ఎవడు రివ్యూ

0

 

గ‌తేడాది సంక్రాంతికి నాయ‌క్‌ గా సంద‌డి చేశాడు రామ్‌ చ‌ర‌ణ్‌. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌ గా మంచి విజ‌యాన్ని సాధించింది. ఈసారీ చెర్రీ బ‌రిలో దిగ‌బోతున్నాడు. ఎవ‌డు సినిమాతో. చ‌ర‌ణ్‌ ని ఓ కొత్త కోణంలో చూపించే సినిమా అంటూ.. ముందు నుంచీ ఈ చిత్రానికి ప్రచారం జ‌రుగుతోంది. అందుకు మెగా అభిమానుల‌తో పాటు, ప‌రిశ్రమ కూడా ఈ సినిమా గురించి ఆస‌క్తిగా ఎదురుచూసింది. కాక‌పోతే వరుస వాయిదాలు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కాస్త త‌గ్గించినా.. మ‌ళ్లీ ఎవ‌డు పుంజుకొన్నాడు. శ్రుతిహాసన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, కాజ‌ల్ ప్రధాన పాత్రల్లో ద‌ర్శన‌మివ్వ‌నున్నారు. మ‌రికొన్ని గంట‌ల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎవ‌డు సినిమాలో ఏం ఉంటున్నాయి? ఇంత క్రేజ్ వెనుక కార‌ణం ఏమిటి??

కథ :

వైజాగ్ లో నివసించే సత్య(అల్లు అర్జున్), దీప్తి(కాజల్ అగర్వాల్) ఇద్దరూ లవర్స్. పెళ్లి చేసుకోవాలని అనుకునే లోపు వైజాగ్ లో పెద్ద రౌడీ అయిన వీరూ భాయ్(రాహుల్ దేవ్) దీప్తిని చూసి ఇష్టపడతాడు. దాంతో తన మనుషులను పంపి దీప్తిని తీసుకురమ్మంటాడు. అది తెలిసిన సత్య – దీప్తి ఆ రౌడీలకి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు కథలో ట్విస్ట్…

అక్కడి నుండి కట్ చేస్తే రామ్ అలియాస్ చరణ్ (రామ్ చరణ్) అదే వైజాగ్ లోని వీరూ భాయ్, అతని గ్యాంగ్ ని చంపడం మొదలు పెడతాడు. ఆ గ్యాంగ్ ని ఫినిష్ చేసేలోపు హైదరాబాద్ లో పెద్ద దాదా అయిన ధర్మ(సాయి కుమార్) మనుషులు చరణ్ ని చంపడానికి ట్రై చేస్తుంటారు. అసలు చరణ్ ఎవడు? ధర్మ చరణ్ ని ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు చరణ్ వీరూ భాయ్ గ్యాంగ్ ని ఎందుకు చంపాడు? అసలు సత్య- దీప్తిల కథలో జరిగిన ట్విస్ట్ ఏంటి? అనే ఆసక్తికరమైన ట్విస్ట్ లను తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో మొదటగా చెప్పాల్సింది,, మొదట్లో వచ్చే అల్లు అర్జున్ ఎపిసోడ్ సినిమాకి ప్రధాన హైలైట్. అలాగే అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ఇక చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గురించి.. యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. యాక్షన్ ఎపిసోడ్స్ లో అతను చేసిన స్టంట్స్ మాస్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఫ్రీడం పాటలో రామ్ చరణ్ స్టెప్పులతో కూడా మెప్పించాడు. కాజల్ అగర్వాల్ ది చిన్న పాత్రే అయినా బాగా చేసింది. చరణ్ తల్లి పాత్రలో జయసుధ గారి నటన బాగుంది.

శృతి హాసన్, అమీ జాక్సన్ ల పాత్రలకి ప్రాధాన్యత లేదు. కానీ ఉన్నంత వరకూ గ్లామర్ పరంగా మాత్రం ఇద్దరూ ముందు బెంచ్ వారిని బాగానే ఆకట్టుకున్నారు. ఇక నెగటివ్ షేడ్స్ ఉన్న ధర్మ పాత్రలో సాయి కుమార్ పెర్ఫార్మన్స్ హీరోకి ధీటుగా పవర్ఫుల్ గా ఉంది. కోట శ్రీనివాసరావు కనిపించేది రెండు మూడు సన్నివేశాలయినప్పటికీ కొన్ని పంచ్ డైలాగ్స్ తో నవ్వు తెప్పిస్తాడు. ఎల్బీ శ్రీ రామ్ ఇలాంటి పాత్రలు ఇది వరకు చేసారు కావున ఎప్పటిలానే ఈ పాత్రని కూడా బాగా చేసారు.

సినిమా మొదటి 15 నిమిషాలు, ఇంటర్వల్ బ్లాక్, ఆ తర్వాత సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే రెయిన్ ఫైట్ మాస్ కి పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి 15 నిమిషాల తర్వాత నుండి చివరి వరకూ ప్రేక్షకులు ఎలా ఊహించుకుంటారో అలానే జరుగుతుంటుంది. డైరెక్టర్ చెప్పాలనుకున్నది సినిమా మొదట్లోనే చెప్పేయడం వల్ల ఆ తర్వాత ఊహాజనితంగా సాగుతుంది. సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ ఎక్కువ బోరింగ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ లో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ కథా పరంగా బాగా రొటీన్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ముందు వరకు పోటా పోటీగా సాగే రివెంజ్ డ్రామా క్లైమాక్స్ లో డీలా పడిపోయింది.

సినిమాలో ఎంటర్టైన్మెంట్ అస్సలు లేదు. బ్రహ్మానందం లాంటి కమెడియన్ ని పెట్టుకొని కూడా ప్రేక్షకులని నవ్వించలేకపోవడం ఈ సినిమాకి మరో మైనస్.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మొదటి హైలైట్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్. పాటలు ఓకే, కానీ దేవీశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి ప్రాణం పోసిందని అని చెప్పాలి. హీరో మరియు విలన్ ని ఎలివేట్ చేసే సీన్స్ లో, సినిమా కాస్త స్లో అవుతుంది అన్న సమయంలో దేవీశ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా సూపర్బ్. ఇక రెండవ హైలైట్ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేం ని బాగా రిచ్ గా చూపించడంతో విజువల్స్ పరంగా చాలా బాగుంది. పీటర్ హెయిన్, సెల్వ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. డైలాగ్స్ ఓకే. ఎడిటర్ అక్కడక్కడా చిన్న చిన్న కత్తిరింపులు వేసుంటే బాగుండేది.

వక్కంతం వంశీ కథలో ఒకటి రెండు ట్విస్ట్ లు తప్ప మిగతా అంతా రొటీన్ గానే ఉంది. రొటీన్ మాస్ ఎంటర్టైనర్ సినిమాలకు కథనం చాలా కీలకం ఆ విషయంలో వంశీ పైడిపల్లి కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. డైరెక్షన్ పరంగా హీరోని ఎలివేట్ చెయ్యడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు.

తీర్పు :

‘ఎవడు’ సినిమా అందరూ అనుకున్నట్టుగానే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే మాస్ ఎంటర్టైనర్. రామ్ చరణ్ పవర్ ప్యాక్ పెర్ఫార్మన్స్, అల్లు అర్జున్ ఎపిసోడ్, హీరోయిన్స్ గ్లామర్ మరియు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి ప్రధాన హైలైట్ అయితే రొటీన్ గా అనిపించే సెకండాఫ్, ఫస్ట్ హాఫ్ లోని కొన్ని బోరింగ్ సీన్స్, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం సినిమాకి మైనస్. రెగ్యులర్ ప్రేక్షకులు ఒకసారి చూడదగిన సినిమా అయితే రామ్ చరణ్ అభిమానులకు మాత్రం పండగ చేసుకునే సినిమా అవుతుంది. సంక్రాంతి సీజన్ కావడం వల్ల ఎ సెంటర్స్ లో అటు ఇటుగా ఉన్నా బి,సి సెంటర్స్ లో మాత్రం కలెక్షన్స్ కొల్లగొడుతుంది.

 

ఎవడు మొదటి షో వివరాలు:

 

Updated at 02:29 AM

సినిమా ముగిసింది. కొద్దిసేపట్లో ఈ సినిమా రివ్యూ ని మీకు అందజేస్తాం.

Updated at 02:26 AM

క్లైమాక్స్ … బారీ ఫైట్ సన్నివేశాలు వస్తున్నాయి.

Updated at 02:16 AM

ఇప్పుడే ఒక ట్విస్ట్ వెల్లడైంది. సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది.

Updated at 02:06 AM

ప్రస్తుతం చివరి మాస్ సాంగ్ ‘పింపుల్…డింపుల్..’ వస్తోంది.

Updated at 01:55 AM

సాయి కుమార్, రామ్ చరణ్ మధ్య పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే సన్నివేశాలు వస్తున్నాయి.

Updated at 01:45 AM

ప్రస్తుతం రామ్ చరణ్ సాయి కుమార్ మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలు జరుగుతున్నాయి.

Updated at 01:35 AM

శృతి హసన్ ఈ పాటలో చాలా అందంగా ఉంది

Updated at 01:28 AM

శృతి హసన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కాలేజీ సన్నివేశాలు జరుగుతున్నాయి.

Updated at 01:24 AM

రామ్ చరణ్ తల్లీ గా జయసుధ పరిచయం అయ్యింది.

Updated at 01:20 AM

సినిమాలో నాల్గవ పాట ‘ఫ్రీడం’ వస్తోంది… ఈ పాటలో రామ్ చరణ్ క్రేజీ గా డాన్స్ చేస్తున్నాడు.

Updated at 01:15 AM

ఇంటర్వల్ తరువాత సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో సాగుతోంది

Updated at 01:10 AM

ఇంటర్వల్ ….. ఈ సినిమా ఇప్పటివరకు మంచి ట్విస్ట్ తో సగం ముగిసింది.

Updated at 01:05 AM

సినిమాలో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ …… సాయి కుమార్ ఇప్పుడే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు

Updated at 12:59 AM

యాక్షన్ సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా ఇంటర్వల్ కు సమయనికి చేరుకుంటోంది.

Updated at 12:50 AM

ప్రస్తుతం సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ‘అయ్యో పాపం’ వస్తోంది

Updated at 12:40 AM

ప్రస్తుతం ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి …. రామ్ చరణ్ మిషన్ లో ఉన్నాడు

Updated at 12:28 AM

ప్రస్తుతం రెండవ పాట ‘ఓయ్ ఓయ్’ వస్తోంది. ఈ పాటలో అమీ జాక్సన్ చాలా హాట్ గా బికినీ లో కనిపిస్తోంది.

Updated at 12:20 AM

సినిమా వైజాగ్ లో సాగుతోంది

Updated at 12:13 AM

అమీ జాక్సన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది

Updated at 12:10 AM

ఇప్పుడే బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చాడు

Updated at 12:05 AM

ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ ‘చెలియా చెలియా’ వస్తోంది. … ఈ పాటలో కాజల్ అగర్వాల్ నటించింది.

Updated at 12:03 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలోకి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.

Updated at 11:58 PM

ఇప్పుడు సినిమా టైటిల్స్ పడుతున్నాయి. సినిమా మొత్తం 10 నెలలు ముందుకు వెళ్ళింది

Updated at 11:55 PM

ఇప్పుడే బస్సు లో అల్లు అర్జున్ కి విలన్స్ కి మధ్య మరో ఫైట్ జరుగుతోంది. ఫైట్ అయిపోగానే అందరికి ఒక ఆశ్చర్యపరిచే విషయం కనిపిస్తుంది

Updated at 11:50 PM

కాజల్ కోసం అల్లు అర్జున్, విలన్స్ మధ్య భారీ ఫైట్ జరుగుతోంది

Updated at 11:43 PM

కాజల్ అగర్వాల్ పేరు దీప్తి

Updated at 11:41 PM

అల్లు అర్జున్ పేరు సత్య

Updated at 11:39 PM

అల్లు అర్జున్ పరిచయం చాలా కూల్ గా అయ్యింది. తను కాజల్ అగర్వాల్ లవర్

Updated at 11:37 PM

చంద్ర మోహన్ కూతురు కాజల్ అగర్వాల్ ని వీరు భాయ్ రౌడీలు వెతుకుతున్నారు.

Updated at 11:35 PM

హలో ఫ్రెండ్స్ … మేము మీకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమా లైవ్ అప్ డేట్స్ అందిస్తున్నాం.

 

 

ఎవడు రివ్యూ, ఎవడు : రివ్యూ, రివ్యూ ఎవడు, రివ్యూ : ఎవడు, ఎవడు సమీక్ష, ఎవడు  : సమీక్ష,  సమీక్ష ఎవడు, సమీక్ష : ఎవడు, Yevadu Movie Review, Yevadu Movie Story,Yevadu Movie Review Ratings,Yevadu Movie Ratings,Yevadu Telugu Movie Review,Yevadu Movie Talk, Yevadu Movie Live Updates, Yevadu Movie Tweet Review,Yevadu Movie Review in Telugu, Yevadu Movie 1st day Collections, Ram Charan Yevadu Movie Live Updates, Ram Charan Yevadu Movie Tweet Review, Evadu Movie Review, Evadu Movie Story,Evadu Movie Review Ratings,Evadu Movie Ratings,Evadu Telugu Movie Review,Evadu Movie Talk, Evadu Movie Live Updates, Evadu Movie Tweet Review,Evadu Movie Review in Telugu, Evadu Movie 1st day Collections, Ram Charan Evadu Movie Live Updates, Ram Charan Evadu Movie Tweet Review,