Templates by BIGtheme NET
Home >> REVIEWS >> అల్లుడు అదుర్స్ రివ్యూ

అల్లుడు అదుర్స్ రివ్యూ


చిత్రం : అల్లుడు అదుర్స్
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్
నిర్మాత‌లు : సంతోష్ శ్రీనివాస్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : చోటా కె నాయుడు
ఎడిట‌ర్‌ : తిమ్మరాజు కె
విడుదల తేదీ : జనవరి 14, 2021

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ‘అల్లుడు అదుర్స్’ గా వచ్చిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) చిన్నతనంలోనే వసుంధరా రెడ్డి (అనూ ఇమాన్యుల్)ను ప్రేమించి విఫలం అవుతాడు. అప్పటినుండి అమ్మాయిలకు, ప్రేమకు దూరంగా ఉంటాడు. అయితే పెద్దయ్యాక అతను కౌముది (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తో ఓ ఒప్పందానికి రావడం, తీరా శ్రీను, కౌముదిని ప్రేమలో పడేసే టైంకి అతని జీవితంలోకి గజా (సోనూసూద్) ఎంట్రీ ఇవ్వడంతో దాంతో శ్రీను గోల్ మారుతుంది. అసలు ఈ గజా ఎవరు ? అతనికి వసుంధరకి సంబంధం ఏమిటీ ? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? తన ఫస్ట్ లవ్ అయిన వసుంధరకు ఎలాంటి సాయం చేశాడు ? ఈ మధ్యలో ఏమి జరిగింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

శ్రీను పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. పైగా గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఆయన రిస్క్ చేసి మరి చేసిన యాక్షన్ సీన్స్ లోని అడ్వంచరస్ బాగున్నాయి. ఇక హీరోయిన్ గా నటించిన నభా నటేష్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రంతో తనకు కలిసొచ్చిన కామెడీ యాంగిల్ ను చూపించాలనుకున్న ప్రయత్నం బాగుంది. ఊహ నిజం మధ్య స్క్రీన్ ఫ్లే రాసుకోవడం, ఆ నేపథ్యంలోనే సెకెండ్ హాఫ్ సినిమాను చేయాలనుకోవడం, ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ను మిస్ కాకుండా బాగానే హ్యాండిల్ చేశాడు.

ప్రకాష్ రాజ్, ఇంద్రజ, సోనూసూద్ లాంటి మంచి నటులు ఈ చిత్రంలో తమ పాత్రలను అద్భుతంగా పోషించి ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తాడు. అలాగే ఎక్కువ సేపు కనిపించకపోయిన కీలక పాత్రలో నటించిన అను ఇమాన్యుల్ తన నటనతో ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

రెగ్యులర్ పాయింట్‌ తో కూడుకున్న రెగ్యులర్ కథతో వచ్చిన ఈ సినిమాలో ఫేక్ ఎమోషన్స్, సిల్లీ కామెడీ ఎక్కువైపోయింది. పైగా రొటీన్ సినిమాలాగే ఐదు ఫైట్స్, మాస్ సాంగ్స్ తో పక్కా కమర్షియల్ చిత్రంలానే సాగుతూ.. బోర్ కొడుతుంది.

సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అదికాక నమ్మశక్యం కాని సన్నివేశాలతో, కొన్ని అక్కరలేని సీన్లతో సినిమా ప్లో దెబ్బతింది. పైగా సినిమా కథాంశంలో కూడా ఎలాంటి కొత్తధనం చూపించకపోవడం, అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.

సిచ్యుయేషన్ ఫన్ అండ్ హీరో ఆడే డ్రామాలోని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించిన్నప్పటికీ మరి నాటకీయంగా అనిపిస్తాయి. సోనూసూద్ ట్రాక్, అలాగే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అతని ట్రాక్ వాస్తవానికి చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కడా జన్యున్ ఎమోషన్ సినిమాలో లేదు. కనీసం, పాత్రల్లో మమేకం అయిపోయి ఫీల్ అయ్యే సందరర్భం సినిమాలో ఒక్కటి కూడా లేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రాసుకున్న స్టోరీ ఐడియానే వెరీ రెగ్యులర్ గా ఉంది. పైగా ఆ ఐడియాకు తగ్గట్టు ట్రీట్మెంట్ వెరీ వెరీ రెగ్యులర్ అండ్ బోరింగ్ గా సాగింది. మ్యూజిక్ డైరెక్టర్‌ దేవి అందించిన అందించిన రీరికార్డింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది, సౌండ్, పాటల్లోని కొన్ని బిట్స్ చాలా బాగున్నాయి. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. సినిమాటోగ్రఫర్ సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

రెగ్యులర్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం చివరకి ఓ రొటీన్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గానే సాగుతూ బోర్ కొడుతోంది. అయితే, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పాత్రల నటన, వారి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, సినిమాలో కొత్తదనం లేకపోవడం, అక్కడక్కడ కొన్ని దృశ్యాలు పాత సినిమాలను గుర్తుకుచేయడం, అలాగే బోరింగ్ ట్రీట్మెంట్ సినిమా రిజల్ట్ ను దెబ్బ తీసింది. ఓవరాల్ గా ఈ చిత్రంలోని కొన్ని అంశాలు బి.సి సెంటర్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయినా, సినిమా మాత్రం మెప్పించదు.

  • అలా చాలా మేర కన్ఫ్యూజన్ కామెడీ ఎపిసోడ్ అనంతరం ఒక ఎమోషనల్ సీన్ తో పూర్తయ్యింది.

  • బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ చామంతిగా ఎంటర్ అయ్యింది. ఇప్పుడు ఆమెపై ప్లాన్ చేసిన మాస్ సాంగ్ ‘రంభ ఊర్వశి మేనక’ స్టార్ట్ అయ్యింది.

  • ప్రకాష్ రాజు చుట్టూతా జరుగుతున్న కన్ఫ్యూజన్ కామెడీని ఆడియెన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

  • ఇప్పుడు ఓ ఫన్నీ రివెంజ్ సీన్ సోను సూద్ మరియు శ్రీనివాస్ ల గ్యాంగ్ మధ్య వస్తుంది.

  • ఇప్పుడు ఓ లవ్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో శ్రీనివాస్, నభా లు మంచి లొకేషన్స్ లో కనిపిస్తున్నారు.

  • ఇప్పుడు అను మరియు నభా లు మొదటి సారి కలుసుకున్న సీన్ వస్తుంది.

  • మరో ఊహించని ట్విస్ట్ తో శ్రీనివాస్ మరియు సోనూ సూద్ లు ఫ్రెండ్స్ అయ్యిపోయారు.

  • ఇప్పుడు సోనూ సూద్ తన ఫ్లాష్ బ్యాక్ ను బెల్లంకొండ శ్రీనివాస్ తో చెప్తున్నాడు.

  • ఇంటర్వెల్ అనంతరం శ్రీనివాస్ మరియు సోనూ సూద్ ల మధ్య ఛాలెంజింగ్ సీన్స్ వస్తున్నాయి.

  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ – ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తోనే మొదలయిన ఈ చిత్రం ఇంటర్వెల్ వరకు ఓమాదిరిగా బాగానే సాగింది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించే స్థాయిలో ఉంది మరి సెకండాఫ్ నుంచి ఎలా ఉంటుందో చూడాలి.

  • ఇపుడు ఇంటర్వెల్ సమయం..సెకండాఫ్ లో సోనూ మరియు బెల్లం కొండ శ్రీను మధ్య అసలు యుద్ధం స్టార్ట్ కానుంది.

  • సోనూ సూద్ ఎంట్రీ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

  • ప్రీ ఇంటర్వెల్ లో నభా పై ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్ లో మెయిన్ విలన్ గజా గా సోను సూద్ ఎంటర్ అయ్యాడు.

  • ఇప్పుడు నభా మరియు శ్రీనివాస్ మధ్య కొన్ని సీన్స్ తర్వాత టైటిల్ ట్రాక్ అల్లుడు అదుర్స్ స్టార్ట్ అయ్యింది.

  • శ్రీనివాస్ తల్లిదండ్రులు దగ్గర అను తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పింది.

  • ఇప్పుడు హోలా చికా సాంగ్ స్టార్ట్ అయ్యింది.

  • వసుధార గా మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఫ్లాష్ బ్యాక్ ఈ కథకు కీలకం అన్నట్టు అనిపిస్తుంది.

  • శ్రీను, నభా లకు ఓ గొడవ అయ్యింది. ఓ కాఫీ షాప్ లో మరో ఫైట్ సీన్ స్టార్ట్ అయ్యింది.

  • ఇప్పుడు సాయి మరియు నభా నటేష్ ల మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.

  • ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ మరియు శ్రీనివాస్ మధ్య ఓ ఒప్పందం జరుగుతున్న సన్నివేశం వస్తుంది.

  • సీనియర్ నటులు జేపీ, వేణు గోపాల్ లు స్క్రీన్ పై ఎంటర్ అయ్యారు. లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ స్వర్గస్థులు అయిన సంగతి తెలిసిందే. ఇదే వారి చివరి చిత్రం కావచ్చు.

  • ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూతురిగా నభా నటేష్ ఎంట్రీ ఇచ్చింది. బెల్లంకొండ శ్రీను మొదటి చూపులోనే ఆమె పడ్డాడు.

  • నిజామాబాద్ లోని ఓ గ్రామ పెద్దగా ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎంట్రీ అయ్యాడు.

  • మొదటి ఫైట్ సీక్వెన్స్ ఇపుడు స్టార్ట్ అయ్యింది.

  • ఓ ఫన్నీ సీన్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడే ఎంటర్ అయ్యాడు.

  • ఇప్పుడు ఫస్ట్ సాంగ్ పడిపోయా స్టార్ట్ అయ్యింది.

  • ఓ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.

  • హాయ్..149 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

చిత్రం : అల్లుడు అదుర్స్ నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ నిర్మాత‌లు : సంతోష్ శ్రీనివాస్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫర్ : చోటా కె నాయుడు ఎడిట‌ర్‌ : తిమ్మరాజు కె విడుదల తేదీ : జనవరి 14, 2021 యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ‘అల్లుడు అదుర్స్’ గా వచ్చిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) చిన్నతనంలోనే వసుంధరా రెడ్డి (అనూ ఇమాన్యుల్)ను ప్రేమించి విఫలం అవుతాడు. అప్పటినుండి అమ్మాయిలకు, ప్రేమకు దూరంగా ఉంటాడు. అయితే పెద్దయ్యాక అతను కౌముది (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తో ఓ ఒప్పందానికి రావడం, తీరా శ్రీను, కౌముదిని ప్రేమలో పడేసే టైంకి అతని జీవితంలోకి గజా (సోనూసూద్) ఎంట్రీ ఇవ్వడంతో దాంతో శ్రీను గోల్ మారుతుంది. అసలు ఈ గజా ఎవరు ? అతనికి వసుంధరకి సంబంధం ఏమిటీ ? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? తన ఫస్ట్ లవ్ అయిన వసుంధరకు ఎలాంటి సాయం చేశాడు ? ఈ మధ్యలో ఏమి జరిగింది ? అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్ : శ్రీను పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. పైగా గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఆయన రిస్క్ చేసి మరి చేసిన యాక్షన్ సీన్స్ లోని అడ్వంచరస్ బాగున్నాయి. ఇక హీరోయిన్ గా నటించిన నభా నటేష్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రంతో తనకు కలిసొచ్చిన కామెడీ యాంగిల్ ను చూపించాలనుకున్న ప్రయత్నం బాగుంది. ఊహ నిజం మధ్య స్క్రీన్ ఫ్లే రాసుకోవడం, ఆ నేపథ్యంలోనే సెకెండ్ హాఫ్ సినిమాను చేయాలనుకోవడం, ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ను మిస్ కాకుండా బాగానే హ్యాండిల్ చేశాడు. ప్రకాష్ రాజ్, ఇంద్రజ, సోనూసూద్ లాంటి మంచి నటులు ఈ చిత్రంలో తమ పాత్రలను అద్భుతంగా పోషించి ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తాడు. అలాగే ఎక్కువ సేపు కనిపించకపోయిన కీలక పాత్రలో నటించిన అను ఇమాన్యుల్ తన నటనతో ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మైనస్ పాయింట్స్ : రెగ్యులర్ పాయింట్‌ తో కూడుకున్న రెగ్యులర్ కథతో వచ్చిన ఈ సినిమాలో ఫేక్ ఎమోషన్స్, సిల్లీ కామెడీ ఎక్కువైపోయింది. పైగా రొటీన్ సినిమాలాగే ఐదు ఫైట్స్, మాస్ సాంగ్స్ తో పక్కా కమర్షియల్ చిత్రంలానే సాగుతూ.. బోర్ కొడుతుంది. సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అదికాక నమ్మశక్యం కాని సన్నివేశాలతో, కొన్ని అక్కరలేని సీన్లతో సినిమా ప్లో దెబ్బతింది. పైగా సినిమా కథాంశంలో కూడా ఎలాంటి కొత్తధనం చూపించకపోవడం, అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. సిచ్యుయేషన్ ఫన్ అండ్ హీరో ఆడే డ్రామాలోని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించిన్నప్పటికీ మరి నాటకీయంగా అనిపిస్తాయి. సోనూసూద్ ట్రాక్, అలాగే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అతని ట్రాక్ వాస్తవానికి చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కడా జన్యున్ ఎమోషన్ సినిమాలో లేదు. కనీసం, పాత్రల్లో మమేకం అయిపోయి ఫీల్ అయ్యే సందరర్భం సినిమాలో ఒక్కటి కూడా లేదు. సాంకేతిక విభాగం : దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రాసుకున్న స్టోరీ ఐడియానే వెరీ రెగ్యులర్ గా ఉంది. పైగా ఆ ఐడియాకు తగ్గట్టు ట్రీట్మెంట్ వెరీ వెరీ రెగ్యులర్ అండ్ బోరింగ్ గా సాగింది. మ్యూజిక్ డైరెక్టర్‌ దేవి అందించిన అందించిన రీరికార్డింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది, సౌండ్, పాటల్లోని కొన్ని బిట్స్ చాలా బాగున్నాయి. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. సినిమాటోగ్రఫర్ సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని పాటించిన ప్రొడక్షన్…

అల్లుడు అదుర్స్ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 2.5
దర్శకత్వ ప్రతిభ - 2.5

2.6

అల్లుడు అదుర్స్ రివ్యూ

అల్లుడు అదుర్స్ రివ్యూ

User Rating: 2.65 ( 1 votes)
3