మహేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు హఠాన్మరణం

0

సూపర్ స్టార్ మహేష్ కి దేశవ్యాప్తంగా అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోవర్స్ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు దరిసి సురేష్ బాబు అకస్మాత్తుగా మరణించారని తెలుస్తోంది. సీనియర్ అభిమాని విషాదకరమైన మరణానికి కలత చెందిన మహేష్ ట్విట్టర్ లో తన సంతాపం తెలియజేశారు.

“దరిసి సురేష్ బాబు అకాల మరణం గురించి వినడం హృదయాన్ని కలిచి వేసింది. అతడు నిజంగా మానుంచి తప్పిపోతాడు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామ“ని మహేష్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ పేజీలో ఒక అభిమాని మహేష్ తో కలిసి సురేష్ ఉన్నప్పటి ఫోటోని షేర్ చేశారు.

స్టార్లు ఉన్నంతకాలం వారిని నెత్తిన పెట్టుకుని పూజించేది అభిమానులే. అందుకే ఆ కుటుంబానికి మహేష్ తరపున ఆర్థిక సాయం అందనుందని తెలుస్తోంది. ఇకపోతే మహేష్ తన కెరీర్ 27వ సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్న వేళ అభిమాని మరణం విషాదకరం.