చిత్రం : అల వైకుంఠపురం
నటీనటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు,సముద్ర ఖని,సచిన్, జయరాం, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, హర్ష,బ్రహ్మాజీ, సునీల్ తదితరులు
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు : అల్లు అరవింద్, ఎస్ రాధా కృష్ణ
సంగీతం : ఎస్ ఎస్ థమన్
సినిమాటోగ్రఫర్ : పి ఎస్ వినోద్
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేదీ : జనవరి 12, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు భారీ అంచనాలతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా విడుదల అయింది. మరి బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టారా.. అలాగే ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
వాల్మీకి (మురళి శర్మ) తన స్వార్థంతో చేసిన ఓ పొరపాటు వల్ల బంటు(అల్లు అర్జున్) వాల్మీకి కొడుకుగా ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయిగా బతకాల్సి వస్తోంది. చిన్నప్పటి నుంచీ అలాగే పెరిగిన బంటుకు తన పుట్టుక గురించి తన తల్లిదండ్రుల గురించి ఒక నిజం తెలుస్తుంది. ఈ మధ్యలో బంటు అమూల్య (పూజా హెగ్డే) దగ్గర జాబ్ లో జాయిన్ అవుతాడు. అలాగే ఆమెతో ప్రేమలో కూడా పడతాడు. ఇక ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం బంటు అసలు కుటుంబం కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటుంది. దాంతో బంటు తన కుటుంబాన్ని ఆ సమస్యల నుండి ఎలా బయట పడేశాడు? ఇంతకీ బంటు తల్లిదండ్రులు ఎవరు? చివరికి తన ఒరిజనల్ తల్లిదండ్రులకు బంటు ఏమి చేశాడు?లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.
భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా గుడ్ థీమ్ తో డీసెంట్ ట్రీట్మెంట్ అండ్ కామెడీతో మరియు అద్భుతమైన సాంగ్స్ తో అలాగే భారీ తారాగణంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బన్నీ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ గుర్తుపెట్టుకునే మంచి కామెడీతో సాగే ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్రీట్ ఇచ్చారు.
సినిమా చూస్తున్నంతసేపూ ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా సాగిపోతుంది అనే ఫీల్ కలుగుతుంది. ఇక బన్నీ తన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని కామెడీ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ టైమింగ్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. ముఖ్యంగా స్టార్ హీరోస్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఆఫీస్ సీన్ లో గాని… మరియు లవ్ స్టోరీ స్టార్టింగ్ లో వచ్చే లవ్ సీన్స్ లో అల్లు అర్జున్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ తో ఫుల్ గా నవ్వించారు. పైగా చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు.
పూర్తి స్వార్థం నిండిన పాత్రలో మురళీశర్మ అద్భుతంగా నటించాడు. తన మాడ్యులేషన్ స్టైల్ ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమాలో హీరోయిన్ పాత్ర అయిన అమూల్య పాత్రలో నటించిన హీరోయిన్ పూజా హెగ్డే చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తోంది.. అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. అలాగే మరో మాజీ హీరోయిన్ టబు, జైరాం తమ పాత్రల్లో చాలా చక్కగా నటించారు.
అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు సనీల్, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక గుడ్ థీమ్ తో త్రివిక్రమ్ రాసిన ట్రీట్మెంట్ అండ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మరో ప్రధాన బలం. త్రివిక్రమ్ ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా మంచి ఫన్ తో నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు.
మైనస్ పాయింట్స్ :
కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు చాల సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు త్రివిక్రమ్ మిగిలిన కొన్ని సన్నివేశాలను మాత్రం ఆ స్థాయిలో తీర్చిదిద్దిలేకపోయారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఇంట్లో వచ్చే సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. అలాగే సినిమా ఓపెనింగ్ నే మంచి ఎమోషనల్ గా ఓపెన్ చేసిన దర్శకుడు.. దాన్ని కంటిన్యూ చేయలేదు. లవ్ స్టోరీ కూడా ఇంకా ఆసక్తికరంగా ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. త్రివిక్రమ్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి పాయింట్, బలమైన వైవిధ్యమైన పాత్రలతో మంచి ఎమోషన్ అండ్ ఫన్ తో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ ఆయన సెకెండ్ హాఫ్ కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. సంగీత దర్శకుడు యస్ తమన్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తమన్ కెరీర్ లోనే చెప్పుకోతగ్గ ఆల్బమ్ గా ఈ సినిమా ఆల్బమ్ నిలిచిపోతుంది. ఇక స్టంట్స్ మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ని ఇస్తాయి. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ పనితనం కూడా బాగుంది. సినిమాలో నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
తీర్పు:
హిట్ అండ్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ క్లీన్ ఎంటర్టైనర్ మంచి పాయింట్ తో గుడ్ ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లేతో బలమైన పాత్రలు మరియు భారీ తారాగణంతో అలాగే డీసెంట్ కామెడీతో బాగా అకట్టుకుంది. అయితే సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు, లవ్ సీన్స్ మాత్రం ఓకే అనిపిస్తాయి. కానీ బన్నీ తన నటనతో తన డాన్స్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. మొత్తం మీద ఈ చిత్రం అల్లు అర్జున్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.
‘అల వైకుంఠపురం లో’ : లైవ్ అప్డేట్స్:
- 
మొత్తానికి ఓ ఫన్నీ నోట్ తో కథ సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
Date & Time : 12:50 AM January 12, 2020 - 
చిత్రం ఇప్పుడు ఎమోషనల్ క్లైమాక్స్ దిశగా వెళుతుంది.
Date & Time : 12:35 AM January 12, 2020 - 
ఇప్పుడు ట్రైలర్ లో చూపించిన ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్ పులొచ్చిందీ..డైలాగ్ సీన్ వస్తుంది.
Date & Time : 12:30 AM January 12, 2020 - 
ఫైనల్ టచ్ గా మెగాస్టార్ సాంగ్ తో బన్నీ హైలైట్ చేసేసారు.దీని అనంతరం మాస్ హిట్ సాంగ్ రాములో రాముల సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 12:20 AM January 12, 2020 - 
ఇప్పుడు బన్నీ సినీ హీరోలు మహేష్,ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ ల పాటలకు డాన్స్ వేస్తున్నాడు.మూవీ లవర్స్ మరియు ఫ్యాన్స్ కు ఇది ఒక ట్రీట్ అని చెప్పాలి.
Date & Time : 12:15 AM January 12, 2020 - 
బన్నీ కంపెనీ వ్యవహారాలపై తనదైన స్టైల్ లో కేర్ తీసుకుంటున్నాడు.
Date & Time : 12:10 AM January 12, 2020 - 
ఇప్పుడు కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 12:05 AM January 12, 2020 - 
రాజేంద్ర ప్రసాద్ మరియు బన్నీల మధ్య మంచి కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 12:00 AM January 12, 2020 - 
అజయ్ తో ఒక అదిరిపోయే పవర్ఫుల్ ఫైట్ సీన్ ఇప్పుడు వస్తుంది.
Date & Time : 11:51 PM January 11, 2020 - 
నివేతా బంధువుగా సునీల్ ఇప్పుడు పరిచయం అయ్యారు.కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:49 PM January 11, 2020 - 
బ్యాక్గ్రౌండ్ లో టైటిల్ ట్రాక్ తో ఆ ఇంట్లోకి బన్నీ ఎంటర్ అయ్యాడు.
Date & Time : 11:43 PM January 11, 2020 - 
వెన్నెల కిషోర్ మరియు సచిన్ ల కామెడీ సీన్స్ అనంతరం..వైకుంఠపురములో కి బన్నీ అడుగు పెడుతున్నాడు.
Date & Time : 11:40 PM January 11, 2020 - 
ఓ డాక్టర్ గా వెన్నెల కిషోర్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:35 PM January 11, 2020 - 
ఇంటర్వెల్ అనంతరం మురళీ శర్మ మరియు బన్నీల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.ఇప్పుడు చిత్రం మరో ఆసక్తికరమైన మలుపు తీసుకుంది.
Date & Time : 11:30 PM January 11, 2020 - 
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మంచి ఫన్ మరియు ఎమోషన్స్ తో కూడిన నరేషన్ తో చిత్రం నడిచింది.అలాగే అల్లు అర్జున్ కామికల్ టైమింగ్ మరియు త్రివిక్రమ్ డైలాగులు ఇప్పటి వరకు ప్రధాన బలంగా నిలిచాయి.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 11:27 PM January 11, 2020 - 
సినిమా సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 11:25 PM January 11, 2020 - 
ఓ కీలక ఎపిసోడ్ అనంతరం కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:20 PM January 11, 2020 - 
సముద్రకనిపై కొన్ని ఆసక్తికర సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:15 PM January 11, 2020 - 
ఈ సినిమాలో పూజా పేరు అమూల్య.కొన్ని చక్కని సన్నివేశాల అనంతరం మరో మెలోడీ ట్రాక్ బుట్ట బొమ్మ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 11:10 PM January 11, 2020 - 
ఇప్పుడు ఒక ఫన్నీ వే లో ఎస్పీ ప్రజాపతిగా రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 11:07 PM January 11, 2020 - 
పూజా తండ్రిగా తనికెళ్ళ భరణి ఇప్పుడు పరిచయం అయ్యారు.ఇప్పుడు కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:04 PM January 11, 2020 - 
ఇప్పుడు బ్రహ్మాజీ ఎంటర్ అయ్యారు.కథనంలో ఆసక్తికరమైన డెవలప్మెంట్ కనిపిస్తుంది.
Date & Time : 11:00 PM January 11, 2020 - 
అప్పలనాయుడుగా నటుడు సముద్రకని పరిచయం అయ్యారు.అతనికి జయరాం కంపెనీతో ఏవో గొడవలు ఉన్నాయి.
Date & Time : 10:52 PM January 11, 2020 - 
నవదీప్,రాహుల్ రామకృష్ణ,బన్నీ మరియు పూజాలు ప్యారిస్ వచ్చారు.ఇప్పుడు ఆల్ టైం హిట్ ట్రాక్ “సామజవరగమన” సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 10:50 PM January 11, 2020 - 
బన్నీకు బాస్ గా పూజా హెగ్డే ఇప్పుడే ఇంట్రో ఇచ్చింది.ఈ ఇద్దరి మధ్య సీన్లతో మంచి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది.
Date & Time : 10:45 PM January 11, 2020 - 
నవదీప్ పాత్ర మరియు అతని డైలాగ్ డెలివరీ హిలేరియస్ గా ఉన్నాయి.
Date & Time : 10:40 PM January 11, 2020 - 
మొట్టమొదటి హిట్ ట్రాక్ ఓ మై గాడ్ డాడీ సాంగ్ మొదలయ్యింది.ఇందులో బన్నీ తన స్టైలిష్ డాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతున్నారు.
Date & Time : 10:32 PM January 11, 2020 - 
బన్నీ మరియు నవదీప్ గ్యాంగ్ మధ్య ఒక చక్కగా డిజైన్ చేసిన ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 10:28 PM January 11, 2020 - 
సుషాంత్ మరదలుగా నివేతా పేతురాజ్ ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:25 PM January 11, 2020 - 
ఇద్దరు పిల్లలు హిలేరియస్ విధానంలో పెరుగుతూ వస్తున్నారు….20 ఏళ్ల తర్వాత.ఇప్పుడు అల్లు అర్జున్(బంటు)గా ఒక స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు.అలాగే రాజ్ గా సుశాంత్.
Date & Time : 10:20 PM January 11, 2020 - 
మురళీ శర్మ పరిచయం అయ్యారు.ఈయనదొక ఆసక్తికర రోల్ లా కనిపిస్తుంది.
Date & Time : 10:15 PM January 11, 2020 - 
ఒక హాస్పిటల్ సీన్ ద్వారా చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.టబు మరియు రోహిణీలు డెలివరీకు అడ్మిట్ అయ్యారు.
Date & Time : 10:10 PM January 11, 2020 - 
హాయ్..165 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 10:00 PM January 11, 2020 
అల వైకుంఠపురం లో రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 2
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 2.5
దర్శకత్వ ప్రతిభ - 2.25
2.6
అల వైకుంఠపురం లో రివ్యూ
అల వైకుంఠపురం లో రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
				
