Templates by BIGtheme NET
Home >> REVIEWS >> హిట్ రివ్యూ

హిట్ రివ్యూ


 

 

విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020

నటీనటులు :  విశ్వక్ సేన్, రుహని శర్మ, మురళి శర్మ, బ్రహ్మాజీ, తదితరులు…

దర్శకత్వం : డాక్టర్ శైలేష్ కొలను

నిర్మాత‌లు : ప్రశాంతి. టి

సంగీతం :  వివేక్ సాగర్

సినిమాటోగ్రఫర్ : ఎస్ మణి కందన్

ఎడిటర్ : గ్యారీ బి హెచ్

విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్. నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా రుహాని శర్మ నటిస్తుండగా మంచి అంచనాలున్నాయి. హిట్ మూవీ నేడు విడుదలైన నేపథ్యంలో ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

కథ:

సిన్సియర్ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ విక్రమ్ (విశ్వక్)తన లవర్ నేహా (రుహాని శర్మ ) మిస్సింగ్ కేసుతో లింక్ ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అప్పాయింట్ అవుతాడు. ఈ మిస్సింగ్ కేసులో డీప్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన విక్రమ్ కి కొన్ని దిగ్బ్రాంతికర విషయాలు కనుగొంటారు. అసలు ప్రీతి, నేహా ఏమైయ్యారు? వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రైమ్ వెనుక ఉన్న నిందితులను విక్రమ్ పట్టుకున్నాడా? అనేది తెరపైన చూడాలి.

ప్లస్ పాయింట్స్:

మంచి నటుడిగా పేరున్న విశ్వక్ సేన్ సీరియస్ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు. అగ్రెస్సివ్ పోలీస్ గా అతని డైలాగ్ డెలివరీ మేనరిజం చాలా సహజంగా అనిపిస్తాయి. ఎమోషనల్ మరియు సీరియస్ సన్నివేశాలలో ఆయన నటన బాగుంది.

కథ రీత్యా హీరోయిన్ రుహాని శర్మ పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ విశ్వక్ తో వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ లో మెప్పించింది.

హీరోకి ఇన్వెస్టిగేషన్ లో సహాయకుడు రోహిత్ రోల్ చేసిన నటుడు చైతన్య మరియు కానిస్టేబుల్ పాత్ర చేసిన మురళి శర్మ అలాగే బ్రహ్మజీ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.

సినిమా నిర్మాణ విలువలు, బీజీఎమ్ చాలా బాగున్నాయి. సినిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా అనిపిస్తుంది.

ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో కొన్ని మంచి థ్రిల్ పంచాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందలేదు.

మైనస్ పాయింట్స్:

సినిమా నిడివి ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్. క్రైం థ్రిల్లర్స్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తక్కువ నిడివి ఉన్నప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు అసలు కారకులు తెలియకుండా సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం విసిగిస్తాయి.

హీరో తన లవర్ కేసు చేధించడానికి ప్రీతీ అనే అమ్మాయి కేసు తీసుకుంటాడు. ఐతే హీరో తన లవర్ కోసం తాపత్రయం పడుతున్నాడు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించ లేకపోయారు. సైకలాజికల్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న హీరో వెనుక ఉన్న అసలు గతం అస్పష్టంగా ముగించారు.

ఇక క్లైమాక్స్ లో సెంటిమెంట్ యాంగిల్ తీసుకొచ్చి సినిమాకు ప్రాపర్ విలన్ ని లేకుండా చేశారు. అప్పటి వరకు ఆ విలన్ ఎవరా అని కసిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు క్లైమాక్స్ ట్విస్ట్ థ్రిల్ ఇవ్వలేకపోయాయి.
 సాంకేతిక విభాగం:

వివేక్ సాగర్ అందించిన పాటలు పర్వాలేదు.బీజీఎమ్ విషయం లో మాత్రం అతనికి మంచి మార్కులు పడ్డాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పై ఇంకా కొంచెం శ్రద్ద పెట్టాల్సింది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు చాలా రిపీట్ అవుతునట్లుగా అనిపించాయి. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఇక దర్శకుడు శైలేష్ కొలను చాలా క్రైమ్ థ్రిల్లర్స్ కి ముడిసరుకైన కిడ్నాప్, మర్డర్ నేపధ్యాన్ని తీసుకున్నారు. ఐతే ఆయనదానికి బలమైన స్క్రీన్ ప్లే రాసుకొని ఉండాల్సింది.ఐతే కథలో ట్విస్ట్స్ లేకున్నా అలరించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో నడిపించారు. ఐతే క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది అనిపించింది.
 తీర్పు :

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ మూవీ చాలా వరకు ఆకట్టుకుంటుంది. . విశ్వక్ సేన్ నటన, రఫ్ ఆటిట్యూడ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, విశ్వక్ పంచ్ డైలాగ్స్ అలరించే అంశాలు. ఐతే కథలో కొన్ని మలుపులు గట్టి స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకొంచెం మంచిగా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. క్రైమ్ థ్రిల్లర్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మరియు మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ కి ఈ చిత్రం నచ్చుతుంది.

‘హిట్’ : లైవ్ అప్డేట్స్:

  • ఇప్పుడు మరొక చిన్న ట్విస్ట్ ద్వారా సినిమా ముగింపు దశకు వచ్చింది.పూర్తి రివ్యూ కోసం  చూస్తూ ఉండండి.

  • నిందితుడుతో జరిపిన ఇంటరాగేషన్ అనంతరం విక్రమ్ కు ఒక క్లియర్ క్లారిఫికేషన్ కు వచ్చాడు.

  • హీరో తనకు దొరికిన క్లూ ద్వారా అనుమానితుడు వరకు వెళ్లగలిగాడు.ఇద్దరి మధ్య ఇప్పుడొక ఫైట్ సీన్ వస్తుంది.

  • ఇప్పుడు విక్రమ్ మరో క్లూ కనుక్కున్నాడు.మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • ఇప్పుడు కథనంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.మరింత వేగంగా సాగే ఇన్వెస్టిగేటివ్ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.

  • ప్రస్తుతం సీన్స్ లో విశ్వక్ ఆ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఓ క్లూ కనుక్కున్నాడు.ఇప్పుడు మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇంటర్వెల్ అనంతరం ఇప్పుడు విక్రమ్ గతానికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆసక్తికర కథనం మరియు మరింత ఆసక్తికర ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో నడించింది.దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత ఆకర్షణగా నిలవడం విశేషం.అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండాఫ్ పై మరింత ఆసక్తిని తీసుకొచ్చేలా ఉందని చెప్పాలి.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

  • కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కీలక సమయంలో విశ్వక్ ప్యానిక్ అటాక్ వల్ల అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు.ఇప్పుడు విరామం.

  • విశ్వక్ ఇప్పుడు ఒక అనుమానితుడిని తడుముతున్నాడు.చిన్న ఫైట్ సీన్ ఇప్పుడు వస్తుంది.

  • ఇప్పుడు హీరోయిన్ హరిప్రియ కథలోకి ఎంటర్ అయ్యింది.ప్రీతీ కేసుకు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • హీరోయిన్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలోనే విశ్వక్ దగ్గరకు మిస్సయిన మరో అమ్మాయి ప్రీతీ కేసు వచ్చింది.ఇప్పుడు విశ్వక్ ఆ కేసుపై ఫోకస్ పెట్టాడు.మరిన్ని గ్రిప్పింగ్ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.

  • ఆసక్తికర సన్నివేశాలతో కూడిన అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇప్పుడు నడుస్తుంది.

  • ఆ అమ్మాయి తప్పిపోయినట్టుగా ఆమె తలిదండ్రులు కేసు వేశారు దీనిని మురళీ శర్మ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మరోపక్క హీరోయిన్ కూడా మిస్సయ్యింది.ఈ కేసును విశ్వక్ టేకప్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నాడు.

  • ఇప్పుడు ట్రైలర్ లో చూపించిన అమ్మాయి కారు ఆగిపోయిన సీన్ వస్తుంది.మరిన్ని సస్పెన్స్ తో కూడిన సీన్స్ వస్తున్నాయి.

  • ఇప్పుడు సీనియర్ నటుడు బాల చందర్ విశ్వక్ హైయర్ అధికారిగా పరిచయం అయ్యారు.మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇప్పుడు ఒక భిన్నమైన క్రైమ్ సీన్ వస్తుంది.ఇక్కడే నటుడు బ్రహ్మాజీ మరియు హీరోయిన్ రుహాని శర్మలు పోలీసులుగా పరిచయం అయ్యారు.

  • ఇప్పుడు సినిమా రిలీజ్ కు ముందు విడుదల చేసిన స్నీక్ పీక్ సీన్ వస్తుంది.

  • విశ్వక్ ప్యానిక్ అటాక్ డిజార్డర్ తో బాధపడుతున్నాడు.చిన్న చికిత్స చేసే సన్నివేశం వస్తుంది.

  • ఒక ఇంట్రాగేషన్ టైప్ సన్నివేశంతో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.హీరో విశ్వక్ సేన్ దేని కోసమో చాలా ఆతృతగా వెతుకుతున్నాడు.

  • హాయ్..126 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

    విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020 నటీనటులు :  విశ్వక్ సేన్, రుహని శర్మ, మురళి శర్మ, బ్రహ్మాజీ, తదితరులు… దర్శకత్వం : డాక్టర్ శైలేష్ కొలను నిర్మాత‌లు : ప్రశాంతి. టి సంగీతం :  వివేక్ సాగర్ సినిమాటోగ్రఫర్ : ఎస్ మణి కందన్ ఎడిటర్ : గ్యారీ బి హెచ్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్. నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా రుహాని శర్మ నటిస్తుండగా మంచి అంచనాలున్నాయి. హిట్ మూవీ నేడు విడుదలైన నేపథ్యంలో ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.. కథ: సిన్సియర్ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ విక్రమ్ (విశ్వక్)తన లవర్ నేహా (రుహాని శర్మ ) మిస్సింగ్ కేసుతో లింక్ ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అప్పాయింట్ అవుతాడు. ఈ మిస్సింగ్ కేసులో డీప్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన విక్రమ్ కి కొన్ని దిగ్బ్రాంతికర విషయాలు కనుగొంటారు. అసలు ప్రీతి, నేహా ఏమైయ్యారు? వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రైమ్ వెనుక ఉన్న నిందితులను విక్రమ్ పట్టుకున్నాడా? అనేది తెరపైన చూడాలి. ప్లస్ పాయింట్స్: మంచి నటుడిగా పేరున్న విశ్వక్ సేన్ సీరియస్ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు. అగ్రెస్సివ్ పోలీస్ గా అతని డైలాగ్ డెలివరీ మేనరిజం చాలా సహజంగా అనిపిస్తాయి. ఎమోషనల్ మరియు సీరియస్ సన్నివేశాలలో ఆయన నటన బాగుంది. కథ రీత్యా హీరోయిన్ రుహాని శర్మ పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ విశ్వక్ తో వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ లో మెప్పించింది. హీరోకి ఇన్వెస్టిగేషన్ లో సహాయకుడు రోహిత్ రోల్ చేసిన నటుడు చైతన్య మరియు కానిస్టేబుల్ పాత్ర చేసిన మురళి శర్మ అలాగే బ్రహ్మజీ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. సినిమా నిర్మాణ విలువలు, బీజీఎమ్ చాలా బాగున్నాయి. సినిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో కొన్ని మంచి థ్రిల్ పంచాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందలేదు. మైనస్ పాయింట్స్: సినిమా నిడివి ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్. క్రైం థ్రిల్లర్స్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తక్కువ నిడివి ఉన్నప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు అసలు కారకులు తెలియకుండా సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం విసిగిస్తాయి. హీరో తన లవర్ కేసు చేధించడానికి ప్రీతీ అనే అమ్మాయి కేసు తీసుకుంటాడు. ఐతే హీరో తన లవర్ కోసం తాపత్రయం పడుతున్నాడు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించ లేకపోయారు. సైకలాజికల్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న హీరో వెనుక ఉన్న అసలు గతం అస్పష్టంగా ముగించారు. ఇక క్లైమాక్స్ లో సెంటిమెంట్ యాంగిల్ తీసుకొచ్చి సినిమాకు ప్రాపర్ విలన్ ని లేకుండా చేశారు. అప్పటి వరకు ఆ విలన్ ఎవరా అని కసిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు క్లైమాక్స్ ట్విస్ట్ థ్రిల్ ఇవ్వలేకపోయాయి.  సాంకేతిక విభాగం: వివేక్ సాగర్ అందించిన పాటలు పర్వాలేదు.బీజీఎమ్ విషయం లో మాత్రం అతనికి మంచి మార్కులు పడ్డాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పై ఇంకా కొంచెం శ్రద్ద పెట్టాల్సింది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు చాలా రిపీట్ అవుతునట్లుగా అనిపించాయి. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు శైలేష్ కొలను చాలా క్రైమ్ థ్రిల్లర్స్ కి ముడిసరుకైన కిడ్నాప్, మర్డర్ నేపధ్యాన్ని తీసుకున్నారు. ఐతే ఆయనదానికి బలమైన స్క్రీన్ ప్లే రాసుకొని ఉండాల్సింది.ఐతే కథలో ట్విస్ట్స్ లేకున్నా అలరించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో నడిపించారు. ఐతే క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది అనిపించింది.  తీర్పు : విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ మూవీ చాలా వరకు ఆకట్టుకుంటుంది. . విశ్వక్ సేన్ నటన, రఫ్ ఆటిట్యూడ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, విశ్వక్ పంచ్ డైలాగ్స్ అలరించే అంశాలు. ఐతే కథలో కొన్ని మలుపులు గట్టి స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకొంచెం మంచిగా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. క్రైమ్ థ్రిల్లర్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మరియు మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ కి ఈ చిత్రం నచ్చుతుంది. 'హిట్' : లైవ్ అప్డేట్స్: ఇప్పుడు మరొక చిన్న ట్విస్ట్ ద్వారా సినిమా ముగింపు దశకు వచ్చింది.పూర్తి రివ్యూ కోసం  చూస్తూ ఉండండి. Date & Time : 06:50 AM February 28, 2020 నిందితుడుతో జరిపిన ఇంటరాగేషన్ అనంతరం విక్రమ్ కు ఒక క్లియర్ క్లారిఫికేషన్ కు వచ్చాడు. Date & Time : 06:45 AM February 28, 2020 హీరో తనకు దొరికిన క్లూ ద్వారా అనుమానితుడు వరకు వెళ్లగలిగాడు.ఇద్దరి మధ్య ఇప్పుడొక ఫైట్ సీన్ వస్తుంది. Date & Time : 06:30 AM February…

హిట్ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.25
సాంకేతిక వర్గం పనితీరు - 2.75
దర్శకత్వ ప్రతిభ - 2.75

2.9

హిట్ రివ్యూ

హిట్ రివ్యూ

User Rating: Be the first one !
3