Templates by BIGtheme NET
Home >> REVIEWS >> పేట రివ్యూ

పేట రివ్యూ


విడుదల తేదీ : జనవరి 10, 2019

నటీనటులు : రజినీకాంత్, సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష తదితరులు.

దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్

నిర్మాత : కళానిధి మారన్

సంగీతం : అనిరుద్ రవిచందర్

సినిమాటోగ్రఫర్ : యస్ తిరు

ఎడిటర్ : వివేక్ హర్షన్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘పేట’. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

కాళీ (రజిని కాంత్) భారీ రికమండేషన్ ఓ మాములు హాస్టల్ లో వార్డెన్ గా జాయిన్ అవుతాడు. అక్కడ జరిగే ర్యాగింగ్ ని తన స్టైల్ లో ఆపుతాడు. ఆ క్రమంలో ఒక ప్రేమ జంటకి వారి ప్రేమ విషయంలో సహాయం చెయ్యటానికి అంగీకరిస్తాడు. ఆ ప్రోసెస్ లో ప్రాణిక్ హీలర్ గా పనిచేసే సిమ్రాన్ తో రజినికి పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతున్న క్రమంలో కొన్ని ఊహించని సంఘటనల మధ్య రజిని పై, ప్రేమ విషయంలో రజిని సహాయం చేస్తోన్న ఆ కుర్రాడి పై ఒక గ్యాంగ్ దాడి చేస్తోంది. ఆ దాడి అనంతరం జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రజిని గతం గురించి తెలుస్తోంది. ఆ గతం ఏమిటి ? అసలు రజినీకి ఆ కుర్రాడికి ఏమిటి సంబంధం ? రజిని మరియు ఆ కుర్రాడి పై దాడి చేసిన ఆ గ్యాంగ్ ఎవరు? అసలు రజిని వార్డెన్ గా ఎందుకు జాయిన్ అయ్యాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంతో రజినీ మళ్ళీ పాత రజినిని గుర్తుకుతెచ్చాడు. హాస్టల్ వార్డెన్ పాత్రలో నటించిన ఆయన, తన పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, తన మార్క్ యాక్టింగ్ తో స్టయిల్ తో సినిమాకి హైలెట్ గా నిలచారు. అలాగే తన కామెడీ టైమింగ్ తోనూ రజిని అక్కడక్కడ నవ్విస్తారు.

మరో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో పాటు తన కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో హీరోయిన్స్ గా నటించిన సిమ్రాన్, త్రిష పాత్ర పరిధిలో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించినా తమ నటనతో తమ గ్లామర్ తో ఆకట్టుకుంటారు.

అలాగే విలన్ గా నటించిన నవాజుద్దిన్ సిధ్దిఖి కూడా చాలా బాగా చేశాడు. క్రూరత్వంతో కూడుకున్న ఒక బలహీనమైన విలన్ గా ఆయన నటన బాగుంది. ఇక డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రజినీ స్టైల్ ని, మ్యానరిజం ను పూర్తిగా వాడుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాంతో ఈ చిత్రం రజిని అభిమానులను బాగానే అలరిస్తోంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్నేహానికి,  పగకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. చాలా సన్నివేశాలను ఆయన నెమ్మదిగా నడిపి బోర్ కొట్టించారు. హీరో, విలన్ల మధ్యన వచ్చే పగ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలోని సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చాలా సాగతీతగా అనిపిస్తాయి.

మొదటి భాగంలో రజిని – సిమ్రాన్ మధ్య లవ్ ట్రాక్ సరదాగా సాగినప్పటికీ.. సెకెండాఫ్ లో ఆ లవ్ ట్రాక్ ను ఇంకా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో ఆ లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. యాక్షన్ ప్లో కి అడ్డు అని అనుకున్నా.. కనీసం ఆ లవ్ ట్రాక్ కి సరైన ముగింపు ఇవ్వాల్సింది. కానీ అసలు ముగింపే ఇవ్వలేదు.

పైగా సినిమాలో అక్కడక్కడ తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తానికి దర్శకుడు కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. కార్తీక్ సుబ్బరాజు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘పేట’. రజినితో పాటు సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. చిత్రంలో కొన్ని మెప్పించే అంశాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన కథనం నెమ్మదిగా సాగడం, సినిమాలో మెయిన్ థీమ్ కు తగట్లు ట్రీట్మెంట్ లేకపోవడం, ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను రూపొందించలేకపోవడం, సినిమాలో కొన్ని సన్నివేశాలు తెలుగు నేటివిటీకి కొంచెం దూరంగా అనిపించడం.. వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలుస్తాయి.

అయితే, హీరోహీరోయిన్ల మధ్య కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు రజిని మార్క్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు, కేవలం రజిని అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా చేసినట్లు అనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా మాములు ప్రేక్షకుల్ని పూర్తిగా మెప్పించలేకపోవచ్చు. కేవలం రజిని అభిమానులకు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

  • ఇక్కడే మరో ఆసక్తికర ట్విస్ట్ తో సినిమా మొత్తానికి పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం  చూస్తూ ఉండండి.

  • సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దిశగా చేరుకుంటుంది.నవాజుద్దీన్ సిద్ధిఖీ మీద దాడి చేసేందుకు రజిని మరియు విజయ్ సేతుపతి చేతులు కలిపారు.

  • సినిమా ఇప్పుడు కాస్త సైడ్ ట్రాక్ తీసుకున్నట్టు అనిపిస్తుంది.రజిని మరియు సేతుపతిల మధ్య సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • ఇప్పుడు విజయ్ సేతుపతితో రజిని మరో ఆసక్తికర ప్లాన్ చేస్తున్న సన్నివేశం వస్తుంది.చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ మరోసారి సిగెరెట్ తాగుతున్న సీన్ తో కనిపిస్తున్నారు.

  • ఇప్పుడు రజినీని ఎలివేట్ చేసే సీన్లు పేట పరాక్ బ్యాక్గ్రౌండ్ పాటతో వస్తున్నాయి.

  • ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ముగిసిపోయింది.ఇప్పుడు రజిని నవాజ్ పై తన ప్రతీకారాన్ని తీర్చుకోడానికి కాలేజ్ విద్యార్థుల సాయంతో ప్లాన్ చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.

  • అన్ని సినిమాల్లో లానే పేట భార్య త్రిషను,అతని స్నేహితుడు శశి కుమార్ ను నవాజ్ బాంబు దాడితో చంపేశారు.

  • ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సుద్దికీ సోదరున్ని చంపడానికి పేట ఒక ఇంటెరెస్టింగ్ ప్లాన్ వేస్తున్నాడు.ఇప్పుడు ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.

  • పేట భార్యగా హీరోయిన్ త్రిష ఎంట్రీ ఇచ్చారు.

  • ఇంటర్వెల్ తర్వాత రజిని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.శశి కుమార్ పేట(రజిని) స్నేహితునిగా ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు ఆహ కళ్యాణం పాట వస్తుంది.

  • ఫస్టాఫ్ రిపోర్ట్ : మొత్తానికి మొదటి సగం అంతా రజిని హిట్ సినిమా బాషా స్టైల్ లో మంచి నరేషన్ తో మంచి ఎలివేషన్ సీన్లతో బాగానే ఉంది.

  • చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా సగం పూర్తి కావచ్చింది.ఇప్పుడు విరామం.

  • ఇప్పుడు సినిమా ప్రారంభంలో వచ్చిన ఫైట్ సీన్ కి కనెక్ట్ చేసే విధంగా మారింది.రజిని నాన్ చాక్ తో ఫైట్ అదగొడుతున్నారు.

  • సినిమా ఇప్పుడు ఇంకా సీరియస్ గా సాగుతుంది.రజిని మరియు విలన్ల మధ్య భారీ పోరాట సన్నివేశానికి ఇప్పుడు రంగం సిద్ధమయ్యింది.

  • ఫైట్ సీన్ లో ఇప్పుడొక ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది.రజిని మరోసారి తన యాక్షన్ అదరగొడుతుంటే దానికి తగ్గట్టుగా అనిరుద్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అడగొడుతున్నాడు.

  • బాబీ సింహా అతని గ్యాంగ్ అక్కడి కాలేజ్ జూనియర్స్ మీద మరియు రజిని పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..ఇప్పుడు రజిని మరియు స్టూడెంట్స్ మధ్య ఉల్లాల్ల పాట వస్తుంది.

  • మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లో ప్రేమికులకు పెళ్లి చేసే గ్యాంగ్ లీడర్ గా విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చారు.

  • ఇప్పుడు సిమ్రాన్ మరియు రజినీలా మధ్య పెదవి చివరికే పాట వస్తుంది.ఈ పాటలో ఈ ఇద్దరి జంట ముచ్చటగా ఉంది.

  • అక్కడి క్యాంపస్ లో పిశాచి సినిమా హీరో నాగ మరియు మేఘా ఆకాష్ లు ప్రేమికులుగా కనిపిస్తున్నారు.ఇప్పుడు ప్రాణిక్ హీలర్ గా సీనియర్ నటి సిమ్రాన్ ఎంట్రీ ఇచ్చారు.

  • మొదటి సంవత్సరం విద్యార్ధినిగా మేఘా ఆకాష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.

  • జూనియర్స్ ని ర్యాగింగ్ చేసే సీనియర్ లా బాబీ సింహా ఎంట్రీ ఇచ్చారు,ఇప్పుడు అనిరుద్ అందించిన మాస్ బీట్ మాసు మరనం పాటకి బాబీ సింహా మరియు స్టూడెంట్స్ తో పాటు సూపర్ స్టార్ కూడా తనదైన స్టెప్స్ వేస్తున్నారు.

  • ఇప్పుడు చిత్రం 6 నెలల వెనక్కి వెళ్ళింది,రజినీకాంత్ ఒక హాస్టల్ వార్డెన్ గా పరిచయం కాబడ్డారు.

  • యాక్షన్ సన్నివేశంతో సినిమా మొదలయ్యింది..రజిని ఎంట్రీకి ఇప్పుడు రంగం సిద్ధమయ్యింది.

  • హాయ్ 172 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది..

విడుదల తేదీ : జనవరి 10, 2019 నటీనటులు : రజినీకాంత్, సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష తదితరులు. దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత : కళానిధి మారన్ సంగీతం : అనిరుద్ రవిచందర్ సినిమాటోగ్రఫర్ : యస్ తిరు ఎడిటర్ : వివేక్ హర్షన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘పేట’. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : కాళీ (రజిని కాంత్) భారీ రికమండేషన్ ఓ మాములు హాస్టల్ లో వార్డెన్ గా జాయిన్ అవుతాడు. అక్కడ జరిగే ర్యాగింగ్ ని తన స్టైల్ లో ఆపుతాడు. ఆ క్రమంలో ఒక ప్రేమ జంటకి వారి ప్రేమ విషయంలో సహాయం చెయ్యటానికి అంగీకరిస్తాడు. ఆ ప్రోసెస్ లో ప్రాణిక్ హీలర్ గా పనిచేసే సిమ్రాన్ తో రజినికి పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతున్న క్రమంలో కొన్ని ఊహించని సంఘటనల మధ్య రజిని పై, ప్రేమ విషయంలో రజిని సహాయం చేస్తోన్న ఆ కుర్రాడి పై ఒక గ్యాంగ్ దాడి చేస్తోంది. ఆ దాడి అనంతరం జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రజిని గతం గురించి తెలుస్తోంది. ఆ గతం ఏమిటి ? అసలు రజినీకి ఆ కుర్రాడికి ఏమిటి సంబంధం ? రజిని మరియు ఆ కుర్రాడి పై దాడి చేసిన ఆ గ్యాంగ్ ఎవరు? అసలు రజిని వార్డెన్ గా ఎందుకు జాయిన్ అయ్యాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : ఈ చిత్రంతో రజినీ మళ్ళీ పాత రజినిని గుర్తుకుతెచ్చాడు. హాస్టల్ వార్డెన్ పాత్రలో నటించిన ఆయన, తన పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, తన మార్క్ యాక్టింగ్ తో స్టయిల్ తో సినిమాకి హైలెట్ గా నిలచారు. అలాగే తన కామెడీ టైమింగ్ తోనూ రజిని అక్కడక్కడ నవ్విస్తారు. మరో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో పాటు తన కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో హీరోయిన్స్ గా నటించిన సిమ్రాన్, త్రిష పాత్ర పరిధిలో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించినా తమ నటనతో తమ గ్లామర్ తో ఆకట్టుకుంటారు. అలాగే విలన్ గా నటించిన నవాజుద్దిన్ సిధ్దిఖి కూడా చాలా బాగా చేశాడు. క్రూరత్వంతో కూడుకున్న ఒక బలహీనమైన విలన్ గా ఆయన నటన బాగుంది. ఇక డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రజినీ స్టైల్ ని, మ్యానరిజం ను పూర్తిగా వాడుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాంతో ఈ చిత్రం రజిని అభిమానులను బాగానే అలరిస్తోంది. మైనస్ పాయింట్స్ : దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్నేహానికి,  పగకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. చాలా సన్నివేశాలను ఆయన నెమ్మదిగా నడిపి బోర్ కొట్టించారు. హీరో, విలన్ల మధ్యన వచ్చే పగ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలోని సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చాలా సాగతీతగా అనిపిస్తాయి. మొదటి భాగంలో రజిని – సిమ్రాన్ మధ్య లవ్ ట్రాక్ సరదాగా సాగినప్పటికీ.. సెకెండాఫ్ లో ఆ లవ్ ట్రాక్ ను ఇంకా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో ఆ లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. యాక్షన్ ప్లో కి అడ్డు అని అనుకున్నా.. కనీసం ఆ లవ్ ట్రాక్ కి సరైన ముగింపు ఇవ్వాల్సింది. కానీ అసలు ముగింపే ఇవ్వలేదు. పైగా సినిమాలో అక్కడక్కడ తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తానికి దర్శకుడు కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. కార్తీక్ సుబ్బరాజు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సాంకేతిక విభాగం : దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా…

పేట రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 2.25
దర్శకత్వ ప్రతిభ - 2.25

2.6

పేట రివ్యూ

పేట రివ్యూ

User Rating: 2.7 ( 1 votes)
3