Srikaram Subhakaram 6th April 2014

0

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Srikaram Subhakaram, 6th April 2014 Episode

Weekly Horoscope (2014-04-06  –  2014-04-12)

మేషం…
——
ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
సన్నిహితులతో అకారణంగా తగాదాలు.
అనుకోని సంఘటనలు.
విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి.
ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.
ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.
ఎంతకష్టించినా ఆశించిన ఫలితం రాక డీలా పడతారు.
వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడుల్లో తొందరవద్దు.
ఉద్యోగులకు స్థానచలన సూచనలు.
పారిశ్రామిక,వైద్యరంగాల వారికి ఒడిదుడుకులు పెరుగుతాయి.
కళాకారులు కొంత నిరాశ చెందుతారు.
మహిళలకు కుటుంబంలో చికాకులు.
ఆది,సోమవారాలలో కుటుంబసౌఖ్యం. కీలక సమాచారం. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి.

వృషభం…
——-
ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి.
అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.
బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి.
చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
విలువైన పత్రాలు చేజారతాయి.
ఆలయాలు సందర్శిస్తారు.
దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది.
వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగులకు పనిభారంతో పాటు, పైస్థాయి నుంచి ఒత్తిడులు.
పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది.
కళాకారులు ఆచితూచి వ్యవహరించాలి.
మహిళలకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి.
శుక్ర, శనివారాలలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం…
——
పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది.
ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు.
స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.
ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.
వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులకు తగిన సమయం.
ఉద్యోగులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.
పారిశ్రామికవర్గాలకు అనుకోని ప్రగతి కనిపిస్తుంది.
కళాకారులు నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు.
మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మంగళ, బుధవారాలలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
గణపతిని ఆరాధించండి..

కర్కాటకం…
——-
ఆదాయం అంతగా కనిపించదు.
ఆస్తి వివాదాలు నెలకొంటాయి.
ఇంటాబయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఆలోచనలు నిలకడగా ఉండవు.
అంచనాలు తప్పి నిరాశ చెందుతారు.
వాహనాలు, ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి.
తీర్థయాత్రలు చేస్తారు.
జ్వర, జలుబు వంటి రుగ్మతలు బాధిస్తాయి.
ఆలయాలు సంద ర్శిస్తారు.
వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి.
ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి.
కళాకారులు కాస్త నిదానంగా వ్యవహరించాలి.
మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు.
మంగళ, బుధవారాలలో ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

సింహం…
——
ఆర్థికలావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు.
అనుకున్న కార్యాలలో విజయం సాధిస్తారు.
సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకుసాగుతారు.
స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.
సంఘంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది.
వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు.
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.లాభాలు తథ్యం.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు, ఇంక్రిమెంట్లు రాగలవు.
పారిశ్రామిక,సాంకేతిక వర్గాలకు నూతనోత్సాహం. విదేశీయానం.
కళాకారులకు ఒత్తిడులు తొలగడం శుభసూచకం.
మహిళలకు ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి.
మంగళ, బుధవారాలలో ఖర్చులు. అనారోగ్యం. భార్యాభార్తల మధ్య విభేదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

కన్య…
——
ఆర్థిక ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు.
ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం.
విలువైన వస్తువులు, వాహనాలు కొంటారు.
ఒక వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.
దూరపు బంధువుల నుంచి ధనలాభం.
ప్రముఖులతో పరిచయాలు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది.
వ్యాపారులకు అనుకోని లాభాలు.
ఉద్యోగులు విధుల్లో అవరోధాలు అధిగమిస్తారు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆహ్వానాలు రాగలవు.
కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. అవార్డులు దక్కుతాయి.
మహిళలకు మానసిక ప్రశాంతత.
శుక్ర, శనివారాలలో పనుల్లో అవరోధాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
గణపతిని పూజించండి.

తుల…
—–
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితులతో వివాదాలు తీరతాయి.
ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు.
వాహనాలు, స్థలాలు కొంటారు.
ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
కొన్ని ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు.
జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు.
వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు తథ్యం.
ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.
కళారంగం వారికి యోగదాయకంగా ఉంటుంది.
మహిళలకు నూతనోత్సాహం.
ఆలయాలు సందర్శిస్తారు.
ఆది,సోమవారాలలో ధనవ్యయం.కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు.
దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం…
——-
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.
శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.
ఆస్తి వివాదాలు నెలకొంటాయి.
బాధ్యతలు పెరుగుతాయి.
కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు.
ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.
చర్మ, గొంతు సంబంధిత రుగ్మతలు , ఔషధసేవనం.
చోరభయం, విలువైన వస్తువులు జాగ్రత్తగాచూసుకోండి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ఉద్యోగులు అదనపు పనిభారంతో సతమతమవుతారు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఒడిదుడుకులు.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి.
మహిళలకు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.
శుక్ర,శనివారాలలో ధన, వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. సోదరులతో సఖ్యత.విందువినోదాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు…
——
రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు.
రుణయత్నాలు ముమ్మరం చేస్తారు.
బంధువులు, మిత్రులతో విభేదాలు.
ఆలోచనలుస్థిరంగా ఉండవు.
ఆస్తి విషయంలో చిక్కులు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.
ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
ఉద్యోగవర్గాలకు నిరుత్సాహం.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు.
కళాకారులకు ఒడిదుడుకులు తప్పవు.
మహిళలు కుటుంబపరంగా కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు.
ఆది, సోమవారాలలో ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. చర్చలు ఫలిస్తాయి.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణచేయండి.

మకరం….
——
కొత్తపనులు ప్రారంభిస్తారు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది.
సన్నిహితులు మీపట్ల మరింతగా అభిమానం చూపుతారు.
అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.
విలువైన వస్తువులు సేకరిస్తారు.
వాహనాలు, స్థలాలు కొంటారు.
స్థిరాస్తి లాభం.
గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు.
సోదరులు, మిత్రుల నుంచి కీలక సమాచారం.
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.
వ్యాపారాలలో లాభాలు.
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.
కళాకారులు అవార్డులు లేదా పురస్కారాలు పొందుతారు.
మహిళలకు మానసిక ఆందోళన తొలగుతుంది.
శుక్ర, శనివారాలలో వ్యయప్రయాసలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

కుంభం…
—–
ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ఉంటాయి.
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.
బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
చిన్ననాటి మిత్రులను ఆహ్వానిస్తారు.
సంఘంలో గౌరవం లభిస్తుంది.
ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు.
వాహనాలు, స్థలాలు కొంటారు.
మీ సత్తా చాటుకుంటారు.
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి.
పారిశ్రామికవర్గాలకు విదేశీయానం.
కళాకారులకు ఊహించని అవకాశాలు.
మహిళలకు కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం అందుతుంది.
ఆది, సోమవారాలలో ధననష్టం. కుటుంబసమస్యలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

మీనం…
——-
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.
శ్రమ పెరుగుతుంది.
సన్నిహితులతో తగాదాలు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
కుటుంబసభ్యులతో తగాదాలు.
అనారోగ్యసూచనలు,
మీ అంచనాలు తప్పుతాయి.
ప్రత్యర్థులు సమస్యలు సృష్టించే వీలుంది.
వ్యాపారాలలో ఒడిదుడుకులు.
ఉద్యోగులకు స్థానచలనం.
పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది.
రాజకీయవర్గాలకు పదవులు చేజారే వీలుంది.
కళాకారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మహిళలకు ఉద్యోగ, ఆస్తిలాభ సూచనలు.
శుక్ర,శనివారాలలో వాహనయోగం. పనుల్లో పురోగతి. కుటుంబసౌఖ్యం.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

Tags;Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Srikaram Subhakaram 6th April 2014,