Srikaram Subhakaram 8th Dec 2013

0

Srikaram Subhakaram Dec 8th – Dec 14th – రాశి ఫలాలు

 

మేషం 
ఈ వారం ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకం గా ఉంటాయి 
సన్నిహితులు , మిత్రులు మీకు  అన్ని విషయాలలో చేదోడు వాదోడు గా ఉంటారు 
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది 
చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది 
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు 
మీ మనస్సుకు తోచిన విధం గా నడుచుకుని  తీసుకొంటారు 
కాంట్రాక్టర్లకు అనుకూల సమయం 
అనారోగ్య సమస్యలు బాదిస్తాయి ముఖ్యం గా ,నరాల బలహీనత  రక్త సంబంధిత రుగ్మతలు అధికమవుతాయి 
రావలసిన సొమ్ము చేతికండడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి 
వ్యాపారాలలో లాభ నష్టాలు సమానం గా ఉంటాయి 
ఉద్యోగవర్గాలు అనుకొన్న పదోన్నతులు దక్కించుకొంటారు 
రాజకీయవర్గాలకు పదవుల పై   హామీ లభిస్తుంది 
విద్యార్దులకు నూతనోత్సాహం 
పశ్చిమ దిశ ప్రయాణం  సానుకూలం 
గణపతి ని పూజించడం మంచి ఫలితాలనిస్తుంది

వృషభం 
ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది 
మిత్రులతోకలసి  ఆనందంగా గడుపుతారు 
మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది 
ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి 
అనుకోకుండా అందిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది 
వ్యవహారాలలో ముందడుగు వేస్తారు 
భూమ్ములు, వాహనాలు కొనుగోలు చేయాలనుకొనే వారికి మంచి సమయం 
జలుబు జ్వరం వంటి వాత సంబంధిత వ్యాధుల వలన సమస్యలు ఎదురవుతాయి 
 జీవిత భాగస్వామి ద్వారా అనుకూలత లభిస్తుంది 
తీర్థ యాత్రలు, ప్రయాణాలు ఆఖరి నిమిషం లో వాయిదా పడే అవకాశం కలదు 
మహిళలకు కుటుంబ విషయాలలో అనుకూలత లభిస్తుంది 
భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి 
ఉద్యోగస్తులకు విధుల్లో అవరోధాలు ఏర్పడతాయి 
పారిశ్రామిక వేత్తలకు నూతనోత్సాహం 
సినీకళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి 
ఉత్తర దిశ ప్రయాణాలు లాభిస్తాయి 
విష్ణుసహస్రనామ పారాయణ చేయడం మంచి ఫలితాలనిస్తుంది

మిథునం 
పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకొంటారు 
సంఘం లో మీ పరపతి పెరుగుతుంది 
సంతాన పరమైన చికాకులు ఎదురైనప్పటికి వాటిని అధిగమిస్తారు 
ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొంత నెమ్మదిస్తాయి 
జీవిత భాగస్వామి తో విబేధాలు తలెత్తే అవకాశం కలదు 
వ్యాపారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయి 
ఉద్యోగులకు అనుకొన్న హోదాలు దక్కుతాయి 
పారిశ్రామిక సాంకేతిక వర్గాలకు ఉత్సాహవంతమైన కాలం 
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
శివ పూజలు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది

కర్కాటకం 
ఆర్ధిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి 
ఆలోచనలు స్థిరం గా ఉండవు 
బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం కలదు 
ఎంత గా కష్టపడిన తగినంత ఫలితం లభించదు 
ఆస్తుల విషయం లో సోదరులతో విభేదిస్తారు 
వాహనాల విషయం లో అప్రమత్తం గా ఉండడం మంచిది 
ఉద్యోగస్తులకు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంటుంది 
వ్యాపారాలలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది 
కళాకారులకు పని ఒత్తిడి తప్పదు 
మహిళలకు కుటుంబం లో చిక్కకులు ఎదురవుతాయి 
విద్యార్దుల అంచనాలు తప్పడం తో కొంత నిరుత్సాహానికి గురవుతారు 
ఉష్ణసంబంధిత అనారోగ్య సమస్యలతో భాదపడవలసి వస్తుంది 
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
లక్ష్మి దేవిని పూజించడం మంచిది

సింహం 
ఆదాయం కొంత నిరాస కలిగిస్తుంది, దీని వలన పొదుపు చేసుకొన్నా డబ్బు సైతం ఖర్చు చేయవలసిన అవసరం వస్తుంది 
సోదరులు మిత్రులతో అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి 
కుటుంబం లో చికాకులు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది 
ఇతరుల నుంచి రావలసిన సొమ్ము రావడానికి మరి కొంత సమయం పడుతుంది 
వివాదాలకు దూరం గా ఉండడం మంచిది 
సంతాన విషయం లో సమస్యలు ఎదురుకొంటారు 
పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు 
ఒక సంఘటన మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొంటుంది 
వ్యాపార లావాదేవీలు సామాన్యం గా ఉంటాయి 
ఉద్యోగులు విధుల్లో ఒడి దుడుకులు ఎదురుకొంటారు 
పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారు నిర్ణయాలలో తొందరపాటు తనం తగ్గించుకొంటే మంచిది 
మహిళలు కొన్ని విషయాలలో ఓర్పు తో వ్యవహరించడం మంచిది 
తూర్పు దిశ ప్రయాణాలు కలసి వస్తాయి 
ఆంజనేయ స్వామి ని పూజించడం మంచిది

కన్య 
ఆర్ధిక విషయాలు సంతృప్తి కరం గా ఉంటాయి 
దీర్ఘకాలిక వివాదాలు సమస్యలు తీరుతాయి 
మీ ఆలోచనలకు కార్య రూపం దాలుస్తారు,
నలుగురి లో మీ పరపతి పెరుగుతుంది 
స్థలాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు 
వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు 
పాత మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు 
వాహనాలు నడిపెటప్పుడు అప్రమత్తం గా ఉండడం మంచిది 
ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉంటాయి 
మహిళలకు కుటుంబం లో విశేష గౌరవం లభిస్తుంది 
వ్యాపారాలు అనుకొన్న విధం గా లాభిస్తాయి , నూతన పెట్టుబడులు సైతం అందుతాయి 
ఉత్తర దిశ ప్రయాణాలు లాభిస్తాయి 
విఘ్నేశ్వర పూజ అన్ని విధాల మంచిది

తుల 
ఆదాయం సంతృప్తి కరం గా ఉంటుంది 
దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి 
విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు 
సేవాకార్యక్రమాల లో పాల్గొంటారు 
చిరకాల ప్రత్యర్ధులు అనుకూలం గా మారుతారు
ఒక ప్రకటన నిరుద్యోగుల్ని ఆకట్టుకొంటుంది 
కుటుంబ సభ్యులతో కలసి ఆలయాలు సందర్శిస్తారు 
దూరపు బంధువులను కలసుకొని ఉల్లాసం గా గడుపుతారు 
వ్యాపారం లో మంచి పురోగతి ఉంటుంది 
ఉద్యోగులకు  ఉన్నత హోదాలు లభిస్తాయి 
సాంకేతిక వర్గాలకు అరుదైన అవకాశాలు లభిస్తాయి 
మహిళలకు శుభవార్తలు లభిస్తాయి 
సోదరులతో కలహాలు ఏర్పడే అవకాశం కలదు 
ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి 
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
దత్తాత్రేయుని పూజించడం మంచిది

వృశ్చికం 
ఈ వారం పనులు మందగిస్తాయి 
రావలసిన సొమ్ము అందాకా ఇబ్బంది ఎదురుకొంటారు. రుణాల కోసం ప్రయత్నిస్తారు 
ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి 
శ్రమఎంత ఉన్నప్పటికీ ఫలితం శూన్యం గా ఉంటుంది 
కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి 
ఆలోచనలు స్థిరం గా ఉండవు 
ఇంటాబయటా భాద్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి 
వ్యాపారాలలో కొద్ది పాటి ఆటుపోట్లు తప్పవు 
ఉద్యోగులకు అదనపు విధులు కొంత ఇబ్బందికరం గా మారుతాయి 
పారిశ్రామిక వర్గాలకు తలపెట్టిన పనులలో నిరుత్సాహం తప్పదు, విదేశి పర్యటనలు సైతం వాయిదా వేసుకోవలసి వస్తుంది 
మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది 
గొంతు ఉదార సంబంధిత రుగ్మతులు సమస్యల తో బాధ పడతారు 
కుటుంబ విషయాలలో అనుకోని ఒడి దుడుకులు ఎదురవుతాయి 
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
హనుమాన్ పూజలు మంచి ఫలితాలనిస్తాయి

ధనుస్సు 
ఆర్ధిక పరిస్థితి కొంత గందరగోళం గా ఉంటుంది 
కొత్తగా రుణాలు చేయవలసి వస్తుంది 
ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు 
ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు 
భాద్యతల తో సతమతమవుతారు 
కావలసిన వారితో కలసి దేవాలయాలు సందర్శిస్తారు 
కొన్ని పనులు నత్త నడకన సాగుతాయి 
ఇంటి నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు 
భాగస్వామ్య వ్యాపారాలు అంతగా లాభించవు 
ఉద్యోగులు భాద్యతల విషయం లో అప్రమత్తత పాటించాలి 
పారిశ్రామిక, సాంకేతిక వర్గాల వారు నిర్ణయాలలో తొందరపడరాదు 
సంతాన పరమైన చికాకులు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి 
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
శివారాధన చేయడం మంచిది

మకరం 
పనుల్లో జాప్యం జరుగుతుంది 
కుటుంబ భాద్యతలు అధికమవుతాయి, ఒక పరీక్షలాగ వాటిని ఎదురుకోవలసి వస్తుంది 
రాబడి తగ్గి అవసరాలకు రుణాలు చేస్తారు 
మీ అంచనాలు తప్పుతాయి 
సోదరులు, బంధువుల నుంచి విమర్శలు, అపవాదులు ఎదురుకొంటారు 
వాహనాల విషయం లో అప్రమత్తం గా ఉండాలి 
విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు 
వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రం గా సాగుతాయి 
ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడతాయి 
సంకేతిక వర్గం లో ఉన్న వారికి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి 
మహిళలు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు 
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలనిస్తుంది

కుంభం 
ఉత్సాహవంతం గా కార్యక్రమాలు పూర్తి చేస్తారు 
ఆర్ధిక విషయాలు సంతృప్తినిస్తాయి 
కుటుంబం లో శుభకార్యాలు నిర్వహిస్తారు 
యుక్తి తో ఎంతటి కార్యాన్నైనా అసంపూర్ణం గా వదలకుండా పూర్తిచేస్తారు 
ఆత్మీయుల ఆదరణ పొందుతారు 
పరపతి పెరుగుతుంది 
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి 
ఉద్యోగాలలో ఒడి దుడుకులు నుంచి బయటపడతారు 
వృత్తి  వ్యాపారాలలో ఉండే వారికి నూతన అవకాశాలు లభిస్తాయి 
సోదరులతో అనవసరమైన విభేదాలు తలెత్తే అవకాశం కలదు 
మహిళలకు కుటుంబం లో గౌరవం పెరుగుతుంది 
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
వెంకటేశ్వర స్వామి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది

మీనం 
ఆర్ధిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి 
రుణదాతల ఒత్తిడులు అధికమవుతాయి 
ఇంటాబయటా నిరుత్సాహం తప్పదు 
మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు 
ఒక కార్యక్రమాన్ని మధ్యలో విరమించవలసి వస్తుంది 
ఆలోచనలు నిలకడగా ఉండవు 
వ్యాపారులు కాస్త ఆలోచించి ముందుకు సాగడం మంచిది 
ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి 
సాంకేతిక వర్గాలకు తొందరపాటు నిర్ణయాలతో కొన్ని చికాకులు ఎదురవుతాయి 
విద్యార్దులకు కృషి కి తగిన ఫలితం కనిపించదు 
మహిళలకు కొంత గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది 
వివిద వృత్తుల వారికి ఈ వారం మానసిక ఆందోళన తప్పదు 
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచి ఫలితాలనిస్తుంది

 

Tags : Srikaram Subhakaram 8th Dev 2013, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu,