Srikaram Subhakaram – 3rd Nov – 9th Nov
మేషం
ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. పారిశ్రామికవేత్తలకు విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహారాధన మంచిది.
వృషభం
కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుకోని ఆహ్వానాలు రాగలవు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు కొంటారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు కొత్త పదవీయోగం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. మానసిక ఆందోళన. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఆస్తి వివాదాలు, సోదరులతో విభేదాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. సినీ, టీవీ కళాకారులకు ఊహించని సన్మానాలు.కుటుంబసభ్యులతో విభేదాలు. ఉద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. దత్తాత్రేయుని పూజించండి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
కర్కాటకం
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. కొన్ని వివాదాలు ఎట్టేకలకు పరిష్కారం. ఇంటిలో శభకార్యాలు. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు. సినికళాకారులకు అవార్డులు తథ్యం. వారం చివరలో ధననష్టం. బంధువర్గంతో విభేదాలు.
సింహం
ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి. భవిష్యత్‌పై కొత్త ఆశలు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార వృద్ధి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు తధ్యం. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. వారం ప్రారంభంలో చికాకులు. మనశ్శాంతి లోపిస్తుంది. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
కన్య
బంధువులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఒక సమాచారం కొంత గందరగోళం సృష్టిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ అంచనాలు తపతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మికమార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వేత్తలకు కొంత నిరాశ తప్పదు. కీలక నిర్ణయాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
తుల
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు మీ అభివృద్ధిలో సహకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారులకు అనుకోని లాభాలు. వారం చివరలో అనుకోని లాభాలు. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
వృశ్చికం
కొత్త కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల నుంచి శుభవర్తమాణాలు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. పరపతి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
ధనుస్సు
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరమైన ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా ఉంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యనిర్ణయాలకు తగిన నిర్ణయం. ముఖ్యనిర్ణయాలకు తగిన సమయం. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వారం మధ్యలో ధననష్టం. కుటుంబంలో చికాకులు తప్పవు.
మకరం
ఎంతటి కార్యాన్నైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్గునపడతారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. విద్యార్థులు పరిశోధనలో ముందడుగు వేస్తారు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఉద్యోగులకు కొత్త హోదాలు.
కుంభం
పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. పోటీపరీక్షల్లో విజయం. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో వైరం,ఆరోగ్యభంగం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆశయాలు నెరవేరుతాయి.
మీనం
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెంచుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. వారం చివరలో మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు.
Tags : Srikaram Subhakaram – 3rd Nov – 9th Nov, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram – 3rd Nov – 9th Nov
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
