నవీన్ పోలిశెట్టి,శృతి శర్మ ప్రధాన పాత్రలలో స్వరూప్ ఆర్ జె ఎస్ దర్శకత్వంలో కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మూవీ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ ఎలావుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
కథ:
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి) చిన్న చిన్న కేసుల విషయంలో పోలీస్ కు సహాయం చేస్తూ తన జీవితం గడుపుతూ ఉండే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్. ఈ క్రమం లో అనుమానాస్పదంగా రేప్ చేసిన చంపబడిన ఓ యువతి మర్డర్ కేసు ని పరిష్కారించే అవకాశం దక్కుతుంది. ఆ అమ్మాయి చావు వెనుక వున్న అసలు నేరస్థులు ఎవరు? ఆత్రేయ ఆ నేరస్థులను పెట్టుకున్నాడా? ఇలాంటి ఉత్కంఠ రేపే కేసు మిస్టరీ ని తెరపైన చూడాలి.
విశ్లేషణ:
మొదటి మూవీ అయినా కూడా దర్శకుడు స్వరూప్ ఎంచుకున్న కథ,అలాగే చెప్పిన విధానం చాలా బాగుంది. వాస్తవికతకు దగ్గరగా ఉన్న ఆయన స్క్రీన్ ప్లే ప్రేక్షకుడికి ప్రతి క్షణం ఉత్కంఠను ఫీల్ అయ్యేలా చేస్తుంది. అలాగే దర్శకుడు హాస్యాన్ని సీరియస్ నెస్ ని మిక్స్ చేసి కథను నడిపించడంలో విజయం సాధించారు. ఈ మూవీ చుసిన తరువాత టాలీవుడ్ కి ఓ మంచి దర్శకుడు దొరికిన భావన కలుగుతుంది.
ఇక హీరో నవీన్ పోలిశెట్టి తన నటనతో సినిమాకి ఊపిరి పోసాడు. సినిమా మొత్తం తన భుజాలపై మోసాడనిపిస్తుంది. నటన పరంగా,అలాగే కామెడీ టైమింగ్ చక్కగా పర్ ఫామ్ చేసాడు . అతని డైలాగ్ డిక్షన్ కూడా సినిమాకు చక్కగా ఉపయోగపడింది. ఇక హీరోయిన్ శృతి శర్మ తన పాత్ర పరిధిలో చక్కగా నటించింది. ఛాయ్ బిస్కెట్ ఫేమ్ సుహాస్,సుదీప్ ప్రధాన పాత్రలలో వారి నటన బాగుంది.
ప్లస్ పాయింట్స్:
నవీన్ పోలిశెట్టి
కథలో సస్పెన్సు
కథనం
మైనస్ పాయింట్స్:
చివరి 30 నిమిషాలు
ప్రేక్షకులకు పరిచయం లేని ఫార్మాట్.
తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఆసక్తి కరంగా సాగే వినోదంతో కూడిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా. హీరో నవీన్ పోలిశెట్టి అంతా తానై మూవీని చక్కగా నడిపించాడు. దర్సకుడు స్వరూప్ ఎంచుకున్న కథ, చెప్పే కథనం ప్రేక్షకుడికి మంచి అనుభూతి ఇస్తాయి. కాబట్టి ఈ మూవీ ఈ వీక్ ఎండ్ కి మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ : లైవ్ అప్డేట్స్
-
యువతి హత్య వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఎలా జరిగింది అనే అనుమానాలన్నిటికి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సమాధానాలు కనిపెట్టడంతో నాటకీయ పరిణామాల మధ్య సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కొరకు చూస్తూ ఉండండి.
Date & Time : 09:50 AM June 21, 2019 -
ఆసక్తికర కథనంతో మూవీ క్లైమాక్స్ దిశగా వెళుతుంది.
Date & Time : 09:42 AM June 21, 2019 -
కేసులో ఉన్న అసలు మిస్టరీని ఛేదించే దిశగా కథ సాగుతోంది. సినిమా కథనం చాలా కొత్తగా ఆసక్తికరంగా ఉంది.
Date & Time : 09:29 AM June 21, 2019 -
చక్కని కథనంతో ఇప్పుడే కథలోని సస్పెన్సు కి తెరపడింది
Date & Time : 09:13 AM June 21, 2019 -
యువతి మర్డర్ కేసుపై జరుగుతున్నవిచారణకు సంబందించిన సన్నివేశాలలో ఆసక్తిగొలిపే ఉత్కంఠ కొనసాగుతుంది. హీరో నవీన్ తన పాత్రలో చక్కగా నటిస్తున్నాడు.
Date & Time : 08:55 AM June 21, 2019 -
మరో కొన్ని ఆసక్తికర మలుపుల తో సినిమా సీరియస్ గా నడుస్తుంది. చాయ్ బిస్కెట్ ఫేమ్ సుహాస్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 08:43 AM June 21, 2019ఇంటర్వెల్ తరువాత పోలీసుస్టేషన్ లో జరిగే హాస్య సన్నివేశంతో మూవీ మొదలైంది
Date & Time : 08:37 AM June 21, 2019 -
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: హాస్యంతో కూడిన సస్పెన్సు సన్నివేశాలతో మొదటిసగం మూవీ చాలా బాగుంది. ఇంటర్వెల్ కి ముందు అలాగే ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠ కలిగించేలా ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ ఎలాఉంటుందో చూడాలి.
Date & Time : 08:29 AM June 21, 2019 -
మరో ఆసక్తికర మలుపుతో మూవీ మొదటి సగం పూర్తయింది. ప్రస్తుతం విరామం.
Date & Time : 08:26 AM June 21, 2019 -
కేసు ఇన్వెస్టిగేషన్ లో ఓ ఆసక్తికరమైన మలుపుతో సినిమా సీరియస్ మోడ్ లోకి వెళ్ళింది.
Date & Time : 08:23 AM June 21, 2019 -
ఉత్కంఠ గొలిపే సీరియస్ ఇన్వెస్టిగేషన్ మధ్యలో అక్కడక్కడా మంచి హాస్యసన్నివేశాలతో మూవీ నడుస్తుంది
Date & Time : 08:15 AM June 21, 2019 -
ఈ కేసులో ప్రధాన నిందుతులుగా సాయి శ్రీనివాస్ ముగ్గురిని అనుమానిస్తాడు. వారిలో ఒక అనుమానితుడిగా చాయ్ బిస్కెట్ ఫేమ్ సందీప్ కనిపిస్తున్నారు.
Date & Time : 08:07 AM June 21, 2019 -
ఒక అమ్మాయిని రేప్ చేసి, మర్డర్ చేసిన సంఘటనకు సంబంధించి భావోద్వేగ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:05 AM June 21, 2019 -
సినిమా మళ్ళీ ప్రస్తుతం లోకి ప్రవేశించింది. ఓ మర్డర్ కేసు లో అనుమానితుడిగా సాయి శ్రీనివాస్ ని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
Date & Time : 07:58 AM June 21, 2019 -
సినిమా కథనం మళ్ళీ మూడేళ్ళ క్రితం సాగర్ ప్రాతంలో జరిగిన సన్నివేశాలతో నడుస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ కి వాళ్ళ అమ్మకి మధ్య అనుబంధం ఆప్యాయతలకు సంబందిందించిన సన్నివేశలతో పాటు, ఆయన తల్లి మరణానికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:54 AM June 21, 2019 -
ఏజెంట్గా సాయి శ్రీనివాస దిన చర్యను,కేసు లను పరిష్కరించే పద్దతులను కామిక్ గా ప్రెసెంట్ చేస్తున్న మొదటి పాట ‘షెర్లాక్ హోల్మ్స్’ వస్తుంది.
Date & Time : 07:47 AM June 21, 2019 -
ఏజెంట్ సాయి శ్రీనివాస కేసులను పరిష్కరించే విధానాన్ని తెలియజేస్తూ, మరి కొన్ని హాస్యంతో కూడిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:40 AM June 21, 2019 -
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తన మొదటి కేసుని పరిస్కరిస్తున్నాడు. ఈ సన్నివేశాలు నవ్వు తెప్పించే విధంగా ఉంది.
Date & Time : 07:33 AM June 21, 2019 -
మూవీ మధ్యప్రదేశ్ లోని సాగర్ అనే ప్రాతంలోని సన్నివేశాలతో మొదలైంది.ఆ వెంటనే సినిమా మూడు సంవత్సరాల తరువాత అనే నోట్ తో నడుస్తుంది. హీరో నవీన్ అంతగా పేరులేని ఓ చిన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్ గా,హీరోయిన్ శృతి అతని అసిస్టెంట్ గా పరిచయమయ్యారు.
Date & Time : 07:25 AM June 21, 2019 -
హాయ్ 148 నిమిషాల నిడివి గల “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీ ఇప్పుడే మొదలైంది.
Date & Time : 07:15 AM June 21, 2019
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 3.75
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 3.5
3.4
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ రివ్యూ
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

