చెన్నై సంస్థ: 87 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద అసమ్మతి

0

ఏపీ చరిత్రలోనే గొప్ప విజయాన్ని అందుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పోయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేశారు. ఈ ఘనత అంతా ఆయన 3వేల కి.మీలకు పైగా చేసిన పాదయాత్ర ద్వారానే లభించిందనే వాదన ఉంది. ప్రజలకు చేరువ కావడంతో ఆయనకు ఓట్ల వాన కురిసిందంటారు.

వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారానే ఎమ్మెల్యే పోస్టులకు అర్హత లేకపోయినా సరే జగన్ గాలిలో చాలామంది గెలిచారు. గెలిచిన తరువాత వాళ్లు అంతా ప్రజలకు అందుబాటులో లేకుండా కొందరు పోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు మీద మోజుతో కొందరు ప్రజలకు దూరమయ్యారన్న టాక్ ఉంది.. వైసీపీ లోకల్ నాయకులను చిన్న చూపు చూస్తూ టీడీపీ వలస నాయకులకు ప్రాముఖ్యత నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొందరు ఎమ్మెల్యేలు ఇలా డిఫెరెంట్ సమస్యలతో ప్రజలకు దూరంగా ఉండడంతో వారిమీద తీవ్ర వ్యతిరేకత ఉందట.. తాజాగా చెన్నై సంస్థ ఇటీవల ఒక సర్వేను ఏపీలో చేసిందట..ఎవరు చేశారో తెలియదు కానీ అమరావతిలో పెద్ద ఎత్తున ఈ చర్చ జరుగుతోంది. దాదాపు 87మంది ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారట..

కొన్ని నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే ఎవరు అంటే కూడా జనం చెప్పలేకపోతున్నారట.. అయితే ఆ సర్వేలో లోకల్ ఎమ్మెల్యేల మీద.. చాలా మంది మంత్రుల మీద కూడా వ్యతిరేకత బాగా ఉందని.. ఆ సర్వే సంస్థ నిగ్గు తేల్చిందని వార్తలు వస్తున్నాయి.

దీన్ని బట్టి వైసీపీని ముంచేది ఆ పార్టీ ఎమ్మెల్యేలే అని.. వారి వల్ల పార్టీ పుట్టి మునుగుతోందని ఆ సర్వేలో తేలిందట.. ఎమ్మెల్యేల తీరు మారకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని అంటున్నారట.. చూడాలి మరి ఏం జరుగుతుందో..