Templates by BIGtheme NET
Home >> Telugu News >> నేరస్థుడికి 1075 ఏళ్ల జైలు.. నేరం ఏంటో తెలుసా?

నేరస్థుడికి 1075 ఏళ్ల జైలు.. నేరం ఏంటో తెలుసా?


సహజంగా మన దగ్గర జైలు శిక్షల తీరును పరిశీలిస్తే.. కనిష్ఠంగా రోజులు గరిష్ఠంగా 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అయితే.. టర్కీలో ఓ నేరస్థుడికి కోర్టు విధించిన శిక్ష చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే! ఒకటీ రెండు కాదు.. ఏకంగా వెయ్యి 75 సంవత్సరాల జైలు శిక్ష విధించింది! వివాదాస్పద ముస్లిం ప్రబోధకుడు అద్నన్ అక్తర్కు టర్కీ కోర్టు ఈ శిక్ష విధించింది. మైనర్లపై లైంగిక దాడులు ఆర్మీ గూఢచర్యం బ్లాక్మెయిలింగ్ తదితర కేసుల్లో దోషిగా తేల్చిన న్యాయస్థానం.. ఈ నేరాలన్నంటికిగానూ మొత్తంగా 1075 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. స్థానిక మీడియా ఈ వివరాలు వెల్లడించింది.

అద్నన్ అక్తర్ ఓ ప్రైవేటు టీవీ చానెల్ ద్వారా మతపరమైన బోధనలు చేస్తూ పాపులర్ అయ్యాడు. మహిళల మధ్య కూర్చుని విలాసవంతమైన జీవితాన్ని ప్రతిబింబించేలా తెరపై చర్చలు నిర్వహించేవాడు. ఈ క్రమంలో వారితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.

పలు ఫిర్యాదులతో అక్తర్ కార్యకలాపాలపై నిఘా పెట్టిన టర్కీ.. అతడి చానెల్పై నిషేధం విధించింది. పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులు అద్నన్ నివాసాలపై దాడులు చేసి 2018లోనే అతడిని అరెస్టు చేశారు. అతడితో పాటు చాలా మంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరాలను నేరస్తులను ప్రోత్సహించడంతోపాటు మైనర్లను లైంగికంగా వేధించడం అత్యాచారాలకు పాల్పడటం బ్లాక్మెయిల్ చేయడం రాజకీయ సైనిక రంగాల్లో గూఢచర్యం వంటి నేరాలెన్నో చేశాడని అక్తర్ పై అభియోగాలు నమోదయ్యాయి.

ఈ క్రమంలో మొత్తం 10 ప్రధాన కేసుల్లో అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. పై విధంగా శిక్ష ఖరారు చేసింది. అతని అనుచరులు 13 మందికి సైతం కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ విషయంపై స్పందించిన 64 ఏళ్ల అద్నన్.. తనపై వచ్చినవన్నీ ఆరోపణలే అంటున్నాడు. తాను ఏ తప్పు చేయలేదని పథకం ప్రకారమే కుట్ర పన్ని ఇరికించారని కోర్టు తీర్పుపై అప్పీలు చేస్తానని చెప్పుకొచ్చాడు. అన్నట్టూ.. అద్నన్ రచయిత కూడా.

1000 మంది గర్ల్ఫ్రెండ్స్..!

కాగా.. అద్నన్ కు వెయ్యి మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట. ఈ విషయం అతనే చెప్పడం గమనార్హం. ఇటీవల జడ్జి ఎదుట హాజరైన అద్నన్.. ‘ఆడవాళ్లను చూస్తే నా గుండె ప్రేమతో ఉప్పొంగిపోతుంది. ప్రేమించడం అనేది మానవ సహజ లక్షణం. నేను అదే చేశాను. నాకు దాదాపు వెయ్యి మంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు. వారందరినీ సంతోషపెట్టగల అసాధారణ లైంగిక సామర్థ్యం నాకుంది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. అద్నన్ అక్తర్ పై నమోదైన అభియోగాలను విచారించిన న్యాయస్థానం.. అతన్ని దోషిగా తేల్చి.. 1075 ఏళ్ల జైలు శిక్ష విధించింది.