Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ఫేషియల్ వలన కలిగే తెలియని దుష్ప్రభావాలు

ఫేషియల్ వలన కలిగే తెలియని దుష్ప్రభావాలు


అందంగా కనపడటం వలన ఆత్మవిశ్వాసంతో పాటూ, మీపై ఉండే నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. అందాన్ని మెరుగుపరచటంలో బ్యూటీ పార్లర్ లు కూడా సహాయపడతాయి. అందాన్ని మెరుగుపరుచుకోవటానికి వాడే ఫేషియల్ ల వలన లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో వీటి వలన దుష్ప్రభావాలు కలగవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
1చికాకులను కలిగిస్తుంది
అధిక గాడతలు గల క్రీమ్స్, లోషన్ మరియు ఇతర ఉత్పత్తులలో రసాయనాల స్థాయిలు అధికంగా ఉండే ఫేషియల్ మసాజ్ చేయటం వలన కొన్ని సార్లు చర్మాన్ని తీవ్రంగా ప్రభావితపరుస్తాయి. ఈ రసాయనాలు డెర్మిస్ (అంతశ్చర్మం) ప్రమాదానికి గురవటం వలన చర్మం చికాకులకు మరియు దురదలకు గురవుతుంది.

2చర్మాన్ని ఎర్రగా మారుస్తుంది
ఫేషియల్ వలన కలిగే మరొక దుష్ప్రభావం- చర్మం ఎర్రగా మారటం. అవును కొన్ని రకాల కఠినమైన గాడతలు గల రసాయనాలు ఫేషియల్ గా వాడటం వలన ఇవి మీ చర్మ రకానికి సరిపోకపోవటం వలన చర్మం ఎర్రగా మారుతుంది. ఇలాంటి ఇన్ఫ్లమేషన్ ల వలన చర్మం వాపులకు గురవటం లేదా ఎర్రగా మారటం జరుగుతుంది.

3అలర్జీలను కలిగిస్తుంది
మనకు మార్కెట్లో కొన్ని వందల రకాల ఫేషియల్ లు అందుబాటులో ఉన్నాయి మరియు ప్రతి ఒక్కటి ఒక్కో ఆవశ్యకతను కలిగి ఉంటాయి. మన చర్మం కూడా వివిధ రకాలుగా ఉంటుంది మరియు వాటికి అవసరాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వివిధ రకాల ఫేషియల్ లు దురదలను, రాషేస్ మరియు వాపులను కలిగిస్తాయి.

4మచ్చలను కలిగించవచ్చు
బ్యూటీ పార్లర్ లలో ఉండే నిపుణులు బ్లాక్ హెడ్ లను మరియుచర్మంలో ఉండే మలినాలను తొలగించుకోటానికి వాడే పరికరాలు వాడతారు. వీటి వలన మీ చర్మంపై మచ్చలు ఏర్పడతాయి.

5pH లో అసమతుల్యత
రోజు ఫేషియల్ చేసుకోవటం వలన చర్మం తేమ కోల్పోవటం వలన pHలో మార్పులు కలుగుతాయి. ఫలితంగా మీ చర్మం పొడిగా మారుతుంది.