Templates by BIGtheme NET
Home >> REVIEWS >> 47 డేస్ రివ్యూ

47 డేస్ రివ్యూ


చిత్రం : 47 డేస్
నటీనటులు: సత్యదేవ్-పూజా జవేరి- రోషిణి ప్రకాష్-శ్రీకాంత్ అయ్యంగార్-రవివర్మ-ముక్తార్ ఖాన్-సత్యప్రకాష్ తదితరులు
సంగీతం: రఘు కుంచె
ఛాయాగ్రహణం: జీకే
నిర్మాతలు: శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్
రచన-దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి

థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజైన మరో సినిమా ‘47 డేస్’. జీ5లో ఈ రోజు నుంచే ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. సత్యదేవ్ లాంటి పేరున్న నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటించడం పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన కొత్త దర్శకుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించడం సంగీత దర్శకుడు రఘు కుంచె ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో దీనిపై కొంత ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగించేలా ఉందో చూద్దాం పదండి.

కథ: సత్యదేవ్ (సత్యదేవ్) వైజాగ్ సిటీలో ఏసీపీ. అతడి భార్య పద్మావతి (రోషిణి ప్రకాష్) ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. భార్య చనిపోయిన బాధకు తోడు ఆమె ఆత్మహత్యకు కారణమేంటో తెలియక సతమతమవుతుంటాడు సత్య. ఈ క్రమంలో ఓ కేసును సరిగా డీల్ చేయక సస్పెండవుతాడు. ఐతే భార్య చనిపోయిన రోజే చనిపోయిన మరో వ్యక్తికి సంబంధించిన కేసు అనుమానాస్పదంగా కనిపిస్తుంది సత్యకు. దీనికి భార్య మరణానికి సంబంధం ఉందన్న అనుమానంతో సొంతంగా విచారణ చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతను వెలికి తీసిన నిజాలేంటి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: స్కూల్లో ఏడో తరగతి చదివేటపుడు ఓ నాటకంలో భాగంగా ఓ అమ్మాయి జూలియట్ పాత్ర వేయాల్సి ఉంటుంది. ఓ అబ్బాయి రోమియో పాత్రకు కుదురుతాడు. కానీ అనివార్య కారణాలతో ఆ అమ్మాయి ఆ పాత్ర చేయలేకపోతుంది. ఇక్కడ కట్ చేస్తే.. చాలా ఏళ్లకు ఈ అమ్మాయి ఓ అబ్బాయి వెంట పడుతుంది. అతను ముందు లైట్ తీసుకుని తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటూ సహజీవనం కూడా చేస్తారు. కానీ ఆ కుర్రాడు మంచోడు కాదని తెలుసుకున్న ఆ అమ్మాయి.. నీ కోసం వెతుక్కుని మరీ వస్తే ఇలా చేస్తావా అంటూ నిలదీస్తుంది. అప్పుడా కుర్రాడు నాకోసం నువ్వు వెతుక్కుని రావడమేంటి.. నేను ఫలానా అంటూ వివరణ ఇస్తాడు. అప్పుడు అమ్మాయి నేను పప్పులో కాలేశానే అని తల పట్టుకుంటుంది. ఏడో తరగతిలో నాటకమట. అందులో తనకు జోడీగా నటించాల్సి ఉన్న అబ్బాయిని ఎన్నో ఏళ్లకు వెతుక్కుంటూ వచ్చి.. అతననుకుని వేరే అబ్బాయితో ప్రేమలో పడి సహజీవనం చేయడమట. ‘47 డేస్’ ఎంత ఇల్లాజికల్ గా సాగుతుందో చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణ. కొంచెం లోతుల్లోకి వెళ్తే ఇలాంటివి సినిమాలో మరెన్నో ఉన్నాయి.

సినిమాలో హీరో ఫ్రెండు అతణ్ని చూసి.. ‘‘అవసరం లేకుండా నువ్వు రెండు రాండమ్ డాట్స్ ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు’’ అంటాడు. దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. ‘47 డేస్’లో ఇలాగే రాండమ్ డాట్స్ ను కనెక్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాడు. థ్రిల్లర్ సినిమాల్లో ఇలా డాట్స్ ను కనెక్ట్ చేయడం ఎంత పకడ్బందీగా సాగుతుందన్నదాన్ని బట్టే ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతాడు. ఐతే ఈ డాట్స్ చాలా వరకు అర్థం లేని విధంగా ఉ:డటం.. ప్రేక్షకులకు షాకులివ్వాలనే ఉద్దేశంతో లాజిక్ లేకుండా ఎలా పడితే అలా ట్విస్టులు రాసుకోవడం.. పాత్రలు కూడా తేలిపోవడంతో ‘47 డేస్’ నిస్సారంగా తయారైంది. కేవలం విలన్ పాత్ర ఒక్కటి చాలు.. సినిమా ఎంత సిల్లీగా ఉందో చెప్పడానికి. ఆ పాత్రను పరిచయం చేసే తీరు.. ఆ తర్వాత నడిపించిన వైనం.. చివరికి ట్విస్ట్ ఇచ్చి దాని అసలు స్వరూపాన్ని చూపించిన విధానం.. ఎంత సిల్లీగా అంటే అంత సిల్లీగా తయారయ్యాయి.

సినిమాగా తీయడానికి ముందు ఈ కథను చెప్పగా విన్న అందరికీ కొన్ని సందేహాలు వచ్చి ఉండాలి. ఇదేం లాజిక్.. ఇక్కడ ఇలా ఎందుకు అని.. చాలా చోట్ల అనిపించి ఉండాలి. ఐతే ఇందులోని ట్విస్టులు బ్రహ్మాండంగా పేలుతాయని.. విలన్ సహా కొన్ని పాత్రలు షాకిస్తాయని.. సినిమా పాసైపోతుందని అంచనా వేసి ఉండొచ్చు. కానీ అలా జరగలేదు. ఇందులోని కొన్ని సన్నివేశాలు వినడానికి థ్రిల్లింగ్ గానే అనిపించి ఉండొచ్చు. కానీ తీశాక చూసుకుని ఇలా ఉన్నాయేంటి అనిపించి ఉంటే ఆశ్చర్యం లేదు. కొత్త దర్శకుడైన ప్రదీప్.. ఈ స్క్రిప్టును డీల్ చేయడంలో పూర్తిగా తడబడ్డ సంగతి చాలా సన్నివేశాల్లో తెలిసిపోతుంటుంది. పాటల్ని తీసేస్తే గంటన్నర నిడివి కూడా లేని సినిమా.. పైగా థ్రిల్లర్ మూవీలో హీరో-కమిషనర్ మధ్య వచ్చే ప్రతిసారీ ఒకే తరహా సన్నివేశాలు పెట్టి విసిగించాడు దర్శకుడు. థ్రిల్లర్ సినిమాలకు అత్యంత ప్రధానమైన ‘బిగి’ అనే మాటే సినిమాలో ఎక్కడా కనిపించదు. అసలేం జరిగిందనే ఉత్కంఠ కొంత ఉంటుంది కానీ.. ఆ జరిగిందేదో చూపించే విధానం చాలా పేలవంగా తయారవడం.. దానికి ముందు వచ్చే సిల్లీ సీన్లు ‘47 డేస్’ను బోరింగ్ గా మార్చేశాయి. సినిమాలో ఎక్కడా ఏ రకమైన ప్రత్యేక అనుభూతిని ఇవ్వని ‘47 డేస్’.. చివరికి సమయం వృథా అయిందనే ఫీలింగ్ మాత్రం కలిగిస్తుంది.

నటీనటులు: తన ధర్మంగా భావించి ‘47 డేస్’ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ప్రమోట్ చేస్తున్న సత్యదేవ్.. సినిమాలో కూడా తన బాధ్యతను తాను నిర్వర్తించాడు. సిన్సియర్ గా నటించాడు. సినిమాలో లేని ఇంటెన్సిటీ అతడి పాత్రలో నటనలో కనిపిస్తుంది. అతడి సిన్సియారిటీ వల్ల.. ఇతనేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడని అక్కడక్కడా అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. సన్నివేశాలు సిల్లీగా సాగుతున్నపుడు హీరో తన నటనలో తీవ్రత చూపిస్తే అది ‘అతి’గానే అనిపిస్తుంది మరి. సత్యదేవ్ లుక్ సహా అన్నీ బాగున్నాయి. సినిమాకు ఏకైక ఆకర్షణ అతనే. హీరోయిన్లు రోషిణి ప్రకాష్ పూజా జవేరి చూడ్డానికి బాగానే ఉన్నారు కానీ.. నటన పరంగా ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. శ్రీకాంత్ అయ్యంగార్ అవసరానికి మించి నటించాడు. అతడి పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రవివర్మ ఓకే. ముక్తార్ ఖాన్ సత్యప్రకాష్ పాత్రలు ఇరిటేట్ చేస్తాయి. శ్రీనివాస్ పాత్రధారి బాగానే చేశాడు.

సాంకేతికవర్గం: రఘు కుంచె పాటలు పర్వాలేదు. కానీ నేపథ్య సంగీతం మాత్రం ఓ థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన స్థాయి లేదు. కమర్షియల్ సినిమాల్లో వినిపించే సౌండ్స్ తో మొక్కుబడిగా లాగించేశాడు. జీకే ఛాయాగ్రహణంలో చమక్కులేవీ కనిపించలేదు. ఔట్ పుట్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సోసోగా అనిపిస్తాయి. రైటర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి.. స్క్రిప్టు దగ్గరే విఫలమయ్యాడు. థ్రిల్లర్ సినిమాను కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా డీల్ చేయబోయి దారి తప్పాడు. ఒక థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన మంచి లక్షణాలేవీ అతను చూపించలేకపోయాడు. అనేక లోపాలున్న కథ.. బిగి లేని కథనంతో ‘47 డేస్’ను నీరుగార్చేశాడు.

చిత్రం : 47 డేస్ నటీనటులు: సత్యదేవ్-పూజా జవేరి- రోషిణి ప్రకాష్-శ్రీకాంత్ అయ్యంగార్-రవివర్మ-ముక్తార్ ఖాన్-సత్యప్రకాష్ తదితరులు సంగీతం: రఘు కుంచె ఛాయాగ్రహణం: జీకే నిర్మాతలు: శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ రచన-దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజైన మరో సినిమా ‘47 డేస్’. జీ5లో ఈ రోజు నుంచే ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. సత్యదేవ్ లాంటి పేరున్న నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటించడం పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన కొత్త దర్శకుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించడం సంగీత దర్శకుడు రఘు కుంచె ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో దీనిపై కొంత ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగించేలా ఉందో చూద్దాం పదండి. కథ: సత్యదేవ్ (సత్యదేవ్) వైజాగ్ సిటీలో ఏసీపీ. అతడి భార్య పద్మావతి (రోషిణి ప్రకాష్) ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. భార్య చనిపోయిన బాధకు తోడు ఆమె ఆత్మహత్యకు కారణమేంటో తెలియక సతమతమవుతుంటాడు సత్య. ఈ క్రమంలో ఓ కేసును సరిగా డీల్ చేయక సస్పెండవుతాడు. ఐతే భార్య చనిపోయిన రోజే చనిపోయిన మరో వ్యక్తికి సంబంధించిన కేసు అనుమానాస్పదంగా కనిపిస్తుంది సత్యకు. దీనికి భార్య మరణానికి సంబంధం ఉందన్న అనుమానంతో సొంతంగా విచారణ చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతను వెలికి తీసిన నిజాలేంటి అన్నది మిగతా కథ. కథనం-విశ్లేషణ: స్కూల్లో ఏడో తరగతి చదివేటపుడు ఓ నాటకంలో భాగంగా ఓ అమ్మాయి జూలియట్ పాత్ర వేయాల్సి ఉంటుంది. ఓ అబ్బాయి రోమియో పాత్రకు కుదురుతాడు. కానీ అనివార్య కారణాలతో ఆ అమ్మాయి ఆ పాత్ర చేయలేకపోతుంది. ఇక్కడ కట్ చేస్తే.. చాలా ఏళ్లకు ఈ అమ్మాయి ఓ అబ్బాయి వెంట పడుతుంది. అతను ముందు లైట్ తీసుకుని తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటూ సహజీవనం కూడా చేస్తారు. కానీ ఆ కుర్రాడు మంచోడు కాదని తెలుసుకున్న ఆ అమ్మాయి.. నీ కోసం వెతుక్కుని మరీ వస్తే ఇలా చేస్తావా అంటూ నిలదీస్తుంది. అప్పుడా కుర్రాడు నాకోసం నువ్వు వెతుక్కుని రావడమేంటి.. నేను ఫలానా అంటూ వివరణ ఇస్తాడు. అప్పుడు అమ్మాయి నేను పప్పులో కాలేశానే అని తల పట్టుకుంటుంది. ఏడో తరగతిలో నాటకమట. అందులో తనకు జోడీగా నటించాల్సి ఉన్న అబ్బాయిని ఎన్నో ఏళ్లకు వెతుక్కుంటూ వచ్చి.. అతననుకుని వేరే అబ్బాయితో ప్రేమలో పడి సహజీవనం చేయడమట. ‘47 డేస్’ ఎంత ఇల్లాజికల్ గా సాగుతుందో చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణ. కొంచెం లోతుల్లోకి వెళ్తే ఇలాంటివి సినిమాలో మరెన్నో ఉన్నాయి. సినిమాలో హీరో ఫ్రెండు అతణ్ని చూసి.. ‘‘అవసరం లేకుండా నువ్వు రెండు రాండమ్ డాట్స్ ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు’’ అంటాడు. దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. ‘47 డేస్’లో ఇలాగే రాండమ్ డాట్స్ ను కనెక్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాడు. థ్రిల్లర్ సినిమాల్లో ఇలా డాట్స్ ను కనెక్ట్ చేయడం ఎంత పకడ్బందీగా సాగుతుందన్నదాన్ని బట్టే ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతాడు. ఐతే ఈ డాట్స్ చాలా వరకు అర్థం లేని విధంగా ఉ:డటం.. ప్రేక్షకులకు షాకులివ్వాలనే ఉద్దేశంతో లాజిక్ లేకుండా ఎలా పడితే అలా ట్విస్టులు రాసుకోవడం.. పాత్రలు కూడా తేలిపోవడంతో ‘47 డేస్’ నిస్సారంగా తయారైంది. కేవలం విలన్ పాత్ర ఒక్కటి చాలు.. సినిమా ఎంత సిల్లీగా ఉందో చెప్పడానికి. ఆ పాత్రను పరిచయం చేసే తీరు.. ఆ తర్వాత నడిపించిన వైనం.. చివరికి ట్విస్ట్ ఇచ్చి దాని అసలు స్వరూపాన్ని చూపించిన విధానం.. ఎంత సిల్లీగా అంటే అంత సిల్లీగా తయారయ్యాయి. సినిమాగా తీయడానికి ముందు ఈ కథను చెప్పగా విన్న అందరికీ కొన్ని సందేహాలు వచ్చి ఉండాలి. ఇదేం లాజిక్.. ఇక్కడ ఇలా ఎందుకు అని.. చాలా చోట్ల అనిపించి ఉండాలి. ఐతే ఇందులోని ట్విస్టులు బ్రహ్మాండంగా పేలుతాయని.. విలన్ సహా కొన్ని పాత్రలు షాకిస్తాయని.. సినిమా పాసైపోతుందని అంచనా వేసి ఉండొచ్చు. కానీ అలా జరగలేదు. ఇందులోని కొన్ని సన్నివేశాలు వినడానికి థ్రిల్లింగ్ గానే అనిపించి ఉండొచ్చు. కానీ తీశాక చూసుకుని ఇలా ఉన్నాయేంటి అనిపించి ఉంటే ఆశ్చర్యం లేదు. కొత్త దర్శకుడైన ప్రదీప్.. ఈ స్క్రిప్టును డీల్ చేయడంలో పూర్తిగా తడబడ్డ సంగతి చాలా సన్నివేశాల్లో తెలిసిపోతుంటుంది. పాటల్ని తీసేస్తే గంటన్నర నిడివి కూడా లేని సినిమా.. పైగా థ్రిల్లర్ మూవీలో హీరో-కమిషనర్ మధ్య వచ్చే ప్రతిసారీ ఒకే తరహా సన్నివేశాలు పెట్టి విసిగించాడు దర్శకుడు. థ్రిల్లర్ సినిమాలకు అత్యంత ప్రధానమైన ‘బిగి’ అనే మాటే సినిమాలో ఎక్కడా కనిపించదు. అసలేం జరిగిందనే ఉత్కంఠ కొంత ఉంటుంది కానీ.. ఆ జరిగిందేదో చూపించే విధానం చాలా పేలవంగా తయారవడం.. దానికి ముందు…

47 డేస్ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2
నటీ-నటుల ప్రతిభ - 2.75
సాంకేతిక వర్గం పనితీరు - 2
దర్శకత్వ ప్రతిభ - 2

2.2

47 డేస్ రివ్యూ

47 డేస్ రివ్యూ

User Rating: 4.8 ( 1 votes)
2