Templates by BIGtheme NET
Home >> REVIEWS >> నోటా రివ్యూ

నోటా రివ్యూ


నటీనటులు : విజయ్ దేవరకొండ, మెహ్రీన్, సంచనా నటరాజన్ సత్యరాజ్, నాజర్, ప్రియదర్శి తదిత‌రులు

దర్శకత్వం : ఆనంద్ శంకర్

నిర్మాతలు : జ్ఞానవేల్‌ రాజా

సంగీతం : సి యస్ సామ్

సినిమాటోగ్రఫర్ : యస్ కృష్ణ రవిచంద్రన్

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
 

కథ :

వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవన్ (నాజర్) పెద్ద కుమారుడు. వాసుదేవన్ తన పై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసులో భాగంగా.. తన సీఎం పదవికి రాజీనామా చేసి.. రాత్రికి రాత్రికే అస్సలు రాజకీయాల గురించి, కనీస అవగాహన కూడా లేని వరుణ్ ని సీఎం ని చేస్తాడు. వరుణ్ తన తండ్రి ఆదేశాల ప్రకారం డమ్మి ముఖ్యమంత్రిగా మేనేజ్ చేస్తుంటాడు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య, వరుణ్ కొన్ని సమస్యలను ఎదురుక్కోవాల్సి వస్తోంది. దాంతో వరుణ్ ప్రతిపక్ష నేత మహేంద్ర (సత్యరాజ్) సహాయంతో ఆ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరిస్తాడు.

కాగా ఆ తర్వాత జరిగే పొలిటికల్ డ్రామాలో వరుణ్ కి ఎదురైనా సమస్యలు ఏమిటీ ? అసలు వాసుదేవన్ (నాజర్) వరుణ్ ని ఏ ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు? వరుణ్ తండ్రికి విరోధి అయి ఉండి కూడా మహేంద్ర (సత్యరాజ్) వరుణ్ కి ఎందుకు సాయం చేస్తుంటాడు ? మహేంద్రకి, వరుణ్ కి ఉన్న సంబంధం ఏమిటి ? రాజకీయాల గురించి అస్సలు తెలియని వరుణ్ చివరకి యువ ముఖ్యమంత్రిగా ఏమి సాధిస్తాడు ? ఆ సాధించే క్రమంలో వరుణ్ చేసిన పనులు, ప్లాన్ లు ఏమిటి ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
 

ప్లస్ పాయింట్స్:

వరుస విజయాలతో దూసుకువెళ్తున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో.. విజయ్ ఓ యంగ్ సీఎం గా చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. తన మాడ్యులేషన్ అండ్ తన టైమింగ్‌ తో అక్కడక్కడా.. తన మార్క్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తూనే.. ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తోనూ విజయ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించిన హీరోయిన్ మెహ్రీన్ కు పెద్దగా స్క్రీన్ టైం కూడా లేదు. ఆమె పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది. ఫిమేల్ లీడ్ లో మరో కీలక పాత్రలో కనిపించిన సంచనా నటరాజన్ యువ రాజకీయ నాయకురాలిగా తన నటనతో కట్టిపడేస్తోంది.

ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన సత్యరాజ్ తన నటనతో ఆకట్టుకుంటారు. ఆయన తన ఎక్స్ ప్రెషన్స్ తో.. కొన్ని ఏమోషనల్ సీన్స్ తో పాటు, పొలిటికల్ డ్రామా సీన్స్ ను కూడా చాలా బాగా పండించారు. ఇక ఎప్పటిలాగే నాజర్ తన గాంభీరమైన నటనతో మరియు వికృతమైన గెటప్ తో ఆకట్టుకోగా… కమెడియన్ ప్రియదర్శి హీరో ఫ్రెండ్ గా, హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్ లో బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి.

పైగా సినిమాలో తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. నాజర్, సత్యరాజ్ ల మధ్య ప్లాష్ బ్యాక్ మరియు చివర్లో సత్యరాజ్ రివీల్ చేసే ట్విస్ట్ కూడా ఆడియన్స్ కి ముందే తేలిసిపోతుంది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.

ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, తను అనుకున్న పొలిటికల్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.
 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథ కథనాలని రాసుకోలేకపోయారు. ఉన్న కంటెంట్ ను ఆనంద్ శంకర్ స్క్రీన్ పై ఆసక్తి కరంగా మలచలేకపోయారు. సి యస్ సామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తోంది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం అస్సలు ఆకట్టుకోవు.

యస్. కృష్ణ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. రేమండ్ ఎడిటింగ్ బాగుంది కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
 

తీర్పు :

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘నోటా’ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ.. ఆ రాజకీయాల్లో ఎదురయ్యే కొన్ని నాటకీయ పరిణామాలను, సమస్యలను ఆసక్తికరంగా చూపించలేకపోయారు.

కథనం కూడా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. పైగా సినిమాలో తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. మొత్తానికి విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకున్నా.. సినిమా ఆకట్టుకోదు. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయినా ఈ ‘నోటా’ చిత్రం ఓవరాల్ గా నిరుత్సాహపరిచినా సినిమాలోని కొన్ని అంశాలు విజయ్ అభిమానులను ఆకట్టుకోవచ్చు.

 

  • సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు వస్తున్నాయి. కొన్ని పొలిటికల్ మైండ్ గేమ్ సన్నివేశాల తరువాత సినిమా పూర్తిఅయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ వుండండి telugunow.com

  • సినిమా సీరియస్ మోడ్ లోకి మారింది. వరుణ్ ప్రతిపక్షాలను టార్గెట్ చేశాడు. ప్రస్తుతం దానికి సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇప్పుడు సినిమాలో మరి కొన్ని ట్విస్టులు.. వరుణ్ ప్రస్తుతం కఠినమైన పరిస్థితులో వున్నాడు.

  • పనామా లో బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ ఫై ప్రియదర్శి విచారణ చేస్తున్నారు. దానికి సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.

  • వరుణ్ ప్రచారం ను ప్రారంభించారు. ప్రస్తుతం అధికార , విపక్షాలమధ్య పొలిటికల్ వార్ కు సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి. ఏఆర్ మురుగదాస్ అతిధి పాత్రలో కనిపిస్తున్నారు.

  • ప్రస్తుతం విజయ్ , సత్యరాజ్ ల మధ్య ఫ్యామిలీ కి సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.

  • ప్రస్తుతం సిటీలో వరదలు సంభవించాయి. వరుణ్ ఈ పరిస్థితులను సమర్దవంతంగా ఎదుర్కుంటున్నాడు.

  • పెళ్లిచూపులు ఫేమ్ ప్రియదర్శి, వరుణ్ కు ఫ్రెండ్ గా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

  • తీవ్రవాదులు చేసిన దాడిలో నాజర్ తీవ్రంగా గాయపడతారు. ఇప్పుడు విరామం.

  • సినిమా సీరియస్ మోడ్ లో సాగుతుంది. ప్రస్తుతం తీవ్రవాదులకు సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.

  • సీరియస్ పొలిటికల్ సన్నివేశాల తరువాత ప్రస్తుతం రాజా రాజా కుల అనే సాంగ్ వస్తుంది.

  • ప్రతిపక్షాలు విజయ్ ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఒక చిన్న ట్విస్ట్ వరుణ్ (విజయ్) ఇప్పుడు బాద్యతాయుతమైన పొలిటీషియన్ గా మారాలనుకుట్టున్నాడు.

  • తన తండ్రి కోరిక మేరకు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తాడు. ప్రస్తుతం కొన్ని సెటైరికల్ పొలిటికల్ సన్నివేషాలు వస్తున్నాయి.

  • నాజర్ ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ కు తండ్రిగా పరిచయం చేయబడ్డారు అలాగే మెహ్రీన్ యువ జర్నలిస్ట్ గా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

  • సాంగ్ తరువాత చిత్రం పొలిటికల్ మోడ్ లోకి మారింది. జర్నలిస్ట్ గా సీనియర్ నటుడు సత్యరాజ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

  • విజయ్ దేవరకొండ హోమ్ ప్రొడక్షన్ ‘కింగ్ అఫ్ హీల్స్’ లోగో బాగుంది. ప్రస్తుతం సినిమాలోని యెత్తర యెత్తర అనే మొదటి సాంగ్ తో హీరో విజయ్ దేవరకొండ పరిచయం చేయబడ్డాడు .

  • సూర్య మరియు ఏఆర్ మురుగదాస్ లకు థాంక్స్ చెబుతూ సినిమా ప్రారంభమైంది

  • హాయ్ .. 149నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది

నటీనటులు : విజయ్ దేవరకొండ, మెహ్రీన్, సంచనా నటరాజన్ సత్యరాజ్, నాజర్, ప్రియదర్శి తదిత‌రులు దర్శకత్వం : ఆనంద్ శంకర్ నిర్మాతలు : జ్ఞానవేల్‌ రాజా సంగీతం : సి యస్ సామ్ సినిమాటోగ్రఫర్ : యస్ కృష్ణ రవిచంద్రన్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !   కథ : వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవన్ (నాజర్) పెద్ద కుమారుడు. వాసుదేవన్ తన పై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసులో భాగంగా.. తన సీఎం పదవికి రాజీనామా చేసి.. రాత్రికి రాత్రికే అస్సలు రాజకీయాల గురించి, కనీస అవగాహన కూడా లేని వరుణ్ ని సీఎం ని చేస్తాడు. వరుణ్ తన తండ్రి ఆదేశాల ప్రకారం డమ్మి ముఖ్యమంత్రిగా మేనేజ్ చేస్తుంటాడు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య, వరుణ్ కొన్ని సమస్యలను ఎదురుక్కోవాల్సి వస్తోంది. దాంతో వరుణ్ ప్రతిపక్ష నేత మహేంద్ర (సత్యరాజ్) సహాయంతో ఆ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరిస్తాడు. కాగా ఆ తర్వాత జరిగే పొలిటికల్ డ్రామాలో వరుణ్ కి ఎదురైనా సమస్యలు ఏమిటీ ? అసలు వాసుదేవన్ (నాజర్) వరుణ్ ని ఏ ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు? వరుణ్ తండ్రికి విరోధి అయి ఉండి కూడా మహేంద్ర (సత్యరాజ్) వరుణ్ కి ఎందుకు సాయం చేస్తుంటాడు ? మహేంద్రకి, వరుణ్ కి ఉన్న సంబంధం ఏమిటి ? రాజకీయాల గురించి అస్సలు తెలియని వరుణ్ చివరకి యువ ముఖ్యమంత్రిగా ఏమి సాధిస్తాడు ? ఆ సాధించే క్రమంలో వరుణ్ చేసిన పనులు, ప్లాన్ లు ఏమిటి ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.   ప్లస్ పాయింట్స్: వరుస విజయాలతో దూసుకువెళ్తున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో.. విజయ్ ఓ యంగ్ సీఎం గా చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. తన మాడ్యులేషన్ అండ్ తన టైమింగ్‌ తో అక్కడక్కడా.. తన మార్క్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తూనే.. ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తోనూ విజయ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించిన హీరోయిన్ మెహ్రీన్ కు పెద్దగా స్క్రీన్ టైం కూడా లేదు. ఆమె పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది. ఫిమేల్ లీడ్ లో మరో కీలక పాత్రలో కనిపించిన సంచనా నటరాజన్ యువ రాజకీయ నాయకురాలిగా తన నటనతో కట్టిపడేస్తోంది. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన సత్యరాజ్ తన నటనతో ఆకట్టుకుంటారు. ఆయన తన ఎక్స్ ప్రెషన్స్ తో.. కొన్ని ఏమోషనల్ సీన్స్ తో పాటు, పొలిటికల్ డ్రామా సీన్స్ ను కూడా చాలా బాగా పండించారు. ఇక ఎప్పటిలాగే నాజర్ తన గాంభీరమైన నటనతో మరియు వికృతమైన గెటప్ తో ఆకట్టుకోగా… కమెడియన్ ప్రియదర్శి హీరో ఫ్రెండ్ గా, హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్ లో బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.   మైనస్ పాయింట్స్: దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి. పైగా సినిమాలో తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. నాజర్, సత్యరాజ్ ల మధ్య ప్లాష్ బ్యాక్ మరియు చివర్లో సత్యరాజ్ రివీల్ చేసే ట్విస్ట్ కూడా ఆడియన్స్ కి ముందే తేలిసిపోతుంది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, తను అనుకున్న పొలిటికల్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.   సాంకేతిక విభాగం : సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్…

నోటా రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.25
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3

3.1

నోటా రివ్యూ

నోటా రివ్యూ రేటింగ్

User Rating: 2.65 ( 1 votes)
3