కరోనా పోకేముందే.. మరో మహమ్మారి ఎంట్రీ.. అది కూడా చైనా నుంచే..

0

కరోనా వ్యాధితో ప్రపంచం మొత్తం తలకిందులైంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్నిదేశాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ.. మరికొన్ని దేశాల్లో సెకండ్వేవ్ ముంచుకొస్తున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇదిలో ఉంటే కరోనా పోకేముందే మరో మహమ్మారి సిద్ధంగా ఉన్నదని డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారిచేసింది. అది కూడా కరోనా లాగే చైనా లోని ఓ ల్యాబ్లో పుట్టిందని సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వర్చువల్ సెషన్లో భాగంగా ప్రతినిధులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలని డబ్ల్యూహెచ్ వో పిలుపునిచ్చింది.

ఈ విషయంలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ కోవిడ్-19 వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (2005)కు అనుకూలంగా ఓ బలమైన ముసాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తుంది అని తెలిపింది. వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా బయటపడిందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ మహమ్మారి అదుపులోకి రాలేదు. ఇంతలోనే చైనాలోని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్జౌలో 6000 మందికి పైగా బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి పాజిటివ్ వచ్చినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఇది కూడా స్థానికంగా ఉన్న ఓ వ్యాక్సిన్ ప్లాంట్ నుంచే ఏడాది క్రితం లీకైనట్లు సమాచారం. ఈ క్రమంలో లాన్జౌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణంలోని 55725కి పరీక్షలు చేశాం. వీరిలో 6620 మందికి పాజిటివ్గా తేలింది’ అని తెలిపారు. పశువుల మీద ఉండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు.

బ్రూసెల్లోసిస్ లక్షణాలివే..

ఈ వ్యాధి సోకిన వారిలో కూడా ఫ్లూలో కనిపించే లక్షణాలే ( దగ్గు జలుబు జ్వరం వొల్లునొప్పులు) కనిపిస్తాయి. కలుషితమైన ఆహారపదార్థాలు నీళ్లు తాగడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు.