వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు.. మూహూర్తం ఫిక్స్.. జగన్ ట్విస్ట్

0

అధికార వైసీపీలోకి టీడీపీ నేతల వలసలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో ఇప్పటికే ఇద్దరు టీడీపీ నేతలు వైసీపీకి సపోర్టు చేశారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అధికార వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అయితే సీఎం జగన్ ఈ చేరికపై ట్విస్ట్ ఇచ్చినట్టు సమాచారం.

పార్టీలోకి గంటాను కాకుండా మరో కుమారుడు రవితేజను వైసీపీలో చేర్చుకోబోతున్నట్టు తెలిసింది. తన తండ్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలోనే శనివారం రవితేజ వైసీపీలో చేరనున్నారు. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో రవితేజకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

కాగా టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాల గిరి వల్లభనేని వంశీని నేరుగా పార్టీలో చేర్చుకున్న సీఎం జగన్.. తర్వాత రూటు మార్చారు. ఎమ్మెల్యేలను కాకుండా వారి కుమారులను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల కుమారులకు కుటుంబాలకు సీఎం జగన్ కండువాలు కప్పనున్నారు.

వైసీపీలో చేరాలనుకునే టీడీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని తొలుత జగన్ ఆదేశించారు. కానీ ఇప్పుడు వారి కుమారులు కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు సైతం నేరుగా పార్టీలో చేర్చుకోకుండా ఆయన కుమారుడిని సీఎం జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారని పలువురు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ రకంగా టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకునే ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.