73 ఏళ్లకిందటే కరోనాను ఊహించారా? నిజమేనా!

0

కరోనా మహమ్మారిని మా వీరబ్రహ్మం గారు ముందే ఊహించారు తెలుసా? కాదు చైనా పండితులు ఈ వ్యాధి గురించి ఎప్పుడో చెప్పారు? లేదు లేదు జపాన్ నవలాకారులు కరోనాను ముందే పసిగట్టారు.. అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అల్బర్ట్ కాము రాసిన ‘ది ప్లేగ్’ నవలలో రాసినట్టే కరోనా మహమ్మారి ముంచుకొస్తున్నదని.. అంతా ఆ నవలలో చెప్పినట్టే జరుగుతున్నదని అల్జీరియా దేవవాసులు భావిస్తున్నారు.

దిప్లేగ్ నవలలో ఏముంది

అల్జీరియా దేశంలోని ఒరాన్ నగరంలో ప్లేగు వ్యాధి విస్తరించడంతో ఈ నవల ప్రారంభమవుతుంది. ఈ వ్యాధితో ప్రజలంతా వణికిపోతుంటారు. ఈ భయంకరమైన అంటు వ్యాధిని అక్కడి ప్రజలు రాచరికవ్యవస్థ ఎలా ఎదుర్కొన్నది అన్నదే ఈ నవల కథాంశం. అయితే అల్జీరియా అప్పట్లో ఫ్రెంచ్ వలసపాలనలో ఉండేంది.

ఎప్పుడే 73 ఏండ్ల కిందట వచ్చిన ఈ నవలలోని కథ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుండటంతో ఇప్పుడు సాహితి ప్రియిలంతా ఈ నవలను కొని చదువుతున్నారు. ఓరాన్ కు చెందిన క్షయవ్యాధి నిపుణుడు డాక్టర్ సలాహ్ లేలౌ ఏమంటున్నారంటే ‘నేను ది ప్లేగ్ నవలను చదినాను. ఆ నవలలో చెప్పినట్టే ప్రస్తుతం కరోనా కూడా ఎంతో విజృంభిస్తున్నది. నా దగ్గరకు కూడా ఎందరో కరోనా రోగులు వస్తున్నారు. వారంతా వ్యాధి ముదిరాకే వస్తున్నారు. దీంతో మేము సరైన వైద్యం చేయలేకపోతున్నాము. ప్లేగ్ నవలలో కూడా అచ్చంగా ఇలాగే ప్రజలు.. రోగం ముదిరాకే వైద్యులను సంప్రదిస్తారు. చివరకు తమవాళ్లు ఎవరన్నా చనిపోతే అధికారులను ప్రభుత్వాలను డాక్టర్ల ను నిందిస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు డాక్టర్ సలాహ్.

అచ్చం ఆ నవలలాగేనే..

దిప్లేగ్ నవలలోనూ ఓ వైద్యుడు రోగులకు చికిత్స నందిస్తుంటాడు. ప్రస్తుతం అల్జీరియాలోనూ డాక్టర్ సలాహ్ కూడా అలాగే రోగులకు చికిత్స నందిస్తున్నాడు. నవలలో చెప్పిన ఓ ఘటన అల్జీరియా రాజధాని అల్జెర్స్లో జరగటం గమనార్హం. నవలలో ఓవ్యక్తి చనిపోతే అతడి బంధువులంతా వచ్చి ఆస్పత్రిపై దాడి చేస్తారు. అచ్చం అలాగే అల్జెర్స్లోని ఒక ఆస్పత్రిలో ఒక కోవిడ్ 19 రోగి చనిపోవడంతో అతని బంధువులు ఆ ఆస్పత్రి డైరెక్టర్ ను ఆగ్రహం తో చుట్టు ముట్టారు. వారినుంచీ తప్పించుకోవడానికి అతను ఆస్పత్రి రెండో అంతస్తునుంచీ దూకేసారు. కాళ్లకు చేతులకు బలంగా దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం అల్జీరియా ప్రజలంతా దిప్లేగ్ నవల లో చెప్పినట్టే జరుగుతున్నదని భావిస్తున్నారట.