కమల్ కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇక ఒంటరి పోరే

0

తమిళనాడులో అప్పుడే రాజకీయ సందడి మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇక వచ్చేస్తున్నా.. అంటూ ప్రకటించడంతో అక్కడ అక్కడ మరింత కాక మొదలైంది. ఈసారి అక్కడ డీఎంకే బలంగా కనిపిస్తోంది. ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ తోనే జత కట్టి ఎన్నికల్లోకి వెళ్లాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ తమ వెంట వస్తుందని భావించిన మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కు నిరాశే ఎదురైంది. వామపక్షాలు కూడా డీఎంకే వెంటే నడుస్తుండటం రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టినా ఆయన వైపు చూస్తూ ఉండడంతోఇక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని కమల్హాసన్ నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడులో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 234 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాలని మక్కల్నీదిమయ్యం భావిస్తోంది. పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమల్ త్వరలో తమిళనాడు వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీనాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే పార్టీ ముఖ్య నాయకులతో కమలహాసన్ సమావేశమయ్యారు. ప్రచారం తదితర అంశాలపై చర్చించారు.త్వరలోనే తమిళనాడు వ్యాప్తంగా భారీ బహిరంగసభలు రోడ్షోలు సమావేశాలు నిర్వహించాలని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సోషల్మీడియా కూడా కీలకంగా మారడంతో.. ఎన్నికల్లో సోషల్ మీడియాను కూడా విరివిగా వాడుకోవాలని కమలహాసన్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా పార్టీ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు అప్డేట్లు అందించనున్నారు. పార్టీ సిద్ధాంతాలను జనం ముందుకు తీసుకెళ్లనున్నారు.

కమల్ రాష్ట్ర పర్యటన కోసం ఒక ప్రత్యేక బస్సును కొనుగోలు చేసి దాంట్లో సకల సౌకర్యాలు సిద్ధం చేశారు. బస్సులో ఓ లిఫ్ట్ ఏర్పాటుచేసి దానికి సీట్ సెట్ చేశారు. సభ నిర్వహించే సమయంలో ఆ లిఫ్టు సాయంతో బస్సు పైభాగానికి చేరుకుని ప్రసంగించే లా ఏర్పాట్లు చేశారు. బస్సులోనే భోజనం చేసే విధంగా కొద్ది మందితో కలిసి సమీక్ష నిర్వహించేలా బస్సును తీర్చిదిద్దారు. మరోవైపు పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి కూడా వాహనాలను సిద్ధం చేశారు. మొత్తం మీద కమలహాసన్ ఎన్నికలు దగ్గర పడడంతో పార్టీని పటిష్టం చేసేందుకు అసలు చేస్తున్నారు.