Templates by BIGtheme NET
Home >> REVIEWS >> రాగల 24 గంటల్లో రివ్యూ

రాగల 24 గంటల్లో రివ్యూ


రాగల 24 గంటల్లో’ మూవీ రివ్యూ

నటీనటులు: ఈషా రెబ్బా-సత్యదేవ్-శ్రీరామ్-గణేష్ వెంకట్రామన్-ముస్కాన్ సేథీ-కృష్ణ భగవాన్-అదిరే అభి-టెంపర్ వంశీ-రవి ప్రకాష్-రవి వర్మ తదితరులు
సంగీతం: రఘు కుంచె
ఛాయాగ్రహణం: అంజి
నిర్మాత: శ్రీనివాస్ కానూరు
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి

ఒకప్పుడు చిన్న స్థాయిలో కామెడీ సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. అలాంటి వాడు ‘ఢమరుకం’ లాంటి భారీ చిత్రం తీశాడు. ఈ సినిమా నిరాశ పరిచింది. అతడి కెరీర్ గాడి తప్పింది. మధ్యలో ‘మామ మంచు అల్లుడు కంచు’ లాంటి కామెడీ సినిమానే చేసినా సరైన ఫలితం దక్కలేదు. ఇప్పుడతను ‘రాగల 24 గంటల్లో’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సత్యదేవ్ ఈషా రెబ్బా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: రాహుల్ (సత్యదేవ్) ఇండియాలోనే టాప్ మోడలింగ్ ఫొటోగ్రాఫర్. ఐతే తన చుట్టూ ఎంతోమంది అమ్మాయిలున్నా పట్టించుకోని రాహుల్.. అనాథ అయిన విద్య (ఈసా రెబ్బా)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను మెప్పించి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ పెళ్లి తర్వాత రాహుల్ విపరీత మనస్తత్వం గురించి విద్యకు తెలుస్తుంది. అతడితో ఆమెకు పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవ తర్వాత అతను చనిపోతాడు. ఈ హత్య తానే చేశానని విద్య పోలీసులకు లొంగిపోతుంది. కానీ ఈ హత్య వెనుక పెద్ద మిస్టరీ ఉందని తర్వాత తేలుతుంది. ఏంటా మిస్టరీ అన్నదే మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘రాగల 24 గంటల్లో’లో ఈషా రెబ్బాకు జోడీగా నటించిన సత్యదేవ్ ఇండియాలోనే నంబర్ ఫొటోగ్రాఫర్. అతనో ఫొటో షూట్ చేస్తే ఆ అమ్మాయి టాప్ మోడల్ అయిపోవాల్సిందే. ఆయన గారు బయటెక్కడైనా కనిపిస్తే ఫ్యాన్స్ వెంటపడి సెల్ఫీలు తీసుకుంటారు. ఇంత పేరున్న ఫొటోగ్రాఫర్.. ఒక అమ్మాయి ఫొటో షూట్ కోసం వస్తే.. డ్రెస్ తీసేయమంటాడు. న్యూడ్ ఫొటో షూట్ అని చాలా క్యాజువల్గా చెబుతాడు. ఆమె కాదంటుంది. అతడికి కోపం వస్తుంది. ఆమె పారిపోతుంటే ఆపి.. ముఖం మీద తన్ని గొంతు మీద నొక్కి చంపేస్తాడు. ఆమెను కాపాడ్డానికి వచ్చిన వాళ్లను కూడా చాలా క్యాజువల్గా చంపేస్తాడు. ఇండియాస్ నంబర్ వన్ ఫొటోగ్రాఫర్ ఇలా ప్రొఫెషనల్ న్యూడ్ షూట్ల కోసం అమ్మాయిల్ని ఒత్తిడి చేయడమేంటో.. కాదంటే చాలా సింపుల్గా ఒకరి తర్వాత ఒకరిని చంపేయడమేంటో అర్థం కాదు. ఈయన విపరీత మనస్తత్వం ఇంకా ఎలా ఉంటుందంటే.. ఫస్ట్ నైట్ జరిగిన రాత్రి బెడ్ రూం నిండా కెమెరాలు పెట్టి మొత్తం షూట్ చేశాడు. తర్వాత విషయం తెలిసి ఇదేంటంటే చాలా మామూలుగానే ఇందులో తప్పేంటి అంటాడు. ఇలాంటి విపరీత మనస్తత్వం ఉండే వ్యక్తులు ఉండొచ్చు. కానీ ఇలాంటోడు ఇండియాలోనే టాప్ ఫొటోగ్రాఫర్ అయిపోవడం.. న్యూడ్ ఫొటో షూట్లు చేయడం ఏంటో అంతు బట్టదు. ఈ పాత్ర తాలూకు విన్యాసాలు సినిమాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే తట్టుకోవడం కష్టం. ‘రాగల 24 గంటల్లో’ సినిమా ప్రేక్షకుల్ని ఎంత ఫ్రస్టేట్ చేస్తుందో చెప్పడానికి ఉదాహరణగా ఈ పాత్ర ఒక్కటి చాలు.

తన పాటికి తానేదో కామెడీ సినిమాలు చేసుకున్నంత కాలం శ్రీనివాసరెడ్డి బండి బాగానే నడిచింది. కానీ తనకు సరిపడని ‘ఢమరుకం’ చేశాక ఆయన పూర్తిగా సినిమా తీయడంలోనే పట్టు కోల్పోయినట్లున్నాడు. లేకుంటే థ్రిల్లర్ సినిమా అని చెప్పి ‘రాగల 24 గంటల్లో’ సినిమాను ఒక డ్రామా లాగా నడిపించాడు. ఈ టైటిల్ సినిమా జానర్ మీద ఒక అంచనాతో థ్రిల్స్ కోసం వెళ్తే అసలేమాత్రం థ్రిల్ అన్నదే లేకుండా చేయడమే ఇందులో థ్రిల్ అని తర్వాత తెలుస్తుంది. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ సాగే ఈ కథలో చివరి దాకా సస్పెన్స్ మెయింటైన్ చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని మాత్రం బాగానే పాటించారు. కానీ 24 గంటల వ్యవధిలో జరిగే పరిణామాలతో కథను నడిపించడమంటే అందుకు ఎంతో కసరత్తు జరగాలి. ముఖ్యంగా బిగువైన స్క్రీన్ ప్లే ఇలాంటి సినిమాలకు అత్యంత కీలకం. కానీ థ్రిల్లర్ సినిమాలు తీసిన అనుభవమే లేని శ్రీనివాసరెడ్డి.. ఈ జానర్ కు ఏమాత్రం కుదరని స్క్రీన్ ప్లేతో సినిమాను నీరుగార్చేశాడు.

హీరోయిన్ భర్త హత్యకు గురవుతాడు. ఆ హత్య వెనుక మిస్టరీ ఏంటో తేలాలి. హత్య సంగతి మొదట్లోనే రివీల్ అవుతుంది. ఆ తర్వాత అసలేం జరిగిందనే ఉత్కంఠతో ప్రేక్షకుడు సినిమాలోకి తొంగి చూస్తాడు. కానీ ఫ్లాష్ బ్యాక్ పేరుతో ఒక నడిపించిన డ్రామా.. ప్రేక్షకుల్ని ఎంతగా విసిగించాలో అంతా విసిగిస్తుంది. పేరుకేమో టాప్ ఫొటోగ్రాఫర్.. కోటీశ్వరుడు.. చేసేవన్నీ చిల్లర పనులు. హీరోలా కనిపించే విలన్ పాత్రలోని శాడిజాన్ని ఎలివేట్ చేయడానికి తీసిన సన్నివేశాలు భరించడం చాలా కష్టమే అవుతుంది. ప్రథమార్ధమంతా ఈ సోదితోనే కాలం గడుస్తుంది. ఇక ద్వితీయార్ధం మొదలయ్యాక కానీ దర్శకుడికి తాను తీస్తున్నది థ్రిల్లర్ సినిమా అని అర్థం కాలేదు. అక్కడి నుంచి కాస్త మలుపులతో కథను నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ మలుపులు కూడా అంత ఎగ్జైటింగ్గా ఏమీ లేవు. ‘ఎవరు’ లాంటి థ్రిల్లర్లు వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి పాత కాలపు కథాకథనాలు ప్రేక్షకులకు రుచించడం చాలా కష్టం. హత్య వెనుక అసలు కారణం రివీల్ చేయడానికి ముందు మళ్లీ ఒక ఫ్లాష్ బ్యాక్ నడిపించారు. అది మరీ పేలవంగా ఉండటంతో ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలన్న ఉత్కంఠ కూడా చచ్చిపోతుంది. చివర్లో అసలు హంతుకులెవరో తెలిశాక కూడా పెద్దగా సర్ప్రైజ్ అయ్యేదేమీ ఉండదు. ముగింపు మరీ సాధారణంగా ఉండటంతో సినిమా మీద కాస్తయినా ఇంప్రెషన్ కలగదు.

నటీనటులు: ఈషా రెబ్బా ఈ సినిమాలో ప్రాధాన్యమున్న పాత్రే చేసింది. తన వంతుగా ఆమె బాగానే నటించింది. తనలోని గ్లామర్ కోణాన్ని కూడా సినిమాలో చూపించింది. సత్యదేవ్ తొలిసారిగా పూర్తి స్థాయి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. అతడి నటనకు వంకలు పెట్టడానికి లేదు. ఇలాాంటి పాత్రల్లో చూడటం కొత్తే. కానీ అతడి పాత్ర బాగా చిరాకు పెట్టేస్తుంది. గణేష్ వెంట్రామన్ ఓవరాక్షన్ తో ఇబ్బంది పెట్టాడు. శ్రీరామ్ పాత్రకు బిల్డప్ ఎక్కువైంది. కృష్ణభగవాన్ ఎప్పుడెప్పుడూ తెర నుంచి బయటికి వెళ్తాడా అన్నంతగా విసిగించాడు. ముస్కాన్ సేథీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం: సినిమాలో విషయాన్ని బట్టే సాంకేతిక నిపుణులు కూడా ఔట్ పుట్ ఇస్తారనడానికి ‘రాగల 24 గంటల్లో’ ఒక రుజువుగా నిలుస్తుంది. రఘు కుంచె లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ పూర్తిగా నిరాశ పరిచాడు. పాటలేవీ గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం ఎక్కడా ప్రత్యేకంగా అనిపించదు. అంజి ఛాయాగ్రహణంలోనూ ఏ విశేషం లేదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి తనకు ఏమాత్రం పట్టులేని థ్రిల్లర్ జానర్లో సినిమా ప్రయత్నించి ఫెయిలయ్యాడు. కథే అంతంతమాత్రం అంటే.. స్క్రీన్ ప్లే మరీ సాధారణం. ప్రస్తుత రోజుల్లో ఎలాంటి థ్రిల్లర్లు వస్తున్నాయి.. ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంది అన్నది చూడకుండా తనకు కుదిరిన విధంగా సినిమా లాగించేశాడు. దర్శకుడిగా అతను పూర్తిగా విఫలమయ్యాడు.

రాగల 24 గంటల్లో’ మూవీ రివ్యూ నటీనటులు: ఈషా రెబ్బా-సత్యదేవ్-శ్రీరామ్-గణేష్ వెంకట్రామన్-ముస్కాన్ సేథీ-కృష్ణ భగవాన్-అదిరే అభి-టెంపర్ వంశీ-రవి ప్రకాష్-రవి వర్మ తదితరులు సంగీతం: రఘు కుంచె ఛాయాగ్రహణం: అంజి నిర్మాత: శ్రీనివాస్ కానూరు స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి ఒకప్పుడు చిన్న స్థాయిలో కామెడీ సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. అలాంటి వాడు ‘ఢమరుకం’ లాంటి భారీ చిత్రం తీశాడు. ఈ సినిమా నిరాశ పరిచింది. అతడి కెరీర్ గాడి తప్పింది. మధ్యలో ‘మామ మంచు అల్లుడు కంచు’ లాంటి కామెడీ సినిమానే చేసినా సరైన ఫలితం దక్కలేదు. ఇప్పుడతను ‘రాగల 24 గంటల్లో’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సత్యదేవ్ ఈషా రెబ్బా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: రాహుల్ (సత్యదేవ్) ఇండియాలోనే టాప్ మోడలింగ్ ఫొటోగ్రాఫర్. ఐతే తన చుట్టూ ఎంతోమంది అమ్మాయిలున్నా పట్టించుకోని రాహుల్.. అనాథ అయిన విద్య (ఈసా రెబ్బా)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను మెప్పించి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ పెళ్లి తర్వాత రాహుల్ విపరీత మనస్తత్వం గురించి విద్యకు తెలుస్తుంది. అతడితో ఆమెకు పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవ తర్వాత అతను చనిపోతాడు. ఈ హత్య తానే చేశానని విద్య పోలీసులకు లొంగిపోతుంది. కానీ ఈ హత్య వెనుక పెద్ద మిస్టరీ ఉందని తర్వాత తేలుతుంది. ఏంటా మిస్టరీ అన్నదే మిగతా కథ. కథనం-విశ్లేషణ: ‘రాగల 24 గంటల్లో’లో ఈషా రెబ్బాకు జోడీగా నటించిన సత్యదేవ్ ఇండియాలోనే నంబర్ ఫొటోగ్రాఫర్. అతనో ఫొటో షూట్ చేస్తే ఆ అమ్మాయి టాప్ మోడల్ అయిపోవాల్సిందే. ఆయన గారు బయటెక్కడైనా కనిపిస్తే ఫ్యాన్స్ వెంటపడి సెల్ఫీలు తీసుకుంటారు. ఇంత పేరున్న ఫొటోగ్రాఫర్.. ఒక అమ్మాయి ఫొటో షూట్ కోసం వస్తే.. డ్రెస్ తీసేయమంటాడు. న్యూడ్ ఫొటో షూట్ అని చాలా క్యాజువల్గా చెబుతాడు. ఆమె కాదంటుంది. అతడికి కోపం వస్తుంది. ఆమె పారిపోతుంటే ఆపి.. ముఖం మీద తన్ని గొంతు మీద నొక్కి చంపేస్తాడు. ఆమెను కాపాడ్డానికి వచ్చిన వాళ్లను కూడా చాలా క్యాజువల్గా చంపేస్తాడు. ఇండియాస్ నంబర్ వన్ ఫొటోగ్రాఫర్ ఇలా ప్రొఫెషనల్ న్యూడ్ షూట్ల కోసం అమ్మాయిల్ని ఒత్తిడి చేయడమేంటో.. కాదంటే చాలా సింపుల్గా ఒకరి తర్వాత ఒకరిని చంపేయడమేంటో అర్థం కాదు. ఈయన విపరీత మనస్తత్వం ఇంకా ఎలా ఉంటుందంటే.. ఫస్ట్ నైట్ జరిగిన రాత్రి బెడ్ రూం నిండా కెమెరాలు పెట్టి మొత్తం షూట్ చేశాడు. తర్వాత విషయం తెలిసి ఇదేంటంటే చాలా మామూలుగానే ఇందులో తప్పేంటి అంటాడు. ఇలాంటి విపరీత మనస్తత్వం ఉండే వ్యక్తులు ఉండొచ్చు. కానీ ఇలాంటోడు ఇండియాలోనే టాప్ ఫొటోగ్రాఫర్ అయిపోవడం.. న్యూడ్ ఫొటో షూట్లు చేయడం ఏంటో అంతు బట్టదు. ఈ పాత్ర తాలూకు విన్యాసాలు సినిమాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే తట్టుకోవడం కష్టం. ‘రాగల 24 గంటల్లో’ సినిమా ప్రేక్షకుల్ని ఎంత ఫ్రస్టేట్ చేస్తుందో చెప్పడానికి ఉదాహరణగా ఈ పాత్ర ఒక్కటి చాలు. తన పాటికి తానేదో కామెడీ సినిమాలు చేసుకున్నంత కాలం శ్రీనివాసరెడ్డి బండి బాగానే నడిచింది. కానీ తనకు సరిపడని ‘ఢమరుకం’ చేశాక ఆయన పూర్తిగా సినిమా తీయడంలోనే పట్టు కోల్పోయినట్లున్నాడు. లేకుంటే థ్రిల్లర్ సినిమా అని చెప్పి ‘రాగల 24 గంటల్లో’ సినిమాను ఒక డ్రామా లాగా నడిపించాడు. ఈ టైటిల్ సినిమా జానర్ మీద ఒక అంచనాతో థ్రిల్స్ కోసం వెళ్తే అసలేమాత్రం థ్రిల్ అన్నదే లేకుండా చేయడమే ఇందులో థ్రిల్ అని తర్వాత తెలుస్తుంది. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ సాగే ఈ కథలో చివరి దాకా సస్పెన్స్ మెయింటైన్ చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని మాత్రం బాగానే పాటించారు. కానీ 24 గంటల వ్యవధిలో జరిగే పరిణామాలతో కథను నడిపించడమంటే అందుకు ఎంతో కసరత్తు జరగాలి. ముఖ్యంగా బిగువైన స్క్రీన్ ప్లే ఇలాంటి సినిమాలకు అత్యంత కీలకం. కానీ థ్రిల్లర్ సినిమాలు తీసిన అనుభవమే లేని శ్రీనివాసరెడ్డి.. ఈ జానర్ కు ఏమాత్రం కుదరని స్క్రీన్ ప్లేతో సినిమాను నీరుగార్చేశాడు. హీరోయిన్ భర్త హత్యకు గురవుతాడు. ఆ హత్య వెనుక మిస్టరీ ఏంటో తేలాలి. హత్య సంగతి మొదట్లోనే రివీల్ అవుతుంది. ఆ తర్వాత అసలేం జరిగిందనే ఉత్కంఠతో ప్రేక్షకుడు సినిమాలోకి తొంగి చూస్తాడు. కానీ ఫ్లాష్ బ్యాక్ పేరుతో ఒక నడిపించిన డ్రామా.. ప్రేక్షకుల్ని ఎంతగా విసిగించాలో అంతా విసిగిస్తుంది. పేరుకేమో టాప్ ఫొటోగ్రాఫర్.. కోటీశ్వరుడు.. చేసేవన్నీ చిల్లర పనులు. హీరోలా కనిపించే విలన్ పాత్రలోని శాడిజాన్ని ఎలివేట్ చేయడానికి తీసిన సన్నివేశాలు భరించడం చాలా కష్టమే అవుతుంది. ప్రథమార్ధమంతా ఈ సోదితోనే కాలం గడుస్తుంది. ఇక ద్వితీయార్ధం మొదలయ్యాక కానీ దర్శకుడికి తాను తీస్తున్నది థ్రిల్లర్ సినిమా అని అర్థం కాలేదు. అక్కడి నుంచి…

రాగల 24 గంటల్లో రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2
నటీ-నటుల ప్రతిభ - 2.5
సాంకేతిక వర్గం పనితీరు - 2
దర్శకత్వ ప్రతిభ - 2

2.1

రాగల 24 గంటల్లో రివ్యూ

రాగల 24 గంటల్లో రివ్యూ

User Rating: Be the first one !
2