Templates by BIGtheme NET
Home >> Cinema News >> సంక్రాంతికే ఫిక్స్ అయిన ‘క్రాక్’

సంక్రాంతికే ఫిక్స్ అయిన ‘క్రాక్’


కరోనా కారణంగా వాయిదా పడ్డ పెద్ద సినిమాలు అన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి క్యూ కట్టనున్నట్లుగా అంతా భావించారు. కాని సంక్రాంతికి 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడవబోతున్నాయి. ఇదే సమయంలో జనాలు కరోనా భయంతో థియేటర్లకు వస్తారో లేదో అనే అనుమానంతో సంక్రాంతికి సినిమాలను విడుదల చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాలు ఒక్కటి కూడా సంక్రాంతికి రావు అనుకున్నారు. ఇలాంటి సమయంలో రవితేజ క్రాక్ సినిమాను సంక్రాంతి సీజన్ కే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం గోవాలో చివరి షెడ్యూల్ ను నిర్వహిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ ముగించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన పార్ట్ కు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యింది. కనుక సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడంలో ఎలాంటి డౌట్ లేదు అంటున్నారు. థియేటర్లు పునః ప్రారంభం అయ్యాయి కనుక కొత్త సినిమాలు కూడా మెల్ల మెల్లగా విడుదల అవుతున్నాయి. నేడు రెండు మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. సంక్రాంతి వరకు పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో క్రాక్ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

శృతి హాసన్ పోలీస్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ మరియు వీడియోలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ చేసిన గత సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవితేజకు ఈ సినిమా విజయం చాలా కీలకం. మరి క్రాక్ రవితేజకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.