్తలు అనురాగం తో మెలుగుతారు.చాకచక్యంగా వ్యవహరించి మీ శత్రువులని సైతం ఎదుర్కొంటారు.ఆరోగ్య ఇబ్బందులు తలెత్తడంవలన చురుగ్గా ముందుకు వెళ్ళలేరు.భాగ్యస్వామ్య వ్యాపారాలు కలసివస్తాయి.ఉద్యోగస్తులకు ప్రొమోషన్ తో కూడిన బదిలీలకు అవకాశం కలదు.పారిశ్రామికవేత్తలకు ఒత్తిడి తగ్గి ఉపశమనం పొందుతారు.విద్యార్దులు అనుకొన్న లక్ష్యాల వైపు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతారు.మహిళలకు కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.సాఫ్టవేర్ రంగం లో వారికి శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది.స్పెక్యులేషన్లు లాభిస్తాయి. వెంకటేశ్వర స్వామి ని పూజించడం మంచిది.

 

కుంభం:
పనులు చురుగ్గా సాగక చికాకు పడతారు.ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు అలాగే ఉంటాయి. కొన్ని సందర్భాలలో రుణాలు చేయవలసి వస్తుంది. ఖర్చుల మీద నియంత్రణ అవసరం.స్నేహితులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి.ఆరోగ్యం మందగిస్తుంది, ఔషధ సేవనం తప్పదు.కోర్టు వ్యవహారాలు పెండింగ్ పడతాయి.వివాద పరిష్కారాల కొరకు మధ్యవర్తిత్వాలు జరుపుతారు.మీ దగ్గర బంధువులతో కష్టసుఖాలు చర్చిస్తారు.ఆప్తులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆత్మీయుల సలహాలతో కొన్ని పనులలో ముందడుగు వేస్తారు.వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి.సినీ కళాకారులకు కొంత నిరుత్సాహం ఏర్పడినప్పటికీ వారం చివరలో అనుకూలం గా ఉంటుంది.విద్యార్దులకు అనుకూల సమయం.మహిళలు ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగుతారు.షేర్ల క్రయవిక్రయాలు పెద్ద ఆశాజనకంగా ఉండవు.శివ పూజలు చేయడం మంచిది.

 

మీనం

మీ ఆశయాలు నెరవేర్చుకొనే సమయం.గతం లో నిలిచిపోయిన కార్యక్రమాలను పూర్తి చేస్తారు.చిన్ననాటి స్నేహితులని కలుసుకొని ఆనందం గా గడుపుతారు.బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వివాహ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది.ప్రయాణాలలో జాప్యం జరిగే అవకాశం కలదు.వ్యాపార లావాదేవీలు ఆశాజనకం గా సాగుతాయి.విద్యార్దులు చక్కటి నైపుణ్యంతో ముందడుగు వేస్తారు.నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.పారిశ్రామికవేత్తలకు పెండింగ్ లో ఉన్న పనులు ఒక కొలిక్కి వస్తాయి.మహిళలు కుటుంబ సమస్యల నుండి బయట పడతారు.ఉన్నోతోద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.సంఘం లో పలుకుబడి కలిగిన వ్యక్తులకు మంచి ప్రసంశలు లభిస్తాయి.మహిళా ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. సంతానానికి సంబందించిన విషయాలలో కుటుంబసభ్యులతో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకొంటారు.ఆరోగ్య విషయం లో శ్రద్ద అవసరం. గణపతి ని పూజించడం మంచిది.

 

 

Tags : Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 23rd Feb 2014