డీ ఫర్ దోపిడి రివ్యు

0

వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ హీరోలుగా సిరాజ్ కల్లా దర్శకత్వంలో బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణడీకేలు నిర్మించిన చిత్రం ‘డీ ఫర్ దోపిడీ’. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ  మా చిత్రానికి కథానాయకుడు నాని వాయిస్ ఓవర్ అందించండంతో పాటు ప్రచారం గీతంలో నర్తించారు. అలాగే ప్రముఖ నిర్మాత పంపిణీదారుడు దిల్ రాజు మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఆసక్తి చూపడం, ఇటీవల విడుదలైన పాటలకు ప్రచార చిత్రాలకు మంచిస్పందన రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు దేవకట్టా ఐపీయస్ ఆఫీసర్ గా నటించారు. సినిమాలోని మిగిలిన పాత్రల్లో మెలోని, తనికెళ్ళభరణి, రాజ్ పిప్పళ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం : మహేష్ శంకర్, సచిన్,జిగర్,పాటలుః కృష్ణచైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : విజయ్ శంకర్ డొంకాడ.

 

……………. సినిమా సమాప్తం ………………

11:18 am : దోపిడి గ్యాంగ్ హోరోలుగా టర్న్ అవుతారు. హ్యాపీ ఎండింగ్ తో నాని వాయిస్ ఓవర్ చాలా బాగుంది. అందులోనే ప్రోమో సాంగ్

10:55 am : దోపిడి మూవీ సాగదీసినట్లు ఉంది. కొన్ని సీన్లు చూడొచ్చు అవి లవ్ ప్రపోజల్, బాయ్ సీన్స్, ఫుడ్ సీన్లు కాస్త చూడొచ్చు అన్నట్టు ఉన్నాయి.

10:45 am : జీడిపప్పు ఉప్నాసన్నివేశం కాస్త ఇంట్రెస్టింగ్ చూపించాడు.

10:35 am :తనికెళ్ల భరణి ఫ్లాష్ బ్యాక్ చాలా ఫన్నీగా ఉంది.

10:30 am : ఏ.సి.పి. కృష్ణమాచార్య (దేవకట్ట) దోపిడిని ఆపడానికి వస్తాడు.

…………. విశ్రాంతి ……………

10:16 am : ఈ గ్యాంగ్ బ్యాంక్ దోపిడికి పెద్ద ప్లాన్ వేస్తారు. దీనికి మూలకర్తగా తనికెళ్ల భరణి ఉంటాడు. కానీ బ్యాంగ్ మేనేజర్ డబ్బును కాపాడటానికి వేరు అరేంజ్ మెంట్ చేస్తాడు.

10:14 am : ఎట్టకేలకు ఒక దొంగ తనానికి ప్రయత్నిస్తారు. ఈ సన్నివేశం కడుపుబ్బా నవ్వు పుట్టించేలా ఉంది. వీరు మాత్రం సీరియస్ గా దొంగతనానికి ప్రయత్నిస్తుంటారు.

10:12 am : దోపిడి ఎలా చేయాల తెగ ట్రై చేస్తుంటారు వరుణ్ గ్రూప్ దాని కోసం ఇంగ్లీష్, హింది ఏది పడితే అది దొంగతనాలకు సంబంధించిన సినిమాలు చూస్తుంటారు.

10:02 am : బాంబ్ ప్లాన్ సక్సెస్ కాదు. కానీ విళ్లు మాత్రం చిక్కుల్లో పడతారు.

9:50 am : ఆ నలుగురు ఒక ప్లాన్ వేస్తారు. అన్న(ఫిష్ వెంకట్) వద్ద డబ్బులు తీసుకొని బాంబు కొంటారు.

9:45 am : సందీప్ కిషన్ గ్రూప్ వాళ్ల ప్లాన్ అమలు పర్చుకోవడానికి బాంబు డీలర్ భాయ్ (ఫృద్వి)ని కలుస్తారు. ఒక్కో దానికి లక్ష రూపాయలు అడుగుతాడు.

9:40 am : ఈ నలుగురు యువకులకు ఫైనాన్స్ ప్రాబ్లమ్ చాలా ఉంటుంది. దీనికోసం ఏ రిస్క్ అయినా చేసి తన కష్టాలు తీర్చుకోవాలని చూస్తారు.

9:35 am : సినిమా స్టార్టింగ్ నలుగురితో అవుతుంది. అందులో విక్కి(వరుణ్ సందేశ్),రాజు(సందీప్ కిషన్ ) ల ఎంట్రి నాని వాయిస్ వోవర్ బాగుంది.

9:30 am : హాయ్! గుడ్ మార్నింగ్ రీడర్స్- వరుణ్ సందేశ్,సందీప్ కిషన్ నటించిన D for దోపిడి సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్వాగతం

Tags : డి ఫర్ దోపిడి రివ్యు, డి ఫర్ దోపిడి : రివ్యు, రివ్యు : డి ఫర్ దోపిడి రివ్యు డి ఫర్ దోపిడి రివ్యు, D for Dopidi Review, D for Dopidi Telugu Movie Review, D for Dopidi Movie Review, D for Dopidi Live Updates, D for Dopidi  Review in Telugu, D for Dopidi Tweet Revew, D for Dopidi Public Talk, D for Dopidi Hit or Flop, D for Dopidi Movie Story,