డిస్కో రాజా రివ్యూ

0

 

విడుదల తేదీ : జనవరి 24, 2020

నటీనటులు :  రవితేజ,నభా నటేష్ పాయల్ రాజ్‌పుత్, బాబీ సింహా, వెన్నెల కిషోర్.

దర్శకత్వం : విఐ ఆనంద్

నిర్మాత‌లు : రామ్ తాల్లూరి

సంగీతం :  ఎస్.ఎస్.తమన్

సినిమాటోగ్రఫర్ : కార్తీక్ ఘట్టమనేని

ఎడిటర్:  శ్రావన్ కటికనేని

మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి.ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా. ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

డిస్కో రాజా (రవితేజ) 1980 కాలంలో మద్రాస్ లో పెద్ద గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. అలా అటాక్ లతో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఎదురులేకుండా సాగుతున్న డిస్కో రాజా, హెలెన్ (పాయల్ రాజ్ పుత్)ను చూసి ఆమె ధైర్యాన్ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ మధ్యలో తనకు అడ్డు వచ్చిన బర్మా సేతు (బాబీ సింగ్) ను జైలుకి పంపి అడ్డు తొలిగిస్తాడు. ఇక ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం డిస్కో రాజా అన్ని వదిలేసి హెలెన్ తో లడఖ్ ప్రాంతానికి వచ్చేస్తాడు. అయితే అక్కడ తన పై జరిగిన అటాక్ లో డిస్కో రాజా చనిపోయి.. మళ్ళీ ముప్పై సంవత్సరాల తరువాత ఒక ఐస్ ట్రెక్కింగ్ చేస్తున్న గ్రూప్ కు దొరుకుతాడు. అయితే చనిపోయిన మనుషుల్లో మళ్ళీ జీవం పోసి బతికించడానికి ఎప్పటినుంచో రీసెర్చ్ చేస్తోన్న టీమ్ (తాన్యా హోప్ బ్యాచ్) కారణంగా డిస్కో రాజా మళ్ళీ బతుకుతాడు. మరోపక్క వాసు (రవితేజ) కోసం కొంతమంది వెతుకుతూ ఉంటారు. ఇంతకీ వాసుకి డిస్కో రాజాకి ఉన్న సంబంధం ఏమిటి ? వాసుతో నభా (నభా నటేష్) ప్రేమ కథ ఎలా మొదలైంది ? ఎలా కొనసాగింది ? అసలు ‘డిస్కో రాజా’ను చంపింది ఎవరు ? వారి పై డిస్కో రాజా ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

డిస్కో రాజాగా మాస్ మహారాజా రవితేజ ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా తన ఏనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో పాటు తన కామెడీ టైమింగ్ తో కూడా బాగా ఆకట్టుకున్నాడు. లుక్స్ పరంగా కూడా గత తన సినిమాలలో కంటే.. ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ముఖ్యంగా కొన్ని గ్యాంగ్ స్టర్ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక హీరోయిన్స్ పాత్రల్లో నటించిన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ లకు తక్కువ స్క్రీన్ టైం ఉన్నా.. వాళ్ళు ఉన్నంతలో బాగానే నటించారు. తమ అందంతో పాటు తమ అభినయంతో కూడా మెప్పించారు. ముఖ్యంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో పాయల్ పలికించిన హావభావాలు బాగున్నాయి.

అలాగే తాన్యా హోప్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విలన్ గా బాబీ సింహా బాగున్నాడు. అలాగే మరో ముఖ్య పాత్రలో కనిపించిన సునీల్ కూడా తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే కామిక్ పాత్రల్లో కనిపించిన కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్నిచోట్ల నవ్వించారు. దర్శకుడు ఆనంద్ తన శైలికి తగ్గట్లుగానే ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా మలిచే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన దర్శకత్వ పనితనం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు వి.ఐ ఆనంద్ మెడికిల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. సెకెండ్ హాఫ్ లో మొదటి ముప్పై నిముషాల్లో వచ్చే డిస్కో రాజా తాలూకు సన్నివేశాలు ఇంకా ఇంట్రస్ట్ గా ఉంటే బాగుండేది. హీరో అండ్ విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు అలాగే సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి.

ముఖ్యంగా ప్రెజెంట్ లవ్ స్టొరీతో పాటు సునీల్ ట్రాక్ ఆడియన్స్ పూర్తి ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. అలాగే కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. కథలోని మెయిన్ ట్రాక్స్ ను అలాగే డిస్కో రాజా క్యారెక్టరైజేషన్ ను మరియు రవితేజ రెండు పాత్రల మధ్య ఎమోషన్ ఇంకా బాగా బలంగా ఎలివేట్ చేయాల్సింది. అలాగే క్లైమాక్స్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ను తగ్గిస్తే సినిమాకి ప్లస్ అయ్యేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. వి.ఐ ఆనంద్ మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ చాల బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. మెయిన్ గా డిస్కో రాజా సాంగ్ అదిరిపోయింది. అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉండాలి. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘డిస్కో రాజా’ అంటూ వచ్చిన మాస్ మహారాజ్ తన ఆటిట్యూడ్ తో పాటు తన కామెడీ టైమింగ్ కూడా బాగా ఆకట్టుకున్నాడు. మెయిన్ గా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే దర్శకుడు వైవిధ్యమైన స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ కు తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోకపోవడం పైగా డిస్కో రాజా క్యారెక్టరైజేషన్ అండ్ రవితేజ రెండు పాత్రల మధ్య ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. మరి ఇలాంటి చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

‘డిస్కో రాజా’ : లైవ్ అప్డేట్స్:

 • ఒక సాధారణ క్లైమాక్స్ ఫైట్ సీన్ తో సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.

 • ఇప్పుడు కథనంలో మరో ఊహించని ట్విస్ట్ రివీల్ అయ్యింది.

 • ఇప్పుడు సినిమా క్లైమాక్స్ కు చేరుకుంటుంది.బాబీ సింహా లడఖ్ కు డిస్కో రాజా పై జరుగుతున్న రీసెర్చ్ సెంటర్ దగ్గరకు వెళ్ళాడు.

 • ఇప్పుడు బాబీ మరియు రవితేజ గ్యాంగ్ ల మధ్య కొన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఇప్పుడు రవితేజ మరియు పాయల్ ల మధ్య మరో రెట్రో హిట్ ట్రాక్ నువ్ నాతో ఏమన్నావో సాంగ్ వస్తుంది.

 • ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇచ్చింది.ఆమెను ఇంప్రెస్ చెయ్యడానికి రవితేజ ట్రై చేస్తున్నాడు.

 • రవితేజ బాబీ సింహా వ్యాపారాలను టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టాడు.ఇప్పుడు కొన్ని ఎలివేషన్ సీన్స్ వస్తున్నాయి.

 • ఇప్పుడు రవితేజ మరియు బాబీ సింహా మధ్య ఒక ఘర్షణ పడుతున్న సన్నివేశం వస్తుంది.

 • బ్యాక్గ్రౌండ్ లో రం పం బం సాంగ్ తో రవితేజ మరియు అతని గ్యాంగ్ కు మధ్య కొన్ని దోపిడీ సీన్స్ వస్తున్నాయి.

 • ఇప్పుడు సినిమా మరోసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది.రవితేజ మరియు సునీల్ లు దొంగలుగా కనిపిస్తున్నారు.ఇప్పుడు వీరు ఒక బ్యాంకును కొల్లగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.

 • ఇప్పుడు ఒక మర్డర్ సీన్,రవితేజ మరియు నరేష్ ల మధ్య ఒక సీరియస్ గా మాట్లాడుతున్న సన్నివేశం వస్తుంది.

 • ఇంటర్వెల్ అనంతరం రవి తేజ పై కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సినిమా మంచి కథనంతో కొనసాగింది.చిత్రంలోని మెయిన్ పాయింట్ ను మంచి ట్విస్టుల ద్వారా బాగా తెరకెక్కించారు.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

 • ఒక ఊహించని ట్విస్ట్ తో చిత్రం ఇప్పుడు సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.

 • ఇప్పుడు బాబీ సింహా మళ్ళీ జాయిన్ అయ్యాడు.ఒక కిడ్నాప్ సన్నివేశం వస్తుంది.

 • ఇప్పుడు వింటేజ్ రవితేజ..డిస్కో రాజాగా ఎంట్రీ ఇచ్చాడు.అతను తన జ్ఞ్యాపకాలను మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారు.ఇప్పుడు హిట్ ట్రాక్ ఫ్రీక్ అవుట్ సాంగ్ వస్తుంది.

 • ఇప్పుడు రవితేజ సోదరుడిగా సత్యం రాజేష్ పరిచయం అయ్యాడు.

 • ఇప్పుడు రవితేజ మరియు కిక్ బ్యాచ్ తో కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.

 • ఇప్పుడు రవితేజపై కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.

 • రవితేజ పై నరేష్ ఒక సీక్రెట్ రీసెర్చ్ చేస్తున్నారు.

 • ఇప్పుడు నభ నటేష్ మరియు రవితేజల మధ్య కొన్ని లవ్ సీన్స్ వస్తున్నాయి.

 • ఇప్పుడు కథనం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు తీసుకెళ్లింది.ఢిల్లిలో ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యింది,ఇప్పుడు దిల్లీవాలా సాంగ్ మొదలయ్యింది.

 • డాక్టర్లు రవితేజ గతాన్ని కనుక్కోడానికి ప్రయత్నిస్తున్నారు.

 • చాలా సార్లు ప్రయత్నం చేసిన తర్వాత రవితేజ మళ్ళీ బతికాడు. ఆ రీసెర్చ్ సెంటర్ నుంచి అతను తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.

 • ఒక హింసాత్మక సన్నివేశంతో బాబీ సింహా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు.

 • ఇప్పుడు సైంటిస్ట్ లుగా తన్య హోప్ మరియు వెన్నెల కిషోర్ లు ఎంట్రీ ఇచ్చారు.వీరు చనిపోయిన దేహంలో మళ్ళీ ప్రాణం పోయడం ఎలా అనే కాన్సెప్ట్ పై పనిచేస్తున్నారు.ఆ సంబంధిత సన్నివేశాలు కాస్త కామెడీ విధానంలో వస్తున్నాయి.

 • లడఖ్ లోని ఒక ట్రెక్కింగ్ గ్రూప్ రవితేజ బాడీను గుర్తించారు,ఇప్పుడు ఒక రీసెర్చ్ సెంటర్ కు సినిమా షిఫ్ట్ అయ్యింది.

 • రవితేజపై ఇప్పుడు హత్యా ప్రయత్నం జరిగింది.ఇప్పుడు అతని బాడీని ఫ్రీజ్ చేసారు,మరింత ఆసక్తికరంగా కథనం మారింది.ఇప్పుడు నటుడు నరేష్ మరియు నభ నటేష్ లు ఎంట్రీ ఇచ్చారు.

 • టైటిల్స్ పడుతూ..లడఖ్ లోని సన్నివేశాలతో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.

 • హాయ్..149 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

  విడుదల తేదీ : జనవరి 24, 2020 నటీనటులు :  రవితేజ,నభా నటేష్ పాయల్ రాజ్‌పుత్, బాబీ సింహా, వెన్నెల కిషోర్. దర్శకత్వం : విఐ ఆనంద్ నిర్మాత‌లు : రామ్ తాల్లూరి సంగీతం :  ఎస్.ఎస్.తమన్ సినిమాటోగ్రఫర్ : కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్:  శ్రావన్ కటికనేని మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి.ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా. ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : డిస్కో రాజా (రవితేజ) 1980 కాలంలో మద్రాస్ లో పెద్ద గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. అలా అటాక్ లతో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఎదురులేకుండా సాగుతున్న డిస్కో రాజా, హెలెన్ (పాయల్ రాజ్ పుత్)ను చూసి ఆమె ధైర్యాన్ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ మధ్యలో తనకు అడ్డు వచ్చిన బర్మా సేతు (బాబీ సింగ్) ను జైలుకి పంపి అడ్డు తొలిగిస్తాడు. ఇక ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం డిస్కో రాజా అన్ని వదిలేసి హెలెన్ తో లడఖ్ ప్రాంతానికి వచ్చేస్తాడు. అయితే అక్కడ తన పై జరిగిన అటాక్ లో డిస్కో రాజా చనిపోయి.. మళ్ళీ ముప్పై సంవత్సరాల తరువాత ఒక ఐస్ ట్రెక్కింగ్ చేస్తున్న గ్రూప్ కు దొరుకుతాడు. అయితే చనిపోయిన మనుషుల్లో మళ్ళీ జీవం పోసి బతికించడానికి ఎప్పటినుంచో రీసెర్చ్ చేస్తోన్న టీమ్ (తాన్యా హోప్ బ్యాచ్) కారణంగా డిస్కో రాజా మళ్ళీ బతుకుతాడు. మరోపక్క వాసు (రవితేజ) కోసం కొంతమంది వెతుకుతూ ఉంటారు. ఇంతకీ వాసుకి డిస్కో రాజాకి ఉన్న సంబంధం ఏమిటి ? వాసుతో నభా (నభా నటేష్) ప్రేమ కథ ఎలా మొదలైంది ? ఎలా కొనసాగింది ? అసలు ‘డిస్కో రాజా’ను చంపింది ఎవరు ? వారి పై డిస్కో రాజా ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : డిస్కో రాజాగా మాస్ మహారాజా రవితేజ ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా తన ఏనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో పాటు తన కామెడీ టైమింగ్ తో కూడా బాగా ఆకట్టుకున్నాడు. లుక్స్ పరంగా కూడా గత తన సినిమాలలో కంటే.. ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ముఖ్యంగా కొన్ని గ్యాంగ్ స్టర్ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక హీరోయిన్స్ పాత్రల్లో నటించిన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ లకు తక్కువ స్క్రీన్ టైం ఉన్నా.. వాళ్ళు ఉన్నంతలో బాగానే నటించారు. తమ అందంతో పాటు తమ అభినయంతో కూడా మెప్పించారు. ముఖ్యంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో పాయల్ పలికించిన హావభావాలు బాగున్నాయి. అలాగే తాన్యా హోప్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విలన్ గా బాబీ సింహా బాగున్నాడు. అలాగే మరో ముఖ్య పాత్రలో కనిపించిన సునీల్ కూడా తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే కామిక్ పాత్రల్లో కనిపించిన కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్నిచోట్ల నవ్వించారు. దర్శకుడు ఆనంద్ తన శైలికి తగ్గట్లుగానే ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా మలిచే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన దర్శకత్వ పనితనం బాగుంది. మైనస్ పాయింట్స్ : దర్శకుడు వి.ఐ ఆనంద్ మెడికిల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. సెకెండ్ హాఫ్ లో మొదటి ముప్పై నిముషాల్లో వచ్చే డిస్కో రాజా తాలూకు సన్నివేశాలు ఇంకా ఇంట్రస్ట్ గా ఉంటే బాగుండేది. హీరో అండ్ విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు అలాగే సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రెజెంట్ లవ్ స్టొరీతో పాటు సునీల్ ట్రాక్ ఆడియన్స్ పూర్తి ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. అలాగే కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. కథలోని మెయిన్ ట్రాక్స్ ను అలాగే డిస్కో రాజా క్యారెక్టరైజేషన్ ను మరియు రవితేజ రెండు పాత్రల మధ్య ఎమోషన్ ఇంకా బాగా బలంగా ఎలివేట్ చేయాల్సింది. అలాగే క్లైమాక్స్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ను…

డిస్కో రాజా రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 2.75

3.1

డిస్కో రాజా రివ్యూ

డిస్కో రాజా రివ్యూ

User Rating: 2.43 ( 2 votes)
3