డేంజర్: కరోనాతో కొత్త ముప్పు

0

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి మనకు సోకి పోయినా కూడా దాని పర్యవసనాలు దారుణంగా ఉంటున్నాయని కొత్తగా వెలుగుచూసింది. కరోనా మనుషుల్లో కొత్త సమస్యలను సృష్టిస్తోందని తేలింది.

కరోనా సోకి తగ్గిన వారిలో మధుమేహం స్థాయిలు పెరుగుతున్నాయని.. లంగ్ ఇన్ ఫెక్షన్స్ లివర్ కిడ్నీలపై ప్రభావం చూపుతున్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు.

తాజాగా కరోనాకు గురైన వారిలో కొందరిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడంతో గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ లకు గురవుతున్నట్టు వెల్లడైంది. ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన వారిలో 7 నుంచి 8శాతం మంది రోగులు నాలుగు నుంచి ఆరు వారాల్లో గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ కు గురవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. వెంటీలేటర్ పై చికిత్స పొందిన రోగుల్లో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు తేలింది.

దీంతో కరోనా తగ్గినా మూడు నెలల పాటు రోగులంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు కరోనా రోగులకు గుండెజబ్బులను తప్పనిసరి చేస్తున్నారు.

కరోనా మరణాల్లో ఎక్కువ మందిలో సైడ్ ఎఫెక్ట్స్ దారితీస్తున్నాయి. కొందరిలో గుండె రక్తనాళాల్లో మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి పూడికలు రావడం కాళ్ల రక్తనాళాల్లో సైతం గడ్డలు ఏర్పడి రక్తప్రసరణ తగ్గుతున్న వారిని గుర్తిస్తున్నారు.

ఈ క్రమంలోనే రోగులంతా మూడు నెలల పాటు యాంటి కో ఆగ్యులేషన్ మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. అలా వాడిని వారిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడిన సందర్భాలు లేవని అంటున్నారు. ఇక ఇన్ ఫెక్షన్లపై స్టెరాయిడ్స్ ఫాలోఅప్ మందులు వాడాలని సూచిస్తున్నారు.