డైలమాలో రజనీ రాజకీయ పార్టీ ఏర్పాటు? ‘కరోనా’నే కారణం.. ఆలస్యంపై అభిమానులకు తలైవా లేఖ

తమిళనాడు రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడునెలలు ఉన్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు సూపర్స్టార్ రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వైపు ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నది. అయినప్పటికీ రజనీకాంత్ కొత్తపార్టీ ఏర్పాటుపై ఎటువంటి ప్రకటన రావడం లేదు. దీంతో రజనీ పార్టీ అసలు ఉంటుందా లేదా అనే విషయమై సోషల్ మీడియా తమిళనాడు సినీ రాజకీయ సర్కిళ్లలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ […]