నటీనటులు : శ్రీ సింహ, సత్య, వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం : రితేష్ రాణా
నిర్మాతలు : చిరంజీవి(చెర్రీ), హేమలత
సంగీతం : కాల భైరవ
సినిమాటోగ్రఫర్ : సురేష్ సారంగం
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
బాబు మోహన్ (శ్రీ సింహా) ఒక డెలివరీ బాయ్. చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నా తప్పు చేయటానికి మాత్రం ఇష్టపడడు. తన ఫ్రెండ్స్ తో ఒక రూమ్ లో కలిసి ఉంటాడు. అయితే ఫ్రెండ్ ఏసు (సత్య) ప్రభావంతో డెలివరీ ఇస్తూ తెలివిగా కస్టమర్స్ ను మోసి చేసి డబ్బు సంపాధించాలని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో ఒక ఫ్లాట్‌కు వెళ్తాడు. కానీ అక్కడ అనుకోకుండా జరిగే కొన్ని నాటకీయ సంఘటనల కారణంగా బాబు ఓ మర్డర్ కేసులో ఇరుకుంటాడు. ఆ కేసు నుండి తప్పించుకోవడానికి ఏం చేశాడు? ఇంతకీ బాబు క్రైమ్ లో ఎలా చిక్కుకుంటాడు.. ? అతను తిరిగి ఆ కేసు నుండి ఎలా బయట పడటానికి ఏం చేశాడు ? ఈ మధ్యలో బాబు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
క్రైౖమ్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ సినిమా సప్సెన్స్ తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సరదాగా సాగుతుంది. సినిమాలో సత్య కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకెండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో బాబు పాత్ర పై ఓ హత్య కేసు పడటం, ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన ప్రధాన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్ లో రివీల్ అయ్యే సస్పెన్స్ ఎలిమెంట్స్.. సెకెండ్ హాఫ్ లో వచ్చే విచారణ సన్నివేశాలు కామెడీ సీన్స్ వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఇక హీరో శ్రీసింహా చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే మంచి స్వభావం ఉన్న ఒక డెలివరీ బాయ్ గా చాల బాగా నటించాడు. మర్డర్ కేసులో ఇరుకునే సన్నివేశాల్లో కూడా చాల సెటిల్డ్ గా నటించాడు. కమెడియన్ సత్య తన కామెడీతో ఈ సినిమాకి ప్రాణం పోసాడు. తన కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తం తన భుజాల పై మోసాడు. అతని డైలాగ్ డిక్షన్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. విలన్ గా నటించిన నటుడు, వెన్నెల కిషోర్, అజేయ్ ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సినిమాలో పాటలు, హీరోయిన్, రొమాన్స్ లేకపోయినా దర్శకుడు రితేష్ ఇటు హాస్యాన్ని అటు సీరియస్ నెస్ ని మిక్స్ చేసి సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు. మెయిన్ గా కామెడీని డీల్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంది. మొదటి మూవీ అయినా కూడా దర్శకుడు రితేష్ మంచి దర్శకత్వ పనితనం కనబర్చాడు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో కామెడీ మరియు సప్సెన్స్.. అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథనం పూర్తి ఆసక్తి కరంగా సాగకపోవం, సినిమా మొదటి పది నిముషాలు బోర్ గా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫన్ సెకెండ్ హాఫ్ లో మిస్ అవ్వడం అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో కొన్ని చోట్ల సహజత్వం లోపించింది. అనిపిస్తోంది. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడుచాలా సినిమాటిక్ గా చెప్పాడు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కెమెరామెన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కామెడీ అండ్ కీలక సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు రితీష్ మంచి కథాంశంతో పాటు మంచి కామెడీని మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలను బాగా రాసుకున్నాడు. అలాగే బాగా తెరకెక్కించాడు. అయితే సెకెండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆయన కాస్త తడబడ్డాడు.
తీర్పు :
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కామెడీగా సాగుతూ కొన్ని చోట్ల సప్సెన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దర్శకుడు రితేష్ రాసుకున్న ట్రీట్మెంట్ అండ్ సత్య కామెడీ టైమింగ్ సినిమాలో బాగా అలరిస్తాయి. కానీ సెకెండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఆసక్తికరంగా సాగకపోవడం, కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలుస్తాయి.అయితే ఈ సినిమా ఓవరాల్ గా మల్టీప్లెక్స్ ప్రేక్షుకులతో పాటు కామెడీ మూవీస్ ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
మత్తు వదలరా రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 3.25
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 3
3.2
మత్తు వదలరా రివ్యూ
మత్తు వదలరా రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
