చిత్రం : మీకుమాత్రమే చెప్తా
నటీనటులు : తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమాతం, వాణి భోజన్, అవంతిక మిశ్రా
దర్శకత్వం : షమీర్ సుల్తాన్
నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ
సంగీతం : శివకుమార్
సినిమాటోగ్రఫర్ : మాథన్ గుణదేవ
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
విడుదల తేదీ : నవంబర్ 1, 2019
టాలెంట్ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ మీకు మాత్రమే చెప్తా. క్రేజీ కాంబో కావడంతో పాటు, మూవీ ట్రైలర్, టీజర్ మూవీపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరి మీకు మాత్రమే చెప్తా ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకుందో సమీక్షలో చూద్దాం.
కథ:
రాకేష్ (తరుణ్ భాస్కర్)ఒక టీవీ ఛానెల్ లో యాంకర్ గా పని చేస్తుంటాడు. డాక్టర్ అయిన స్టెఫీ(వాణి భోజన్) ప్రేమలో పడిన రాకేష్ ఆమెకు సిగరెట్, మందు తాగడం వంటి విషయాలలో కొన్ని అబద్దాలు చెవుతాడు. ఇంకా రెండు రోజులలో స్టెఫీ తో పెళ్లనగా రాకేష్ ఒక అమ్మాయితో గదిలో ఉన్న వీడియో బయటకి వస్తుంది. దీనితో రాకేష్ తన మిత్రుడు అభినవ్ గోమటమ్ సహాయతో ఆ వీడియో ని సైట్ నుండి డిలీట్ చేసేలా ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరి ఆ వీడియో స్టెఫీ కీ కనిపించకుండా చేయగలిగారా? ఆ వీడియో గురించిన నిజం స్టెఫీ తెలుసుకుందా? అసలు ఆ వీడియోలో రాకేష్ ఎందుకు ఉన్నాడు? రాకేష్, స్టెఫీ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
మొదటి చిత్రం పెళ్లి చూపులు తో జాతీయ అవార్డు గెలుచుకొని టాలెంట్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరో గా మొదటి చిత్రం తో మెప్పించాడు. తన గర్ల్ ఫ్రెండ్ కి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని ప్రతి క్షణం భయపడే ఫ్రస్ట్రేటెడ్ గయ్ గా ఆయన నటన సహజత్వానికి దగ్గరగా ఉంది.
ఇక తరుణ్ ఫ్రెండ్ పాత్ర చేసిన అభినవ్ హీరో తో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. మిత్రుడి టెన్షన్ ని పంచు కుంటూ, అక్కడడక్కడా ఫున్నింగ్ పంచెస్ తో తన రోల్ కు ఆయన పూర్తి న్యాయం చేశారు.
అబద్దాలు నచ్చని…, రాకేష్ చర్యలను అనుమానించే అమ్మాయి పాత్రలో వాణి భోజన్ చక్కగా సరిపోయింది. అనసూయ, అవంతిక మిశ్రా, పావని గంగిరెడ్డి తక్కువ నిడివి గల పాత్రలో పరవాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్:
యూత్ కు కనెక్ట్ అయ్యే ఓ కాంటెంపరరీ కాన్సెప్ట్ ని ఎంచుకున్న దర్శకుడు, ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో తడబడ్డాడు.ఒక చిన్న పాయింట్ ని కథావస్తువుగా తీసుకున్న ఆయన రిపీటెడ్ సన్నివేశాలతో నిరాశ కలిగించారు.
ఇలాంటి ట్రిక్కీ ప్లే తెరపై పేలాలంటే ఆద్యంతం అలరించే పంచ్ లతో సాగాలి. కాని అక్కడక్కడ తప్ప తరుణ్ భాస్కర్, అభినవ్ పంచులు ప్రేక్షకులకు నవ్వు తెప్పించలేకపోయాయి.
సహజత్వానికి దగ్గరగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఈ మూవీ క్లాస్ సి మరియు బి ప్రేక్షకులకు అంతగా చేరకపోవచ్చు. నిర్మాణ విలువలు కూడా ఏమంత రిచ్ గా ఉండవు. దేవరకొండ లాంటి నిర్మాత ఉన్నప్పుడు ఇలాంటి తక్కువ క్వాలిటీ ఉన్న సినిమాను ఉహించము.
అనసూయ లాంటి యాక్టర్ ని ప్రాధాన్యం లేని రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేశారు.ఇక ఈ మూవీ లో చేసిన ఒక్క యాక్టర్ కూడా తెలిసినవారు కాకపోవడం మరో మైనస్ గా చెప్పవచ్చు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు మొబైల్ వలన వ్యక్తి ప్రైవసీ కి ఏవిధంగా భంగం కలుగుతుంది అనే విషయాన్నీ ఒక జంట ప్రేమ, పెళ్లికి ముడిపెట్టి ఫన్నీ గా నడపాలని భావించారు.ఐతే ఆ క్రమంలో ఆయన రాసుకున్న సన్నివేశాలు, స్క్రీన్ ప్లే రొటీన్ గా అనాసక్తిగా సాగింది. ఒక చిన్న పాయింట్ చుట్టూ రెండు గంటల కథ నడిపే క్రమంలో ఆయన ఎంచుకున్న విధానం, రాసుకున్న పంచ్ లు పేలి ఉంటే ఇంకా మూవీ మరో లెవెల్ లో ఉండేది.
కథలో భాగంగా శివ స్వరపరిచిన రెండు పాటలు పర్వాలేదు, బీజీఎమ్ అంత ఆసక్తిగా ఏమిలేదు.
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదని పించాయి.
తీర్పు:
ఈ సినిమా సింపుల్ స్టోరీతో సందర్భోచితంగా సాగే పక్కా కామెడీ ఎంటర్ టైనర్. సినిమాలో తరుణ్, అభినవ్ మధ్య నడిచే సీన్స్ అలాగే వీడియోకి సంబంధించిన కొన్ని ఎపిసోడ్లు బాగా నవ్విస్తాయి. అయితే కథనం ఆకట్టుకోలేకపోవడం మరియు కథ సింపుల్ గా ఉండటం, కొని సన్నివేశాలు ఇంట్రస్ట్ గా సాగకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఒకసారి సరదగా చూడొచ్చు.
‘మీకుమాత్రమే చెప్తా’ : లైవ్ అప్డేట్స్:
‘Meeku Mathrame Chepta ‘ Live updates in English
- 
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.Date & Time : 06:22 AM November 1, 2019
- 
మూవీ క్లైమాక్స్ సన్నివేశాలు నడుస్తున్నాయిDate & Time : 06:20 AM November 1, 2019
- 
కథలో అనసూయ పాత్రకు సంబంధించి షాకింగ్ విషయం తెలిసిందిDate & Time : 06:18 AM November 1, 2019
- 
ఇక్కడ స్టోరీలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిందిDate & Time : 06:15 AM November 1, 2019
- 
దాంతో ఒక్కసారిగా సీరియస్ అయిన హీరోయిన్ ఆ పెళ్లి నుండి నిష్క్రమించిందిDate & Time : 06:14 AM November 1, 2019
- 
కానీ, తరుణ్ ఫోన్ లో.. హీరోయిన్ తరుణ్ కి సంబంధించిన ఆ వీడియోని చూసింది.Date & Time : 06:12 AM November 1, 2019
- 
మరో పక్క పెళ్లిలో కామెడీ సన్నివేశాలు వస్తూ ఉన్నాయిDate & Time : 06:10 AM November 1, 2019
- 
ఎలాగోలా వారు డబ్బును హ్యాకర్ కు ఇచ్చారు. దాంతో వీడియో లింక్‌ను తొలగించారుDate & Time : 06:08 AM November 1, 2019
- 
అనసూయ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తోందిDate & Time : 06:05 AM November 1, 2019
- 
వీడియో డిలేట్ చేయటానికి అడిగిన 20 లక్షలను తరుణ్ బ్యాచ్ హ్యాకర్ ఫ్రెండ్ కి ఇచ్చి పంపారు, కానీ తరుణ్ బ్యాచ్ చేత కిడ్నాప్ చేయబడ్డ హీరోయిన్ కజిన్ తప్పించుకొని పెళ్లిని ఆపడానికి వస్తూ ఉంది.Date & Time : 06:02 AM November 1, 2019
- 
ఇప్పుడు తరుణ్ పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు జరుగుతున్నాయిDate & Time : 05:58 AM November 1, 2019
- 
హీరో, అభినవ్ మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయిDate & Time : 05:54 AM November 1, 2019
- 
అంతలో వీడియో డిలేట్ చేయాలంటే 20 లక్షలు ఇవ్వాలని తరుణ్ కి కాల్ వచ్చింది. దానికి అంగీకరించిన తరుణ్ బ్యాచ్ డబ్బు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారుDate & Time : 05:50 AM November 1, 2019
- 
తరుణ్ స్నేహితుల మధ్య కామెడీ సన్నివేశాలు సాగుతూనే ఉన్నాయిDate & Time : 05:45 AM November 1, 2019
- 
ఆ క్రమంలో అసలు ఆ వీడియోను ఎవరు అప్‌లోడ్ చేశారో తరుణ్ బ్యాచ్ కి తెలిసింది.తరుణ్ హ్యాకర్స్ ఫ్రెండ్ ని బెదిరించి ఆ వీడియోను తొలగించడానికి ట్రై చేస్తున్నారుDate & Time : 05:42 AM November 1, 2019
- 
అంతలో వీడియో రికార్డ్ చేసిన వ్యక్తిని కలవడానికి హీరో బ్యాచ్ సిద్ధం అయ్యారు
 అవంతిక ఎంట్రీ ఇచ్చింది
 అవంతిక తన అంకుల్ తో కలిసి వీడియో గురించి హీరోని కలవడానికి వచ్చిందిDate & Time : 05:39 AM November 1, 2019
- 
సినిమా ప్రెసెంట్ అండ్ ప్లాష్ బ్యాక్ మధ్య సాగుతూ ఉందిDate & Time : 05:37 AM November 1, 2019
- 
హీరోయిన్, హీరో ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం లొకేషన్ అడిగితే.. తరుణ్ ఎస్కెప్ అవ్వడం కోసం అబద్దం చెప్పాడు, దాంతో ఆమె అతన్ని వీడియో కాల్ చేయమంది ఇద్దరి మధ్య సీన్ ఇంట్రస్టింగ్ గా సాగుతుందిDate & Time : 05:35 AM November 1, 2019
- 
సెకెండ్ హాఫ్ ఇప్పుడే మొదలైందిDate & Time : 05:30 AM November 1, 2019
- 
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ‘మీకు మాత్రమే చెప్తా’ !
 ఈ సినిమా అర్ధ భాగం ముగిసేసరికి అందరి అంచనాలకు తగ్గట్టుగానే మంచి ఫన్ తో సాగుతుంది. మధ్యలో కథనం కాస్త నెమ్మదించినా కామెడీ బాగుండటంతో చాల వరకూ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ కి సంబంధించిన వీడియో బయట పడ్డ దగ్గరనుంచీ స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. పైగా సినిమాలో నటీనటులు అద్భుతమైన టైమింగ్ తో మంచి ఫన్ జనరేట్ చేశారు. అయితే కొన్ని సీన్స్ ఆశించిన స్థాయిలో లేవు. స్లోగా సాగుతూ అక్కడక్కడా బోర్ కొడతాయి. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకు బాగానే ఆసక్తి కలిగించినా ఓవరాల్ గా ఏవరేజ్ గా అనిపిస్తోంది.Date & Time : 05:25 AM November 1, 2019
- 
ఆ డిస్కషన్ అనంతరం ఇంటర్వెల్ పడిందిDate & Time : 05:23 AM November 1, 2019
- 
అనసూయ ఆ వీడియో గురించి తెలుసుకుంది. అసలు ఆ వీడియో గురించి హీరోయిన్ కి చెప్పటం గురించి వారంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ డిస్కషన్ అంతా కామెడీగా సాగుతుందిDate & Time : 05:20 AM November 1, 2019
- 
చివరికి హీరోయిన్ కజిన్ ఆ వీడియో గురించి తెలుసుకున్నాడు. దాంతో సీన్స్ అన్ని కామెడీగా సాగుతున్నాయిDate & Time : 05:14 AM November 1, 2019
- 
అంతలో అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఆమె తరుణ్ ఫ్రెండ్ సిస్టర్
 అనసూయకి వారికీ మధ్య కామెడీ సీన్స్ వస్తూ ఉన్నాయిDate & Time : 05:12 AM November 1, 2019
- 
తరుణ్ అండ్ ఫ్రెండ్స్ ఆ వీడియోను హ్యాక్ చేసి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారుDate & Time : 05:11 AM November 1, 2019
- 
ఆ వీడియోను హీరోయిన్ కు పంపకుండా తరుణ్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సడెన్ గా మూడో ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చాడు. ముగ్గురు మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి.Date & Time : 05:06 AM November 1, 2019
- 
దాంతో హీరో అండ్ అభినవ్, హీరోయిన్ కజిన్ ను కిడ్నాప్ చేశారుDate & Time : 05:03 AM November 1, 2019
- 
ఆ గొడవల దెబ్బకి హీరోయిన్ కజిన్ వీరి వివాహాన్ని ఆపడానికి ప్రయత్నిస్తోందిDate & Time : 05:01 AM November 1, 2019
- 
ఈ ఫ్యామిలీ సీన్స్ అన్ని కామెడీగా సాగుతున్నాయిDate & Time : 04:58 AM November 1, 2019
- 
మర్యాదల విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయిDate & Time : 04:57 AM November 1, 2019
- 
అంతలో హీరో కుటుంబాన్ని సందర్శించడానికి హీరోయిన్ తన కుటుంబంతో వచ్చిందిDate & Time : 04:55 AM November 1, 2019
- 
ఇంతకీ ఆ వీడియోను ఎవరు అప్‌లోడ్ చేశారో తెలుసుకోవడానికి తరుణ్ అండ్ అభినవ్ ప్రయత్నిస్తున్నారుDate & Time : 04:51 AM November 1, 2019
- 
ఆ వీడియో గురించి అభినవ్ కి తరుణ్ వివరిస్తున్నాడుDate & Time : 04:47 AM November 1, 2019
- 
హీరోకి అభినవ్ మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయిDate & Time : 04:44 AM November 1, 2019
- 
అభినవ్ తన స్నేహితులకు చిన్న ప్లాష్ బ్యాక్ వివరించాడుDate & Time : 04:42 AM November 1, 2019
- 
సడెన్ గా తరుణ్ ఫోన్ కి ఒక వీడియో వచ్చిందిDate & Time : 04:40 AM November 1, 2019
- 
ఆ పెళ్లి సీన్ లోనే అభినవ్, హీరో మరియు హీరోయిన్ కజిన్ మధ్య కామెడీ ప్లే అవుతూ ఉందిDate & Time : 04:38 AM November 1, 2019
- 
ఆ సీన్స్ లోనే హీరో హీరోయిన్ల పెళ్లి సంబంధిత సీన్ వస్తూ ఉందిDate & Time : 04:36 AM November 1, 2019
- 
ప్లాష్ బ్యాలో హీరో హీరోయిన్స్ కాంబినేషన్ లో కామెడీ సీన్స్ మొదలయ్యాయిDate & Time : 04:34 AM November 1, 2019
- 
ప్లాష్ బ్యాక్ లో తరుణ్ భాస్కర్ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందిDate & Time : 04:32 AM November 1, 2019
- 
ఇప్పుడే ప్లాష్ బ్యాక్ మొదలైందిDate & Time : 04:30 AM November 1, 2019
- 
కామెడీ సీన్స్ లోకి అభినవ్ అండ్ అతని ఫ్రెండ్స్ ఎంట్రీ ఇచ్చారుDate & Time : 04:28 AM November 1, 2019
- 
కామెడీ సీన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయిDate & Time : 04:26 AM November 1, 2019
- 
టీవీలో వర్క్ చేస్తూ తరుణ్ భాస్కర్ ఎంట్రీ ఇచ్చారుDate & Time : 04:24 AM November 1, 2019
- 
కొన్ని కామెడీ సంబంధిత సీన్స్ వస్తున్నాయి.Date & Time : 04:22 AM November 1, 2019
- 
ఒక ఛేజ్ సీన్ తో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.Date & Time : 04:20 AM November 1, 2019
- 
హాయ్..120 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.Date & Time : 04:15 AM November 1, 2019
మీకుమాత్రమే చెప్తా రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 2.5
నటీ-నటుల ప్రతిభ - 3
సాంకేతిక వర్గం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 3
2.9
మీకుమాత్రమే చెప్తా రివ్యూ
మీకుమాత్రమే చెప్తా రివ్యూ
 TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
				




 
											 
							