Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 2nd Feb 2014

Srikaram Subhakaram 2nd Feb 2014


Srikaram Subhakaram 2nd Feb 2014

రాశి ఫలాలు

26th Jan 201–1st Feb 2014 by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (2014-02-02  –  2014-02-08)

మేషం
రావలసిన సొమ్ము అందుతుంది
వ్యవహారాలూ సంతృప్తికరం గా సాగుతాయి
ఆశర్యకరమైన విషయాలు తెలుసుకొంటారు
నలుగురి లో మీ పరపతి పెరుగుతుంది
సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది
ఆస్తి విషయాలలో బంధువులతో తగాదాలు పరిష్కారమవుతాయి
ఆలయాలు సందర్శిస్తారు
చిరకాల ప్రథ్యర్దులు మిత్రులుగా మారి సహకరిస్తారు
ఉద్యోగులకు విధి నిర్వహణలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు
వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు అందుతాయి
రాజకీయవర్గాలకు సన్మానాలు, సత్కారాలతో బిజీగా గడుపుతారు
కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి
విద్యార్దులకు ప్రోత్సాహకరం గా ఉంటుంది. కొత్త విద్యావకాశాలు లభిస్తాయి
మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

వృషభం
ఆదాయం కొంత పెరుగుతుంది
సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి
శుభకార్యాలలో పాల్గొంటారు
కొన్ని బాకీలు అందుతాయి
అరుదైన ఆహ్వానాలు అందుతాయి
ఆస్తి వివాదాలు నుంచి గట్టెక్కుతారు
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు
మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు
వ్యాపారాల విస్తరణ యత్నాలు సానుకూలమవుతాయి
ఉద్యోగులకు పదోన్నతులు అవకాశాలు లభిస్తాయి
రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పదవులు ఊరిస్తాయి
కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరకు వచ్చి ఉత్సాహన్నిస్తాయి
విద్యార్దులకు సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి
మహిళలకు కుటుంబం లో చికాకులు తొలగుతాయి
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది

మిథునం
ఈ వారం ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి
శ్రమ పడ్డా ఫలితం కనిపించడం తో సంతృప్తి గా ఉంటుంది
సోదరులు, మిత్రులతో ఆనందం గా గడుపుతారు
మీ ఆశయాల సాధన లో బంధువుల తోడ్పాటు లభిస్తుంది
భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు
దేవాలయాల సందర్శన చేస్తారు
ఇంటిలో విందు వినోదాలు ఉంటాయి
ఉద్యోగాలకు అనుకూలం గా ఉంటుంది, పదోన్నతులు కలిగే అవకాశం కలదు
కళాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్మానాలు జరుగుతాయి
మహిళలు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
గణపతి ని ఆరాధించడం మంచిది

కర్కాటకం
అదనపు ఆదాయం సమకూరుతుంది
సన్నిహితులు మరింత దగ్గరవుతారు
కొన్ని సమస్యలు తీరుతాయి
ఆలోచనలు కలసి వస్తాయి
కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి
ఆలయాలు సందర్శిస్తారు
గతం లోని సంఘటనలు గుర్తుకు వస్తాయి
మీ వ్యూహాలు అమలు పరిచి కొన్ని విజయాలు సాదిస్తారు
వ్యాపారాలలో ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి
కళాకారులకు, అవార్డులు, రివార్డులు అందుతాయి
రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.
పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి
మహిళలు కుటుంబ సమస్యలు పరిష్కరించుకొంటారు
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచి ఫలితాలనిస్తుంది

సింహం
కొత్త పనులకు శ్రీ కారం చుడతారు
ఆస్తి వివాదాలు తీరి అనుకున్నరీతిలో లభ్ది పొందుతారు
జీవిత భాగస్వామి సూచనలు పాటించి ముందుకుసాగుతారు
ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు
ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం
వ్యాపారస్తులకు ఉత్సాహవంతమైన కాలం
ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కొన్ని చికాకులు తొలగుతాయి
రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించి సన్మానాలు పొందుతారు
కళాకారులకు గతం లో పెండింగ్ లో పడ్డ అవకాశాలు దగ్గరకు వస్తాయి
మహిళలకు అనారోగ్య సమస్యలు బయటపడతాయి
ఉత్తర దిశ ప్రయాణాలు కలసి వస్తాయి
నరసింహ స్వామి ని పూజించడం మంచి ఫలితాలనిస్తుంది

కన్య
ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరం గా ఉంటాయి
సన్నిహితులతో ఆనందం గా గడుపుతారు
శ్రేయోభిలాషుల సలహాలను పాటిస్తారు
సంఘం లో గౌరవమర్యాదలు పెరుగుతాయి
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి
కొత్త కాంట్రాక్టులు పొందుతారు
పలుకుబడి పెరిగి అందరిలో గుర్తింపు పొందుతారు
ఆలయాలు సందర్శిస్తారు
వ్యాపారులకు కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం
ఉద్యోగులకు ఊహించని రీతిలో పదోన్నతులు లభిస్తాయి
పారిశ్రామికవేత్తల అంచనాలు నిజమవుతాయి. పట్టుదల పెరుగుతుంది
కళాకారులకు అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
మహిళలకు చికాకులు తొలగుతాయి
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది

తుల
పరపతికలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి
సభలు, సమావేశాల్లో పాల్గొంటారు
పాతబాకీలు వసూలవుతాయి
గతం లో నిలిచిపోయిన పనులు సైతం ప్రస్తుతం పూర్తి చేస్తారు
బంధువులతో మంచి చెడ్డా విచారిస్తారు
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంటారు
దేవాలయాలు సందర్శిస్తారు
స్థిరాస్థి కి సంబంధించిన లాభాలు కలుగుతాయి. గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు కలవు
వ్యాపారులకు అనుకున్న లాభాలు లభిస్తాయి
పారిశ్రామికవేత్తలకు అరుదైన పురస్కారాలు అందుతాయి. లైసెన్సులు వంటి వాటికికోసం ప్రయత్నించే వారికి ప్రయత్నపూర్వకం గా లభిస్తాయి
మహిళలు కుటుంబం లో శుభకార్యాల నిర్వహణలో తలమునకలుగా వ్యవహరిస్తారు
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
శివారాధన చేయడం మంచి ఫలితాలనిస్తుంది

వృశ్చికం
ఆర్దిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
సన్నిహితుల సాయం అందుతుంది
ఆరోగ్యం కొంత మందగిస్తుంది
వివాదాలు కొన్ని పరిష్కరించుకొంటారు
భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు
ఆత్మీయుల సలహాలు పాటిస్తారు
అనుకున్న పనులు సకాలం సాదిస్తారు
వ్యాపారాలలో లాభాలు గడిస్తారు
ఉద్యోగులకు విధి నిర్వహణలో ముందడుగు వేస్తారు
కళాకారుల ఊహలు నిజం చేసుకొంటారు. కొందరికి సన్మానాలు కుడా జరుగుతాయి
పారిశ్రామికవేత్తల కొత్త సంస్థలు ప్రారంభించడానికి యత్నాలు ముమ్మరం చేస్తారు
మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అందుతుంది
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
గణపతి ని పూజించడం మంచిది

ధనుస్సు
ఆర్ధిక వ్యవహారాలలో కొంత అసంతృప్తి కలుగుతుంది
పనులు నెమ్మదిగా సాగుతాయి
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి
దేవాలయ దర్శనాలు చేస్తారు
ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి
ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి
కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాలలో ప్రసంశలు అందుతాయి
వ్యాపారాలలో కొద్ది పాటి లాభాలు లభిస్తాయి
ఉద్యోగులకు శ్రమపడ్డా ఫలితం కనిపించకపోవడం తో కొంత నిరాశ తప్పదు
పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఖరారవుతాయి
కళాకారులకు ఉత్సాహవంతమైన సమాచారం అందుతుంది
మహిళలకు కొన్ని వివాదాలు తీరుతాయి
ఉత్తర దిశ ప్రయాణాలు సానుకూలం
వెంకటేశ్వర స్వామి ని పూజించడం మంచి ఫలితం ఉంటుంది

మకరం
ఈ వారం పనుల్లో జాప్యం జరిగే అవకాశం కలదు
ఆర్ధికపరిస్థితి నిరుత్సాహపరుస్తుంది
ముఖ్య నిర్ణయాలు వాయిదావేస్తారు
ఆలోచనలు స్థిరం గా ఉండవు
చర్మ సంబంధిత రుగ్మతులు వేధిస్తాయి
తండ్రి తరఫు వారితో తగాదాలు ఏర్పడే అవకాశం కలదు
దూరప్రయాణాలు ఉంటాయి
సన్నిహితుల నుంచి విమర్శలు సైతం ఎదురుకొంటారు
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడుల్లో తీసుకొనే నిర్ణయాలలో తొందరపాటు వద్దు
ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు జరిగే అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు
పారిశ్రామికవేత్తలకు సంస్థలు ఏర్పాటు చేసే విషయం లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి
మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం
ఆంజనేయస్వామి ని పూజించడం మంచిది

కుంభం
ఈ వారం ఆదాయం నిరాశ కలిగిస్తుంది
ఆకస్మిక ప్రయాణాలు సంభవిస్తాయి
విలువైన వస్తువులు, పత్రాల విషయం లో జాగ్రత్త వహించాలి
ఆరోగ్య భంగం వలన ఔషధ సేవనం తప్పదు
శ్రమ అధికం గా ఉంటుంది
ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు
ఆలయాలు సందర్శిస్తారు
బంధువులతో తగాదాలు ఏర్పడతాయి
ఆలోచనలు స్థిరం గా ఉండవు
వ్యాపారాలలో లాభాలు గడించడం కష్టతరమవుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది
ఉద్యోగులకు ఊహించని మార్పులు సంభవిస్తాయి
పారిశ్రామిక వేత్తలు సంస్థల ఏర్పాటులో ఆటుపోట్లు ఎదురుకొంటారు
కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి
మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది

మీనం
రావలసిన సొమ్ము అందుతుంది
వ్యవహారాలలో విజయం సాదిస్తారు
శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి
చిరకాల ప్రథ్యర్దులు మిత్రులుగా మారుతారు
ఆస్తి వివాదాలు తీరుతాయి
అందరిలోనూ గుర్తింపు పొందుతారు
వ్యాపారాలు ఉత్సాహం గా సాగుతాయి
ఉద్యోగులకు ఉన్నతహొదాలు లభిస్తాయి
పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతం గా ఉంటుంది
కళాకారులకు అవార్డులు లభిస్తాయి
ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు
మహిళలకు కొంత నిరాశ తప్పదు
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది

Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 2nd Feb 2014, Srikaram Subhakaram Wpisodes youtube, Srikaram Subhakaram youtube,