Srikaram Subhakaram 26th Jan 2014

0

Srikaram Subhakaram 26th Jan 2014

రాశి ఫలాలు

26th Jan 201–1st Feb 2014 by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (2014-01-26  –  2014-02-01)

మేషం
ఆర్ధికం గా కొంత నిరాశ కలిగినా ఏదోవిధం గా అవసరాలు తీరుతాయి
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి
సన్నిహితులతో స్వల్ప విభేదాలు తలెత్తే అవకాశం లేదు
కొన్ని వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు
వాహనాలు, ఆభరణాలు కొంటారు
స్థిరాస్తి వివాదాలు నుంచి బయటపడతారు
వ్యాపార లావాదేవీలు కొంత మందగిస్తాయి
ఉద్యోగాలలో అదనపు భాద్యతలు వహించవలసి వస్తుంది
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి
కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి
మహిళలకు కొంత అనుకూల సమయమని చెప్పవచ్చు
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది
ఆది, సోమవారాల్లో ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తలు సోదరీ సోదరుల మధ్య కలహాలు, జ్వర వాత సంబంధిత రుగ్మతులు తలెత్తుతాయి

వృషభం
కొన్ని కార్యక్రమాలు నిదానం గా పూర్తీ చేస్తారు
ఆత్మీయుల సహాయం కోరుతారు
రావలసిన సొమ్ము కొంత వరకూ అందే అవకాశం ఉంది
చిరకాల ప్రత్యర్దులు మీ దారికి వస్తారు
ఆస్తి వ్యవహారాలలో సోదరుల నుంచి సమస్యలు తొలగుతాయి
పోటీపరీక్షలు నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి
ఒక వార్త మీకు ఊరట కలిగించవచ్చు
ఆరోగ్య సమస్యలు తీరుతాయి
వ్యాపారాలలో కొద్ది పాటి లాభాలు అందుతాయి. పెట్టుబడుల్లో కాస్త నిదానం పాటించండి
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పు ఉండవచ్చు
మహిళలు కుటుంబసమస్యల పరిష్కరించడం లో నిమగ్నమవుతారు
కళాకారులకు కొంత అనుకూలకాలమే
దక్షిణ దిశ ప్రయాణాలు సానుకూలం
దుర్గా దేవి ని పూజించడం మంచి ఫలితాన్నిస్తుంది
గురు, శుక్రవారాలలో కుటుంబం లో కలహాలు, రుణ యత్నాలు, ఇంటాబయటా విమర్శలు. జీవిత భాగస్వామి తో మాట పట్టింపులు ఉంటాయి

మిథునం
ఇంత కాలం పడిన కష్టం ఫలించే సమయం
ఆర్ధిక లావాదేవీలు సంతృప్తికరం గా ఉంటాయి
జీవితాశయం నెరవేరుతుంది
కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు
ఆలోచనలు కలిసివస్తాయి
భూములు వాహనాలు కొనుగోలు చేయాలనుకొనే వారికి మంచి సమయం
ఆలయాలు సందర్శిస్తారు
వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. నూతన పెట్టుబడులు సమకూరుతాయి
ఉద్యోగులకు అనుకోని హోదాలు లభిస్తాయి
రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం
నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందుతారు
కళాకారులకు సన్మాన, సత్కారాలు ఉంటాయి
తూర్పు దిశ ప్రయాణాలు కలసివస్తాయి
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది
శుక్ర, శనివారాలు నిదానం గా వ్యవహరించాలి, కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదురుకొంటారు, అనుకోని ఖర్చులు ఉంటాయి. ఆప్తులతో కలహాలు ఏర్పడతాయి

 

కర్కాటకం
అందరిలోనూ మీకంటూ గౌరవం లభిస్తుంది
ఎంతటి పనినైన పట్టుదలతో పూర్తి చేస్తారు
ఆత్మీయులు, శ్రేయోభిలాషులు నుంచి మాట సహాయం అందుతుంది
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు
పాత బాకీలు సైతం వసూలవుతాయి
వ్యూహాత్మక వైఖరి తో ముందడుగు వేసి విజయాలు సాదిస్తారు
పరపతి పెరుగుతుంది
ఆకస్మిక నిర్ణయాలు తీసుకొంటారు
వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు తథ్యం
ఉద్యోగులకు హోదాలు దక్కవచ్చు
పారిశ్రామిక వేత్తలకు ఉత్తమ పురస్కారాలు తథ్యం
కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి
మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
అంగారక స్తోత్రం పారాయణ చేయడం మంచిది
ఆది, సోమావారాలలో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువర్గం తో కలహాలు ఏర్పడతాయి, మానసిక ఆందోళనలు తలెత్తుతాయి

 

సింహం
లక్ష్య సాధనే ధ్యేయం గా ముందుకు సాగుతారు
పట్టుదల, ఆత్మ విశ్వాసం పెరుగుతాయి
ఎంతటి వారినైనా ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకొంటారు
ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు
భూముకు క్రయవిక్రయాల్లో అనుకూల వాతావరణం
చిన్ననాటి మిత్రులను కలసుకొంటారు
కుటుంబం లో శుభకార్యాల నిర్వహణ పై చర్చలు జరుపుతారు
వ్యాపారాలలో ఆటంకాలు తొలగి లాభాలు అందుతాయి
ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రసంశలు దక్కుతాయి
పారిశ్రామిక, రాజకీయవర్గాల వారికి అనూహ్యమైన రీతిలో ఆహ్వానాలు రాగలవు.
మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది
తూర్పు దిశ ప్రయాణాలు సానుకూలం
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది
తూర్పు దిశ ప్రయాణాలు సానుకూలం
విష్ణుసహస్రనామ పారాయణ చేయడం మంచిది
మంగళ, బుధవారాలలో భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తుతాయి. మనశాంతి లోపిస్తుంది. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

 

కన్య
ఆర్ధికం గా ఇబ్బందులు తొలగుతాయి. రుణ బాధల నుంచి విముక్తులవుతారు
ఆశయాలు నెరవేరుతాయి
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి చిరకాల మిత్రుల నుంచి ఆహ్వానాలు, గ్రీటింగులు అందుతాయి
వ్యవహారాలలో విజయం సాదిస్తారు
పలుకుబడి మరింతగా పెరుగుతుంది
ఎంతోకాలం గా నిలిచినా అగ్రిమెంట్లు పూర్తి చేసుకొంటారు
ఇంటి నిర్మానయత్నాలు కార్యరూపం దాలుస్తాయి
వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి
ఉద్యోగులు అనుకున్న విధం గా ఉన్నతి పొందుతారు
పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతం గా ఉంటుంది
కళాకారులకు సన్మానాలు జరుగుతాయి
విద్యార్ధుల ఫలితాల సాధనాలు విజయం సాదిస్తారు
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం
ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాన్నిస్తుంది
గురు శుక్రవారాలలో దూర ప్రయాణాలు, ఆరోగ్య సమస్యలు, జీవిత భాగస్వామి తో మాట పట్టింపులు, అనుకోని ఖర్చులు ఉంటాయి

 

తుల
ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
దూరప్రయాణాలు చేస్తారు
బంధువుల మిత్రులతో విభేదిస్తారు
అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు
ఒక వ్యవహారం లో వెనకడుగు వేయవలసి వస్తుంది
విలువైన వస్తు సామగ్రి జారవిడుచుకొంటారు
కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు
మీ నిర్ణయాలు ఉపసంహరించుకొంటారు
ఆలయాలు సందర్శిస్తారు
వ్యాపారాలలో ఆచి తూచి వ్యవహరించాలి
ఉద్యోగులకు స్థానచలన సూచనలు
పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు కొంత ఆందోళన తప్పకపోవచ్చు. విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం కలదు
కళాకారులు ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు
మహిళలకు అన్నింటా నిరుత్సాహం తప్పదు
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
దుర్గా స్తోత్రాలు చదవడం మంచి ఫలన్నిస్తుంది
మంగళ, బుధవారాలలో, ధన, వస్తు లాభాలు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. విన్దువినొదాలలో పాల్గొంటారు
వివాదాలు పరిష్కారమవుతాయి

 

 

వృశ్చికం
ఆర్ధిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు
చిన్ననాటి సంఘటనలు నెమరవేసుకొంటారు
వాహనాలు స్థలాలు కొనుగోలు లో చిక్కులు తొలగుతాయి
ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది
దూరమైనా ఆప్తులు దగ్గరకు చేరి సాయపడతారు
ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
కొన్ని వ్యవహారాలలో కీలక పాత్రపోషిస్తారు
ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు
వ్యాపారాల విస్తరణ కు అవసరమైన పెట్టుబడులు సమకూరుతాయి
ఉద్యోగులకు విధుల్లో ప్రతి బంధకాలు తొలగుతాయి
పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు
కళాకారులు ఉత్సాహం గా అవకాశాలు సద్వినియోగం చేసుకొంటారు
మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
హనుమాన్ చాలీసా చదవడం మంచిది
శుక్ర, శని వారాలలో అనుకోని ప్రయాణాలు, వృధా ఖర్చులు, బంధువర్గం తో కలహాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి

 

 

ధనుస్సు
ఇంటాబయటా అనుకూలం గా ఉంటుంది
రావలసిన సొమ్ము సైతం అంది అవసరాలు తీరుతాయి
మీ ఓర్పు, సహనం విజయాలలో సహకరిస్తాయి
పనులు అనుకున్న రీతిలో పూర్తి[చేస్తారు
ఆత్మీయులు, బంధువుల సహాయం అందుతుంది
వాహనాలు, స్థలాలు కొంటారు
ఒక ముఖ్య సమాచారం సంతోషం కలిగిస్తుంది
బాధ్యతలు సమర్దవంతం గా నిర్వహిస్తారు
భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి
ఉద్యోగావర్గాలకు ఉత్సాహవంతం గా ఉంటుంది
పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు, సహాయం అందుతాయి
కళాకారులకు అనుకున్న అవకాశాలు అందుకొంటారు
విద్యార్ధులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి
మహిళలలు కుటుంబ సభ్యుల చేయూత తో ముందుకు సాగుతారు
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం
హనుమాన్ చాలీసా చదవడం మంచి ఫలితాన్నిస్తుంది
ఆది, సోమవారాలు మానసిక ఆందోళన. వ్యయ ప్రయాసలు, సోదరీసోదరుల తో కలయాలు ఉంటాయి.

 

మకరం
సంఘం లో విశేష గౌరవం పొందుతారు
ఇంటాబయటా మీదే పై చేయిగా ఉంటుంది
సన్నిహితుల సాయం తో ముందుకు సాగుతారు
స్థిరాస్థి వివాదాలు తీరి లభ్ది పొందుతారు సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు
చిన్ననాటి మిత్రులను కలసుకొంటారు
జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచన
ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి
పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు
కళాకారులకు అవార్డులు దక్కే అవకాశం కలదు
నిరుద్యోగులు పోటి పరిక్షలలో మంచి ఫలితాలు సాదిస్తారు
పచ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది
మంగళ, బుధవారాలలో దూర ప్రయాణాలు,మిత్రులతో విభేదాలు, అంచనాలు తారు మారు, రుణాలు చేయవలసి రావడం ఉంటాయి

 

 

కుంభం
ఆదాయం మరింతగా పెరుగుతుంది
సన్నిహితుల సాయం తో పనులు చక్కదిద్దుతారు
పరపతి పెరుగుతుంది
చిన్ననాటి స్నేహితులతో ఆనందం గా గడుపుతారు
కొన్ని సమస్యలు చాకచక్యం గా పరిష్కరించుకొంటారు
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు
దూరపు బంధువులను కలసుకొని మంచీ చెడ్డా విచారిస్తారు
పరపతి పెరుగుతుంది
కోర్టు వ్యవహారాలు అనుకూలం గా పరిష్కారమవుతాయి
చిరకాల ప్రథ్యర్దులు మిత్రులుగా మారుతారు
వ్యాపారాలలో పురోగతి సాదిస్తారు
ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి
పారిశ్రామిక, విద్యారంగాల వారు విదేశీ పర్యటనలు జరుపుతారు
కళాకారులకు ఊహించని అవకాశాలు అందుతాయి
మహిళలకు ప్రోత్సాహకరం గా ఉంటుంది
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
ఆదిత్య హృదం చదవడం మంచి ఫలితాలనిస్తుంది
గురు, శనివారాలలో అనుకోని ప్రయాణాలు. కుటుంబ సమస్యలు, పనుల్లో అవరోధాలు, అనారోగ్యాలకి అవకాశం కలదు

 

 

మీనం
రావలసిన సొమ్ము అందుతుంది
ఆలయాలు సందర్శిస్తారు
ప్రముఖుల నుంచి పిలుపు రావచ్చు వివాహ యత్నాలు అనుకూలిస్తాయి
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి
బంధువులు, మిత్రుల చేయుత లభిస్తుంది
పనులు చకచకా పూర్తి కాగలవు. ఆస్తి వివాదాలు తీరుతాయి
వ్యాపార విస్తరణ లో అవరోధాలు తొలగుతాయి. నూతన పెట్టుబడులు సమకూరుతాయి
ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి
పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి
విద్యార్దుల పరిశోధనలు అనుకూలిస్తాయి
కళాకారులకు అవార్డులు లేదా పురస్కారాలు దక్కవచ్చు
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం
శివారాధన చయడం మంచిది
ఆది, సోమవారాల్లో దూర ప్రయాణాలు, ఇంటాబయటా చికాకులు. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఉంటాయి

 

Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 28th Jan 2014, Srikaram Subhakaram Wpisodes youtube, Srikaram Subhakaram youtube,