ఏపీలో జరుగుతున్న మార్పులు..పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న అసూయ!
ప్రముఖ పారిశ్రామికవేత్తలు కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “మీరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. నిలువెత్తు లోతు గుంతల్లో మేము కూరుకుపోతున్నాం,” అంటూ వారు మాట్లాడుతూ, ప్రభుత్వ చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీలో ఏర్పడిన కొత్త కూటమి ప్రభుత్వానికి పెట్టుబడులు వస్తున్నాయంటే, పొరుగు రాష్ట్రల్లో అసంతృప్తి పెరుగుతోంది. కర్ణాటకలో పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిస్థితిని చూసే బదులు చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు విమర్శించాయి. […]
