Templates by BIGtheme NET
Home >> REVIEWS >> సెకండ్ హ్యాండ్ రివ్యు

సెకండ్ హ్యాండ్ రివ్యు


Title :Second Hand (2013)

Star Cast : Dhanya Balakrishna, Sudheer Varma, and more…
Director : Kishore Tirumala
Produced by: BVS Ravi, Poorna Naidu
Music by: Ravichandra
Genre : Feature film soundtrack
Releasing on : December 13, 2013.

 సెకండ్ హ్యాండ్ రివ్యు

కథ:

‘సెకండ్ హ్యాండ్’ సినిమా మూడు డిఫరెంట్ లవ్ స్టోరీలకు సంబందించింది. వారు సంతోష్ (సుదీర్ వర్మ), సుబ్బారావు (కిరీటి దామరాజు), సహస్ర (ధన్య బాలకృష్ణ). ఇవన్ని ఫెయిల్ అయిన ప్రేమ కథలు. అంతేకాకుండా ఇవి డిఫరెంట్ లవ్ స్టోరీస్.

సంతోష్ ఒక జూనియర్ ఫోటోగ్రాఫర్. తను దీపు అనే అమ్మాయిని చాలా డీప్ గా ప్రేమిస్తాడు. ఈ ప్రేమ కథ చాలా సాఫీగా, రొమాంటిక్ గా సాగిపోతు వుంటుంది. అలాంటి సమయంలో కొన్ని ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల, వారికి ఉన్న వ్యక్తిగత లక్ష్యాల వల్ల వారి మద్య దూరం పెరుగుతుంది. సంతోష్ ఎంతో భాదాపడుతూనే దీపును వదులుకుంటాడు.

సుబ్బారావు చాలా మంచి వ్యక్తి, జెంటిల్ మ్యాన్. అతను విశాలమైన మనసు కలిగిన వ్యక్తిగా భావిస్తూ ఉంటాడు. సుబ్బారావు స్వేఛ్చ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆమె తనకు గతంలో వేరొకతనితో గల సంబంధాన్ని గురించి చెబుతుంది. ఆమెను సుబ్బారావు అర్థం చేసుకుంటాడని భావిస్తుంది. కానీ ఆమె ప్రయత్నం వృదా అవుతుంది.

సహస్ర ఒక యంగ్ అమ్మాయి. తను ఫ్రెండ్ కి లవర్ కి మధ్య ఉన్నా తేడా తెలియని అమ్మాయి. ఈ మూడు ప్రేమ కథల గురించి, చివరికి వారంతా ఏమయ్యరనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ ప్రేమికులంత చివరి వరకు ఎలా కలుసుకుంటారు అనేది కథ. వీరందరూ వీరికి పోసాని కృష్ణ మురళి వల్ల ఒకరి గురించి ఒకరు ఎలా తెలుసుకున్నారు అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ చాలా బాగా చేసింది. ఈ సినిమాలో ఆమె మూడు డిఫరెంట్ పాత్రలలో నటించింది. ఆమె ప్రతి దానిలో కొత్తగా కనిపించడానికి చాలా ప్రయత్నం చేసింది. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. అలా అని ఈ సినిమాలో ఎలాంటి అల్ట్రా గ్లామరస్ పాత్రలో కనిపించలేదు.

కిరీటి దామరాజు సుబ్బారావుగా ఎంటర్టైనింగ్ పాత్రలో నటించాడు. అతను టైమింగ్ కు తగినట్టుగా కామెడీ చేయడం జరిగింది. సుదీర్ వర్మ కూడా బాగా చేశాడు. విష్ణు అందరిని మెప్పించే విదంగా చైతన్యగా మంచి పెర్ఫామెన్స్ చేశాడు. దీనిలో అతని టాలెంట్ ను మరోసారి మనం చూడవచ్చు.

డైరెక్టర్ మొదటి హాఫ్ ని చాలా బాగా తీశాడు. మొదటి బాగంలో సినిమా మంచి వేగంతో డీసెంట్ గా సాగుతుంది. ఈ బాగంలో ఎంటర్టైనింగ్ పార్ట్ బాగుంది. ధన్య చేసిన మూడు డిఫరెంట్ పాత్రలు చాలా వినూత్నంగా వున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి లాస్ ఈ సినిమా సెకండ్ హాఫ్, దీనిలో అవసరంలేని మేలో డ్రామా ఎక్కువగా ఉంది. సినిమా వేగం తగ్గుతూ రావడం వల్ల కథ అస్సలు ముందుకు కదలదు. ఈ సినిమా మొదటి బాగంలో వున్న ఎంటర్టైన్మెంట్ రెండవ బాగంలో కనిపించదు. ఈ సినిమాలో డైరెక్టర్ కిషోర్ తిరుమల ఒక తమిళియన్ గా ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమాకి ఆ పాత్ర అవసరం లేదు.

ఈ సినిమాలో సహస్ర కథ రివీల్ కాగానే ఆ తర్వాత జరిగే వాటిని మనం ముందుగానే ఊహించవచ్చు. ఈ సినిమాని చూస్తుంటే బోర్ గా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాని చూస్తుంటే దీనిని తక్కువ బడ్జెట్ తో నిర్మించారనే విషయం అర్థమవుతుంది.
ఈ సినిమా సెకండ్ హాఫ్ లో విసువల్స్ చాలా పూర్ గా ఉన్నాయి. (ఈ సినిమా ప్రొడక్షన్ టీం మాత్రం టెక్నికల్ గా వచ్చిన ఓ పెద్ద ప్రాబ్లం వల్ల అలా జరిగిందని అంటున్నారు.

సాంకేతిక విభాగం:

బడ్జెట్ కు తగినట్టుగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కోసం ఉపయోగించిన కెమెరాలు, సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు. ఈ సినిమాకి ఇది చాలా హెల్ప్ అయ్యింది. బడ్జెట్ కు తగినట్టుగా ఎడిటింగ్ నీట్ గా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. కిషోర్ తిరుమల సమర్ధత కలిగిన డైరెక్టర్. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఎంటర్టైనింగ్ ఉండి ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది.

తీర్పు :

నటీనటుల పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్లే మరియు కామెడీ తో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే డైరెక్టర్ సెకండాఫ్ లో అదే ఫ్లోని డీల్ చేయలేకపోయాడు. ఇప్పటికే మీరు మీ రొమాంటిక్ రిలేషన్ లో ఫెయిల్ అయిన వారికి సెకండ్ హ్యాండ్ సినిమా బాగా అనిపిస్తుంది. మిగతా వారికి సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది.

Updated at 12:42 PM

విజయ్ కోరియోగ్రఫీ చేసిన ‘ సుబ్బారావు’ టైటిల్ సాంగ్ జరుగుతుంది…. .సినిమా క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది…..

Updated at 12:38 PM

పోసాని కృష్ణ మురళి తన కామెడీతో నవ్విస్తున్న సన్నివేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి……..

Updated at 12:25 PM

సెకండ్ హాఫ్ లో కాస్త వినోదం తగ్గినట్లు ఉంది. కథ కూడా కొంచెం సాగదీస్తున్నట్టుగా అనిపిస్తోంది..

Updated at 12:15 PM

మూడో లవ్ స్టొరీ కాస్త డిఫరెంట్ గా సాగిపోతుంది….. ఇప్పటి వరకూ అమ్మాయి అబ్బాయిని మోసం చేసే సన్నివేశాలు జరుగుతున్నాయి…….

Updated at 12:05 PM

చైతన్యగా విష్ణు ఇప్పుడే తెరకు పరిచయం అయ్యాడు….. సినిమాలో ఇప్పుడే మూడో లవ్ స్టొరీ మొదలౌతోంది…….

Updated at 11:57 AM

ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా పోసాని కృష్ణ మురళి తెరకు పరిచయం అయ్యాడు……..

Updated at 11:38 AM

ఇంటర్వెల్ – ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి కధనం, కొన్ని హాస్య సన్నివేశాలతో ముగిసింది……… ఇంతక ముందు మీరు ఎప్పుడైనా లవ్ ఫెయిల్ అయ్యుంటే ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు. ఇక సినిమాలో సెకండ్ హాఫ్ కీలకం కానుంది

Updated at 11:30 AM

సుబ్బారావు పుస్తకాల్లో పెర్కొన్నటువంటి ఒక పెద్దమనిషి తరహ వ్యక్తి….. స్వేచ్చతో మొదలైన అతని లవ్ స్టొరీ మామూలు లవ్ ఫైల్యూర్ గా దిశగా సాగుతోంది.

Updated at 11:14 AM

అబ్బాయిలు, అమ్మాయిలు మాటలయుద్ధంతో విడిపోయారు …… ఇప్పుడే సుబ్బారావు స్టొరీ మొదలైంది ………..

Updated at 11:00 AM

కాలేజీ లైఫ్ లో ప్రేమికులు ఎదుర్కొనే సాధారణపరిస్దితులను చూపిస్తున్నారు….. హాస్యం పండించే దృశ్యాలను చక్కగా రాసారు……

Updated at 10:53 AM

సినిమాలో ఊహించని ఫన్నీ ట్విస్ట్……. స్మూత్ గా సాగిపోతున్న లవ్ ట్రాక్ ఇప్పుడు కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది……

Updated at 10:37 AM

ధన్యా, సుదీర్ మద్య ఇప్పుడే ఒక ఫన్నీ లవ్ ట్రాక్ మొదలైంది.

Updated at 10:33 AM

సుదీర్ వర్మ, ధన్యా బాలకృష్ణ కూడా తెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం ‘ గోవింద గోవిందా…..’ సాంగ్ వస్తుంది.

Updated at 10:30 AM

కిరీటి ఇప్పుడే సుబ్బారావుగా తెరకు పరిచయమయ్యాడు

Updated at 10:27 AM

హలో ఫ్రెండ్స్….. మేము మీకిప్పుడు ‘సెకండ్ హ్యాండ్’ మూవీ లైవ్ అప్ డేట్స్ ని అందించబోతున్నాం. సినిమా ఇప్పుడే ఆసక్తికరమైన టైటిల్స్ తో మొదలైంది

 

సెకండ్ హ్యాండ్ రివ్యు, సెకండ్ హ్యాండ్ : రివ్యు, రివ్యు : సెకండ్ హ్యాండ్, Second Hand Review, Second Hand Movie Review, Second Hand Rating, Second Hand Telugu Movie Review , Second Hand Movie Rating, Dhanya Balakrishna Second Hand Review, Second Hand Movie Rating, Second Hand Film Review, Second Hand Cinema Review, Second Hand Story, Second Hand Live Updates, Second Hand Tweet Review, Second Hand Movie Review and Rating, Dhanya Balakrishna Action in Second Hand Movie, Second Hand Film Rating, Second Hand Cinema Rating