పుతిన్ కు ప్రమాదకర వ్యాధి.. రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా?

0

రష్యా అధ్యక్షుడిగా.. ప్రధానిగా కొన్ని దశాబ్ధాల పాటు తన బలాన్ని నిరూపించుకుంటూ ఎదిగిన వ్లాదిమర్ పుతిన్ ను ఓ అరుదైన వ్యాధి అంటుకుంది. రష్యా అధ్యక్షుడిగా జీవితకాలం తనే ఉండేలా రాజ్యాంగ సవరణ చేసుకొని ప్రజల చేత రెఫరెండం చేయించుకొని మరీ కొనసాగుతున్న పుతిన్ కు ఇప్పుడు ఓ భయంకర వ్యాధి ఆ పదవి నుంచి దిగిపోయేలా చేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది జనవరిలో ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.అరుదైన వ్యాధి కారణంగానే పుతిన్ ఈ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేలా కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు సైతం ఒత్తిడి చేస్తున్నారని రష్యాలోని ఓ ప్రముఖ పత్రిక తన కథనంలో పేర్కొంది.

68 ఏళ్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు పార్కిన్సన్ వ్యాధి సోకింది.ఈ వ్యాధి వల్ల మెదడులోని నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ సమయంలో పదవీ బాధ్యతలను నిర్వర్తించడం అంత సరైంది కాదని వైద్యులు సూచించినట్లు తెలిసింది.

బతికున్నంత కాలం అధ్యక్ష పదవిని చేసేలా రాజ్యాంగ సవరణ చేసిన పుతిన్ ను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తి వ్యక్తి కూడా రష్యా అధ్యక్షుడిగా దించలేడు.కానీ అనూహ్యంగా ఆయనను ఓ అరుదైన వ్యాధి గద్దెదించుతుండడం విశేషంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం పుతిన్ అనారోగ్యంతో తన విధులను ఇంటి నుంచే నిర్వర్తిస్తున్నారని.. భవిష్యత్ లో వ్యాధి మరింత ముదిరి ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత 20 ఏళ్లుగా రష్యాను ఏకఛ్చత్రాధిపత్యం కింద పుతిన్ పాలిస్తున్నారు. 1999 నుంచి 2024 వరకు ఆయనే పదవిలో ఉండనున్నారు.