Templates by BIGtheme NET
Home >> REVIEWS >> ఓ పిట్ట క‌థ రివ్యూ

ఓ పిట్ట క‌థ రివ్యూ


సినిమా : ఓ పిట్ట క‌థ

నటీనటులు :  విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు

దర్శకత్వం : చెందు ముద్దు

నిర్మాత‌లు : ఆనంద్ ప్రసాద్

సంగీతం :  ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫర్ : సునీల్ కుమార్ ఎన్

ఎడిటర్ : డి వెంకట ప్రభు

విడుదల తేదీ : మార్చి 06, 2020

విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు. చెందు ముద్దు దర్శకుడు. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

కథ :

పి వెంకటలక్ష్మి (నిత్యా శెట్టి) తల్లి లేని అమ్మాయి.. తన తండ్రితో హ్యాపీగా కాకినాడలో లైఫ్ ను లీడ్ చేస్తుంటుంది. తన తండ్రి దగ్గర పని చేసే ప్రభు (సంజయ్‌ రావు) వెంకటలక్ష్మిని చిన్నప్పటి నుండే ప్రేమిస్తాడు. వెంకటలక్ష్మి కూడా అతన్ని ప్రేమిస్తోంది. ఇలా సాగుతున్న ఆమె జీవితంలోకి క్రిష్ (విశ్వంత్‌ దుద్దంపూడి) చైనా నుండి వస్తాడు. వెంకటలక్ష్మిని చూసిన మొదటి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కానీ ఆమె ప్రభుని లవ్ చేస్తోందని ఎలాగైనా ప్రభు నుండి విడతీయాలని ప్లాన్ చేస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం వెంకటలక్ష్మి మిస్ అయిపోతుంది. యస్.ఐ (బ్రహ్మాజీ) వెంకటలక్ష్మి కేసుని ఎంక్వేరి చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో వెంకటలక్ష్మిని క్రిష్ చంపేసినట్లు వీడియో దొరుకుతుంది. అయితే ఆ తరువాత వెంకటలక్ష్మిని ప్రభునే చంపినట్లు మరో సాక్ష్యం దొరుకుతుంది. ఇంతకీ వెంకటలక్ష్మిని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికీ ఉంది ? అసలు వెంకటలక్ష్మి నిజంగానే చనిపోయిందా ? లేక ఆమెను ఎవరైనా దాచారా ? చివరికి వెంకటలక్ష్మి కథ ఎలా ముగిసింది ? ప్రభు, క్రిష్ లలో ఎవరు మంచి, ఎవరు చెడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సస్పెన్స్ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ మిస్సింగ్ కేసు చుట్టూ ఈ సినిమా అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సరదాగా సాగుతుంది. సినిమాలో లాస్ట్ ముప్పై నిముషాల స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకెండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో వెంకటలక్ష్మి పాత్ర మిస్ అవ్వడం, ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన ఇద్దరి హీరోల పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్ లో రివీల్ అయ్యే ప్లాష్ బ్యాక్ స్టోరీస్ అండ్ వేరియేషన్స్.. మరియు సంజయ్ రావ్ ఫ్రెండ్ గా నటించిన నటుడు కామెడీ వంటి అంశాలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

ఈ సినిమాలో హీరోలుగా నటించిన విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు తమ పాత్రలకు తగ్గట్లు.. ఇంటర్నల్ గా ఒకలా, బయటకు మరోలా కనిపిస్తూ తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విశ్వంత్‌ దుద్దంపూడి మొదటిసారి తనకు కొత్తగా అనిపించే పాత్రలో నటించాడు. కొన్ని సీన్స్ లో తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ తో పాటు హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లో, అలాగే పోలీస్ స్టేషన్ లో వచ్చే సన్నివేశంలో కూడా బాగా నటించాడు. మరో హీరో సంజయ్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

ఇక హీరోయిన్ గా నటించిన నిత్యాశెట్టి లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఆమె తండ్రి పాత్రలో కనిపించిన నటుడు, మరియు హీరో ఫ్రెండ్ గా నటించిన నటుడు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సినిమాలో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో చివరి ముప్పై నిముషాలు మాత్రమే సినిమాని నిలబెట్టాయి. అయితే, ఆ ముప్పై నిముషాలు కోసం మిగిలిన సినిమా అంతా భరించాలా అంటేనే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తోంది.

దర్శకుడు చందు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ట్రీట్మెంట్ ను రాసుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ మినహా ఎక్కడా అంత గొప్ప ఇంట్రస్ట్ గాని, గొప్ప ఫీల్ గాని కనిపించదు. పోనీ లవ్ సీన్స్ అయినా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయా అంటే.. నెట్ లో దొరికే జోక్ లతో మరియు హీరోహీరోయిన్ల మధ్య చిన్న డిస్కషన్స్ తోనే లవ్ ట్రాక్ ను నెట్టుకొచ్చేసాడు దర్శకుడు.

పైగా అనవసరమైన సన్నివేశాలు మరియు డైలాగ్స్ కూడా ఎక్కువైపోయాయి. దీనికి తోడు ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగుతాయి. హీరోలు – హీరోయిన్ ల క్యారెక్టర్స్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ వారి మధ్య వ్యత్యాసాన్ని, సినిమా కథాంశానికి సమంధించిన సస్పెన్స్ ను బలంగా ఎలివేట్ చేయలేకపోయారు. హీరోలిద్దరూ లవ్ ట్రాక్ ను ఆయా క్యారెక్టర్స్ మధ్య నడిచే డ్రామాని ముందు నుంచీ బాగా ఎలివేట్ చేస్తే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడు లాస్ట్ ముప్పై నిముషాల మీద పెట్టిన శ్రద్ధ ఫస్ట్ నుండే పెట్టి ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరోలా ఉండేది.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం చాల బాగుంది. సాంగ్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. సునీల్ కుమార్ ఎన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత ఆనంద్ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు చందు మంచి స్టోరీ లైన్ తో మరియు కొన్ని సస్పెన్స్ సీన్స్ తో పర్వాలేదనిపించారు.

తీర్పు :

‘ఓ పిట్టకథ’ అంటూ వచ్చిన ఈ సినిమా కొన్ని చోట్ల సప్సెన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అక్కడక్కడా కామెడీ టచ్ తో బాగానే పర్వాలేదు అనిపించుకుంది. ఐతే సెకెండ్ హాఫ్ లో చివరి ముప్పై నిముషాల ప్లే దర్శకుడు చందు బాగా తెరక్కించారు. ఆ ముప్ఫై నిముషాల సినిమా చాలా బాగుంది. కానీ అప్పటివరకూ సినిమా పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగకపోవడం, కొన్ని సీన్స్ రిపీట్ డ్ కావడం, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే ఈ సినిమా ఓవరాల్ గా సస్పెన్స్ ఇష్టపడే ప్రేక్షుకులకు నచ్చుతుంది. ఇక మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోదు.

సినిమా : ఓ పిట్ట క‌థ నటీనటులు :  విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు దర్శకత్వం : చెందు ముద్దు నిర్మాత‌లు : ఆనంద్ ప్రసాద్ సంగీతం :  ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫర్ : సునీల్ కుమార్ ఎన్ ఎడిటర్ : డి వెంకట ప్రభు విడుదల తేదీ : మార్చి 06, 2020 విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు. చెందు ముద్దు దర్శకుడు. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం… కథ : పి వెంకటలక్ష్మి (నిత్యా శెట్టి) తల్లి లేని అమ్మాయి.. తన తండ్రితో హ్యాపీగా కాకినాడలో లైఫ్ ను లీడ్ చేస్తుంటుంది. తన తండ్రి దగ్గర పని చేసే ప్రభు (సంజయ్‌ రావు) వెంకటలక్ష్మిని చిన్నప్పటి నుండే ప్రేమిస్తాడు. వెంకటలక్ష్మి కూడా అతన్ని ప్రేమిస్తోంది. ఇలా సాగుతున్న ఆమె జీవితంలోకి క్రిష్ (విశ్వంత్‌ దుద్దంపూడి) చైనా నుండి వస్తాడు. వెంకటలక్ష్మిని చూసిన మొదటి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కానీ ఆమె ప్రభుని లవ్ చేస్తోందని ఎలాగైనా ప్రభు నుండి విడతీయాలని ప్లాన్ చేస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం వెంకటలక్ష్మి మిస్ అయిపోతుంది. యస్.ఐ (బ్రహ్మాజీ) వెంకటలక్ష్మి కేసుని ఎంక్వేరి చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో వెంకటలక్ష్మిని క్రిష్ చంపేసినట్లు వీడియో దొరుకుతుంది. అయితే ఆ తరువాత వెంకటలక్ష్మిని ప్రభునే చంపినట్లు మరో సాక్ష్యం దొరుకుతుంది. ఇంతకీ వెంకటలక్ష్మిని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికీ ఉంది ? అసలు వెంకటలక్ష్మి నిజంగానే చనిపోయిందా ? లేక ఆమెను ఎవరైనా దాచారా ? చివరికి వెంకటలక్ష్మి కథ ఎలా ముగిసింది ? ప్రభు, క్రిష్ లలో ఎవరు మంచి, ఎవరు చెడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : సస్పెన్స్ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ మిస్సింగ్ కేసు చుట్టూ ఈ సినిమా అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సరదాగా సాగుతుంది. సినిమాలో లాస్ట్ ముప్పై నిముషాల స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకెండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో వెంకటలక్ష్మి పాత్ర మిస్ అవ్వడం, ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన ఇద్దరి హీరోల పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్ లో రివీల్ అయ్యే ప్లాష్ బ్యాక్ స్టోరీస్ అండ్ వేరియేషన్స్.. మరియు సంజయ్ రావ్ ఫ్రెండ్ గా నటించిన నటుడు కామెడీ వంటి అంశాలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోలుగా నటించిన విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు తమ పాత్రలకు తగ్గట్లు.. ఇంటర్నల్ గా ఒకలా, బయటకు మరోలా కనిపిస్తూ తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విశ్వంత్‌ దుద్దంపూడి మొదటిసారి తనకు కొత్తగా అనిపించే పాత్రలో నటించాడు. కొన్ని సీన్స్ లో తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ తో పాటు హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లో, అలాగే పోలీస్ స్టేషన్ లో వచ్చే సన్నివేశంలో కూడా బాగా నటించాడు. మరో హీరో సంజయ్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ గా నటించిన నిత్యాశెట్టి లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఆమె తండ్రి పాత్రలో కనిపించిన నటుడు, మరియు హీరో ఫ్రెండ్ గా నటించిన నటుడు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సినిమాలో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మైనస్ పాయింట్స్ : సినిమాలో చివరి ముప్పై నిముషాలు మాత్రమే సినిమాని నిలబెట్టాయి. అయితే, ఆ ముప్పై నిముషాలు కోసం మిగిలిన సినిమా అంతా భరించాలా అంటేనే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తోంది. దర్శకుడు చందు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ట్రీట్మెంట్ ను రాసుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ మినహా ఎక్కడా అంత గొప్ప ఇంట్రస్ట్ గాని, గొప్ప ఫీల్ గాని కనిపించదు. పోనీ లవ్ సీన్స్ అయినా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయా అంటే.. నెట్ లో దొరికే జోక్ లతో మరియు హీరోహీరోయిన్ల మధ్య చిన్న డిస్కషన్స్ తోనే లవ్ ట్రాక్ ను నెట్టుకొచ్చేసాడు దర్శకుడు. పైగా అనవసరమైన సన్నివేశాలు మరియు డైలాగ్స్ కూడా ఎక్కువైపోయాయి. దీనికి తోడు ఆ…

ఓ పిట్ట క‌థ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.25
నటీ-నటుల ప్రతిభ - 2.75
సాంకేతిక వర్గం పనితీరు - 2.75
దర్శకత్వ ప్రతిభ - 2.75

2.6

ఓ పిట్ట క‌థ రివ్యూ

ఓ పిట్ట క‌థ రివ్యూ

User Rating: Be the first one !
3