Templates by BIGtheme NET
Home >> REVIEWS >> ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ

ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ


 

విశ్వవిఖ్యాత నట సార్యభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తెరపై ఆవిష్కరించడమంటే సాధారణ విషయం కాదు. ఆయన సినీ జీవితం ఒక మహావృక్షం. రాజకీయ జీవితం మరపురాని జ్ఞాపకం. ఎన్టీఆర్ తన జీవితంలో ఎంతో ఖ్యాతిని గడించారు. ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో నా అన్న వారే ఆయన్ని కాదనుకొని వెళ్లిపోయారు. వాస్తవానికి ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఎన్నో ఘట్టాలను ఒక్కో సినిమాగా తీయొచ్చు. అలాంటిది ఆయన సినీ, రాజకీయ జీవితాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ధైర్యాన్ని నందమూరి బాలకృష్ణచేశారు. ముందుగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. తండ్రి జీవిత కథను తెరపై చూపించే మొదటి హక్కు తనకే ఉందని తెలుపుతూ ఆ మహా నటుడిగా కనిపించే సాహసాన్ని బాలయ్య చేశారు. 

కథ :

ఎన్టీఆర్ ( బాలకృష్ణ ) రిజిస్టారర్ గా పనిచేస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్ లో వున్న అవినీతి నచ్చక జాబ్ కు రాజీనామా చేసి సినిమాల్లో కి వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి ? ఇండియన్ మొదటి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు ? ఆ తరువాత రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో బాలకృష్ణ నటన మేజర్ హైలైట్ అయ్యింది. ఆయనకెరీర్ లో ఈ చిత్రం మైలు రాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన తీరు చూస్తే ఈపాత్రను బాలయ్య తప్ప ఎవరు చేయలేరని అనిపిస్తుంది. ఇక బాలకృష్ణ తరువాత నటన పరంగా మెప్పించిన పాత్రలు బసవతారకం, ఏ యన్ ఆర్. ఈ పాత్రల్లో నటించిన విద్యా బాలన్ , సుమంత్ చాలా బాగా నటించారు. ముఖ్యంగా విద్యా బాలన్ బసవ తారకం పాత్రకు కరెక్ట్ గా సరిపోయింది.

ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కృష్ణుడి ఎపిసోడ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రింట్ సన్నివేశాలు సినిమా కు హైలైట్ గా నిలిచాయి. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులను చక్కగా చూపెట్టాడు చూపెట్టాడు దర్శకుడు క్రిష్. ముఖ్యంగా సినిమాను ఎండ్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. దాంతో సెకండ్ పార్ట్ ఫై ఆసక్తిని తీసుకురాగలిగాడు క్రిష్.

సినిమా లో హైలెట్స్:

తెలుగు దేశం పార్టీని ప్రకటించడం వంటి ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ల్యాబ్ ప్రింట్ సీన్, దివిసీమ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అట. ఇక సినిమాకు మరో బలం సాయి మాధవ్ బుర్ర డైలాగులు, కీరవాణి నేపథ్య సంగీతం అని చాలా మంది చెబుతున్నారు. 60 ఏళ్ల ఎన్టీఆర్‌గా బాలయ్య చాలా బాగున్నారు

ఎన్టీఆర్ తోటరాముడుగా నటించే సీన్స్, సావిత్రితో నటించే సన్నివేవాలు చాలా బావున్నాయి. దర్శకుడు క్రిష్ తన ప్రతిభ చూపించారు.

చివరి 20 నిమిషాలలో వచ్చే సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయి.

ఎన్టీఆర్ కథ నాయకుడు మొత్తం ఆయన సినీరంగంలో తిరుగులేని స్టార్ గా ఎలా అవతరించాడు అనే అంశం గురించే. ఎన్టీఆర్ ఆసక్తికరమైన ప్రకటనతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ముగుస్తుంది.

ఫస్ట్ హాఫ్ కంటే సెంకండ్ హాఫ్ బావుంది. అభిమానులు మెచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయం.

ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్ర అందించిన డైలాగులు చాలా బావున్నాయి.

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం మాస్టర్ పీస్ అనిపించేలా ఉంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన మైనస్ స్లో నరేషన్. బయోపిక్ సినిమాలంటే ఆసక్తిరమైన మలుపులు గ్రిప్పింగ్ నరేషన్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అవి మిస్ అయ్యాయి. ఇక బాలకృష్ణ , విద్యా బాలన్ , ఏ ఎన్ ఆర్ పాత్రలు తప్ప మిగితా పాత్రలు పెద్దగా రిజిస్టర్ అవ్వవు. గ్రిప్పింగ్ నరేషన్ తో మరికొన్ని ఎలివేషన్ సన్నివేశాలతో సినిమాను ఆసక్తికరంగా మార్చి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే.

సాంకేతిక వర్గం :

తెలుగు ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించడం సవాలు తో కూడుకున్న పని. ఈ విషయంలో క్రిష్ చాలా వరకు విజయం సాదించాడనే చెప్పొచ్చు. అయితే స్లో నరేషన్ అలాగే ఎక్కువ నిడివి సినిమాను అనుకున్న రేంజ్ కు తీసుకురాలేకపోయాయి.

ఇక కీరవాణి సంగీతం ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహిస్తే బాగుండేది. సాయి మాధవ్ బుర్ర రాసిన సంభాషణలు కూడా బాగున్నాయి. ఇక ఎన్ బి కె ఫిలిమ్స్. వారాహి, విబ్రి మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

మహా నటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చాలా వరకు మెప్పించింది. బాలకృష్ణ నటన, సినిమాటిక్ ఎలివేషన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవ్వగా, స్లో నరేషన్, నిడివి సినిమాకు మైనస్ అయ్యాయి.ఇక ఈచిత్రం నందమూరి అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. చివరగా ఈచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి ఛాయస్ అవుతుందనే చెప్పవచ్చు.

 

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ : లైవ్ అప్డేట్స్ :

  • సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.

  • ఇప్పుడు సినిమా అంతిమ దశకు చేరుకుంటుంది.నందమూరి తారక రామారావు గారు తన రాజకీయ పార్టీని ప్రకటించేసారు.

  • రాజకీయ పార్టీని స్థాపించేందుకు సిద్ధమవుతున్న కొన్ని సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • ఇప్పుడు చిత్రం మరో కీలక ఘట్టం రాజకీయ కోణంలోకి వెళ్తుంది.దగ్గుబాటి రానా చంద్రబాబు పాత్రలో ఎంట్రీ ఇచ్చారు.

  • క్యామియో రోల్ లో రకుల్ ప్రీత్ సింగ్ వేటగాడు సినిమా పాటతో ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు సర్దార్ పాపారాయుడు సినిమాకి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇప్పుడే యమగోల చిత్ర హీరోయిన్ జయప్రద పాత్రలో హన్సిక ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు ఎన్టీఆర్ జీవితంలో దివి సీమ వరదలకు సంబందించిన కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా వస్తున్నాయి.

  • ప్రభ పాత్రలో హీరోయిన్ శ్రేయ దానవీర శూర కర్ణ షూటింగ్ లో కనిపిస్తున్నారు.ఆ సినిమా షూటింగ్ కు సంబందించిన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • అన్నదమ్ముల అనుబంధం సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ను ఎలివేట్ చేసే ఒక అద్భుత సన్నివేశం ఇప్పుడు వస్తుంది.

  • విరామం అనంతరం నర్తనశాల సినిమాకి సంబందించిన సన్నివేశాలతో చిత్రం ప్రారంభం అయ్యింది.

  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా ఆరంభం నుంచి ఇంటర్వెల్ వరకు సాఫీ గానే సాగింది.ఇప్పుడు సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో దానికి సెకండాఫ్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలి.

  • ఇప్పటికి సినిమా సగం పూర్తి కావచ్చింది.ఇప్పుడు విరామం

  • ఎన్టీఆర్ మొదటి కొడుకు రామ కృష్ణ చనిపోయిన సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా భావోద్వేగ పూరితంగా వస్తుంది.

  • ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో అత్యంత కీలక పాత్ర పది తలల రావణుని పాత్ర సీతా రామ కళ్యాణం సినిమా కోసం తీస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.ఈ పాత్రలో బాలకృష్ణ అభిమానులకు కనుల పండుగలా కనిపిస్తారు.ఇప్పుడే మహానటి సావిత్రి పాత్రలో నిత్యా మీనన్,హాస్య నటుడు రేలంగి పాత్రలో బ్రహ్మానందం,కృష్ణ కుమారి పాత్రలో ప్రణీత ఒక్కోక్కరిగా ఎంట్రీ ఇచ్చారు.

  • ఇప్పుడు మాయాబజార్ చిత్రంలో కృష్ణుని యొక్క పాత్రలో ఎన్టీఆర్ పాత్ర పరిచయం అయ్యింది.ఈ సీన్ మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది.

  • ఎన్టీఆర్ మరియు బసవ తారకం మధ్య ఆప్యాయతకు చిహ్నంగా బంటురీతి కొలువు అనే పాట ఇప్పుడు వస్తుంది.

  • రాయలసీమలోని కొన్ని కరువు ప్రాంతాల బాగు కోసం విరాళాల సేకరణను ప్రతిబింబిస్తూ జై కొట్టు తెలుగోడా అనే పాట ఇప్పుడు వస్తుంది.ఎన్టీఆర్ కి ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆదరణ క్రమక్రమంగా పెరుగుతుంది.

  • ఇప్పుడు ఎన్టీఆర్ విజయ వాహిని బ్యానర్ లో కాంట్రాక్టు పై సంతకం పెడుతున్న సన్నివేశం వస్తుంది.దర్శకుడు నాగిరెడ్డి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్,చక్రపాణిగా మురళి శర్మ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.అలాగే పాతాళ భైరవి చిత్ర దర్శకుడు వెంకట రెడ్డి పాత్రలో క్రిష్ ఎంట్రీ కూడా ఇప్పుడే ఇచ్చారు.

  • అప్పట్లో మరో అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటుడు సుమంత్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు ఎన్టీఆర్ మరియు ఎన్నార్ ల మధ్య ఉన్న బంధాన్ని చిత్రీకరిస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.

  • సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలుకు సంబందించిన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.ఈ సీన్స్ అన్ని కొంచెం భావోద్వేగ పూరితంగా కనిపిస్తున్నాయి.

  • ఇప్పుడు ఎన్టీఆర్ యొక్క మొదటి సినిమా మన దేశం షూటింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.

  • ట్రైలర్ లో చూపిన విధంగా ఎన్టీఆర్ తన ఉద్యోగాన్ని వదిలేసి సినీ పరిశ్రమ వైపు అడుగులు వేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.ఈ సీన్లను ప్రతిబింబిస్తూ కథానాయక పాట బాక్గ్రౌండ్ లో వస్తుంది.

  • రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగిగా ఎన్టీఆర్ పరిచయం కాబడ్డారు.ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.

  • 1984లో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ షాట్ తో చిత్రం ప్రారంభం అయ్యింది,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ మరియు బసవతారకం పాత్రలో విద్యా బాలన్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు మళ్ళీ 1947కాలంలోకి తీసుకెళ్లింది.ఇప్పుడే నందమూరి తారక రామారావు గా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు.

  • హాయ్..171 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడు మొదలయ్యింది.

  విశ్వవిఖ్యాత నట సార్యభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తెరపై ఆవిష్కరించడమంటే సాధారణ విషయం కాదు. ఆయన సినీ జీవితం ఒక మహావృక్షం. రాజకీయ జీవితం మరపురాని జ్ఞాపకం. ఎన్టీఆర్ తన జీవితంలో ఎంతో ఖ్యాతిని గడించారు. ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో నా అన్న వారే ఆయన్ని కాదనుకొని వెళ్లిపోయారు. వాస్తవానికి ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఎన్నో ఘట్టాలను ఒక్కో సినిమాగా తీయొచ్చు. అలాంటిది ఆయన సినీ, రాజకీయ జీవితాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ధైర్యాన్ని నందమూరి బాలకృష్ణచేశారు. ముందుగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. తండ్రి జీవిత కథను తెరపై చూపించే మొదటి హక్కు తనకే ఉందని తెలుపుతూ ఆ మహా నటుడిగా కనిపించే సాహసాన్ని బాలయ్య చేశారు.  కథ : ఎన్టీఆర్ ( బాలకృష్ణ ) రిజిస్టారర్ గా పనిచేస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్ లో వున్న అవినీతి నచ్చక జాబ్ కు రాజీనామా చేసి సినిమాల్లో కి వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి ? ఇండియన్ మొదటి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు ? ఆ తరువాత రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : సినిమాలో బాలకృష్ణ నటన మేజర్ హైలైట్ అయ్యింది. ఆయనకెరీర్ లో ఈ చిత్రం మైలు రాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన తీరు చూస్తే ఈపాత్రను బాలయ్య తప్ప ఎవరు చేయలేరని అనిపిస్తుంది. ఇక బాలకృష్ణ తరువాత నటన పరంగా మెప్పించిన పాత్రలు బసవతారకం, ఏ యన్ ఆర్. ఈ పాత్రల్లో నటించిన విద్యా బాలన్ , సుమంత్ చాలా బాగా నటించారు. ముఖ్యంగా విద్యా బాలన్ బసవ తారకం పాత్రకు కరెక్ట్ గా సరిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కృష్ణుడి ఎపిసోడ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రింట్ సన్నివేశాలు సినిమా కు హైలైట్ గా నిలిచాయి. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులను చక్కగా చూపెట్టాడు చూపెట్టాడు దర్శకుడు క్రిష్. ముఖ్యంగా సినిమాను ఎండ్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. దాంతో సెకండ్ పార్ట్ ఫై ఆసక్తిని తీసుకురాగలిగాడు క్రిష్. సినిమా లో హైలెట్స్: తెలుగు దేశం పార్టీని ప్రకటించడం వంటి ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ల్యాబ్ ప్రింట్ సీన్, దివిసీమ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అట. ఇక సినిమాకు మరో బలం సాయి మాధవ్ బుర్ర డైలాగులు, కీరవాణి నేపథ్య సంగీతం అని చాలా మంది చెబుతున్నారు. 60 ఏళ్ల ఎన్టీఆర్‌గా బాలయ్య చాలా బాగున్నారు ఎన్టీఆర్ తోటరాముడుగా నటించే సీన్స్, సావిత్రితో నటించే సన్నివేవాలు చాలా బావున్నాయి. దర్శకుడు క్రిష్ తన ప్రతిభ చూపించారు. చివరి 20 నిమిషాలలో వచ్చే సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయి. ఎన్టీఆర్ కథ నాయకుడు మొత్తం ఆయన సినీరంగంలో తిరుగులేని స్టార్ గా ఎలా అవతరించాడు అనే అంశం గురించే. ఎన్టీఆర్ ఆసక్తికరమైన ప్రకటనతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెంకండ్ హాఫ్ బావుంది. అభిమానులు మెచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయం. ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్ర అందించిన డైలాగులు చాలా బావున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం మాస్టర్ పీస్ అనిపించేలా ఉంది. మైనస్ పాయింట్స్ : సినిమాకి ప్రధాన మైనస్ స్లో నరేషన్. బయోపిక్ సినిమాలంటే ఆసక్తిరమైన మలుపులు గ్రిప్పింగ్ నరేషన్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అవి మిస్ అయ్యాయి. ఇక బాలకృష్ణ , విద్యా బాలన్ , ఏ ఎన్ ఆర్ పాత్రలు తప్ప మిగితా పాత్రలు పెద్దగా రిజిస్టర్ అవ్వవు. గ్రిప్పింగ్ నరేషన్ తో మరికొన్ని ఎలివేషన్ సన్నివేశాలతో సినిమాను ఆసక్తికరంగా మార్చి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే. సాంకేతిక వర్గం : తెలుగు ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించడం సవాలు తో కూడుకున్న పని. ఈ విషయంలో క్రిష్ చాలా వరకు విజయం సాదించాడనే చెప్పొచ్చు. అయితే స్లో నరేషన్ అలాగే ఎక్కువ నిడివి సినిమాను అనుకున్న రేంజ్ కు తీసుకురాలేకపోయాయి. ఇక కీరవాణి సంగీతం ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహిస్తే బాగుండేది. సాయి మాధవ్ బుర్ర రాసిన సంభాషణలు కూడా బాగున్నాయి. ఇక ఎన్ బి కె ఫిలిమ్స్. వారాహి, విబ్రి మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. తీర్పు : మహా నటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చాలా వరకు మెప్పించింది.…

ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 3.5
నటీ-నటుల ప్రతిభ - 4
సాంకేతిక వర్గం పనితీరు - 3.75
దర్శకత్వ ప్రతిభ - 4

3.8

ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ

ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ

User Rating: 4.17 ( 6 votes)
4