Templates by BIGtheme NET
Home >> Telugu News >> కరోనానే ఈ భారీ వర్షాలకు కారణమట?

కరోనానే ఈ భారీ వర్షాలకు కారణమట?


వర్షాకాలం ముగిసినా ఇంకా వానలు దంచి కొడుతూనే ఉన్నాయి. గ్రామాలు నగరాలను ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే వరదలే వచ్చాయి. ఎందుకు ఇంతలా దంచుతున్నయో అని ప్రజలంతా మధనపడిపోతున్నారు. కుండపోత వానలపై వాతావరణ కేంద్రాలు సైంటిస్టులు ఇప్పుడు శూలశోధన మొదలుపెట్టారు. అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులను స్టడీ చేస్తున్నారు. అయితే వీరు ప్రస్తుతం ఓ అంచనాకు వచ్చారు. ‘కరోనా మహమ్మారి’ కారణంగానే ఈ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

కరోనాతో ప్రకృతి అంతా సాఫ్ అయిపోయింది. దీంతో అది టైం ప్రకారం పనిచేస్తూ స్వచ్ఛమైన వానలను ధాటిగా కురిపిస్తోంది. కరువు తీరా వానలు పడడానికి పలు కారణాలను శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా మార్చి మూడో వారం నుంచి లాక్ డౌన్ తో కాలుష్యం తగ్గి గాలిలో స్వచ్ఛత ఏర్పడి తేమ పెరిగింది. దీంతో అన్ని రకాల పరిశ్రమలు మూతపడ్డాయి. ఫ్యాక్టరీలు కట్టేశారు. వాహనాల రాకపోకలు పెద్దగా లేవు. దీంతో కాలుష్యం తగ్గిపోయింది. ఫలితంగా గాలిలో స్వచ్ఛత ఏర్పడి తేమ శాతం పెరిగింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఏటా నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నుంచి నిష్క్రమించాలి. ఇవి ఎంత త్వరగా నిష్క్రమించాయనే దానిని బట్టే వానాకాలం సీజన్ లెక్కలుంటాయి. గత 11ఏండ్లలో ఒకే సారి 2018లో మాత్రమే అత్యంత ఆలస్యంగా సెప్టెంబర్ 29న రాజస్థాన్ నుంచి నిష్క్రమించాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 28న వెనక్కి వెళ్లడం మొదలైంది.

అవి మధ్యప్రదేశ్ కు వచ్చేసరికి బంగళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు అల్పపీడనాల గాలులు వాటి నిష్క్రమణకు అడ్డుచక్రంలా మారి అక్కడే ఆపేశాయి. ఈ రుతుపవనాలు తెలంగాణపై కేంద్రకృతమయ్యాయి భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. ఇవి తెలంగాణ నుంచి ఎప్పుడు వెళ్లిపోతాయనేది సైంటిస్టులు కూడా ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నారు. అవి వెనక్కిపోవాలంటే బంగళాఖాతంలో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రుతుపవనాలు నాలుగైదు రోజుల వరకు ఇక్కడే ఉండే అవకాశాలుంటున్నాయని చెబుతున్నారు. అవి పూర్తిగా వెనక్కి పోతేనే వర్షాలు తగ్గుముఖం పడుతాయని అంటున్నారు.

వీటితో పాటుగా ఉత్తర–దక్షిణ తూర్పు– పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ప్రవాహ ద్రోణులు ఏర్పడుతున్నాయి. వీటిని వాతావరణ భాషలో ‘ షీర్ జోన్’ అని పిలుస్తారు. ఇలా గాలుల ప్రవాహం ఏర్పడినప్పుడు అవి పయనించే మార్గంలో వాతావరణం చల్లబడి తేమను తీసుకొస్తాయి. ప్రస్తుతం బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో 508కి.మీ ఎత్తు వరకూ గాలులతో ఉపరిత ఆవరన్తనం ఉంది. మంగళవారాని కల్లా ఇది అల్పపీడనంగా మారే అవకాశముంది.

ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వానాకాలంలో దేశంలో కెల్లా అత్యంత ఎక్కువగా సౌరాష్ట్ర కచ్ సబ్ డివిజన్ లో సాధారణం కన్నా 126శాతం రాయలసీమలో 84 ఉత్తర కర్ణాటకలో 49 తెలంగాణలో 46శాతం అదనపు వర్షపాతం కురిసింది. దేశంలో ఇది నాలుగో స్థానం. తెలంగాణలో ఇంత అధిక వర్షపాతం గత 33ఏండ్లలో ఎన్నడూ నమోదు కాకపోవడం విశేషం. మరో నాలుగైదు రోజుల పాటు రుతుపవనాల ప్రభావం తెలుగురాష్ట్రాలపై ఉంటుందని.. ఆ తర్వాతే వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.