Home / LIFESTYLE / Srikaram Subhakaram 23rd March 2014

Srikaram Subhakaram 23rd March 2014

Srikaram Subhakaram 23rd March 2014

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (2014-03-23  –  2014-03-29)

మేషం..
—–
ఆర్థిక విషయాలు ఊహించిన విధంగా ఉంటాయి.
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది.
ప్రతికూలంగా ఉన్న వారు సైతం అనుకూలంగా మారతారు.
జీవితాశయం నెరవేరుతుంది.
చిన్ననాటి మిత్రుల కలయిక.
ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.
స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగస్తులకు నూతనోత్సాహం.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.
విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు.
సినీకళాకారులకు సన్మానయోగం.
మహిళలకు కుటుంబపరంగా విశేష గౌరవం.
శుక్ర, శనివారాలలో ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు. అనారోగ్యం.
తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

వృషభం…
——
గత సంఘటనలు నెమరువేసుకుంటారు.
ప్రముఖులతో పరిచయాలు.
సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.
రావలసిన సొమ్ము అందుతుంది.
భూవివాదాల పరిష్కారానికి సంబంధించి వివాదాలు తీరతాయి.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
కాంట్రాక్టులు పొందుతారు.
ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు.
వ్యాపారాలు విస్తరణలో ముందుకుసాగుతారు.
ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు.
రాజకీయ, సాంకేతికవర్గాలకు సంతోషకరమైన సమాచారం.
కళాకారులకు అవార్డులు దక్కుతాయి.
భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయి.
సోమ, మంగళవారాలలో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. కుటుంబసభ్యులతో కలహాలు.
ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం…
——-
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.
కొన్ని బాకీలు రావడంలో ఆలస్యమవుతుంది.
బంధువులతో విభేదాలు కొంత వరకూ పరిష్కారం.
కొత్త కార్యక్రమాలు ప్రారంభించి నిదానంగా పూర్తి చేస్తారు.
ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారనున్నది.
గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.
సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.
ఉద్యోగులకు విధుల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది.
రాజకీయవర్గాలకు పదవీయోగం.
కళాకారులకు అనుకున్న అవకాశాలు దక్కే ఛాన్స్.
బుధ, గురువారాలలో బంధువిరోధాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
శివాలయంలో 21 ప్రదక్షిణలు చేయండి.

కర్కాటకం…
——-
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
వివాదాలకు దూరంగా ఉండండి.
ఆస్తుల విషయంలో తగాదాలు నెలకొంటాయి.
సోదరులు,సోదరీలతో విభేదాలు.
వాహనాలు, ఆభరణాలు చేజారతాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
వచ్చిన కాంట్రాక్టులు సైతం నిరాశ కలిగిస్తాయి.
వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు.
ఉద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.
మహిళలకు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.
సోమ,మంగళవారాలలో శుభవార్తలు. ఆర్థిక లాభాలు. వివాదాల పరిష్కారం. భార్యాభర్తల మధ్య సఖ్యత.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

సింహం…
—–
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు.
వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.
ఆత్మీయుల నుంచి శుభవార్తలు.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.
భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది.
కాంట్రాక్టర్లు అనుకున్న టెండర్లు దక్కుతాయి.
వ్యాపారాలలో లాభాలు అందుతాయి.
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లాభిస్తాయి.
రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి.
కళాకారులు గతంలో జారవిడుచుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు.
నిరుద్యోగులు ఉద్యోగలాభం.
మహిళలకు ఊహించని విజయాలు.
శుక్ర, శనివారాలలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

కన్య….
—-
ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సన్నిహితులు, మిత్రుల సహాయసహకారాలు అందుతాయి.
వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.
ఆలోచనలు అమలు చేస్తారు.
వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.
చర్చలు ఫలిస్తాయి.
దేవాలయాలు సందర్శిస్తారు.
వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగవర్గాలకు ప్రమోషన్లు రాగలవు.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.
మహిళలకు అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు.
బుధ, గురువారాలలో బంధువిరోధాలు. ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. దూరప్రయాణాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ పూజలు చేయండి.

తుల..
—-
ఆదాయం అనుకున్న విధంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.
బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు.
ప్రత్యర్థులతో చర్చలు సఫలం.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.
వాహనాలుకొనుగోలు చేస్తారు.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం.
రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పదవులు పొందే అవకాశం.
మహిళలు శుభకార్యాలు నిర్వహిస్తారు.
సోమ, మంగళవారాలలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. కుటుంబసమస్యలు.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం..
——
చిరకాలంగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు పూర్తి చేస్తారు.
సంఘంలో గౌరవం పొందుతారు.
సోదరులతో తగాదాలు తీరతాయి.
ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది.
అంచనాలు నిజమవుతాయి.
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
కొత్తకాంట్రాక్టులు పొందుతారు.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు తధ్యం.
ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
పారిశ్రామికవర్గాలకు విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు అందుతాయి.
కళాకారులు అవార్డులు స్వీకరిస్తారు.
మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి.
శుక్ర,శనివారాలలో దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు..
—–
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
సన్నిహితులు మరింత దగ్గరవుతారు.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
పాత బాకీలు అందుతాయి.
భూములు, వాహనాలు సమకూరతాయి.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.
కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
వ్యాపారాలు విస్తరించడంతో పాటు, లాభాలు అందుకుంటారు.
ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి.
రాజకీయ, సాంకేతికవర్గాలకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి.
కళాకారులకు ఆశ్చర్యకరమైన రీతిలో పురస్కారాలు అందుతాయి.
నిరుద్యోగుల యత్నాలు సఫలం.
సోమ, మంగళవారాలలో దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
గణేశ్ స్తోత్రాలు పఠించండి.

మకరం…
——
రావలసిన పైకం అందుతుంది.
పనుల్లో పురోగతి సాధిస్తారు.
బంధువులతో తగాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.
విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
పరిచయాలు పెరుగుతాయి.
వస్తువులు,వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
జీవితాశయం నెరవేరుతుంది.
వాహనయోగం.
వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు.
ఉద్యోగులకు అదనపు విధులతో సమర్థతను చాటుకుంటారు.
పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళాకారులకు గౌరవ పురస్కారాలు అందుతాయి.
మహిళలకు ఆస్తి విషయాలలో ఒప్పందాలు.
శుక్ర, శనివారాలలో బంధువులతో తగాదాలు. ప్రయత్నాలు విఫలం. ఒప్పందాలలో ఆటంకాలు. అనారోగ్యం.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
గణపతికి అర్చన చేయించుకుంటే మంచిది.

కుంభం…
—–
కొన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు.
ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో కొన్ని విజయాలు సాధిస్తారు.
ఆలయాలు సందర్శిస్తారు.
నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు.
ఆస్తి వివాదాలు కొంతవరకూ పరిష్కారం.
ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు.
పరపతి కలిగిన వారితో పరిచయాలు.
వ్యాపారులకు అనుకోని లాభాలు.
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగాఉంటుంది.
మహిళలు ఇంటాబయటా విశేష గౌరవం పొందుతారు..
సోమ, మంగళవారాలలో మిత్రుల నుంచి విమర్శలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. భార్యాభర్తల మధ్య వివాదాలు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
శివార్చన మంచిది.

మీనం…
——
మీఅంచనాలు నిజం కాగలవు.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.
భూ వివాదాలు తీరి లాభంపొందుతారు.
చాకచక్యంగా వివాదాల నుంచి బయటపడతారు.
ఆలోచనలు అమలు చేస్తారు.
శత్రువులుసైతం మిత్రులుగా మారతారు.
స్థలాలు, గృహం కొనుగోలు చేస్తారు.
శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు.
వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి.
కళాకారులకు సన్మానయోగం.
శుక్ర, శనివారాలలో బంధువులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

Tags; Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 23rd March 2014

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top