లిక్కర్ తో స్పెర్మ్ కౌంట్ హుష్ కాకీ..!!

0

మద్యపానం అనేది ఈ జెనరేషన్ లో చాలా కామన్ అయిపోయింది. అలాంటిదేమీ లేదు.. మా కొంపలో ఒక్కరు కూడా తాగరు అందరూ అద్భుతాలే.. పాలు తాగే బ్యాచే అని ఎవరైనా తమ పిచ్చి మనసుకు సర్దిచెప్పుకుంటే అంత కన్నా ఆత్మవంచన మరొకటి ఉండదు. ఎందుకంటే ఇలాంటి ఇళ్ళలోనే తాగుబోతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అయితే ఒకరికి తెలియకుండా ఒకరు పెగ్గులేస్తుంటారని అర్థం.

మద్యపానం హానికరం అని అన్ని మద్యం సీసా పైనే రాసి ఉంటుంది. ఇక కొందరు సరదా దర్శకులు ‘మద్యపానం హానికరం తాగితే పోతారు’ అంటూ ముకేష్ తీరులో హర్రర్ సీన్ లా కాకుండా సులువైన శైలిలో సినిమా మొదట్లోనే నవ్విస్తారు. హానికరం అని అందరికీ తెలుసు. అయినా తాగుతారు అదే కదా కిక్కు.. అందులోనే కదా ఉండేది థ్రిల్లు. అయితే ఎక్కడ కిక్కు ఉంటుందో అక్కడ కక్కుకునే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ థ్రిల్ ఉంటుందో అక్కడ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ రిస్కులు చాలానే ఉన్నాయి. మద్యపానం వలన కలిగే సమస్యల్లో ఇన్ ఫెర్టిలిటి కూడా ఒకటి.

మత్తులో ‘మూడ్’ ఎక్కువ వస్తుందని చాలామంది అపోహలో ఉంటారు కానీ నిజానికి మద్యపానం వల్ల అడ.. మగ ఇద్దరిలో సెక్స్ కోరికలు తగ్గుతాయట. ఇక ఎక్కువకాలం మద్యపానం అలవాటు ఉంటే సెక్స్ పట్ల నిరాసక్తత పెరిగే ఛాన్స్ ఉంటుందట. మగవారిలో.. ఆడవారిలో ఇన్ ఫెర్టిలిటీ ఈమధ్య ఎక్కువవుతోంది. మద్యపానం కూడా అందుకు ఒక కారణమట. అతిగా మద్యం సేవించడం వల్ల మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని సర్వేలు చెబుతున్నాయి.

ఆల్కహాల్ వల్ల మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతోందని.. అది వీర్యకణాల క్వాలిటీపై ప్రభావం చూపిస్తోందట. వీర్యకణాల సంఖ్య.. సైజ్.. షేప్.. చలనం వంటి విషయాలు ప్రభావితం అవుతున్నాయట. దీంతో వివాహితులైన మగవారికి పిల్లలు కనే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయట. మన భారతీయ సమాజంలో ఇలాంటి అలవాట్ల గురించి డాక్టర్లతో ఓపెన్ గా చర్చించేవారు చాలా తక్కువమంది ఉంటారు. దీంతో ఈ సమస్య రాను రాను తీవ్రమవుతోందట. మరి మద్యపానం వల్ల కలిగే ఇలాంటి దుష్ఫలితాలు పోవాలంటే దానికి మార్గం ఏంటి అంటే.. మందు మానేయడమేనట. మరీ మానేయలేం అనుకుంటే అతి తక్కువ మోతాదులో స్వీకరించడం.. పార్టీలకు మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండేలా చూసుకోవడం మంచిదట. మరీ బూస్టు ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ తరహాలో రోజూ రెచ్చిపోకూడదట.
Please Read Disclaimer