Templates by BIGtheme NET
Home >> REVIEWS >> ఓ బేబీ రివ్యూ

ఓ బేబీ రివ్యూ


విడుదల తేదీ : జూలై 05, 2019

నటీనటులు : సమంత,నాగ శౌర్య,లక్ష్మి,రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్,తేజ సజ్జా

దర్శకత్వం : బి వి నందిని రెడ్డి

నిర్మాత‌లు : సురేష్ బాబు,సునీతా తాటి,టి జి విశ్వ ప్రసాద్, థామస్ కిన్.

సంగీతం : మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫర్ : రిచర్డ్ ప్రసాద్

ఎడిటర్ : జునైద్ సిద్ధికి

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీఎత్తున విడుదలైంది. జీవితంలో కష్టాలు తప్ప ఎన్నడూ సుఖపడని ఓ 70 ఏళ్ల బామ్మకి.. విచిత్రంగా 20 ఏళ్ల యంగ్ లేడీగా మారే అవకాశం వస్తే, అప్పుడు ఆ ఇరవై ఏళ్ల యువతి ప్రవర్తన ఎలా ఉంటుందనే అంశాలు ప్రధానంగా ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, టీజర్స్ తో మూవీపై భారీ అంచనాలు కలిగేలా చేసింది. మరి సమంత నటించిన ఓ బేబీ మూవీ ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఓ బేబీ మూవీ కథ విషయానికి వస్తే బేబీ(లక్ష్మి) ఎప్పుడూ ఏదో కోల్పియినట్లు అసహనంగా ఉండే ఓ బామ్మ. ఈమె ఓ క్యాంటీన్ ని నడుపుతూ ఉంటుంది. ఆమె మితిమీరిన డామినేషన్,చాదస్తాన్ని తట్టుకోలేక పోతుంటుంది ఆమె మనవరాలు. ఈ కుటుంబ మనస్పర్ధలతో బేబీ ఇంటినుండి గెంటివేయబడుతుంది. అలా నిరాశ్రయురాలైన బేబీ జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. తన కోరిక ప్రకారం వృద్ధురాలైన బేబీ యంగ్ లేడీగా మారిపోతుంది. మరొక మారు యవ్వనంలోకి ప్రవేశించిన బేబీ(సమంత) ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంది, ఈ ఊహించని ప్రయాణంలో ఆమెకు ఎదురైన సంఘటనలను ఎలా ఎదుర్కొంది అనేవి తెరపై చూడాలి.

ప్లస్ పాయింట్స్:

కొత్త కథను ఎంచుకోవడంతో పాటు, ఎంచుకున్న కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ నందిని రెడ్డి విజయం సాధించారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ఆమె కథను చిత్రీకరించిన తీరు అభినందనీయం. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలతో పోల్చితే నందిని రెడ్డి అత్యుత్తమ సినిమాగా ఓ బేబీ నిలుస్తుంది.

ఇక సమంత నటన వర్ణించడానికి మాటలు చాలవంటే అతిశయోక్తి కాదు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపిన సమంత ప్రేక్షకుడిని కథతో ప్రయాణించేలా చేస్తుంది. ఆమె కెరీర్ లోనే ఓ బేబీ బెస్ట్ మూవీస్ లలో ఒకటిగా నిలిచిపోతుంది. ఈ మూవీలో సమంతను ఒక స్టార్ హీరోయిన్ లాగాక ఒక నటిగానే గుర్తుండిపోతుంది. రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలతో పాటు, పతాక సన్నివేశాలలో రావ్ రమేష్ తో వచ్చే సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడి చేత కంట నీరుపెట్టిస్తాయి. హాస్య సన్నివేశాలలో కూడా సమంత అవార్డు విన్నింగ్ నటనతో మెప్పించింది. ఈ సినిమా తరువాత సమంత ప్రతిభను ఇంకా మనం సరిగా వాడుకోవడం లేదనిపిస్తుంది.

అలాగే సమంత తర్వాత ఈ మూవీ లో ప్రముఖంగా ప్రస్తావించాల్సిన నటుడు రాజేంద్ర ప్రసాద్. సమంత స్నేహితుడిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఆయన తన మార్కు హావభావాలతో ప్రతి సన్నివేశం రక్తికట్టించారు. అలాగే సినిమా మొదటి 15నిమిషాలలో వచ్చే సన్నివేశాల్లో వృద్ధురాలైన బేబీ పాత్రలో సీనియర్ నటి లక్ష్మి చక్కగా నటించి పాత్రకు జీవంపోశారు.

ఇక సమంత సరసన హీరో గా చేసిన నాగ శౌర్య హ్యాండ్ సమ్ గా ఉన్నాడు, తన పాత్ర పరిధిలో చక్కగా నటించాడు. కుటుంబ విలువలు,మంచి విషయాలు చెప్పే బావోద్వేగమైన పాత్రలో రావు రమేష్ చక్కగా నటించారు. ఆయన పాత్ర సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. బాలనటుడిగా చాలా సినిమాలలో కనిపించి హీరోగా మారిన తేజ సజ్జా మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. సమంతని ప్రేమించే యువకుడిగా తన పాత్ర బాగుంది.

ఇక రావ్ రమేష్ భార్య పాత్రలో ప్రగతి నటన బాగుంది.చిత్రం మొదటి సగం మొత్తం చక్కని కామెడీ సన్నివేశాలతో పాటు సున్నితమైన ఎమోషన్స్ తో అలరించిన నందిని, పతాక సన్నివేశాలలో చక్కని ప్రతిభతో ఆకట్టుకున్నారు. సినిమాకి ఆమె రాసుకున్న ముగింపుకూడా ప్రేక్షకుడికి నచ్చేలా ఉంది.

మైనస్ పాయింట్స్:

సినిమా రెండవ భాగం కొంచెం సాగతీతకు గురైనట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను తగ్గిస్తే బాగుండు అని భావన కలుగుతుంది.
సెకండ్ హాఫ్ లో మూవీ నెమ్మదించడంతో పాటు,తరువాత సన్నివేశాలు తేలికగా ఊహించే విధంగా ఉన్నాయి.

సాంకేతిక విభాగం:

సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి హృదయాలకు హత్తుకునేలా చిత్రీకరించడంలో కెమెరా మెన్ ప్రతిభ కనబడుతుంది. ఇక ఎడిటింగ్ పర్వాలేదనిపించింది, ఎందుకంటే దాదాపు 10నిమిషాల మూవీ నిడివి తగ్గించే అవకాశం ఉంది. నాగ శౌర్య , సమంత చాలా అందంగా కనిపించారు. పాటల పరంగా,బీజీఎమ్ పరంగా చూసిన మిక్కీ జె మేయర్ అద్భుతంగా చేశారు.

ఇక దర్శకురాలు నందిని రెడ్డి ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే, ఓ బేబీ మూవీ తో ఆమె అద్భుతమే చేశారు. భావోద్వేగ సన్నివేశాలలో అలాగే కామెడీ సన్నివేశాలలో సమంత పాత్రను తెరపై ఆమె ఆవిష్కరించిన తీరు అమోఘం.

తీర్పు:

మొత్తంగా సమంత నటించిన ఓ బేబీ మూవీ ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా. సినిమాలో ఎమోషన్స్,కామెడీ,రొమాన్స్ వాల్యూస్ ఇలా అన్ని కోణాలు కలగలిపి ఒక కంప్లీట్ మూవీని నందిని రెడ్డి ప్రెసెంట్ చేశారు. సమంత అంతా తానై అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఆమె ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిచేలా చేస్తుంది. తెలుగు సినిమా మూసధోరణి వదిలేసి ప్రయోగాత్మకమైన మంచి చిత్రాలను నిర్మిస్తుంది అనడానికి ఓ బేబీ మూవీ ఒక ఉదాహరణ. ఓ బేబీ కచ్చితంగా చూడాల్సిన సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు.

టాలీవుడ్ హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత కెరీర్ తారాజువ్వలా దూసుకెళ్తున్నది. అభిమన్యుడు, రంగస్థలం, సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి సినిమాలు ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా జూలై 5వ తేదీన విడుదల అవుతున్న సందర్భంగా సమంత మీడియాతో ముచ్చటించారు. స్టార్ డమ్ ఎంత అనే విషయాన్ని నిరూపించుకోవడానికి చేసిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందంటే..

‘ఓ బేబీ’ : లైవ్ అప్డేట్స్:

  • ఓ చిన్న సర్ప్రైజ్ ద్వారా సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
  • మరికొన్ని కుటుంబ నేపధ్య సన్నివేశాలు వస్తున్నాయి.
  • కొన్ని భావోద్వేగపూరిత సన్నివేశాల తర్వాత మహా అద్భుతం పాట మొదలైంది.
  • ఇప్పుడు సమంత మరియు రాజేంద్ర ప్రసాద్ ల మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
  • సమంత మరియు నాగశౌర్యల మధ్య కొన్ని హాస్య సన్నివేశాల అనంతరం నాల్గవ పాట అయినటువంటి “నాలో మైమరపు” మొదలైంది.
  • ఇప్పుడు ఆకాశం లోనా పాట మొదలైంది.ఇపుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు షిఫ్ట్ అయ్యింది.బేబీ భర్తగా అడవి శేష్ క్యామియో పాత్ర పరిచయం అయ్యింది.
  • ఇప్పుడు సమంత మరియు నాగశౌర్యల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
  • ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మరియు రావు రమేష్ ల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
  • ఇంటర్వెల్ అనంతరం రాజేంద్ర ప్రసాద్ మరియు సమంతల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.ఇప్పటి వరకు జరిగిన అసలు కథను రాజేంద్ర ప్రసాద్ కు సమంత చెప్పేసింది.
  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి ఒక సరికొత్త కథనంతో బాగుందనే చెప్పాలి.సమంత తన పెర్ఫామెన్స్ ఇప్పటి వరకు హైలైట్ గా నిలిచారు.మరి సెకండాఫ్ ఇంకెలా ఉంటుందో చూడాలి.
  • సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
  • నాగశౌర్య సమంతాను ఇష్టపడి ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నాడు. ఈ కథనం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.
  • యుక్త వయసుకు మారిన లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ ఇంటికే అద్దెకు ఉండడానికి వస్తుంది.ఆ సంబంధిత కామెడీ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
  • ఇప్పుడు “ఓహ్ బేబీ” పాటకు వేళయింది.ఈ పాటలో సమంత తన హావభావాలతో అదరగొట్టేస్తున్నారు.
  • ఒక కీలక సంఘటన ద్వారా వయసులో పెద్దగా ఉన్న బేబీ(లక్ష్మి)ను యుంగ్ బేబీ(సమంత)గా మార్చడానికి ఉపయోగపడే పాత్రగా జగపతిబాబు ఎంటర్ అయ్యారు.ఇప్పుడు అసలు ఫన్ మొదలయ్యింది.
  • ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మరియు లక్ష్మిల మధ్య కొన్ని భావిద్వేగపూరిత సన్నివేశాలు వస్తున్నాయి.
  • ఇప్పుడు నటి ప్రగతి, బేబీ(లక్ష్మి) కోడలిగా పరిచయం కాబడ్డారు.ఇప్పుడు కొన్ని కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.
  • రాజేంద్ర ప్రసాద్ మరియు లక్ష్మిలు ఒక మంచి పాత మిత్రులుగా కనిపిస్తున్నారు.ఇప్పుడు నాగ శౌర్య ఒక మ్యూజికల్ షో కో ఆర్డినేటర్ గా ఎంట్రీ ఇచ్చారు.
  • సినిమా ముసలి వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నదానిపై ఒక మెడికల్ కాలేజీలో రావు రమేష్ చెప్తున్న ఒక క్లాస్ తో ఇప్పుడే మొదలయ్యింది.ఇప్పుడు సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ మరియు లక్ష్మి ఆ మెడికల్ కాలేజ్ కాంటీన్ యాజమాన్యంగా ఎంట్రీ ఇచ్చారు.సంబంధిత కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
  • హాయ్..160 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ చిత్రం ‘ఓ బేబీ’. దక్షిణ కొరియా బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి బీవీ నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, తేజ, అడివి శేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జులై 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలవుతోంది.

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్‌ను చూసిన ప్రేక్షకులు సమంత హిట్టు కొట్టడం ఖాయమంటున్నారు. 23 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ 70 ఏళ్ల బామ్మ యాటిట్యూడ్‌తో ఆమె నటించిన తీరు ఎలా ఉంటుందో ట్రైలర్‌లో చూపించారు. సినిమాలో సమంత విశ్వరూపం చూపించడం ఖాయమని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. కామెడీ, ఎమోషన్‌తో కూడిన ఈ ఫాంటసీ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచేలా నటుడు, దర్శకుడు అడివి శేష్ ‘ఓ బేబీ’ ఫస్ట్ రివ్యూను వెల్లడించారు. తాజాగా సినిమా చూసిన ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు.

‘ఓ బేబీ సినిమా చూశాను! హృదయాన్ని హత్తుకునే తీయని ఫాంటసీ కథ. నందినిరెడ్డి ప్రతి ఎమోషన్‌ను చాలా కచ్చితంగా తెరకెక్కించారు. సమంత అయితే అద్భుతంగా చేశారు. చాలా అందంగా ఉన్నారు. లక్ష్మి గారు సినిమాకు ప్రాణం. చిన్మయి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాగశౌర్య, రావు రమేష్ గారు చాలా హుందాగా నటించారు’ అని అడివి శేష్ ట్వీట్ చేశారు.


మరో ట్వీట్‌లో రాజేంద్ర ప్రసాద్ సహా మిగిలిన నటీనటుల గురించి ప్రస్తావించారు. ‘రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రగతి, తేజ ఇలా తారాగణం అంతా చాలా బాగా చేశారు. ఈ రమ్యమైన కల్పితకథలో ప్రతి అంశం నిజంలానే అనిపిస్తుంది. ఇలాంటి సినిమాను అందించిన నిర్మాతలకు వందనం. సినిమాకు మూలమైన నందినిరెడ్డిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రస్తుతం మంచి కథలు వస్తున్నాయి’ అని శేష్ పేర్కొన్నారు.

విడుదల తేదీ : జూలై 05, 2019 నటీనటులు : సమంత,నాగ శౌర్య,లక్ష్మి,రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్,తేజ సజ్జా దర్శకత్వం : బి వి నందిని రెడ్డి నిర్మాత‌లు : సురేష్ బాబు,సునీతా తాటి,టి జి విశ్వ ప్రసాద్, థామస్ కిన్. సంగీతం : మిక్కీ జె మేయర్ సినిమాటోగ్రఫర్ : రిచర్డ్ ప్రసాద్ ఎడిటర్ : జునైద్ సిద్ధికి సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీఎత్తున విడుదలైంది. జీవితంలో కష్టాలు తప్ప ఎన్నడూ సుఖపడని ఓ 70 ఏళ్ల బామ్మకి.. విచిత్రంగా 20 ఏళ్ల యంగ్ లేడీగా మారే అవకాశం వస్తే, అప్పుడు ఆ ఇరవై ఏళ్ల యువతి ప్రవర్తన ఎలా ఉంటుందనే అంశాలు ప్రధానంగా ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, టీజర్స్ తో మూవీపై భారీ అంచనాలు కలిగేలా చేసింది. మరి సమంత నటించిన ఓ బేబీ మూవీ ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం. కథ: ఓ బేబీ మూవీ కథ విషయానికి వస్తే బేబీ(లక్ష్మి) ఎప్పుడూ ఏదో కోల్పియినట్లు అసహనంగా ఉండే ఓ బామ్మ. ఈమె ఓ క్యాంటీన్ ని నడుపుతూ ఉంటుంది. ఆమె మితిమీరిన డామినేషన్,చాదస్తాన్ని తట్టుకోలేక పోతుంటుంది ఆమె మనవరాలు. ఈ కుటుంబ మనస్పర్ధలతో బేబీ ఇంటినుండి గెంటివేయబడుతుంది. అలా నిరాశ్రయురాలైన బేబీ జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. తన కోరిక ప్రకారం వృద్ధురాలైన బేబీ యంగ్ లేడీగా మారిపోతుంది. మరొక మారు యవ్వనంలోకి ప్రవేశించిన బేబీ(సమంత) ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంది, ఈ ఊహించని ప్రయాణంలో ఆమెకు ఎదురైన సంఘటనలను ఎలా ఎదుర్కొంది అనేవి తెరపై చూడాలి. ప్లస్ పాయింట్స్: కొత్త కథను ఎంచుకోవడంతో పాటు, ఎంచుకున్న కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ నందిని రెడ్డి విజయం సాధించారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ఆమె కథను చిత్రీకరించిన తీరు అభినందనీయం. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలతో పోల్చితే నందిని రెడ్డి అత్యుత్తమ సినిమాగా ఓ బేబీ నిలుస్తుంది. ఇక సమంత నటన వర్ణించడానికి మాటలు చాలవంటే అతిశయోక్తి కాదు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపిన సమంత ప్రేక్షకుడిని కథతో ప్రయాణించేలా చేస్తుంది. ఆమె కెరీర్ లోనే ఓ బేబీ బెస్ట్ మూవీస్ లలో ఒకటిగా నిలిచిపోతుంది. ఈ మూవీలో సమంతను ఒక స్టార్ హీరోయిన్ లాగాక ఒక నటిగానే గుర్తుండిపోతుంది. రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలతో పాటు, పతాక సన్నివేశాలలో రావ్ రమేష్ తో వచ్చే సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడి చేత కంట నీరుపెట్టిస్తాయి. హాస్య సన్నివేశాలలో కూడా సమంత అవార్డు విన్నింగ్ నటనతో మెప్పించింది. ఈ సినిమా తరువాత సమంత ప్రతిభను ఇంకా మనం సరిగా వాడుకోవడం లేదనిపిస్తుంది. అలాగే సమంత తర్వాత ఈ మూవీ లో ప్రముఖంగా ప్రస్తావించాల్సిన నటుడు రాజేంద్ర ప్రసాద్. సమంత స్నేహితుడిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఆయన తన మార్కు హావభావాలతో ప్రతి సన్నివేశం రక్తికట్టించారు. అలాగే సినిమా మొదటి 15నిమిషాలలో వచ్చే సన్నివేశాల్లో వృద్ధురాలైన బేబీ పాత్రలో సీనియర్ నటి లక్ష్మి చక్కగా నటించి పాత్రకు జీవంపోశారు. ఇక సమంత సరసన హీరో గా చేసిన నాగ శౌర్య హ్యాండ్ సమ్ గా ఉన్నాడు, తన పాత్ర పరిధిలో చక్కగా నటించాడు. కుటుంబ విలువలు,మంచి విషయాలు చెప్పే బావోద్వేగమైన పాత్రలో రావు రమేష్ చక్కగా నటించారు. ఆయన పాత్ర సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. బాలనటుడిగా చాలా సినిమాలలో కనిపించి హీరోగా మారిన తేజ సజ్జా మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. సమంతని ప్రేమించే యువకుడిగా తన పాత్ర బాగుంది. ఇక రావ్ రమేష్ భార్య పాత్రలో ప్రగతి నటన బాగుంది.చిత్రం మొదటి సగం మొత్తం చక్కని కామెడీ సన్నివేశాలతో పాటు సున్నితమైన ఎమోషన్స్ తో అలరించిన నందిని, పతాక సన్నివేశాలలో చక్కని ప్రతిభతో ఆకట్టుకున్నారు. సినిమాకి ఆమె రాసుకున్న ముగింపుకూడా ప్రేక్షకుడికి నచ్చేలా ఉంది. మైనస్ పాయింట్స్: సినిమా రెండవ భాగం కొంచెం సాగతీతకు గురైనట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను తగ్గిస్తే బాగుండు అని భావన కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో మూవీ నెమ్మదించడంతో పాటు,తరువాత సన్నివేశాలు తేలికగా ఊహించే విధంగా ఉన్నాయి. సాంకేతిక విభాగం: సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి హృదయాలకు హత్తుకునేలా చిత్రీకరించడంలో కెమెరా మెన్ ప్రతిభ కనబడుతుంది. ఇక ఎడిటింగ్ పర్వాలేదనిపించింది, ఎందుకంటే దాదాపు 10నిమిషాల మూవీ నిడివి తగ్గించే అవకాశం ఉంది. నాగ శౌర్య , సమంత చాలా అందంగా కనిపించారు. పాటల పరంగా,బీజీఎమ్ పరంగా చూసిన మిక్కీ జె మేయర్ అద్భుతంగా చేశారు. ఇక దర్శకురాలు నందిని రెడ్డి ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే, ఓ బేబీ మూవీ తో ఆమె అద్భుతమే చేశారు. భావోద్వేగ సన్నివేశాలలో అలాగే కామెడీ సన్నివేశాలలో సమంత పాత్రను…

ఓ బేబీ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 3.25
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.75

3.5

ఓ బేబీ రివ్యూ

ఓ బేబీ రివ్యూ రేటింగ్

User Rating: 3.5 ( 1 votes)
4