చాణక్య రివ్యూ

0

నటీనటులు : గోపీచంద్, మెహ్రిన్ పిర్జా, సునీల్,అలీ, జరీన్ ఖాన్, నాజర్, ఆదర్శ్, రాజా చెంబూరు తదితరులు.

దర్శకత్వం : తిరు

నిర్మాత‌లు : రామ బ్రహ్మం సుంకర

సంగీతం : విశాల్ చంద్ర శేఖర్

సినిమాటోగ్రఫర్ : వెట్రి

గోపీచంద్, మెహ్రీన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య. ఏకే ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం నేడు విడులైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

అర్జున్(గోపీచంద్), రామకృష్ణ అనే బ్యాంక్ ఎంప్లాయ్ ముసుగులో దేశం కోసం పనిచేసే అండర్ కవర్ రా ఏజెంట్. ఓ మిషన్ లో భాగంగా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అయిన సోహైల్ కి అంత్యంత సన్నితుడైన టెర్రరిస్ట్ ని అర్జున్, అతని నలుగురు రా ఏజెంట్స్ తో కలిసి కిడ్నాప్ చేయడంతో పాటు, చంపడం జరుగుతుంది. దీనితో వారిపై పగబట్టిన టెర్రరిస్ట్ అర్జున్ నలుగురు మిత్రులను కిడ్నాప్ చేసి పాకిస్తాన్ కి తీసుకెళ్లడంతో పాటు, వచ్చి వారిని కాపాడు కోవలసిందిగా ఏజెంట్ అర్జున్ కి సవాల్ విసురుతాడు. అర్జున్ ఐడెంటిటీ రివీల్ కావడంతో రా కూడా అతన్ని ఏజెంట్ గా తీసివేస్తుంది.

మరి అర్జున్ ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్స్ నుండి తన మిత్రులను ఎలా కాపాడుకున్నాడు? గవర్నమెంట్ మరియు రా సంస్థ సపోర్ట్ లేకుండా అర్జున్ ఈ మిషన్ ఒక్కడే ఎలా నిర్వహించాడు. చివరికి అర్జున్ తన మిత్రులను కాపాడుకోగలిగాడా? లేదా అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

గోపీచంద్ మొదటిసారి రా ఏజెంట్ గా నటించినా ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. యాక్షన్ హీరోగా మంచి పేరున్న గోపీచంద్ డిఫరెంట్ లుక్ లో సాలిడ్ బాడీతో ఆకట్టుకున్నారు. ఇక గోపిచంద్ తో రెండోసారి జతకట్టిన మెహ్రిన్ గ్లామర్ తో పాటు, క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. అలీ, సునీల్ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలలో ఆమె కొంచెం హాస్యం కూడా పంచారు.

హీరో నుండి కమెడియన్ గా ఇప్పుడిప్పుడే ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టిన సునీల్ ఈ చిత్రంలో పూర్తిస్థాయి కమెడియన్ రోల్ దక్కించుకున్నాడు. టైమింగ్ కామెడీలో దిట్ట అయిన సునీల్, గోపీచంద్ మిత్రుడి పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక పెట్ డాగ్ డాక్టర్ గా ఆలీ కనిపించిన కొద్దినిమిషాలు హైలెట్ కామెడీ పండించారు. ఆయన కామెడీ కొంచెం హద్దులు దాటినా మొత్తానికి జనం నవ్వుకునేలా చేసింది. మొదటిసగంలో అలీ, సునీల్ కామెడీ మూవీకి బలంగా నిలిచింది.

మూవీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే పోరాట సన్నివేశాలు రెండు అలరిస్తాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉంటూ రా కోసం పనిచేసే పాత్రలో లేడీ ఏజెంట్ పాత్రలో జరీన్ ఖాన్ చక్కగా సరిపోయింది. వాస్తవంగా ముస్లిం అయిన జరీన్ పాకిస్తాన్ కి చెందిన ఆమ్మాయిపాత్రలో చక్కగా ఒదిగిపోయింది. సెకండ్ హాఫ్ లో మెహ్రిన్ కనిపించకపోవడం వలన మిస్ అయినా గ్లామర్ లోటు ఆమె తీర్చారు.

ఇక గోపీచంద్ సహ ఏజెంట్స్ గా కనిపించిన ఆదర్శ్, రాజా చేంబోలు, రా చీఫ్ గా చేసిన సీనియర్ నటులు నాజర్ వారి పాత్రల పరిధిలో చక్కని ప్రదర్శన కనబరిచారు.

మైనస్ పాయింట్స్:

హీరో హీరోయిన్ల మధ్య సాగే చక్కని రొమాన్స్, అలీ, సునీల్ కామెడీ కొన్ని యాక్షన్ సన్నివేశాలతో డీసెంట్ గా సాగిన ఫస్ట్ హాఫ్ తరువాత చాణక్య మూవీ సెకండ్ హాఫ్ లో పట్టుకోల్పోయింది. ఏమాత్రం ఆసక్తికలిగించని సన్నివేశాలతో సాగడం ఈ మూవీ ప్రధాన బలహీనత.

సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్తాన్ నేపథ్యంలో నడిపించిన దర్శకుడు ఒక సింగిల్ రా ఏజెంట్, ఇంటెర్నేషనల్ టెర్రరిస్ట్ తో అతని సొంత గడ్డపై పోటీపడే సన్నివేశాలు వాస్తవానికి దూరంగా అస్సలు ప్రేక్షకుడిని మెప్పించేలా తీయలేదు. భయంకరమైన ఒక టెర్రరిస్ట్ ని ఎదుర్కోవడానికి ఒక రా ఏజెంట్ వేసే వ్యూహాలు, పథకాలు ఆసక్తిని కలిగించవు. చాణక్య మూవీలో సన్నివేశాలు అనేక చిత్రాలతో పోలివుండటం కూడా మూవీ కి ఒక సమస్యగా మారింది.

సినిమా కాబట్టి కొంచెం లాజిక్ వదిలేసినా కన్విన్సింగ్ గా, ఆసక్తిగొలిపేలా సన్నివేశాలు ఉండాలి. అలాగే సెకండ్ హాఫ్ లో అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం మరొక మైనస్. క్లైమాక్స్ కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా తేల్చేశారు. గోపీచంద్ నుండి ఆశించే సుదీర్ఘమైన పోరాట సన్నివేశాలు లేకపోవడం కూడా మైనస్.

సాంకేతిక విభాగం:

దర్శకుడు తిరు రా ఏజెంట్ కథను చెప్పే క్రమంలో లాజిక్ అస్సలు ఫాలో కాలేదు. అంగబలం, అధికార బలం ఉన్న ఒక పెద్ద ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ని అతని సొంత గడ్డైన పాకిస్తాన్ లో ఎదుర్కోవడమంటే సాధారణ విషయం కాదు. అలాంటి సాహసం చేసిన హీరో వేసే ఎత్తులు కొంచెం లాజికల్ గా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సాగాలి. కానీ చాణక్య మూవీలో తిరు ఆ ఆసక్తిని కలిగించలేకపోయాడు. ఒక స్పై మిషన్ స్టోరీని చాలా సాదా సీదా సన్నివేశాలతో తెరకెక్కించి సిల్లీ భావన కలిగించారు. ఐతే మొదటి సగం మాత్రం ఆయన ఆకట్టుకున్నారు.

ఇక విశాల్ చంద్ర శేఖర్ బీజీఎమ్ కొంత మేర ఆకట్టుకున్నా, పాటలు ఏమాత్రం అనుభూతి కలిగించవు. రెండవ భాగంలో వచ్చిన మెలోడీ సాంగ్ బాగున్నా రాంగ్ టైం లో వచ్చి ఆసక్తి కోల్పోయింది.

తక్కువ నిడివిగల ఈ చిత్ర ఎడిటింగ్ బాగుంది. ఇక సినిమాటోగ్రాఫర్ వెట్రి తన ప్రతిభతో అలరించారు, పాకిస్తాన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలలో స్పై ఆపరేషన్స్ లో ఆయన కెమెరా పనితనం బాగుంది. అబ్బూరి రవి రాసిన కొన్ని డైలాగ్స్ అక్కడక్కగా బాగా పేలాయి.

తీర్పు:

మొత్తంగా గోపిచంద్ నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య అంచనాలు అందుకోలేదనే చెప్పాలి. ఇంటెర్నేషనల్ టెర్రరిస్ట్ పై రా ఏజెంట్ చేసే సింగిల్ పోరాటం ఎక్కడా ఆసక్తి కలిగించదు. దర్శకుడు రాసుకున్న లాజిక్ లేని సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఐతే మొదటి సగం మాత్రం రొమాంటిక్ సన్నివేశాలు, మెప్పించే కామెడీతో సాగింది. చాణక్య మూవీతో మంచి హిట్ కొట్టాలనుకున్న గోపిచంద్ ప్రయత్నం సఫలం కాలేదనిపిస్తుంది. గోపీచంద్ అభిమానులు మాత్రం ఆయనను ఓ కొత్త పాత్రలో చూసి ఆనందించ వచ్చు.

‘చాణక్య’ : లైవ్ అప్డేట్స్:

 • సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.

 • సినిమా క్లైమాక్స్ కు చేరుకుంటుంది.ఇప్పుడు కథనంలో మరో ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది.

 • ఒక పెద్ద చేజింగ్ సీన్ తర్వాత గోపీచంద్ మరియు మెహ్రీన్ ల మధ్య ఓహ్ మై లవ్ డ్యూయెట్ సాంగ్ వస్తుంది.

 • ఇప్పుడు ఒక మంచి ట్విస్ట్ చోటు చేసుకుంది.కథనంలో కొన్ని కీలక పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి.

 • సోహాలిను కిడ్నాప్ చేసేందుకు గోపీచంద్ మరియు జరీన్ లు ప్రయత్నిస్తున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

 • ఇప్పుడు జరీన్ గోపీచంద్ కు సాయం చేస్తుంది.సంబంధిత కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.

 • ప్రముఖ బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ద్వారా పరిచయం కాబడ్డారు.

 • ఒక రోగ్ ఏజెంట్ గా గోపీచంద్ పాకిస్థాన్ కరాచీలో ఎంటర్ అయ్యారు.పాకిస్థాన్ మరియు ఇండియన్స్ అతని కోసం వెతుకుతున్నారు.

 • ఇంటర్వెల్ అనంతరం గోపీచంద్ తన స్నేహితుల గ్యాంగ్ ను కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు.

 • ఇప్పుడు సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.

 • ఒక కిడ్నాప్ సన్నివేశం హై వోల్టేజ్ యాక్షన్ సీన్ కు దారి తీసింది.విలన్ ఖురేషి కొడుకు సోహాలి ఇప్పుడు ఎంటర్ అయ్యాడు.

 • హీరోహీరోయిన్ల మధ్య ఒక లవ్ ప్రపోజల్ సీన్ తర్వాత డార్లింగ్ పాట మొదలయ్యింది.

 • ఓ సీరియస్ సన్నివేశం తర్వాత కమెడియన్ అలీ పాత్ర ఎంటర్ అయ్యింది.ఇపుడు గోపీచంద్ మరియు అలీల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.

 • మరికొన్ని హాస్య సన్నివేశాల తర్వాత గులాబీ పాట మొదలయ్యింది.

 • ఐశ్వర్యగా హీరోయిన్ మెహ్రీన్ ఎంటర్ అయ్యింది.ఇప్పుడు మెహ్రీన్,గోపి చంద్ మరియు సునీల్ ల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఇప్పుడు పాకిస్థాన్ ను చెందిన మెయిన్ విలన్ పాత్రలో ఖురేషి ఎంటర్ అయ్యాడు. తర్వాత గోపి చంద్(అర్జున్) ఢిల్లీలోని ఒక బ్యాంకు ఉద్యోగిగా కొత్త పాత్రలోకి మారారు.

 • ఇప్పుడొక థ్రిల్లింగ్ కోవర్ట్ ఆపరేషన్ తో పాటుగా ఆసక్తికరంగా టైటిల్స్ పడ్డాయి.

 • ఒక అండర్ కవర్ ఏజెంట్ పాత్రలో హీరో గోపీచంద్ ఇప్పుడే పరిచయం అయ్యారు.సిరియా లోని ఒక ఆపరేషన్ మీద ఉన్నారు.

 • భారతదేశ పరిశోధకా శాఖ వింగ్ హెడ్ గా నటుడు నాజర్ ఎంట్రీతో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.ఇప్పుడు ఉగ్రవాద సంబంధిత కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

 • హాయ్..147 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.

నటీనటులు : గోపీచంద్, మెహ్రిన్ పిర్జా, సునీల్,అలీ, జరీన్ ఖాన్, నాజర్, ఆదర్శ్, రాజా చెంబూరు తదితరులు. దర్శకత్వం : తిరు నిర్మాత‌లు : రామ బ్రహ్మం సుంకర సంగీతం : విశాల్ చంద్ర శేఖర్ సినిమాటోగ్రఫర్ : వెట్రి గోపీచంద్, మెహ్రీన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య. ఏకే ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం నేడు విడులైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. కథ: అర్జున్(గోపీచంద్), రామకృష్ణ అనే బ్యాంక్ ఎంప్లాయ్ ముసుగులో దేశం కోసం పనిచేసే అండర్ కవర్ రా ఏజెంట్. ఓ మిషన్ లో భాగంగా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అయిన సోహైల్ కి అంత్యంత సన్నితుడైన టెర్రరిస్ట్ ని అర్జున్, అతని నలుగురు రా ఏజెంట్స్ తో కలిసి కిడ్నాప్ చేయడంతో పాటు, చంపడం జరుగుతుంది. దీనితో వారిపై పగబట్టిన టెర్రరిస్ట్ అర్జున్ నలుగురు మిత్రులను కిడ్నాప్ చేసి పాకిస్తాన్ కి తీసుకెళ్లడంతో పాటు, వచ్చి వారిని కాపాడు కోవలసిందిగా ఏజెంట్ అర్జున్ కి సవాల్ విసురుతాడు. అర్జున్ ఐడెంటిటీ రివీల్ కావడంతో రా కూడా అతన్ని ఏజెంట్ గా తీసివేస్తుంది. మరి అర్జున్ ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్స్ నుండి తన మిత్రులను ఎలా కాపాడుకున్నాడు? గవర్నమెంట్ మరియు రా సంస్థ సపోర్ట్ లేకుండా అర్జున్ ఈ మిషన్ ఒక్కడే ఎలా నిర్వహించాడు. చివరికి అర్జున్ తన మిత్రులను కాపాడుకోగలిగాడా? లేదా అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్: గోపీచంద్ మొదటిసారి రా ఏజెంట్ గా నటించినా ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. యాక్షన్ హీరోగా మంచి పేరున్న గోపీచంద్ డిఫరెంట్ లుక్ లో సాలిడ్ బాడీతో ఆకట్టుకున్నారు. ఇక గోపిచంద్ తో రెండోసారి జతకట్టిన మెహ్రిన్ గ్లామర్ తో పాటు, క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. అలీ, సునీల్ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలలో ఆమె కొంచెం హాస్యం కూడా పంచారు. హీరో నుండి కమెడియన్ గా ఇప్పుడిప్పుడే ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టిన సునీల్ ఈ చిత్రంలో పూర్తిస్థాయి కమెడియన్ రోల్ దక్కించుకున్నాడు. టైమింగ్ కామెడీలో దిట్ట అయిన సునీల్, గోపీచంద్ మిత్రుడి పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక పెట్ డాగ్ డాక్టర్ గా ఆలీ కనిపించిన కొద్దినిమిషాలు హైలెట్ కామెడీ పండించారు. ఆయన కామెడీ కొంచెం హద్దులు దాటినా మొత్తానికి జనం నవ్వుకునేలా చేసింది. మొదటిసగంలో అలీ, సునీల్ కామెడీ మూవీకి బలంగా నిలిచింది. మూవీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే పోరాట సన్నివేశాలు రెండు అలరిస్తాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉంటూ రా కోసం పనిచేసే పాత్రలో లేడీ ఏజెంట్ పాత్రలో జరీన్ ఖాన్ చక్కగా సరిపోయింది. వాస్తవంగా ముస్లిం అయిన జరీన్ పాకిస్తాన్ కి చెందిన ఆమ్మాయిపాత్రలో చక్కగా ఒదిగిపోయింది. సెకండ్ హాఫ్ లో మెహ్రిన్ కనిపించకపోవడం వలన మిస్ అయినా గ్లామర్ లోటు ఆమె తీర్చారు. ఇక గోపీచంద్ సహ ఏజెంట్స్ గా కనిపించిన ఆదర్శ్, రాజా చేంబోలు, రా చీఫ్ గా చేసిన సీనియర్ నటులు నాజర్ వారి పాత్రల పరిధిలో చక్కని ప్రదర్శన కనబరిచారు. మైనస్ పాయింట్స్: హీరో హీరోయిన్ల మధ్య సాగే చక్కని రొమాన్స్, అలీ, సునీల్ కామెడీ కొన్ని యాక్షన్ సన్నివేశాలతో డీసెంట్ గా సాగిన ఫస్ట్ హాఫ్ తరువాత చాణక్య మూవీ సెకండ్ హాఫ్ లో పట్టుకోల్పోయింది. ఏమాత్రం ఆసక్తికలిగించని సన్నివేశాలతో సాగడం ఈ మూవీ ప్రధాన బలహీనత. సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్తాన్ నేపథ్యంలో నడిపించిన దర్శకుడు ఒక సింగిల్ రా ఏజెంట్, ఇంటెర్నేషనల్ టెర్రరిస్ట్ తో అతని సొంత గడ్డపై పోటీపడే సన్నివేశాలు వాస్తవానికి దూరంగా అస్సలు ప్రేక్షకుడిని మెప్పించేలా తీయలేదు. భయంకరమైన ఒక టెర్రరిస్ట్ ని ఎదుర్కోవడానికి ఒక రా ఏజెంట్ వేసే వ్యూహాలు, పథకాలు ఆసక్తిని కలిగించవు. చాణక్య మూవీలో సన్నివేశాలు అనేక చిత్రాలతో పోలివుండటం కూడా మూవీ కి ఒక సమస్యగా మారింది. సినిమా కాబట్టి కొంచెం లాజిక్ వదిలేసినా కన్విన్సింగ్ గా, ఆసక్తిగొలిపేలా సన్నివేశాలు ఉండాలి. అలాగే సెకండ్ హాఫ్ లో అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం మరొక మైనస్. క్లైమాక్స్ కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా తేల్చేశారు. గోపీచంద్ నుండి ఆశించే సుదీర్ఘమైన పోరాట సన్నివేశాలు లేకపోవడం కూడా మైనస్. సాంకేతిక విభాగం: దర్శకుడు తిరు రా ఏజెంట్ కథను చెప్పే క్రమంలో లాజిక్ అస్సలు ఫాలో కాలేదు. అంగబలం, అధికార బలం ఉన్న ఒక పెద్ద ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ని అతని సొంత గడ్డైన పాకిస్తాన్ లో ఎదుర్కోవడమంటే సాధారణ విషయం కాదు. అలాంటి సాహసం చేసిన హీరో వేసే ఎత్తులు కొంచెం లాజికల్ గా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సాగాలి. కానీ చాణక్య మూవీలో తిరు ఆ ఆసక్తిని కలిగించలేకపోయాడు. ఒక స్పై మిషన్ స్టోరీని చాలా సాదా సీదా సన్నివేశాలతో తెరకెక్కించి…

చాణక్య రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 3
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 3.75
దర్శకత్వ ప్రతిభ - 3

3.4

చాణక్య రివ్యూ

చాణక్య రివ్యూ

User Rating: Be the first one !
3