కొత్త ఇంటి ప్ర‌వేశానికి బాల‌య్య రెడీ!

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం భ‌గ‌వంత్ కేస‌రి బాక్సాఫీస్ విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నారు. అఖండ త‌ర్వాత మ‌రో విజ‌యాన్ని ఆయ‌న త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇదే ఉత్సాహంలో వ‌రుస చిత్రాల‌కు క‌మిట‌వుతున్నార‌ని స‌మాచారం. 2024లో నంద‌మూరి న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ‌ను లాంచ్ చేస్తాన‌ని ఇదివ‌ర‌కూ ఓ ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ అన్నారు. అయితే అంత‌కంటే ముందే ఒక బిగ్ స‌ర్ ప్రైజ్ కి ఆయన సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని నందమూరి బాలకృష్ణ విశాలమైన భ‌వంతిలో నివ‌సిస్తున్న సంగ‌తి తెలిసిందే. […]