Templates by BIGtheme NET
Home >> REVIEWS >> రెడ్ రివ్యూ

రెడ్ రివ్యూ


చిత్రం : రెడ్
నటీనటులు : రామ్ పోతినేని, మాల్వికా శర్మ, అమృత అయ్యర్, నివేదా పెతురాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, హెబా పటేల్, సోనియా అగర్వాల్
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాత‌లు : స్రవంతి రవికిషోర్
సంగీతం : మణి శర్మ
సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి
ఎడిట‌ర్‌ : జునైద్ సిద్దిఖీ
విడుదల తేదీ : జనవరి 14, 2021

‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అందుకున్న తరువాత రామ్, ఈ సంక్రాంతి పండక్కి ‘రెడ్’ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

ఈ రెడ్ కథలో రామ్ ఆదిత్య అండ్ సిద్ధార్థ్ గా రెండు పాత్రల్లో కనిపిస్తాడు. సిద్ధార్థ్ వృత్తిరీత్యా ఇంజనీర్ కాగా, ఆదిత్య ఒక దొంగ. అయితే, ఒక రోజు, ఆకాష్ అనే వ్యక్తి చంపబడతాడు. ఆ హత్య చేసింది, సిద్ధార్థ్ నే చెప్పి అతన్ని అరెస్టు చేస్తారు. కానీ, ఆదిత్య కూడా ఇదే కేసులో చిక్కుకున్నప్పుడు కథలోని అసలు పాయింట్ అండ్ ట్విస్ట్ తలెత్తుతుంది. ఇంతకీ, ఆకాష్‌ను ఎవరు చంపారు? అసలు ఆ హత్య వెనుక అలాగే కథలోని అసలు చిక్కు ముడి వెనుక మొత్తం ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? అది కథను ఎలా ముందుకు నడిపింది ? చివరకు ఆదిత్య అండ్ సిద్ధార్థ్ ఆ హత్య కేసు నుండి ఎలా బయటపడతారు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధానంగా ఆదిత్య, సిద్ధార్థ్ రెండు పాత్రలు మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి. పైగా ఆ రెండు పాత్రల్లో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమా అంత రెండు పాత్రల మధ్య వెరీయేషన్స్ చూపిస్తూ చాలా సెట్టిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. రెండు పాత్రలలోని వైవిధ్యాలను రామ్, ప్రతి సీన్ లోనూ చక్కగా ప్రదర్శించిన విధానం మాత్రం మొత్తం సినిమాలోనే హైలైట్ గా నిలుస్తోంది

ఇక హీరోయిన్ మాలవికా శర్మ సినిమాలో అందంగా కనిపిస్తోంది. కాని ఈ చిత్రంలో ఆమెకు పెద్దగా స్కోప్ అండ్ స్క్రీన్ స్పెస్ కూడా లేదు. ఇక వెన్నెలా కిషోర్ కొన్ని సన్నివేశాల్లో కామెడీని పండించాడు. అలాగే హాస్యనటుడు సత్య తన పాత్రలో కూడా మంచి ఫన్ ను జనరేట్ చేశాడు. పోసాని అలాగే మిగిలిన నటీనటులు బాగానే నటించారు. ఇక ఈ చిత్రంలో పోలీసుల సెటప్ అండ్ సీన్స్ కూడా బాగున్నాయి.

ఇంటర్వెల్ బ్లాక్, దర్యాప్తులో వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక నివేదా పెతురాజ్ తన పాత్రలో ఓకే అనిపించింది. డైరెక్టర్ డైరెక్షన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ ను ఎమోషన్స్ తో డీల్ చేసిన విధానం బాగుంది. ఆయన రాసిన డైలాగ్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో పెద్ద లోపం ఏమిటంటే, ఈ చిత్రం ఆకర్షణీయమైన ట్రీట్మెంట్ లేకపోవడం. ప్రొసీడింగ్స్‌పై పట్టు లేనందున మొదటి సన్నివేశం నుండే ఈ చిత్రం నిస్తేజంగానే సాగుతోంది. పైగా నివేదా పాత్ర బలహీనంగా ఉన్నందున దర్యాప్తు సీన్స్ కూడా సిల్లీగా అనిపిస్తాయి. దాంతో ఈ సినిమా ఎటువంటి ప్రభావాన్ని సృష్టించదు.

ఇది కాకుండా, సినిమా ప్లే కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. అసలు మెయిన్ కథ విరామం సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. హీరోకి స్నేహితురాలను పోలీసులు తమ దర్యాప్తులో ఆమెను విస్మరిస్తారు. ఇలా లాజిక్ లేకుండా సాగింది ఇన్విస్టిగేషన్. అలాగే, హీరోకు నివేదా ఎందుకు సహాయం చేస్తుందో కూడా స్పష్టత లేదు. ఇలాంటి లాజిక్స్ లేనివి చాలా ఉన్నాయి. దీనికితోడు సినిమా వ్యవధి కూడా చాలా పొడవుగా ఉంది. చాలా సీన్స్ లో మీకు విసుగు తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం :

కెప్టెన్ అఫ్ ది షిప్ అయినా డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి సరైన అవుట్ ఫుట్ ను ఇవ్వలేకపోయాడు. ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఇక ఆకట్టుకునే మ్యూజిక్ ఈచిత్రంలో ఉంది. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటింగ్ బాగుంది. ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమాలో సంభాషణలు ఆకట్టుకుంటాయి మరియు ఈ చిత్రం సెటప్ కూడా బాగుంది. అయితే దర్యాప్తుకు ప్రాధాన్యత లేనందు వల్ల సినిమాలో ఇంట్రస్ట్ మిస్ అయింది.

తీర్పు :

మొత్తం మీద, ఈ రెడ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్, కథలోని మెయిన్ పాయింట్ బాగుంది. అయితే, కొత్త పాయింట్‌ తో వైవిద్యభరితమైన చిత్రంగా వచ్చినప్పటికీ ఈ సినిమా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా రామ్ రెండు పాత్రలు, ఆ పాత్రల చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్ అలాగే హత్యకు సంబంధించిన సీన్స్ మరియు కొన్ని సెంటిమెంట్ మూమెంట్స్ బాగున్నా.. కథాకథనాలు ఆసక్తికరంగా లేకపోవడం, యాక్షన్ సీన్స్ ఇంట్రస్ట్ గా సాగకపోవడం, అలాగే కథకు అవసరం లేని అనవసరమైన సన్నివేశాలు ఎక్కువైపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. కాకపోతే రామ్ ఫ్యాన్స్ కు సినిమాలోని రామ్ నటన మరియు కొన్ని అంశాలు నచ్చుతాయి.

‘రెడ్ ‘: లైవ్ అప్డేట్స్ 

  • సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం TeluguNow.com చూస్తూ ఉండండి.

  • ఇప్పుడు క్లైమాక్స్ టైం..అన్నీ క్లియర్ అవుతున్నాయి, అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు అన్నది చూపిస్తున్నారు.

  • ఇప్పుడు ఆ మర్డర్ కు సంబంధించి ఒక్కో అంశం రివీల్ అవుతున్న సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.

  • ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో మర్డర్ లోని ట్విస్ట్ ఇపుడు చూపిస్తున్నారు.

  • ఆ మర్డర్ లో మరింత గందరగోళం నెలకొంది. అలాగే కొన్ని లాజికల్ సీన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు పోసాని ఎంటర్ అయ్యాడు.

  • ఇప్పుడు ఇంట్రెస్టింగ్ నరేషన్ అంతా కాస్త బోరింగ్ గా మారినట్టు అనిపిస్తుంది.

  • ఇప్పుడు చిత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి వెళ్ళింది. సోనియా అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది.

  • ఇన్వెస్టిగేషన్ సీన్ నీట్ గా చూపిస్తున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగుంది.

  • నివేతా ఈ కేసును సైలెంట్ గా డీల్ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు మరో ట్విస్ట్.

  • ఓ ల్యాబ్ టెక్నిషియన్ గా కిషోర్ ఇప్పుడే ఎంటర్ అయ్యాడు. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • ఇంటర్వెల్ అనంతరం మరో సీరియస్ సీన్ తో సినిమా స్టార్ట్ అయ్యింది. అరెస్ట్ కాబడిన ఇద్దరి రామ్ లపై ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్ వస్తుంది.

  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే మొదట్లో నెమ్మదిగా ఉన్నా మెల్లగా ఇంట్రెస్టింగ్ గా మారింది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ నెలకొన్న సస్పెన్స్ బాగుంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

  • ఓ సస్పెన్స్ సీన్ తో సినిమా ఇంటర్వెల్ కు చేరుకుంది. ఇప్పుడు విరామం.

  • ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్లాక్ వస్తుంది. రామ్ ఓ మర్డర్ చేసినట్టుగా చిత్రీకరించబడ్డాడు. ఇపుడు సినిమా థ్రిల్లర్ కోణంలోకి వెళ్తుంది.

  • ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది. దాన్ని డీల్ చేసే పోలీస్ గా నివేతా పెత్తురాజ్ సంపత్ తో కలిసి ఎంట్రీ అయ్యింది.

  • ఇప్పుడు ఇద్దరి కథలలోని ఓ సింపుల్ ట్విస్ట్ చోటు చేసుకుని ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.

  • ఇప్పుడు మరో హిట్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. యూరప్ లో విజువల్స్ చాలా బాగున్నాయి. రామ్ కూడా మంచి హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.

  • ఇప్పుడు కథనంలో మెయిన్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇద్దరు రామ్ ల తాలూకా కథలు భిన్న కోణాల్లో చూపిస్తున్నారు.

  • కమెడియన్ సత్య మరియు రామ్ ల మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి. ఇపుడు పృథ్వీ లోకేష్ కూడా ఎంటర్ అయ్యాడు.

  • ఇప్పుడు మొదటి సాంగ్ మాస్ బీట్ డించక్ స్టార్ట్ అయ్యింది. హెబ్బా మరియు రామ్ లు హాట్ స్టెప్స్ తో ఆకట్టుకుంటున్నారు.

  • ఇప్పుడు మరో రామ్ ఎంట్రీ అయ్యాడు. అసలు ఎలాంటి నీతి, నిజాయితీ లేని వాడిగా కనిపిస్తున్నాడు.

  • ఓ కార్పొరేట్ ఎంప్లాయ్ లా రామ్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే మహిమా గా మాల్వికా శర్మ కూడా యాడ్ అయ్యింది

  • హాయ్..146 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

చిత్రం : రెడ్ నటీనటులు : రామ్ పోతినేని, మాల్వికా శర్మ, అమృత అయ్యర్, నివేదా పెతురాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, హెబా పటేల్, సోనియా అగర్వాల్ దర్శకత్వం : కిషోర్ తిరుమల నిర్మాత‌లు : స్రవంతి రవికిషోర్ సంగీతం : మణి శర్మ సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి ఎడిట‌ర్‌ : జునైద్ సిద్దిఖీ విడుదల తేదీ : జనవరి 14, 2021 ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అందుకున్న తరువాత రామ్, ఈ సంక్రాంతి పండక్కి ‘రెడ్’ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం. కథ: ఈ రెడ్ కథలో రామ్ ఆదిత్య అండ్ సిద్ధార్థ్ గా రెండు పాత్రల్లో కనిపిస్తాడు. సిద్ధార్థ్ వృత్తిరీత్యా ఇంజనీర్ కాగా, ఆదిత్య ఒక దొంగ. అయితే, ఒక రోజు, ఆకాష్ అనే వ్యక్తి చంపబడతాడు. ఆ హత్య చేసింది, సిద్ధార్థ్ నే చెప్పి అతన్ని అరెస్టు చేస్తారు. కానీ, ఆదిత్య కూడా ఇదే కేసులో చిక్కుకున్నప్పుడు కథలోని అసలు పాయింట్ అండ్ ట్విస్ట్ తలెత్తుతుంది. ఇంతకీ, ఆకాష్‌ను ఎవరు చంపారు? అసలు ఆ హత్య వెనుక అలాగే కథలోని అసలు చిక్కు ముడి వెనుక మొత్తం ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? అది కథను ఎలా ముందుకు నడిపింది ? చివరకు ఆదిత్య అండ్ సిద్ధార్థ్ ఆ హత్య కేసు నుండి ఎలా బయటపడతారు ? అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్ : సినిమాకు ప్రధానంగా ఆదిత్య, సిద్ధార్థ్ రెండు పాత్రలు మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి. పైగా ఆ రెండు పాత్రల్లో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమా అంత రెండు పాత్రల మధ్య వెరీయేషన్స్ చూపిస్తూ చాలా సెట్టిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. రెండు పాత్రలలోని వైవిధ్యాలను రామ్, ప్రతి సీన్ లోనూ చక్కగా ప్రదర్శించిన విధానం మాత్రం మొత్తం సినిమాలోనే హైలైట్ గా నిలుస్తోంది ఇక హీరోయిన్ మాలవికా శర్మ సినిమాలో అందంగా కనిపిస్తోంది. కాని ఈ చిత్రంలో ఆమెకు పెద్దగా స్కోప్ అండ్ స్క్రీన్ స్పెస్ కూడా లేదు. ఇక వెన్నెలా కిషోర్ కొన్ని సన్నివేశాల్లో కామెడీని పండించాడు. అలాగే హాస్యనటుడు సత్య తన పాత్రలో కూడా మంచి ఫన్ ను జనరేట్ చేశాడు. పోసాని అలాగే మిగిలిన నటీనటులు బాగానే నటించారు. ఇక ఈ చిత్రంలో పోలీసుల సెటప్ అండ్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్, దర్యాప్తులో వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక నివేదా పెతురాజ్ తన పాత్రలో ఓకే అనిపించింది. డైరెక్టర్ డైరెక్షన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ ను ఎమోషన్స్ తో డీల్ చేసిన విధానం బాగుంది. ఆయన రాసిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్ : ఈ సినిమాలో పెద్ద లోపం ఏమిటంటే, ఈ చిత్రం ఆకర్షణీయమైన ట్రీట్మెంట్ లేకపోవడం. ప్రొసీడింగ్స్‌పై పట్టు లేనందున మొదటి సన్నివేశం నుండే ఈ చిత్రం నిస్తేజంగానే సాగుతోంది. పైగా నివేదా పాత్ర బలహీనంగా ఉన్నందున దర్యాప్తు సీన్స్ కూడా సిల్లీగా అనిపిస్తాయి. దాంతో ఈ సినిమా ఎటువంటి ప్రభావాన్ని సృష్టించదు. ఇది కాకుండా, సినిమా ప్లే కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. అసలు మెయిన్ కథ విరామం సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. హీరోకి స్నేహితురాలను పోలీసులు తమ దర్యాప్తులో ఆమెను విస్మరిస్తారు. ఇలా లాజిక్ లేకుండా సాగింది ఇన్విస్టిగేషన్. అలాగే, హీరోకు నివేదా ఎందుకు సహాయం చేస్తుందో కూడా స్పష్టత లేదు. ఇలాంటి లాజిక్స్ లేనివి చాలా ఉన్నాయి. దీనికితోడు సినిమా వ్యవధి కూడా చాలా పొడవుగా ఉంది. చాలా సీన్స్ లో మీకు విసుగు తెప్పిస్తుంది. సాంకేతిక విభాగం : కెప్టెన్ అఫ్ ది షిప్ అయినా డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి సరైన అవుట్ ఫుట్ ను ఇవ్వలేకపోయాడు. ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఇక ఆకట్టుకునే మ్యూజిక్ ఈచిత్రంలో ఉంది. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటింగ్ బాగుంది. ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమాలో సంభాషణలు ఆకట్టుకుంటాయి మరియు ఈ చిత్రం సెటప్ కూడా బాగుంది. అయితే దర్యాప్తుకు ప్రాధాన్యత లేనందు వల్ల సినిమాలో ఇంట్రస్ట్ మిస్ అయింది. తీర్పు : మొత్తం మీద, ఈ రెడ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్, కథలోని మెయిన్ పాయింట్ బాగుంది. అయితే, కొత్త పాయింట్‌ తో వైవిద్యభరితమైన చిత్రంగా వచ్చినప్పటికీ ఈ సినిమా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా రామ్ రెండు పాత్రలు, ఆ పాత్రల చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్ అలాగే హత్యకు సంబంధించిన సీన్స్…

రెడ్ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.25

3.3

రెడ్ రివ్యూ

రెడ్ రివ్యూ

User Rating: 2.7 ( 1 votes)
3