స్కామ్ 1992 వెబ్ సిరీస్ రివ్యూ

0

డబ్బు చుట్టూ అల్లిన క్రైమ్ డ్రామా అంటే ఎవరికి ఆసక్తి ఉండదు. అందునా స్టాక్ మార్కెట్ కుంభకోణాలపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో చర్చ జరుగుతుంటుంది. ఈ తరహా కథాంశాలతో హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. రియలిస్టిక్ ఇన్సిడెంట్లతో వచ్చి బంపర్ హిట్లు కొట్టాయి. వాల్ స్ట్రీట్ నుండి మార్జిన్ కాల్ వరకు.. ఈక్విటీ నుండి ఊల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ వరకు మనీ కోసం మాన్ స్టర్లుగా మోసగాళ్లుగా మారే మనుషుల కథను చూడొచ్చు.

ఇండియాలో స్టాక్ మార్కెట్ పై అతి పెద్ద స్కామ్ అనగానే హర్షద్ మెహతా కుంభకోణం గురించి చర్చిస్తుంటారు. దర్శకుడు హన్సాల్ మెహతా ఇప్పుడు అదే కుంభకోణంపై వెబ్ సినిమా తీశారు. 10 ఎపిసోడ్లతో కూడుకున్న వెబ్ సిరీస్ సినిమా ఇది. ప్రతీక్ గాంధీ- శ్రేయా ధన్వంతరి- నిఖిల్ ద్వివేది- షరీబ్ హష్మి- కెకె రైనా- రజత్ కపూర్- సతీష్ కౌశిక్ – అనంత్ మహాదేవన్ తదితరులు నటించారు.

బిగ్ బుల్ హర్షద్ మెహతా కథను వివరించేటప్పుడు హన్సాల్ మెహతా విసిరిన ప్రాథమిక సవాల్ ఆసక్తికరం. కథానాయకుడి మైండ్ గేమ్స్ ద్వారా తన కథను తెరకెక్కించకుండా.. ఈ సిరీస్ ని అన్నివర్గాల ప్రేక్షకుల్ని రంజింపజేసేలా తెరకెక్కించారా అంటే జవాబు కష్టమే. అతను తరచూ కథనాన్ని భారీ స్టాక్ మార్కెట్ లింగో .. లాజిస్టిక్స్ చెత్తలో నడిపించారు. 10-భాగాల వెబ్ సిరీస్ హిందీ చిత్రసీమలో ఒక అరుదైన ప్రయత్నం. ఇది హాలీవుడ్ ఫైనాన్షియల్ థ్రిల్లర్లలా రియలిస్టిక్ గా కనిపిస్తుంది. డబ్బు చుట్టూ అల్లిన క్రైమ్ డ్రామాలో తప్పనిసరిగా డబ్బుకు సంబంధించిన వికారాలెన్నో ఎమోషన్స్ రాజేస్తుంటాయి. ఇక వీటిలో ఎవరి కారణాలు వారికి ఉంటాయి.

హన్సాల్ మెహతా తాజా ప్రయత్నం పూర్తి సినిమాటిక్ కాకపోవడం తో పూర్తిగా ఎక్కదు. స్కామ్ 1992: హర్షద్ మెహతా స్టోరీ బయోపిక్ తరహాలో అద్భుతం చేయడం కుదరనిది. ఇది ఇండిపెండెంట్ ఇండియా అత్యంత సమస్యాత్మకమైన స్టాక్ మార్కెట్ కథలలో ఒకదాన్ని ఆవిష్కరిస్తుంది.

స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత కథ సుచేత దలాల్ – దేబాషిష్ బసు రచించిన పుస్తకం `ది స్కామ్: హూ వోన్ – హూ లాస్ట్- హూ గాట్ అవే` ఆధారంగా రూపొందించినది. హర్షద్ దిగువ-మధ్యతరగతి లైఫ్ నుండి బాంబే స్టాక్ మార్కెట్ వ్యాపారిగా ఎదిగాడు. బిగ్ బుల్ నుండి ర్యాగింగ్ బుల్ వరకు దలాల్ స్ట్రీట్ వరకూ ఎదిగిన తీరు అసమానం. అతడు చివరికి నాటకీయ వినాశనం కొని తెచ్చుకున్నాడు. హర్షద్ 47 ఏళ్ళ వయసులో మరణించాడు. అతడు చనిపోయే నాటికి అతనిపైనా.. అతడి కుటుంబ సభ్యులపైనా 70 క్రిమినల్ మరియు 600 సివిల్ కేసులు నమోదయ్యాయి. ఎదుగుదల .. పతనం మధ్య… 1992 లో రూ .5000 కోట్ల సెక్యూరిటీల కుంభకోణానికి కారణమైన ఆర్థిక నేరాలపై అతనిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇది భారత మార్కెట్ పతనం .. స్టాక్స్ పతనానికి దారి తీసిన ఒక బిగ్గెస్ట్ స్కామ్. ఆర్థిక మోసాలను వివరించే ఈ సినిమాలో దమ్మెంతో మేధోవర్గాలు మాత్రమే చెప్పగలవు.

డబ్బు చుట్టూ అల్లిన క్రైమ్ డ్రామా అంటే ఎవరికి ఆసక్తి ఉండదు. అందునా స్టాక్ మార్కెట్ కుంభకోణాలపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో చర్చ జరుగుతుంటుంది. ఈ తరహా కథాంశాలతో హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. రియలిస్టిక్ ఇన్సిడెంట్లతో వచ్చి బంపర్ హిట్లు కొట్టాయి. వాల్ స్ట్రీట్ నుండి మార్జిన్ కాల్ వరకు.. ఈక్విటీ నుండి ఊల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ వరకు మనీ కోసం మాన్ స్టర్లుగా మోసగాళ్లుగా మారే మనుషుల కథను చూడొచ్చు. ఇండియాలో స్టాక్ మార్కెట్ పై అతి పెద్ద స్కామ్ అనగానే హర్షద్ మెహతా కుంభకోణం గురించి చర్చిస్తుంటారు. దర్శకుడు హన్సాల్ మెహతా ఇప్పుడు అదే కుంభకోణంపై వెబ్ సినిమా తీశారు. 10 ఎపిసోడ్లతో కూడుకున్న వెబ్ సిరీస్ సినిమా ఇది. ప్రతీక్ గాంధీ- శ్రేయా ధన్వంతరి- నిఖిల్ ద్వివేది- షరీబ్ హష్మి- కెకె రైనా- రజత్ కపూర్- సతీష్ కౌశిక్ - అనంత్ మహాదేవన్ తదితరులు నటించారు. బిగ్ బుల్ హర్షద్ మెహతా కథను వివరించేటప్పుడు హన్సాల్ మెహతా విసిరిన ప్రాథమిక సవాల్ ఆసక్తికరం. కథానాయకుడి మైండ్ గేమ్స్ ద్వారా తన కథను తెరకెక్కించకుండా.. ఈ సిరీస్ ని అన్నివర్గాల ప్రేక్షకుల్ని రంజింపజేసేలా తెరకెక్కించారా అంటే జవాబు కష్టమే. అతను తరచూ కథనాన్ని భారీ స్టాక్ మార్కెట్ లింగో .. లాజిస్టిక్స్ చెత్తలో నడిపించారు. 10-భాగాల వెబ్ సిరీస్ హిందీ చిత్రసీమలో ఒక అరుదైన ప్రయత్నం. ఇది హాలీవుడ్ ఫైనాన్షియల్ థ్రిల్లర్లలా రియలిస్టిక్ గా కనిపిస్తుంది. డబ్బు చుట్టూ అల్లిన క్రైమ్ డ్రామాలో తప్పనిసరిగా డబ్బుకు సంబంధించిన వికారాలెన్నో ఎమోషన్స్ రాజేస్తుంటాయి. ఇక వీటిలో ఎవరి కారణాలు వారికి ఉంటాయి. హన్సాల్ మెహతా తాజా ప్రయత్నం పూర్తి సినిమాటిక్ కాకపోవడం తో పూర్తిగా ఎక్కదు. స్కామ్ 1992: హర్షద్ మెహతా స్టోరీ బయోపిక్ తరహాలో అద్భుతం చేయడం కుదరనిది. ఇది ఇండిపెండెంట్ ఇండియా అత్యంత సమస్యాత్మకమైన స్టాక్ మార్కెట్ కథలలో ఒకదాన్ని ఆవిష్కరిస్తుంది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత కథ సుచేత దలాల్ - దేబాషిష్ బసు రచించిన పుస్తకం `ది స్కామ్: హూ వోన్ - హూ లాస్ట్- హూ గాట్ అవే` ఆధారంగా రూపొందించినది. హర్షద్ దిగువ-మధ్యతరగతి లైఫ్ నుండి బాంబే స్టాక్ మార్కెట్ వ్యాపారిగా ఎదిగాడు. బిగ్ బుల్ నుండి ర్యాగింగ్ బుల్ వరకు దలాల్ స్ట్రీట్ వరకూ ఎదిగిన తీరు అసమానం. అతడు చివరికి నాటకీయ వినాశనం కొని తెచ్చుకున్నాడు. హర్షద్ 47 ఏళ్ళ వయసులో మరణించాడు. అతడు చనిపోయే నాటికి అతనిపైనా.. అతడి కుటుంబ సభ్యులపైనా 70 క్రిమినల్ మరియు 600 సివిల్ కేసులు నమోదయ్యాయి. ఎదుగుదల .. పతనం మధ్య... 1992 లో రూ .5000 కోట్ల సెక్యూరిటీల కుంభకోణానికి కారణమైన ఆర్థిక నేరాలపై అతనిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇది భారత మార్కెట్ పతనం .. స్టాక్స్ పతనానికి దారి తీసిన ఒక బిగ్గెస్ట్ స్కామ్. ఆర్థిక మోసాలను వివరించే ఈ సినిమాలో దమ్మెంతో మేధోవర్గాలు మాత్రమే చెప్పగలవు.

స్కామ్ 1992

కథ స్క్రీన్ ప్లే - 3
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 3.5
దర్శకత్వ ప్రతిభ - 3.5

3.4

స్కామ్ 1992

స్కామ్ 1992

User Rating: Be the first one !
3