Templates by BIGtheme NET
Home >> Telugu News >> గ్రేటర్ పోరు…ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు గెలుస్తున్నారంటే…!

గ్రేటర్ పోరు…ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు గెలుస్తున్నారంటే…!


తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పర్వం ముగిసింది. రేపు(శుక్రవారం) కౌంటింగ్ జరగనుంది. అయితే – ఫలితాల కంటే ముందే అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పై ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాంటి వారిని నిరుత్సాహపరచకుండా ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లలో టీఆర్ ఎస్ పార్టీదే ఆధిక్యం – ఆ పార్టీకే అధికారం అనే విషయం స్పష్టమైంది. అయితే గతంలో దక్కినన్ని సీట్లు ఆ పార్టీ సొంతం చేసుకోలేకపోవడం గమనార్హం. మరోవైపు బీజేపీ భారీగా పుంజుకుంది. ఇక పెద్ద ఎత్తున బొక్క పడిపోయిన పార్టీ కాంగ్రెస్!.

వివిధ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవి.

ఆరా సర్వే:- ఆరా ఎగ్జిట్ పోల్స్ లలో టీఆర్ ఎస్ పార్టీదే గులాబీ పీఠం అని తేలింది. 40.08 శాతం ఓటు షేర్ తో 78 స్థానాల్లో విజయం సాధించి మరోసారి గ్రేటర్ పీఠం గులాబీ పార్టీ ఖాతాలో పడనుందని అంచనా వేసింది. గ్రేటర్ లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ 31.21 శాతం ఓటు షేరింగ్ ను సొంతం చేసుకొని 28 స్థానాలు దక్కించుకోనున్నట్లు అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 8.58 శాతం ఓటు షేరింగ్ తో మూడు స్థానాలు తన ఖాతాలో వేసుకోనుందని తేలింది.

పీపుల్స్ పల్స్:

పీపుల్స్ పల్స్ సంస్థ సర్వేలో కూడా టీఆర్ ఎస్ పార్టీకే పట్టం కట్టారు. టీఆర్ ఎస్ పార్టీ 68-78 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎంఐఎం 38-42 సీట్లు సొంతం చేసుకోనుందని తెలిపింది. బీజేపీ 25-35 స్థానాల్లో గెలుస్తుందని – అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 1-5 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చింది.

హెచ్ ఎంఆర్:

ఈ ఎగ్జిట్ పోల్స్ లో కూడా టీఆర్ ఎస్ పార్టీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టారు. 65 నుంచి 70 స్థానాలు గులాబీ ఖాతాలో పడనుండగా ఎంఐఎంకు 35నుంచి 40 స్థానాలు – బీజేపీకి 27 నుంచి 31 స్థానాలు – కాంగ్రెస్ పార్టీకి 3 – 6 స్థానాలు – ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని వెల్లడించింది.

సీసీఎస్ టీంః

సీసీఎస్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా అధికార పార్టీకే మొగ్గు చూపారు. 82 నుంచి 96 స్థానాలు టీఆర్ ఎస్ కు దక్కనున్నాయని విశ్లేషించింది. ఎంఐఎంకు 32 నుంచి 38 స్థానాలు – బీజేపీకి 12 నుంచి 20 స్థానాలు – కాంగ్రెస్ కు 3 నుంచి 5 స్థానాలు దక్కనున్నట్లు పేర్కొంది.