దూసుకెళ్తా రివ్యు

0

Title : Doosukeltha (2013)
Star Cast : Vishnu Manchu, Lavanya Tripathi…
Director : Veeru Potla
Producer : Mohan Babu
Genre : Action – Romance
Music : Mani Sharma
Releasing on : – October 17 2013

Doosukeltha Review, Doosukeltha Movie Review, Telugu Movie Reviews, Ratings, Story, Live, Tweet, Updates, Manchu Vishnu, Director, Producer, Talk, Lavanya Tripathi, Heroine, Cast and Crew

Doosukeltha Telugu Movie Review, Rating – Story, Live Updates | Vishnu Manchu
KalyanDoosukeltha Review | Doosukeltha Movie Review | Telugu Movie Reviews | Ratings | Story | Live | Tweet | Updates | Manchu Vishnu | Director | Producer | Talk | Lavanya Tripathi | Heroine | Cast and Crew
Doosukeltha Review, Doosukeltha Movie Review, Telugu Movie Reviews, Ratings, Story, Live, Tweet, Updates, Manchu Vishnu, Director, Producer, Talk, Lavanya Tripathi, Heroine, Cast and Crew

సినిమాకి కావ‌ల్సింది మూడే మూడు.
ఒక‌టి ఎంట‌ర్‌టైన్ మెంట్‌…
రెండోది ఎంట‌ర్‌టైన్ మెంట్‌..
మూడోది ఎంట‌ర్‌టైన్ మెంట్‌…
అంతే. దీనికి మించిన స‌క్సెస్ సీక్రెట్ ఏమీ లేదు. ఇంత‌కు ముందు ఇదే ఎంట‌ర్‌టైన్ మెంట్‌ని జంథ్యాల‌, ఈవీవీ అందించారు. విజ‌యాలు సాధించారు. కాక‌పోతే వాళ్లు కాస్త లాజిక్ ల‌కు ఆస్కారం ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అదే ఎంట‌ర్‌టైన్ మెంట్‌ని నమ్ముకొంటూ శ్రీ‌నువైట్ల లాంటి ద‌ర్శకులు పుట్టుకొచ్చారు. కాక‌పోతే.. ఇక్కడ లాజిక్‌ని వెతుక్కోవ‌డం మానేశారు. అయినా స‌రే.. ప్రేక్షకులు ఆద‌రిస్తున్నారు. కాబ‌ట్టి సినిమాలో లాజిక్ అనేదాన్ని ప‌క్కన పెట్టాల్సివ‌స్తోంది. దూసుకెళ్తా కూడా అచ్చంగా అలాంటి క‌థే. ద‌ర్శకుడు కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని మాత్రమే న‌మ్ముకొన్నాడు. దాన్నే అందంగా, అర్థమ‌య్యేలా… అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలోని లోపాలు మ‌ర్చిపోయేలా చెప్పగ‌లిగాడు. మ‌రింత‌కీ.. దూసుకెళ్తాలో ఏముంది? ఈ సినిమాతో విష్ణు మ‌రో హిట్టు కొట్టాడా? లేదంటే ఆ హిట్‌కి అత‌ను ఎంత దూరంలో ఆగిపోయాడు?? తెలుసుకొందాం రండి.

చిన్నా (విష్ణు) చిన్నప్పటి నుంచీ కాస్త తేడా కేసు. అన్ని విష‌యాల్లోనూ దూసుకెళ్తుంటాడు. భ‌లే మాట‌కారి. తెలివితేట‌లు క‌ల‌వాడు. కాక‌పోతే ఎవ‌రైనా చిన్న స‌హాయం చేస్తే.. జీవితాంతం గుర్తుపెట్టుకొంటాడు. ఓ పందెంలో గెల‌వ‌డానికి చిన్ని అనే అమ్మాయి చిన్నాకి స‌హాయం చేస్తుంది. ఇద్దరి మ‌ధ్యా స్నేహం చిగురిస్తుంది. అయితే చిన్ని వాళ్ల కుటుంబానికి దూరం కావ‌డానికి.. ఇల్లు వ‌దిలి వెళ్లిపోవ‌డానికి ఒక విధంగా చిన్నానే కార‌ణం అవుతాడు. దాంతో చిన్నా అంటే చిన్నికి కోపం. చిన్నా పెద్దోడ‌వుతాడు. ఓ టీవీ చాన‌ల్‌లో రిపోర్టర్‌గా చేర‌తాడు. ఓ మంత్రి పన్నాగాన్ని కెమెరాలో బంధించి ఇరికిస్తాడు. అప్పటి నుంచీ… చిన్నా కోసం ఆ మంత్రి మ‌నుషులు వెదుకుతుంటారు. ఓ ప్రమాదంలో గాయ‌ప‌డిన చిన్నాని అలైఖ్య (లావ‌ణ్య త్రిపాఠీ) కాపాడుతుంది. దాంతో ఆమెకు ఏదైనా స‌హాయం చేయాల‌నుకొంటాడు. అలైఖ్యను ఓ వ్యక్తి వెంటాడుతుంటాడు. అత‌న్ని ప‌ట్టుకొంటే చిన్నాకి ఓ నిజం తెలుస్తుంది. అదేంటి? అస‌లింత‌కీ ఈ అలైఖ్య ఎవ‌రు? చిన్నప్పటి చిన్ని ఏమైంది? అనేదే ఈ సినిమా క‌థ‌.

క‌మ‌ర్షియ‌ల్ తెలుగు సినిమా క‌థ‌లా.. దూసుకెళ్తాలో క‌థ కూడా ఎలాంటి లాజిక్కులూ లేకుండా సాగుతుంది. ఒక్కో పాత్ర తెర‌పై రావ‌డం, ఆ పాత్రని ప‌రిచ‌యం చేయ‌డంతోనే ఫ‌స్టాఫ్ గ‌డిచిపోతుంది. చిన్నప్పటి ఎపిసోడ్ కూడా కాస్త హెవీగానే ఉంటుంది. కానీ సెకండాఫ్ లో ఆ ఎపిసోడే కీల‌కంగా మారింది. ఫ‌స్టాఫ్‌లో ద‌ర్శకుడు ప‌రిచ‌యం చేసిన ప్రతీ పాత్రనీ సెకండాప్‌లో తెలివిగా వాడుకొన్నాడు.

ఈ సినిమాని రెండు భాగాలుగా చూసుకోవాలి. విశ్రాంతికి ముందు – ఆ త‌ర‌వాత‌. ప్రథ‌మార్థం కాస్త గంద‌ర‌గోళంగా సాగుతుంది. ఏంటో మ‌న ప్రమేయం లేకుండా.. ఏదేదో సాగిపోతుంటుంది. చిన్నాకి ఉద్యోగం రావ‌డం, తొలిరోజే ఓ పెద్ద ఆప‌రేష‌న్ అప్పగించ‌డం, ఆ త‌ర‌వాత ఆసుప‌త్రిలో చేర‌డం ఆ స‌న్నివేశాల‌న్నీ చూస్తే, ఇంత మ‌తిలేని క‌థేంటి? అనిపిస్తుంది. ఇంట్రవెల్ ట్విస్టు కూడా ముందే ఊహిస్తాం. కానీ ద‌ర్శకుడు ఇక్కడ న‌మ్ముకొన్న సూత్రం… బ్రహ్మానందం. ఆయ‌న్ని రంగంలోకి దింపి ఫ‌స్టాఫ్ కాస్త బెట‌ర్ అనిపించాడు. ఇక సెకండాఫ్ పిచ్చేశ్వర‌రావుగా విష్ణు ఎప్పుడైతే విల‌న్ ఇంట్లో అడుగుపెట్టాడో అప్పటి నుంచి న‌వ్వులు బాగా పండాయి. వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం సెకండాఫ్ మొత్తాన్ని త‌మ భుజ స్కంధాల‌పై వేసుకొని న‌డిపించేశారు. సెకండాఫ్‌లో విష్ణు కేవ‌లం స‌పోర్టింగ్ రోల్‌గా ప‌రిమిత‌మైపోయాడు. ఈ క‌థ‌కు అది అవ‌స‌రం కూడా. వెన్నెల కిషోర్‌కి క‌థ చెప్పే స‌న్నివేశం క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. కిషోర్‌, బ్రహ్మీ మ‌ధ్య సాగే సీన్ హైలెట్‌. అలా సెకండాఫ్‌లో క‌థ లేదు.. అనే విష‌యాన్ని తెలీకుండా జాగ్రత్త ప‌డ్డారు. థియేట‌ర్ నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చేట‌ప్పుడు ప్రేక్షకుడు రిలాక్స్‌గా వ‌స్తాడు. అది చాలు… ఈ సినిమా ఆడేయడానికి.

ఢీ, దేనికైనా రెడీ విజ‌యాల‌తో విష్ణు ఓ విషయాన్ని గ‌మ‌రించాడు. త‌న‌కు యాక్షన్ ఎంట‌ర్‌టైన్ మెంట్ క‌థ‌లే న‌ప్పుతాయ‌ని. ఈసారీ అదే పంథాలో వెళ్లాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే.. త‌న సినిమాని సేఫ్ జోన్‌లో పెట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవ‌న్నీ తీసుకొన్నాడు. ఈ సినిమాలో తండ్రిని అనుక‌రించ‌డం కాస్త త‌గ్గింది. అదొక్కటే పెద్ద మార్పు. ఇక డాన్సులూ, ఫైటింగులూ, పెర్ ఫార్మెన్స్ అంటారా..? ఆ విష‌యంలో ఎప్పుడూ లోటు చేయ‌లేదు. కానీ ఈ సినిమాని మరింత క‌సిగా చేశాడ‌నే విషయం అర్థమ‌వుతోంది. ఇక లావ‌ణ్య త్రిపాఠీ ఈ సినిమాకి ప్రధాన మైన‌స్‌. జెనీలియా లాంటి క‌థానాయిక చేయాల్సిన పాత్ర అది. లావ‌ణ్య తేలిపోయింది. అంత చూడ‌బుల్ ఫేసూ కాదు. ప్రతినాయ‌కుడి పాత్రని భ‌యంక‌రంగా చూపించాల‌నుకొని.. అస‌లేమాత్రం గుర్తింపు లేని ఓ కొత్త ముఖాన్ని తీసుకొచ్చి పాడేసి పెద్ద త‌ప్పు చేశారు. ఇక మ‌ణి సంగీతం మామూలుగానే ఉంది. ఆర్‌.ఆ ర్ విష‌యంలో అనుభ‌వం కనిపించింది.

ఈ సినిమాలో ఇద్దరు సెమీ హీరోలున్నారు. బ్రహ్మీ, వెన్నెల కిషోర్‌. సెకండాఫ్‌లో వీరిద్దరినీ మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది. ఈ సినిమాలో వెన్నెల‌కి షోర్ మ‌రింత బిజీ అవుతాడు.. గ్యారెంటీ. ద‌ర్శకుడి కంటే ర‌చ‌యిత‌గానే ఎక్కువ మార్కులు తెచ్చుకొన్నాడు వీరు పోట్ల. సెకండాఫ్ డీల్ చేసిన విధానం బాగుంది. అక్కడ‌క్కడ ట్విస్టుల‌ను బాగా ప్లే చేశాడు. రెండో భార్యని ప‌ట్టుకొని.. ఫ‌స్ట్ డౌన్ అన‌డం బాగుంది. వ‌స్తువు మ‌న‌దైన‌ప్పుడు అరిగో క‌రిగో మ‌ళ్లీ మ‌న ద‌గ్గరికి వ‌స్తుంది… లాంటి డైలాగులు భ‌లే పేలాయి. ఇలా చెప్పుకోవ‌డం కంటే థియేట‌ర్లో చూడ‌డ‌మే బాగుంటుంది.

మొత్తానికి విష్ణు మ‌రోసారి వినోదాన్నిన‌మ్ముకొన్నాడు. ఆ న‌మ్మకం వ‌మ్ముకాదు. అయితే… ఫ‌స్టాఫ్ విష‌యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని, మైన‌స్‌ల‌ను క‌వ‌ర్ చేసుకొంటే.. ఈ సినిమా ఎక్కడో ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఎంట‌ర్ టైన్ మెంట్‌ని న‌మ్ముకొన్న సినిమా న‌ష్టపోయిన‌ట్టు చ‌రిత్రలోనే లేదు.

 

Doosukeltha Movie Review in English