మిడిల్ క్లాస్ మెలొడీస్ రివ్యూ

0

చిత్రం : మిడిల్ క్లాస్ మెలొడీస్
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ త‌దిత‌రులు
దర్శకత్వం : వినోద్‌ అనంతోజు
సంగీతం : స్వీకర్ అగస్తి
స్క్రీన్ ప్లే : వినోద్‌ అనంతోజు
నిర్మాత : వెనిగళ్ల ఆనంద ప్రసాద్
విడుదల తేదీ : నవంబర్ 20th,2020

లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు హోం థియేటర్లుగా మారిపోయాయి. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు మన హీరోలు. ఈ ఖాతాలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా చేరారు. ఆయన హీరోగా నటించిన రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 20న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ
టైటిల్‌కు తగ్గట్టే ఇదో మిడిల్ క్లాస్ కుటుంబాల కథ. అందరికీ కనెక్ట్ అయ్యే కథ. గుంటూరు దగ్గరలోని ఓ పల్లెటూరులో కాకా హోటల్ నడుపుకునే కొండలరావు (గోపరాజు రమణ) కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ) బొంబాయి చట్నీ బాగా చేస్తాడు. అయితే, గుంటూరులో హోటల్ పెట్టి అక్కడి ప్రజలకు తన బొంబాయి చట్నీ రుచి చూపించి ఫేమస్ అయిపోయావాలని రాఘవ కలలు కంటూ ఉంటాడు. కానీ, గుంటూరులో హోటల్ పెట్టడం రాఘవ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. మరోవైపు వరసకు మావయ్య అయ్యే నాగేశ్వరరావు కూతురు సంధ్య (వర్ష బొల్లమ్మ)ను రాఘవ ప్రేమిస్తాడు. కానీ, సంధ్యకు వాళ్ల నాన్న వేరే సంబంధాలు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాఘవ హోటల్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాడు?, సంధ్యను పెళ్లి చేసుకున్నాడా?, ఈ క్రమంలో రాఘవ ప్రయాణం ఎలా సాగింది? అనే విషయాలు సినిమాలో చూడాలి.

విశ్లేషణ
ఇది ప్రతి మిడిల్ క్లాస్ వాడి కథ. ఒక మధ్య తరగతి కుటుంబంలో రోజూ జరిగే తతంగమే ఈ సినిమా. బహుశా దర్శకుడు వినోద్ కూడా మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చి ఉంటారు. అందుకే, సినిమాలో తన మార్క్ చూపించారు. సినిమా కథ కొత్తదేమీ కాదు. అందరికీ తెలిసిన కథే. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ, అలాంటి కథను మంచి కథనంతో సరదాగా సాగిపోయే సన్నివేశాలతో ఆహ్లాదకరమైన సినిమాగా మలిచారు దర్శకుడు. ముఖ్యంగా సినిమాలో పాత్రల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. ప్రతి పాత్ర మన చుట్టూ ఉండే వాళ్లలానే అనిపిస్తుంది.

గుంటూరు నేపథ్యంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆ యాసను, అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించారు. ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర అద్భుతం. నిజం చెప్పాలంటే సినిమాకు హీరో ఆ పాత్రే. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, పలు సీరియల్స్‌లో నటించిన సీనియర్ ఆర్టిస్ట్ గోపరాజు రమణ.. కొండలరావు పాత్రలో జీవించేశారు. ఆయన కోపంలోనే హాస్యాన్ని పండించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు కొండలరావు పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుంది అంటే అతిశయోక్తికాదు.

నిజానికి ఈ సినిమాలో మలుపులు, ట్విస్టులు లాంటివి ఏమీ లేవు. కథ అలా సాఫీగా సాగిపోతుంది అంతే. కానీ, చాలా సరదాగా వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ఎక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. కుటుంబంతో కలిసి హాయిగా చూడదగిన సినిమా. కాకపోతే, క్లైమాక్స్ కాస్త నిరుత్సాహపరుస్తుంది. సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. దర్శకుడు క్లైమాక్స్‌పై కాస్త దృష్టి పెట్టి ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది.

రాఘవ పాత్రలో ఆనంద్ దేవరకొండ కరెక్ట్‌గా సరిపోయారు. కాకపోతే, ఆయన మాటల్లో గుంటూరు యాస కన్నా హైదరాబాద్ యాసనే ఎక్కువగా వినిపించింది. రాఘవ స్నేహితుడు గోపాల్ పాత్రలో చైతన్య గరికపాటి బాగా నటించాడు. అచ్చం గుంటూరు కుర్రాడిలా అనిపించాడు. హీరోయిన్ వర్ష తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులంతా ఎవరి పాత్రకు వారు పూర్తి న్యాయం చేశారు. ఎందుకంటే సినిమాలో ప్రతి పాత్రకు ఆ స్కోప్ ఉంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమా ఆఖరిలో కనిపించి హాస్యాన్ని పండించారు.

ఈ సినిమాకు మరో ప్రధాన బలం మాటలు. జనార్ధన్ పసుమర్తి మాటలు అద్భుతంగా రాశారు. మధ్యతరగతి కుటుంబాల్లో, అందులోనూ పల్లెటూళ్లలో ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో అలాంటి మాటలతోనే జనార్ధన్ సన్నివేశాలకు అందాన్ని తీసుకొచ్చారు. ఈ మాటలతోనే ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అయిపోతుంది. ముఖ్యంగా గుంటూరోళ్లకి. ఇక స్వీకర్ అగస్తి అందించిన పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా గుంటూరు టైటిల్ సాంగ్ అదుర్స్.

అలాగే, సన్నీ కూరపాటి కెమెరాతనం గురించి కూడా కచ్చితంగా మాట్లాడుకోవాలి. గుంటూరు పరిసరాలను చాలా అందంగా చూపించారు. సినిమాను రెండుంపావు గంటల్లో క్రిస్పీగా ఎడిట్ చేసి ఎడిటర్ రవితేజ గిరిజాల తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్‌లో చాలా మంచి సినిమాను నిర్మించారు.

చిత్రం : మిడిల్ క్లాస్ మెలొడీస్ నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ త‌దిత‌రులు దర్శకత్వం : వినోద్‌ అనంతోజు సంగీతం : స్వీకర్ అగస్తి స్క్రీన్ ప్లే : వినోద్‌ అనంతోజు నిర్మాత : వెనిగళ్ల ఆనంద ప్రసాద్ విడుదల తేదీ : నవంబర్ 20th,2020 లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు హోం థియేటర్లుగా మారిపోయాయి. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు మన హీరోలు. ఈ ఖాతాలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా చేరారు. ఆయన హీరోగా నటించిన రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 20న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ టైటిల్‌కు తగ్గట్టే ఇదో మిడిల్ క్లాస్ కుటుంబాల కథ. అందరికీ కనెక్ట్ అయ్యే కథ. గుంటూరు దగ్గరలోని ఓ పల్లెటూరులో కాకా హోటల్ నడుపుకునే కొండలరావు (గోపరాజు రమణ) కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ) బొంబాయి చట్నీ బాగా చేస్తాడు. అయితే, గుంటూరులో హోటల్ పెట్టి అక్కడి ప్రజలకు తన బొంబాయి చట్నీ రుచి చూపించి ఫేమస్ అయిపోయావాలని రాఘవ కలలు కంటూ ఉంటాడు. కానీ, గుంటూరులో హోటల్ పెట్టడం రాఘవ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. మరోవైపు వరసకు మావయ్య అయ్యే నాగేశ్వరరావు కూతురు సంధ్య (వర్ష బొల్లమ్మ)ను రాఘవ ప్రేమిస్తాడు. కానీ, సంధ్యకు వాళ్ల నాన్న వేరే సంబంధాలు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాఘవ హోటల్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాడు?, సంధ్యను పెళ్లి చేసుకున్నాడా?, ఈ క్రమంలో రాఘవ ప్రయాణం ఎలా సాగింది? అనే విషయాలు సినిమాలో చూడాలి. విశ్లేషణ ఇది ప్రతి మిడిల్ క్లాస్ వాడి కథ. ఒక మధ్య తరగతి కుటుంబంలో రోజూ జరిగే తతంగమే ఈ సినిమా. బహుశా దర్శకుడు వినోద్ కూడా మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చి ఉంటారు. అందుకే, సినిమాలో తన మార్క్ చూపించారు. సినిమా కథ కొత్తదేమీ కాదు. అందరికీ తెలిసిన కథే. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ, అలాంటి కథను మంచి కథనంతో సరదాగా సాగిపోయే సన్నివేశాలతో ఆహ్లాదకరమైన సినిమాగా మలిచారు దర్శకుడు. ముఖ్యంగా సినిమాలో పాత్రల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. ప్రతి పాత్ర మన చుట్టూ ఉండే వాళ్లలానే అనిపిస్తుంది. గుంటూరు నేపథ్యంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆ యాసను, అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించారు. ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర అద్భుతం. నిజం చెప్పాలంటే సినిమాకు హీరో ఆ పాత్రే. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, పలు సీరియల్స్‌లో నటించిన సీనియర్ ఆర్టిస్ట్ గోపరాజు రమణ.. కొండలరావు పాత్రలో జీవించేశారు. ఆయన కోపంలోనే హాస్యాన్ని పండించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు కొండలరావు పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుంది అంటే అతిశయోక్తికాదు. నిజానికి ఈ సినిమాలో మలుపులు, ట్విస్టులు లాంటివి ఏమీ లేవు. కథ అలా సాఫీగా సాగిపోతుంది అంతే. కానీ, చాలా సరదాగా వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ఎక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. కుటుంబంతో కలిసి హాయిగా చూడదగిన సినిమా. కాకపోతే, క్లైమాక్స్ కాస్త నిరుత్సాహపరుస్తుంది. సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. దర్శకుడు క్లైమాక్స్‌పై కాస్త దృష్టి పెట్టి ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. రాఘవ పాత్రలో ఆనంద్ దేవరకొండ కరెక్ట్‌గా సరిపోయారు. కాకపోతే, ఆయన మాటల్లో గుంటూరు యాస కన్నా హైదరాబాద్ యాసనే ఎక్కువగా వినిపించింది. రాఘవ స్నేహితుడు గోపాల్ పాత్రలో చైతన్య గరికపాటి బాగా నటించాడు. అచ్చం గుంటూరు కుర్రాడిలా అనిపించాడు. హీరోయిన్ వర్ష తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులంతా ఎవరి పాత్రకు వారు పూర్తి న్యాయం చేశారు. ఎందుకంటే సినిమాలో ప్రతి పాత్రకు ఆ స్కోప్ ఉంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమా ఆఖరిలో కనిపించి హాస్యాన్ని పండించారు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం మాటలు. జనార్ధన్ పసుమర్తి మాటలు అద్భుతంగా రాశారు. మధ్యతరగతి కుటుంబాల్లో, అందులోనూ పల్లెటూళ్లలో ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో అలాంటి మాటలతోనే జనార్ధన్ సన్నివేశాలకు అందాన్ని తీసుకొచ్చారు. ఈ మాటలతోనే ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అయిపోతుంది. ముఖ్యంగా గుంటూరోళ్లకి. ఇక స్వీకర్ అగస్తి అందించిన పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా గుంటూరు టైటిల్ సాంగ్ అదుర్స్. అలాగే, సన్నీ కూరపాటి కెమెరాతనం గురించి కూడా కచ్చితంగా మాట్లాడుకోవాలి. గుంటూరు పరిసరాలను చాలా అందంగా చూపించారు. సినిమాను రెండుంపావు గంటల్లో క్రిస్పీగా ఎడిట్ చేసి ఎడిటర్ రవితేజ గిరిజాల తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్‌లో చాలా మంచి సినిమాను నిర్మించారు.

మిడిల్ క్లాస్ మెలొడీస్ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.25
సాంకేతిక వర్గం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 3

3

మిడిల్ క్లాస్ మెలొడీస్ రివ్యూ

మిడిల్ క్లాస్ మెలొడీస్ రివ్యూ

User Rating: Be the first one !
3